ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారత జట్టు ఘోర ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌పై ఇప్పటికీ తీవ్ర విమర్శల వర్షం కురుస్తోంది. వీరిద్దరిని తమ పదవిలనుంచి తప్పించాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. రోహిత్ శర్మ స్ధానంలో వెటరన్ ఆటగాడు అజింక్యా రహానేకు టెస్టు జట్టు పగ్గాలు అప్పజెప్పాలని పలువరు సూచిస్తున్నారు.
ద్రవిడ్‌కు గుడ్‌బై
ఇక ఏడాది ఆక్టోబర్, నవంబర్‌లో జరగనున్న వన్డే ప్రపంచకప్ తర్వాత భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగియనుంది. అయితే ద్రవిడ్ పదవీకాలన్ని బీసీసీఐ పెంచే యోచనలో లేనట్లు తెలుస్తోంది. 2021లో రవిశాస్త్రి నుంచి కోచింగ్ బాధ్యతలు స్వీకరించిన ద్రవిడ్.. తన మార్క్ చూపించలేకపోయాడనే చెప్పుకోవాలి.
ద్రవిడ్ నేతృత్వంలో ముఖ్యంగా ఆసియాకప్-2022, టీ20 ప్రపంచకప్-2022, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ సిరీస్, డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారత జట్టు ఓటములను చవిచూసింది. ఈ క్రమంలోనే బీసీసీఐ ద్రవిడ్‌ను సాగనింపాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇక ద్రవిడ్ తర్వాత భారత జట్టు హెడ్‌కోచ్ బాధ్యతలు టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని లేదా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ జస్టిన్ లాంగర్‌కు అప్పజెప్పాలని అభిప్రాయపడుతున్నారు. మరికొంత మంది ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ను హెడ్‌కోచ్‌గా నియమించాలంటూ ట్విటర్‌లో పోస్టులు చేస్తున్నారు.
చదవండి: #NarendraModiStadium: అహ్మదాబాద్ స్టేడియం నిజంగా గొప్పదా!.. ఎందుకంత ప్రాముఖ్యత?
Comments
Please login to add a commentAdd a comment