wankede stadium
-
వాంఖడేలో అంత ఈజీ కాదు.. అత్యధిక టార్గెట్ ఛేజింగ్ ఎంతంటే?
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా జూలు విధిల్చింది. తొలి రెండు టెస్టుల్లో విజయాలను నమోదు చేసిన కివీస్‌కు ఓటమి రుచి చూపించేందుకు భారత జట్టు సిద్దమైంది.రెండో రోజు ఆటముగిసే సమయానికి కివీస్ తమ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. న్యూజిలాండ్ ప్రస్తుతం కేవలం 143 పరుగుల ఆధిక్యంలో మాత్రమే ఉంది. భారత స్పిన్నర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ బంతితో మ్యాజిక్ చేశారు. బంతిని గింగరాల తిప్పుతూ కివీస్ బ్యాటర్లను బోల్తా కొట్టించారు. జడేజా 4 వికెట్లతో సత్తాచాటగా, అశ్విన్ మూడు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.ఛేజింగ్ అంత ఈజీ కాదు..ఇక కివీస్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో భారత్ ఇంకా ఒక్క వికెట్ పడగొట్టాల్సి ఉంది. ప్రస్తుతం క్రీజులో అజాజ్ పటేల్, ఓ రూర్కీ ఉన్నారు. త్వరగా వికెట్ పడగొట్టి 150 పరుగుల ఆధిక్యంలోపు కివీస్‌ను కట్టడి చేయాలని టీమిండియా భావిస్తోంది.అయితే వాంఖడేలో 150 పరుగుల లక్ష్యం చేధన కూడా అంత సులువు కాదు. ఎందుకంటే వాంఖడే పిచ్‌పై నాలుగో ఇన్నింగ్స్‌లో పరిస్థితులు బ్యాటింగ్‌కు చాలా కఠినంగా ఉంటాయి. వాంఖడే వికెట్ మ్యాచ్ జరుగుతున్న కొద్దీ బ్యాటర్లకు సవాల్‌గా మారనుంది.అంతేకాకుండా బంతి కూడా ఎక్కువగా టర్న్ అయ్యే అవకాశముంది. కాగా ఇటీవల కాలంలో స్పిన్నర్లను ఎదుర్కొవడంలో భారత బ్యాటర్లు ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో కివీస్ స్పిన్నర్లు చెలరేగితే భారత్‌కు కష్టాలు తప్పవు. న్యూజిలాండ్ జట్టులో అజాజ్ పటేల్, ఇష్ సోధీ వంటి వరల్డ్ క్లాస్ స్పిన్నర్లు ఉన్నారు. భారత్ సునాయసంగా లక్ష్యాన్ని చేధించాలంటే ఓపెనింగ్ భాగస్వామ్యం చాలా ముఖ్యం. రోహిత్ శర్మ, జైశ్వాల్ కచ్చితంగా తమ బ్యాట్లకు పని చెప్పాల్సిందే.అత్యధిక టార్గెట్ ఛేజింగ్ ఎంతంటే?ఇక వాఖండేలో విజయవంతమైన అత్యధిక ఛేదన 163 పరుగులు. 2000లో భారత్ నిర్దేశించిన ఈ లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ఛేజ్ చేసింది. ఇప్పటివరకు ఏ జట్టు కూడా ఇంతకంటే ఎక్కువ లక్ష్యాన్ని అందుకోలేకపోయింది. చివరగా 2021లో 540 పరుగుల లక్ష్య చేధనలో న్యూజిలాండ్ 167 పరుగులకే ఆలౌటైంది. అంతకంటే ముందు 2013లో వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 187కే ఆలౌటై ఇన్నింగ్స్ తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది. 2004లో ఆస్ట్రేలియా 107 పరుగులను ఛేదించలేక 93 రన్స్‌కే కుప్పకూలింది. స్పిన్నర్ల వలలో చిక్కుకుని కంగారులు విల్లవిల్లాడారు. ఈ వేదికలో టీమిండియాకు కూడా ఓసారి ఘోర పరభావం ఎదురైంది. 2006 ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 313 పరుగుల ఛేదనలో 100 పరుగులకే కుప్పకూలింది. -
వాంఖడేలో భారత జట్టుకు సన్మానం.. ఫ్యాన్స్‌కు ఫ్రీ ఎంట్రీ
టీ20 వరల్డ్‌కప్-4 విజేతగా నిలిచిన భారత జట్టు నాలుగు రోజుల తర్వాత తమ సొంత గడ్డపై అడుగుపెట్టింది. గురువారం ఉదయం ఢిల్లీలోని ఇందిరా గాంధీ విమానశ్రాయంకు భారత జట్టుకు ఘన స్వాగతం లభించింది. ఎయిర్ పోర్ట్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న అభిమానులు టీమిండియాకు నీరాజనం పలికారు. భారత ఆటగాళ్లు సైతం ఎయిర్ పోర్ట్ నుంచి హోటల్‌కు వెళ్తున్న దారిలో అదిరే స్టెప్పులతో అలరించారు. అనంతరం రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు దేశ ప్రధాని నరేంద్ర మోదీని కలిసింది. దాదాపు అరగంట పాటు క్రికెటర్లు, సహాయ సిబ్బంది మోదీతో ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. ఇక మోదీతో భేటి అనంతరం టీమిండియా ఆటగాళ్లు ప్రత్యేక విమానంలో ముంబైకు పయనమయ్యారు. సాయంత్రం 5 గంటలకు ముంబై నగర వీధుల్లో టీమిండియా విజయోత్సవ యాత్ర జరుగనుంది.ఫ్యాన్స్‌కు ఫ్రీ ఎంట్రీ..ఆ తర్వాత రాత్రి 7 గంటలకు ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఆటగాళ్లకు సన్మాన కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి మాజీ క్రికెటర్లతో పాటు బీసీసీఐ పెద్దలు హాజరకానున్నారు. ఈ క్రమంలో ముంబై క్రికెట్ ఆసోషియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సన్మాన వేడుకను చూసేందుకు అభిమానులకు ఫ్రీ ఎంట్రీ ఇవ్వాలని ఎంసీఎ నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని గురువారం ఎంసీఎ ఒక ప్రకటనలో పేర్కొంది. అదే విధంగా స్టేడియం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేసినట్లు ఎంసీఎ అధికారులు తెలిపారు. సాయంత్రం 4 గంటలకు స్టేడియం గేట్లు ఓపెన్ చేయనున్నట్లు ఎంసీఏ వెల్లడించింది.వర్షం అంతరాయం..ఇక ఈ కార్యక్రమానికి వర్షం అంతరాయం కలిగించే ఛాన్స్ ఉంది. సన్మాన కార్యక్రమం జరిగే సమయంలో వర్షం పడే అవకాశాలు 90 శాతం ఉన్నట్లు అక్కడ వాతవారణ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా ఈ వేడుక కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. -
న్యూజిలాండ్‌తో సెమీఫైనల్.. ముంబైకు చేరుకున్న టీమిండియా! వీడియో వైరల్
వన్డేప్రపంచకప్-2023 లీగ్ దశను అద్బుత విజయంతో ముగించిన టీమిండియా.. ఇప్పుడు సెమీఫైనల్లో సత్తాచాటేందుకు సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా తొలి సెమీఫైనల్లో నవంబర్ 15న ముంబై వాంఖడే వేదికగా న్యూజిలాండ్‌తో భారత్ తలపడనుంది. ఈ క్రమంలో సోమవారం(నవంబర్ 13) సాయంత్రం ముంబైలో భారత జట్టు అడుగుపెట్టింది. నేరుగా బెంగళూరు నుంచి రోహిత్ సేన ప్రత్యేక విమానంలో ముంబైకు చేరుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలవతున్నాయి. కాగా భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి మాత్రం జట్టుతో కాకుండా తన ఫ్యామిలీతో ముంబైకు చేరుకున్నాడు. ఇక ముంబైకు చేరుకున్న భారత జట్టు మంగళవారం నుంచి రెండు రోజుల పాటు ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గోనుంది. కాగా ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు టీమిండియా ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించిన సంగతి తెలిసిందే. చదవండి: World cup 2023: కివీస్‌తో సెమీస్ పోరు.. టీమిండియా ప్రతీకారం తీర్చుకుంటుందా? Team India in Mumbai. - Time to beat Kiwis and make it to the Final...!!!pic.twitter.com/dmthEhDUA1 — Mufaddal Vohra (@mufaddal_vohra) November 13, 2023 -
ఆస్ట్రేలియాతో తొలి వన్డే.. ఫీల్డింగ్ కోచ్‌గా మారిన ద్రవిడ్! వీడియో వైరల్
శుక్రవారం ముంబై వేదికగా ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఈ మ్యాచ్‌కు టీమిండియా రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరమయ్యాడు. ఈ క్రమంలో తొలి వన్డేకు భారత జట్టు సారథిగా హార్దిక్ పాండ్యా వ్యవహరించనున్నాడు. ఇక తొలి వన్డే కోసం రెండు రోజుల ముందే ముంబైకు చేరుకున్న హార్దిక్ సేన ప్రాక్టీస్ సెషన్స్‌లో మునిగి తేలింది. హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలో భారత జట్టు తమ ప్రాక్టీస్‌ను పూర్తి చేసింది. అయితే ఈ ప్రాక్టీస్ సెషన్స్‌లో రాహుల్ ద్రవిడ్ ఫీల్డింగ్ కోచ్‌గా అవతరమెత్తాడు. ప్రపంచంలోనే అద్భుతమైన స్లిప్ ఫీల్డర్‌గా పేరొందిన ద్రవిడ్.. తన ఫీల్డింగ్ స్కిల్స్‌ను ఆటగాళ్లతో పంచుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్లో షేర్ చేసింది. ఈ వీడియోలో ద్రవిడ్.. యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్‌కు స్లిప్ ఫీల్డింగ్ మెళకువలు నేర్పిస్తున్నట్లు కన్పించింది. ఇక ఈ మ్యాచ్‌కు రోహిత్ దూరం కావడంతో భారత ఇన్నింగ్స్‌ను శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ ప్రారంభించనున్నారు. తుది జట్లు(అంచనా) భారత్: శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్ ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), మార్నస్ లాబుషేన్, మార్కస్ స్టోయినిస్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), గ్లెన్ మాక్స్వెల్, సీన్ అబాట్, నాథన్ ఎల్లిస్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా చదవండి: Ind Vs Aus: గిల్‌కు జోడీగా టీమిండియా ఇన్నింగ్స్ ఆరంభించేది అతడే: హార్దిక్ పాండ్యా A perfect 'catch'-up ft. #TeamIndia Head Coach Rahul Dravid & @ShubmanGill ahead of Match Day 👌👌 #INDvAUS | @mastercardindia pic.twitter.com/TC1mw5L7fX — BCCI (@BCCI) March 17, 2023 -
దేవధర్ ట్రోఫీ విజేత ఈస్ట్‌జోన్
ముంబై: దేశవాళీ క్రికెట్ టోర్నీ దేవధర్ ట్రోఫీని ఈస్ట్‌జోన్ జట్టు కైవసం చేసుకుంది. వాంఖడే స్టేడియంలో బుధవారం జరిగిన ఫైనల్లో ఈస్ట్ 24 పరుగుల తేడాతో వెస్ట్‌జోన్‌పై గెలిచింది. 1973-74 సీజన్లో మొదలైన దేవధర్ ట్రోఫీని ఈస్ట్‌జోన్ జట్టు నెగ్గడం ఇది ఐదోసారి. చివరిసారి ఈస్ట్ జట్టు 2003-04 సీజన్లో విజేతగా నిలిచింది. ఫైనల్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఈస్ట్‌జోన్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది. కెప్టెన్ మనోజ్ తివారీ (92 బంతుల్లో 75; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), సామంత్రి (50 బంతుల్లో 60; 7 ఫోర్లు, 1 సిక్సర్), విరాట్ సింగ్ (84 బంతుల్లో 54; 6 ఫోర్లు) అర్ధసెంచరీలతో రాణించారు. ధావల్, జోసెఫ్ రెండేసి వికెట్లు తీశారు. వెస్ట్‌జోన్ జట్టు 47.2 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌటయింది. 37 పరుగులకే అంబటి తిరుపతి రాయుడు సహా మూడు వికెట్లు కోల్పోయిన వెస్ట్‌ను... కేదార్ జాదవ్ (91 బంతుల్లో 97; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. అయితే చివరి ఓవర్లలో ఈస్ట్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి మ్యాచ్ చేజారకుండా చూసుకున్నారు. అశోక్ దిండా నాలుగు వికెట్లు తీశాడు.