Dravid go on WILD celebration as Mohammed Siraj dismisses Usman Khawaja - Sakshi
Sakshi News home page

IND vs AUS: తొలి బంతికే సిరాజ్‌ వికెట్‌.. రోహిత్‌, ద్రవిడ్‌ రియాక్షన్‌ మామూలుగా లేదుగా! వీడియో వైరల్‌

Published Thu, Feb 9 2023 12:27 PM | Last Updated on Thu, Feb 9 2023 1:05 PM

Dravid go on WILD celebrationas Mohammed Siraj dismisses Usman Khawaja - Sakshi

వారెవ్వా.. సిరాజ్‌ తొలి బంతికే వికెట్‌
పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అదరగొడుతున్న భారత పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌.. టెస్టుల్లో కూడా తన సూపర్‌ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఆసీస్‌తో మొదటి టెస్టు సందర్భంగా సిరాజ్‌ వేసిన తొలి బంతికే వికెట్‌ సాధించాడు. రెండో ఓవర్‌ బౌలింగ్‌ వేసేందుకు వచ్చిన సిరాజ్‌ మొదటి బంతికే ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాటర్‌ ఉస్మాన్ ఖవాజా పెవిలియన్‌కు పంపాడు. సిరాజ్‌ వేసిన అద్భుతమైన బంతికి ఖావాజా వికెట్ల ముందు దొరికిపోయాడు. సిరాజ్‌ దెబ్బకు ఖావాజా ఖాతాతెరవకుండానే వెనుదిరిగాడు.



రోహిత్‌, ద్రవిడ్‌ రియాక్షన్‌ వైరల్‌
సిరాజ్‌ వేసిన బంతిని ఉస్మాన్ ఖవాజా లెగ్‌సైడ్‌ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతి మిస్స్‌ అయ్యి అతడి ప్యాడ్‌కు తాకింది. దీంతో వికెట్‌ కీపర్‌తో పాటు బౌలర్‌ ఎల్బీ అప్పీల్‌ చేశారు. కానీ ఫీల్డ్‌ అంపైర్‌ మాత్రం నాటౌట్‌ అని తల ఊపాడు. ఈ క్రమంలో వికెట్‌ కీపర్‌ భరత్‌తో చర్చలు జరిపిన భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ రివ్యూ తీసుకున్నాడు. అయితే రిప్లే మాత్రం బంతి ఇన్‌లైన్‌ పడి ఆఫ్‌స్టంప్‌ను తాకుతున్నట్లు సృష్టంగా కన్పించింది.

దీంతో అంపైర్‌ నితిన్‌ మీనన్‌ తన నిర్ణయాన్ని వెనుక్కి తీసుకుంటూ ఔట్‌గా ప్రకటించాడు. ఈ క్రమంలో భారత ఆటగాళ్లు సెలబ్రేషన్స్‌లో మునిగి తేలిపోయారు. ముఖ్యంగా భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. డ్రెసింగ్‌ రూంలో కూర్చున్న ద్రవిడ్‌ గట్టిగా అరుస్తూ సెలబ్రేషన్స్‌ జరుపుకున్నాడు. కాగా రోహిత్‌, ద్రవిడ్‌కు సంబంధించిన రియాక్షన్‌ ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

కష్టాల్లో ఆస్ట్రేలియా..
నాగ్‌పూర్‌ వేదికగా జరగుతోన్న భారత్‌-ఆస్ట్రేలియా తొలి టెస్టు మొదటి రోజు నుంచే అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు భారత బౌలర్లు చుక్కలు చూపిస్తున్నారు. భారత బౌలర్ల దాటికి ఆసీస్‌ 36 ఓవర్లకు ఆస్ట్రేలియా నాలుగు వికెట్లు కోల్పోయి 84 పరుగులు చేసింది. జడేజా రెండు వికెట్లు సాధించగా.. షమీ, సిరాజ్‌ వికెట్‌ సాధించారు. ప్రస్తుతం క్రీజులో స్మిత్‌(25),హ్యాండ్స్‌కాంబ్ ఉన్నారు.


చదవండి: KS Bharat: కేఎస్‌ భరత్‌ అరంగేట్రం.. సీఎం జగన్‌ శుభాకాంక్షలు
                   IND vs AUS: షమీ సూపర్‌ డెలివరీ.. ఆఫ్‌ స్టంప్‌ ఎగిరిపోయిందిగా! పాపం వార్నర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement