
శుక్రవారం ముంబై వేదికగా ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఈ మ్యాచ్‌కు టీమిండియా రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరమయ్యాడు. ఈ క్రమంలో తొలి వన్డేకు భారత జట్టు సారథిగా హార్దిక్ పాండ్యా వ్యవహరించనున్నాడు. ఇక తొలి వన్డే కోసం రెండు రోజుల ముందే ముంబైకు చేరుకున్న హార్దిక్ సేన ప్రాక్టీస్ సెషన్స్‌లో మునిగి తేలింది. హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలో భారత జట్టు తమ ప్రాక్టీస్‌ను పూర్తి చేసింది.
అయితే ఈ ప్రాక్టీస్ సెషన్స్‌లో రాహుల్ ద్రవిడ్ ఫీల్డింగ్ కోచ్‌గా అవతరమెత్తాడు. ప్రపంచంలోనే అద్భుతమైన స్లిప్ ఫీల్డర్‌గా పేరొందిన ద్రవిడ్.. తన ఫీల్డింగ్ స్కిల్స్‌ను ఆటగాళ్లతో పంచుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో షేర్ చేసింది. ఈ వీడియోలో ద్రవిడ్.. యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్‌కు స్లిప్ ఫీల్డింగ్ మెళకువలు నేర్పిస్తున్నట్లు కన్పించింది. ఇక ఈ మ్యాచ్‌కు రోహిత్ దూరం కావడంతో భారత ఇన్నింగ్స్‌ను శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ ప్రారంభించనున్నారు.
తుది జట్లు(అంచనా)
భారత్: శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్
ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), మార్నస్ లాబుషేన్, మార్కస్ స్టోయినిస్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), గ్లెన్ మాక్స్‌వెల్, సీన్ అబాట్, నాథన్ ఎల్లిస్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా
చదవండి: Ind Vs Aus: గిల్‌కు జోడీగా టీమిండియా ఇన్నింగ్స్ ఆరంభించేది అతడే: హార్దిక్ పాండ్యా
A perfect 'catch'-up ft. #TeamIndia Head Coach Rahul Dravid & @ShubmanGill ahead of Match Day 👌👌 #INDvAUS | @mastercardindia pic.twitter.com/TC1mw5L7fX
— BCCI (@BCCI) March 17, 2023