దేవధర్ ట్రోఫీ విజేత ఈస్ట్‌జోన్ | devendra trophy East zone | Sakshi
Sakshi News home page

దేవధర్ ట్రోఫీ విజేత ఈస్ట్‌జోన్

Published Thu, Dec 4 2014 12:20 AM | Last Updated on Sat, Sep 2 2017 5:34 PM

దేవధర్ ట్రోఫీ విజేత ఈస్ట్‌జోన్

దేవధర్ ట్రోఫీ విజేత ఈస్ట్‌జోన్

ముంబై: దేశవాళీ క్రికెట్ టోర్నీ దేవధర్ ట్రోఫీని ఈస్ట్‌జోన్ జట్టు కైవసం చేసుకుంది. వాంఖడే స్టేడియంలో బుధవారం జరిగిన ఫైనల్లో ఈస్ట్ 24 పరుగుల తేడాతో వెస్ట్‌జోన్‌పై గెలిచింది. 1973-74 సీజన్‌లో మొదలైన దేవధర్ ట్రోఫీని ఈస్ట్‌జోన్ జట్టు నెగ్గడం ఇది ఐదోసారి. చివరిసారి ఈస్ట్ జట్టు 2003-04 సీజన్‌లో విజేతగా నిలిచింది.
 
 ఫైనల్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఈస్ట్‌జోన్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది. కెప్టెన్ మనోజ్ తివారీ (92 బంతుల్లో 75; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), సామంత్రి (50 బంతుల్లో 60; 7 ఫోర్లు, 1 సిక్సర్), విరాట్ సింగ్ (84 బంతుల్లో 54; 6 ఫోర్లు) అర్ధసెంచరీలతో రాణించారు. ధావల్, జోసెఫ్ రెండేసి వికెట్లు తీశారు. వెస్ట్‌జోన్ జట్టు 47.2 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌటయింది. 37 పరుగులకే అంబటి తిరుపతి రాయుడు సహా మూడు వికెట్లు కోల్పోయిన వెస్ట్‌ను... కేదార్ జాదవ్ (91 బంతుల్లో 97; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. అయితే చివరి ఓవర్లలో ఈస్ట్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి మ్యాచ్ చేజారకుండా చూసుకున్నారు. అశోక్ దిండా నాలుగు వికెట్లు తీశాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement