Wankhede Stadium
-
అభిషేక్ శర్మ విధ్వంసం..భారత్ గెలుపు సిరీస్ కైవసం (ఫొటోలు)
-
వాంఖడే స్టేడియంలో క్రికెట్ దిగ్గజాల కోలాహలం (ఫోటోలు)
-
చాంపియన్స్ ట్రోఫీతో వాంఖడేలో మరోసారి సంబరాలు
ముంబై: ప్రఖ్యాత వాంఖడే క్రికెట్ మైదానానికి భారత క్రికెట్‌తో ప్రత్యేక అనుబంధం ఉందని... టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. గతేడాది టి20 ప్రపంచకప్ అనంతరం వాంఖడే మైదానంలో జరిగిన వేడుకలను తానెప్పటికీ మరవలేనని... ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ నెగ్గి మరోసారి అలాంటి సంబరాలు చేసుకోవాలనుందని రోహిత్ శర్మ వెల్లడించాడు. వాంఖడే స్టేడియం నిర్మించి 50 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఆదివారం ముంబై క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పలువురు స్టార్ క్రికెటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత కెప్టెన్ రోహిత్ మాట్లాడుతూ... ‘2024లో టి20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత తిరిగి ముంబైకి చేరుకున్న రోజు వచ్చిన స్పందన అనూహ్యం. సాగరతీరం మొత్తం అభిమానులతో నిండిపోవడాన్ని చూసి ఆశ్చర్యపోయా. మనవాళ్లతో కలిసి సంబరాలు చేసుకోవడంలో ఉన్న ఆనందమే వేరు. అది ఎలా ఉంటుందో ఒకటికి రెండుసార్లు చూశాను. 2007లో తొలిసారి టి20 ప్రపంచకప్ గెలిచినప్పుడు కూడా వాంఖడే స్టేడియంలో వేడుకలు నిర్వహించారు. అప్పుడు కూడా అభిమానులు బ్రహ్మరథం పట్టారు. 2011 వన్డే ప్రపంచకప్ గెలిచినప్పుడు కూడా అదే జరిగింది. త్వరలో చాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ఈ మెగా టోర్నీ ఆడే సమయంలో 140 కోట్ల మంది భారతీయుల ఆశలు మా మీద ఉంటాయని తెలుసు. మరో ఐసీసీ ట్రోఫీని తీసుకువచ్చి ఇక్కడ సంబరాలు చేసుకునేందుకు ప్రయత్నిస్తాం’ అని పేర్కొన్నాడు. క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ మాట్లాడుతూ... వాంఖడేకు వస్తే ఇంటికి వచ్చినట్లే ఉంటుందని అన్నాడు. వాంఖడేలో ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడిన సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ... ‘2013లో కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించాలని నిర్ణయించుకున్నప్పుడు అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్‌తో చివరి టెస్టు వాంఖడేలో ఆడాలని ఉందని చెప్పా. నా అభ్యర్థనను అంగీకరించిన బోర్డు అందుకు అనుమతిచ్చింది. అప్పటి వరకు నేను మైదానంలో ఆడుతున్నప్పుడు మా అమ్మ ప్రత్యక్షంగా ఎప్పుడూ చూడలేదు. దీంతో కుటుంబ సభ్యుల సమక్షంలో ఇక్కడ కెరీర్ చివరి మ్యాచ్ ఆడా. ఆరోజు మైదానంలో అడుగు పెట్టినప్పుడు ఎలాంటి భావన కలిగిందో ఇప్పటికీ అదే అనిపిస్తుంది. ఇక నా జీవితంలో అత్యంత మధుర క్షణాలకు కూడా వాంఖడే వేదికగా నిలిచింది. 1983లో కపిల్‌దేవ్ సారథ్యంలోని టీమిండియా వన్డే ప్రపంచకప్ గెలిచినప్పుడు ఎంతో సంతోషించా. ఆ స్ఫూర్తితోనే ఆటపై మరింత దృష్టి పెట్టా. అయితే ఆ తర్వాత ఎన్నో ప్రయత్నాలు చేసినా వరల్డ్‌కప్ చేతికి చిక్కలేదు. ఎట్టకేలకు 2011లో నా కల వాంఖడే మైదానంలోనే నెరవేరింది’ అని అన్నాడు. తాను ఇదే మైదానంలో 6 బంతులకు 6 సిక్స్‌లు కొట్టిన విషయాన్ని భారత మాజీ ఆటగాడు, మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి గుర్తు చేసుకున్నాడు. వాంఖడే 50వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేశారు. -
India vs New Zealand: జయమా... పరాభవమా!
పుష్కర కాలం తర్వాత సొంతగడ్డపై టెస్టు సిరీస్ కోల్పోయిన టీమిండియా... ఇప్పుడు క్లీన్‌స్వీప్ ప్రమాదం ముంగిట నిలిచింది. సుదీర్ఘ టెస్టు క్రికెట్ చరిత్రలో స్వదేశంలో ఇప్పటి వరకు ఒక్క సిరీస్‌లోనూ క్లీన్‌స్వీప్ కాని భారత జట్టు... ఇప్పుడు న్యూజిలాండ్ తో అలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటోంది. మరోవైపు భారత్‌లో భారత్‌పై ఇప్పటి వరకు టెస్టు సిరీస్ నెగ్గని న్యూజిలాండ్... ఆ పని పూర్తి చేసి క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ బెర్త్ దక్కాలంటే ఈ మ్యాచ్‌లో విజయం అనివార్యం అయిన పరిస్థితుల్లో రోహిత్ బృందం ఎలాంటి ప్రదర్శన కనబరుస్తుందనేది ఆసక్తికరం! తొలి రెండు టెస్టుల్లో స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి కలిసికట్టుగా కదంతొక్కాలని, భారత్‌ను గెలుపు బాట పట్టించాలని అభిమానులు ఆశిస్తున్నారు.ముంబై: అనూహ్య తడబాటుతో న్యూజిలాండ్ చేతిలో వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిన భారత జట్టు శుక్రవారం నుంచి వాంఖడే మైదానం వేదికగా నామమాత్రమైన మూడో టెస్టు ఆడనుంది. ఇప్పటికే 0–2తో సిరీస్ కోల్పోయిన టీమిండియా ... కనీసం ఆఖరి మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని చూస్తుంటే... తొలిసారి భారత్ లో సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్ దాన్ని క్లీన్‌స్వీప్‌గా మలచాలని భావిస్తోంది. ఈ సిరీస్‌కు ముందు స్వదేశంలో గత 12 సంవత్సరాలుగా భారత జట్టు టెస్టు సిరీస్ ఓడిపోలేదు. అంతేకాకుండా 1984 నుంచి స్వదేశంలో భారత జట్టు ఏ ద్వైపాక్షిక సిరీస్‌లోనూ మూడు టెస్టుల్లో ఓడిపోలేదు. బెంగళూరు వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో పేస్ పిచ్‌ను సిద్ధం చేసి... వాతావరణ మార్పుల మధ్య తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలడంతో ఘోర పరాజయం మూటగట్టుకున్న రోహిత్ జట్టు... పుణేలో జరిగిన రెండో టెస్టులో స్పిన్ పిచ్‌పై కూడా తడబడింది. స్పిన్‌ను సమర్థవంతంగా ఎదుర్కోగలరనే పేరున్న మన ఆటగాళ్లు పుణే టెస్టులో పార్ట్ టైమ్ స్పిన్నర్ లాంటి సాంట్నర్‌ను ఎదుర్కోలేక చేతులెత్తేయడం అభిమానులను కలవర పరిచింది. ఈ నేపథ్యంలో వాంఖడే పిచ్‌ను సహజసిద్ధంగా ఉంచామని... జట్టు కోసం పిచ్‌లో ఎలాంటి మార్పులు చేయలేదని భారత సహాయక కోచ్ అభిషేక్ నాయర్ అన్నాడు. ఈ సిరీస్‌లో ఆకట్టుకోలేకపోయిన స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఆఖరి మ్యాచ్‌లోనైనా రాణిస్తారా చూడాలి. వరుసగా రెండుసార్లు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ ఆడిన టీమిండియా... ముచ్చటగా మూడోసారి కూడా తుదిపోరుకు అర్హత సాధించాలంటే మిగిలిన ఆరు టెస్టుల్లో సత్తా చాటాల్సిన అవసరముంది. బ్యాటర్లపైనే భారం! కొట్టిన పిండి లాంటి స్వదేశీ పిచ్‌లపై పరుగులు రాబట్టేందుకు భారత ఆటగాళ్లు ఇబ్బంది పడుతుంటే... న్యూజిలాండ్ బ్యాటర్లు మాత్రం సులువుగా పరుగులు చేస్తున్నారు. 2, 52, 0, 8... ఈ సిరీస్‌లో టీమిండియా కెపె్టన్ రోహిత్ శర్మ స్కోర్లివి. టాపార్డర్‌లో ముందుండి ఇన్నింగ్స్‌ను నడిపించాల్సిన రోహిత్ ఇలాంటి ప్రదర్శన చేస్తుండగా... స్టార్ బ్యాటర్ కోహ్లి గత నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 0, 70, 1, 17 పరుగులు చేశాడు. చాన్నాళ్లుగా జట్టు బాధ్యతలు మోస్తున్న ఈ జంట స్థాయికి ఈ ప్రదర్శన తగినది కాకపోగా... మిగిలిన వాళ్లు కూడా నిలకడలేమితో ఇబ్బంది పడుతున్నారు. యశస్వి జైస్వాల్ మంచి టచ్‌లో ఉండగా... శుబ్‌మన్ గిల్, సర్ఫరాజ్, పంత్ కలిసి కట్టుగా కదం తొక్కితేనే భారీ స్కోరు సాధ్యం. ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, అశి్వన్, వాషింగ్టన్ సుందర్ కేవలం బౌలింగ్‌పైనే కాకుండా బ్యాటింగ్‌లోనూ తమ వంతు పాత్ర పోషించాల్సిన అవసరముంది. ప్రధానంగా గత టెస్టులో టీమిండియా స్టార్ ఆటగాళ్లను న్యూజిలాండ్ స్పిన్నర్ సాంట్నర్ వణికించిన చోట... అశ్విన్–జడేజా జోడీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఈ లోపాలను అధిగమించకపోతే టీమిండియా మూడో టెస్టులోనూ పరాభవం మూటగట్టుకోవాల్సి ఉంటుంది. మరోవైపు కేన్ విలియమ్సన్ వంటి కీలక ఆటగాడు లేకుండానే భారత్‌పై సిరీస్ గెలిచిన న్యూజిలాండ్ ఇదే జోరు చివరి మ్యాచ్‌లోనూ కొనసాగించాలని చూస్తోంది. కాన్వే, రచిన్ రవీంద్ర, కెపె్టన్ లాథమ్ నిలకడగా రాణిస్తుండగా... ఫిలిప్స్, మిచెల్ కూడా మెరుగైన ప్రదర్శన చేస్తే న్యూజిలాండ్‌కు ఈ టెస్టులోనూ తిరుగుండదు. బౌలింగ్ విభాగంలో సౌతీ, ఒరూర్కీ, హెన్రీ, సాంట్నర్ విజృంభిస్తే భారత జట్టుకు ఇబ్బందులు తప్పవు. జోరుగా సాధన తొలి రెండు టెస్టుల్లో ప్రభావం చూపలేకపోయిన టీమిండియా... కివీస్‌తో మూడో టెస్టుకు ముందు జోరుగా ప్రాక్టీస్ చేస్తోంది. వాంఖడే పిచ్ స్పిన్‌కు సహకరించే అవకాశం ఉండటంతో స్పిన్నర్లను ఎదుర్కోవడంపై మన ప్లేయర్లు దృష్టి సారించారు. రోహిత్ శర్మ, కోహ్లితో పాటు ప్లేయర్లందరూ సాధనలో పాల్గొన్నారు. -
జగజ్జేతలకు జేజేలు.. వాంఖడేలో టీమిండియా జట్టుకు సన్మానం (ఫొటోలు)
-
దటీజ్ హార్దిక్ పాండ్యా.. అవమానపడ్డ చోటే జేజేలు! వీడియో వైరల్
13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఐసీసీ ట్రోఫీ సాధించి స్వదేశానికి చేరుకున్న భారత జట్టుకు అభిమానులు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. బార్బోడస్ నుంచి నేరుగా ఢిల్లీకి చేరుకున్న టీమిండియాకు అభిమానులు, బీసీసీఐ అధికారులు ఘనస్వాగతం పలికారు. ఎయిర్ పోర్ట్ నుంచి హోటల్‌కు వెళ్లే అంతవరకు జేజేలు కొడుతూ అభినందించారు. ఇప్పుడు ముంబై వంతు. ముంబై వీధుల్లో భారత ఆటగాళ్ల ఓపెన్ బస్ పరేడ్ ప్రారంభమైంది. క్రికెట్ అభిమానులతో ముంబై తీరం పోటెత్తింది. తమ ఆరాధ్య క్రికెటర్లను స్వాగతం పలికేందుకు భారీ సంఖ్యలో అభిమానులు రోడ్లపైకి వచ్చారు. నారిమన్ పాయింట్ నుంచి వాంఖడే స్టేడియం వరకు ఓపెన్ బస్ విక్టరీ పరేడ్ జరగనుంది. ఆ తర్వాత వాంఖడే స్టేడియంలో వరల్డ్ ఛాంపియన్స్‌కు సన్మానం జరగనుంది.హార్దిక్‌కు సారీ చెప్పిన అభిమానిఇక టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఎక్కడైతే కిందపడి అవమానాలు పొందాడో అక్కడే పడిలేచిన కెరటంలా దూసుకొచ్చాడు. ఐపీఎల్-2024లో సమయంలో ఏ వాంఖడే స్టేడియంలో అయితే విమర్శలు ఎదుర్కొన్నాడో.. ఇప్పుడు అదే మైదానంలో నీరాజనాలు అందుకుంటున్నాడు. భారత ఆటగాళ్ల సన్మాన వేడుక చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు వాంఖడే స్టేడియంకు తరలివచ్చారు. హార్దిక్ హార్దిక్ అంటూ జేజేలు కొడుతూ ఉన్నారు. ఈ క్రమంలో ఓ మహిళా అభిమాని లైవ్‌లో హార్దిక్ క్షమాపణలు చెప్పింది."మొట్టమొదట నేను హార్దిక్ పాండ్యాకి సారీ చెప్పాలనుకుంటున్నాను. ఐపీఎల్లో నేను కూడా అతడిని ట్రోల్ చేశాను. అలా ఎందుకు ట్రోల్ చేశానా అని ఇప్పుడు బాధపడుతున్నాను. అతడు టీ20 వరల్డ్‌కప్‌లో హీరోగా మారాడు. అతడు వేసిన చివరి ఒక అద్భుతం. అతడికి నేను క్షమాపణ చెప్పాలనుకుంటున్నానని" సదరు అభిమాని ఇండియా టూడేతో పేర్కొంది. Hardik Pandya is Zlatan Ibrahimovic of Indian Cricket 🏏 who has turned his "haters into fans" 👏🏻The Best All Rounder of ICC T20 World Cup 2024 - @hardikpandya7 💥#IndianCricketTeampic.twitter.com/cNcK2zPiwq— Richard Kettleborough (@RichKettle07) July 4, 2024 -
వాంఖడేలో భారత జట్టుకు సన్మానం.. ఫ్యాన్స్‌కు ఫ్రీ ఎంట్రీ
టీ20 వరల్డ్‌కప్-4 విజేతగా నిలిచిన భారత జట్టు నాలుగు రోజుల తర్వాత తమ సొంత గడ్డపై అడుగుపెట్టింది. గురువారం ఉదయం ఢిల్లీలోని ఇందిరా గాంధీ విమానశ్రాయంకు భారత జట్టుకు ఘన స్వాగతం లభించింది. ఎయిర్ పోర్ట్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న అభిమానులు టీమిండియాకు నీరాజనం పలికారు. భారత ఆటగాళ్లు సైతం ఎయిర్ పోర్ట్ నుంచి హోటల్‌కు వెళ్తున్న దారిలో అదిరే స్టెప్పులతో అలరించారు. అనంతరం రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు దేశ ప్రధాని నరేంద్ర మోదీని కలిసింది. దాదాపు అరగంట పాటు క్రికెటర్లు, సహాయ సిబ్బంది మోదీతో ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. ఇక మోదీతో భేటి అనంతరం టీమిండియా ఆటగాళ్లు ప్రత్యేక విమానంలో ముంబైకు పయనమయ్యారు. సాయంత్రం 5 గంటలకు ముంబై నగర వీధుల్లో టీమిండియా విజయోత్సవ యాత్ర జరుగనుంది.ఫ్యాన్స్‌కు ఫ్రీ ఎంట్రీ..ఆ తర్వాత రాత్రి 7 గంటలకు ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఆటగాళ్లకు సన్మాన కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి మాజీ క్రికెటర్లతో పాటు బీసీసీఐ పెద్దలు హాజరకానున్నారు. ఈ క్రమంలో ముంబై క్రికెట్ ఆసోషియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సన్మాన వేడుకను చూసేందుకు అభిమానులకు ఫ్రీ ఎంట్రీ ఇవ్వాలని ఎంసీఎ నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని గురువారం ఎంసీఎ ఒక ప్రకటనలో పేర్కొంది. అదే విధంగా స్టేడియం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేసినట్లు ఎంసీఎ అధికారులు తెలిపారు. సాయంత్రం 4 గంటలకు స్టేడియం గేట్లు ఓపెన్ చేయనున్నట్లు ఎంసీఏ వెల్లడించింది.వర్షం అంతరాయం..ఇక ఈ కార్యక్రమానికి వర్షం అంతరాయం కలిగించే ఛాన్స్ ఉంది. సన్మాన కార్యక్రమం జరిగే సమయంలో వర్షం పడే అవకాశాలు 90 శాతం ఉన్నట్లు అక్కడ వాతవారణ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా ఈ వేడుక కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. -
రోహిత్ శర్మకు ‘షాకిచ్చిన’ మహిళా అభిమాని! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో ఇంత వరకు బోణీ కొట్టని ఒకే ఒక జట్టు ముంబై ఇండియన్స్. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో మూడో ఓడి.. హ్యాట్రిక్ పరాజయాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. ఈ నేపథ్యంలో ఆదివారం నాటి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి తొలి విజయం అందుకోవాలని పట్టుదలగా ఉంది. సొంత మైదానం వాంఖడేలోనైనా సత్తా చాటాలని ఉవ్విళూర్లుతోంది. మరోవైపు.. ఢిల్లీ క్యాపిటల్స్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. నాలుగు మ్యాచ్‌లలో కేవలం ఒక్కటి మాత్రమే గెలిచిన పంత్ సేనకు ముంబైతో పోరు కీలకంగా మారింది. ఈ క్రమంలో ఇప్పటికే ఇరు జట్ల ఆటగాళ్లు ‘అస్త్రశస్త్రాల’తో సంసిద్ధులయ్యారు. ఇదిలా ఉంటే.. ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను చూసేందుకు అభిమానులు వాంఖడేకు పోటెత్తుతున్న విషయం తెలిసిందే. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4301451426.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); ఈ క్రమంలో ఓ యువతి హిట్‌మ్యాన్‌ను కలిసేందుకు మైదానానికి వచ్చింది. మ్యాచ్‌కు ముందు సేద తీరుతున్న రోహిత్ దగ్గరకు పరిగెత్తుకు వెళ్లి.. అతడి పాదాలకు నమస్కరించింది.దీంతో రోహిత్ ఒక్కసారిగా షాకయ్యాడు. A fan meets Rohit Sharma & touches his feet at the Wankhede stadium. 💥 pic.twitter.com/LsWwFUCbRg — Mufaddal Vohra (@mufaddal_vohra) April 6, 2024 కాస్త ఇబ్బందిపడుతూనే ఇలా చేయవద్దవంటూ వారించాడు. ఇక తన అభిమాన క్రికెటర్‌ను కలిసిన అనంతరం సదరు యువతి.. రోహిత్ ఫొటోపై అతడి ఆటోగ్రాఫ్ తీసుకుంది. ఆ తర్వాత ఫొటోలు కూడా దిగి ఫ్యాన్‌గర్ల్ మూమెంట్‌ను సెలబ్రేట్ చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా ఐపీఎల్-2024లో హార్దిక్ పాండ్యా సారథ్యంలో ముంబై ఇండియన్స్ ఆటగాడిగా బరిలోకి దిగుతున్నాడు రోహిత్ శర్మ. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో కలిపి కేవలం 69 పరుగులు మాత్రమే చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లోనైనా బ్యాట్ ఝులిపిస్తాడేమో చూడాలి!! చదవండి: Virat Kohli: స్లో ఇన్నింగ్స్ అంటూ సెటైర్లు.. కోహ్లి స్పందన ఇదే -
IND-W vs AUS-W: విజయంతో ప్రారంభించాలని...
ముంబై: కొత్త ఏడాదిని విజయంతో ప్రారంభించాలనే లక్ష్యంతో... నేడు ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరిగే చివరిదైన మూడో వన్డేలో భారత జట్టు బరిలోకి దిగనుంది. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా ఇప్పటికే తొలి రెండు వన్డేల్లో ఓటమి పాలై సిరీస్‌ను కోల్పోయింది. ఫలితంగా ఆ్రస్టేలియాపై తొలిసారి ద్వైపాక్షిక వన్డే సిరీస్‌ను సొంతం చేసుకోవాలని ఆశించిన భారత జట్టుకు మరోసారి నిరాశే ఎదురైంది. ఇక చివరి మ్యాచ్‌లోనైనా గెలిచి ఊరట చెందాలని భారత బృందం భావిస్తోంది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టుల్లో విశేషంగా రాణించి అద్భుత విజయాలు అందుకున్న భారత జట్టు వన్డే ఫార్మాట్‌కు వచ్చేసరికి తడబడింది. సమష్టి ప్రదర్శన కొరవడటంతో ఈ ప్రభావం మ్యాచ్ తుది ఫలితంపై పడింది. భారత్ తరఫున బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలలో ఒకరిద్దరే రాణిస్తుండటం ప్రతికూలంగా మారింది. తొలి వన్డేలో భారత జట్టు భారీ స్కోరు చేసినా బౌలర్ల వైఫల్యం దెబ్బతీసింది. రెండో వన్డేలో రిచా ఘోష్ ఒంటరి పోరాటంతో విజయానికి చేరువైన భారత్ చివర్లో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి ఆఖరికి మూడు పరుగుల తేడాతో ఓడిపోయింది. అంతేకాకుండా రెండో మ్యాచ్‌లో భారత ఫీల్డర్లు ఏకంగా ఏడు క్యాచ్‌లు జారవిడిచారు. కెపె్టన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్ రెండు మ్యాచ్‌ల్లోనూ విఫలమైంది. తొలి మ్యాచ్‌లో 9 పరుగులు చేసిన హర్మన్ రెండో మ్యాచ్‌లో 5 పరుగులతో సరిపెట్టుకుంది. చివరిసారి 2007లో స్వదేశంలో ఆ్రస్టేలియాపై వన్డే మ్యాచ్‌లో గెలిచిన భారత్ ఆ తర్వాత వరుసగా తొమ్మిది వన్డేల్లో ఓటమి చవిచూసింది. స్వదేశంలో ఆసీస్ చేతిలో పరాజయపరంపరకు తెర దించాలంటే చివరి వన్డేలో భారత జట్టు విశేషంగా రాణించాల్సి ఉంటుంది. స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, యసిక్త భాటియాలతోపాటు కెపె్టన్ హర్మ న్‌ప్రీత్ కూడా బ్యాటింగ్‌లో మెరిపిస్తే భారత్ భారీ స్కోరు చేసే అవకాశముంటుంది. బౌలింగ్‌లో రేణుక సింగ్‌తోపాటు స్పిన్నర్లు కూడా తమ బాధ్యతను నిర్వర్తించడంతో టీమిండియా విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. చివరి బంతి వరకు ఓటమిని అంగీకరించని తత్వం ఆ్రస్టేలియా క్రికెటర్ల సొంతం. అందుకే రెండు వన్డేల్లోనూ ఆ జట్టు ఒత్తిడికిలోనైన సందర్భాల్లో తడబడకుండా సంయమనంతో ఆడి కోలుకున్నారు. ఫోబి లిచ్‌ఫీల్డ్, తాలియా మెక్‌గ్రాత్, యాష్లే గార్డ్నర్, ఎలీస్ పెరీ, కెపె్టన్ అలీసా హీలీ, అనాబెల్ సదర్లాండ్ మరోసారి రాణిస్తే ఆ్రస్టేలియా వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడం సాధ్యమే. -
సచిన్ విగ్రహంపై అభిమానుల అసంతృప్తి.. స్టీవ్ స్మిత్‌లా ఉందంటూ కామెంట్స్
ముంబైలోని వాంఖడే స్టేడియంలో కొత్తగా ఏర్పాటైన సచిన్ టెండూల్కర్ విగ్రహంపై భారత క్రికెట్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సచిన్ విగ్రహం ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్‌ను పోలి ఉండటంతో సచిన్ అభిమానులు పెదవి విరుస్తున్నారు. సచిన్ విగ్రహాన్ని సరిగ్గా రూపొందింలేదని విగ్రహ రూపకర్తపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యావత్ భారత దేశంతో పాటు ప్రపంచ దేశాలన్నీ కీర్తించే సచిన్ విగ్రహాన్ని తయారు చేసేప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని తాయారు చేసి ఉండాల్సిందని విగ్రహ రూపకర్తను దూషిస్తున్నారు. సచిన్ అంటే గిట్టని వారు, క్రికెట్ పరిజ్ఞానం లేని వారు స్టీవ్ స్మిత్ విగ్రహం భారత్‌లో ఉందేందంటూ వ్యంగ్యమైన కామెంట్స్ చేస్తున్నారు. వాంఖడేలో నిన్న భారత్-శ్రీలంక మధ్య మ్యాచ్ జరిగినప్పటికీ నుంచి సచిన్ విగ్రహం పెద్ద చర్చనీయాంశమైంది. కాగా, నవంబర్ 1న ప్రతిష్టాత్మక వాంఖడే మైదానంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన విషయం తెలిసిందే. వాంఖడేలో సచిన్ స్టాండ్ పక్కనే విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సచిన్ ఆఫ్‌సైడ్ షాట్ ఆడే పోజ్‌లో ఈ విగ్రహాన్ని డిజైన్ చేశారు. అహ్మదాబాద్‌కు చెందిన ప్రమోద్ కాంబ్లే ఈ విగ్రహాన్ని రూపొందించారు. సచిన్‌తో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, బీసీసీఐ కార్యదర్శి జై షా విగ్రహావిష్కరణ చేశారు. కాగా, సచిన్ తన సొంత మైదానమైన వాంఖడేలో తన ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ (నవంబర్ 16, 2013) ఆడిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, వాంఖడే వేదికగా శ్రీలంకతో నిన్న జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 302 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో భారత్ అధికారికంగా సెమీస్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. గిల్ (92), కోహ్లి (88), శ్రేయస్ (82) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. లంక బౌలర్లలో దిల్షన్ మధుష్క 5 వికెట్లతో సత్తా చాటాడు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన లంకేయులను భారత పేసర్లు దారుణంగా దెబ్బకొట్టారు. మొహమ్మద్ షమీ (5-1-18-5), మొహమ్మద్ సిరాజ్ (7-2-16-3), జస్ప్రీత్ బుమ్రా (5-1-8-1), రవీంద్ర జడేజా (0.4-0-4-1) ధాటికి శ్రీలంక 19.4 ఓవర్లలో 55 పరుగులకే ఆలౌటైంది. లంక ఇన్నింగ్స్‌లో ఏకంగా ఐదుగురు డకౌట్లు కాగా..14 పరుగులు చేసిన కసున్ రజిత టాప్ స్కోరర్‌గా నిలిచాడు. -
Sachin Tendulkar Statue At Wankhede Stadium: వాంఖడే స్టేడియంలో సచిన్ విగ్రహావిష్కరణ (ఫొటోలు)
-
నేడు సచిన్ విగ్రహావిష్కరణ
ముంబై: ప్రతిష్టాత్మక వాంఖెడె మైదానంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ విగ్రహం ఏర్పాటు కానుంది. బుధవారం జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఈ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. సచిన్ స్టాండ్ పక్కనే దీనిని ఏర్పాటు చేయనుండగా...ఆఫ్‌సైడ్‌లో షాట్ ఆడుతున్న చిత్రాన్ని ఈ విగ్రహం కోసం ఎంచుకున్నారు. అహ్మదాబాద్‌కు చెందిన ప్రమోద్ కాంబ్లే దీనిని రూపొందించారు. స్వయంగా సచిన్‌తో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, బీసీసీఐ కార్యదర్శి జై షా తదితరులు దీనికి హాజరవుతారు. తన సొంత మైదానమైన ముంబై వాంఖెడె స్టేడియంలోనే 2011 వన్డే వరల్డ్ కప్ ట్రోఫీ అందుకున్న సచిన్... తన ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్‌ను ఇక్కడే నవంబర్ 16, 2013న ఆడాడు. -
క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. ధోనికి అరుదైన గౌరవం
ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) టీమిండియా మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోనికి అరుదైన గౌరవం ఇవ్వనుంది. వాంఖడే స్టేడియం వేదికగా 12 సంవత్సరాల క్రితం శ్రీలంకతో జరిగిన వన్డే ప్రపంచ కప్ ఫైనల్ స్మారకార్థం స్టాండ్స్‌లోని ఒక సీటుకు ధోని పేరు పెట్టాలని నిర్ణయించింది. 91 పరుగులు నాటౌట్‌గా నిలిచిన ధోని సిక్సర్‌తో విన్నింగ్ షాట్ కొట్టి 28 ఏళ్ల నిరీక్షణకు తెరదించాడు. కాగా.. శ్రీలంకతో ఫైనల్లో ధోని కొట్టిన విన్నింగ్ సిక్స్ కొట్టి కోట్లాది భారతీయు కలను నిజం చేశాడు. నాడు ధోని కొట్టిన సిక్స్.. స్టేడియంలో ఓ సీటుపై పడింది. ఆ సీటుకు ఇప్పుడు ధోనీ పేరు పెట్టాలని ఎంసీఏ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) ప్రెసిడెంట్ అమోల్ ఖేల్ వెల్లడించారు. వాంఖడే స్టేడియంలో కొన్ని స్టాండ్స్‌కు ఇప్పటికే సచిన్, గవాస్కర్, విజయ్ మర్చంట్ పేర్లు ఉన్నాయి. ప్రస్తుతం క్రికెట్ చరిత్రలోనే తొలిసారి వినూత్నంగా సీటుకు ధోని పేరు పెట్టనుండడం విశేషం. -
భారత్ క్రికెట్ దిగ్గజం సచిన్ కు అరుదైన గౌరవం
-
IPL 2022: ముచ్చటగా మూడు...
ముంబై: ఐపీఎల్లో ప్లే ఆఫ్స్ అవకాశాలు కోల్పోయిన తర్వాత మెరుగ్గా ఆడుతున్న ముంబై ఇండియన్స్ మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. ‘సొంతగడ్డ’ వాంఖెడేలో జరిగిన పోరులో ఐదుసార్లు లీగ్ చాంపియన్ ముంబై ఐదు వికెట్ల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌ను చిత్తు చేసింది. తాజా ఫలితంతో నాలుగుసార్లు విజేత చెన్నై కూడా అధికారికంగా ‘ప్లే ఆఫ్స్’కు దూరమైంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 16 ఓవర్లలో 97 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ ఎమ్మెస్ ధోని (33 బంతుల్లో 36 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఒక్కడే కాస్త పట్టుదలగా నిలబడగా, మిగతావారంతా చేతులెత్తేశారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ డానియెల్ స్యామ్స్ (3/16) చెన్నైని దెబ్బ తీయగా... కార్తికేయ, మెరిడిత్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం ముంబై 14.5 ఓవర్లలో 5 వికెట్లకు 103 పరుగులు చేసింది. తిలక్ వర్మ (32 బంతుల్లో 34 నాటౌట్; 4 ఫోర్లు), టిమ్ డేవిడ్ (7 బంతుల్లో 16 నాటౌట్; 2 సిక్స్‌లు) ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. టపటపా... తొలి ఓవర్లో కాన్వే (0), మొయిన్ అలీ (0) వికెట్లను కోల్పోయిన చెన్నై ఆ తర్వాత కోలుకోలేకపోయింది. రాబిన్ ఉతప్ప (1), రుతురాజ్ గైక్వాడ్ (7), అంబటి రాయుడు (10) కూడా వెనుదిరగడంతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 32/5కు చేరింది. ఈ దశలో ధోని ఒక ఎండ్‌లో నిలబడి పరుగులు సాధించే ప్రయత్నం చేయగా... శివమ్ దూబే (10), బ్రేవో (12) కూడా విఫలమయ్యారు. అనంతరం ముంబై కూడా కాస్త తడబడింది. ఇషాన్ కిషన్ (6), రోహిత్ శర్మ (18), స్యామ్స్ (1), స్టబ్స్ (0) తక్కువ వ్యవధిలో అవుట్ కావడంతో ముంబై ఇండియన్స్ స్కోరు 33/4కు చేరింది. అయితే తిలక్ వర్మ, హృతిక్ షోకిన్ (18; 2 ఫోర్లు) ఐదో వికెట్‌కు 48 పరుగుల భాగస్వామ్యంతో జట్టును గెలుపుదిశగా నడిపించారు. కరెంట్ లేదు...డీఆర్ఎస్ లేదు ప్రపంచ క్రికెట్లో అత్యంత విలువైన ప్రతిష్టాత్మక టోర్నీ... లీగ్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్ల మధ్య దేశంలో అమిత ప్రాధాన్యత ఉన్న మైదానంలో జరుగుతున్న మ్యాచ్... కానీ మ్యాచ్‌కు ముందస్తు ఏర్పాట్లను బీసీసీఐ చేసుకోవడంలో విఫలమైంది. ముంబై నగరంలో కరెంట్ కోతతో వాంఖెడేలో కూడా అంధకారం ఏర్పడింది. ఫ్లడ్ లైట్లు సరిగా వెలగకపోవడంతో టాస్ కూడా ఆలస్యమైంది. అయితే ఆ తర్వాత కరెంట్ కోత అసలు ఆటనూ ఇబ్బంది పెట్టింది. విద్యుత్ సమస్య కారణంగా ‘హాక్ ఐ’ టెక్నాలజీని వాడే అవకాశం లేదంటూ చెన్నై ఇన్నింగ్స్‌లో తొలి పది బంతుల పాటు డీఆర్ఎస్ పని చేయలేదు. నాలుగో బంతికి కాన్వేను అంపైర్ ఎల్బీగా ప్రకటించగా, రివ్యూ చేసే అవకాశం లేకపోయింది. బంతి గమనాన్ని చూస్తే కచ్చితంగా అతను నాటౌట్‌గా తేలేవాడని అనిపించింది. రెండో ఓవర్ నాలుగో బంతికి కూడా ఉతప్ప దాదాపు ఇదే తరహాలో వెనుదిరిగాడు. అతను కూడా రివ్యూ గురించి ఆలోచించినా ఆ అవకాశం లేదని తేలడంతో విరమించుకున్నాడు. ఆ తర్వాతే మైదానంలో సాధారణ స్థితి నెలకొంది. ఐపీఎల్లో నేడు బెంగళూరు X పంజాబ్ కింగ్స్ వేదిక: ముంబై, రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం. -
బంపరాఫర్ కొట్టేశారు
-
IND vs NZ 2nd Test: కోహ్లి వచ్చేశాడు.. రహానేకు మరో అవకాశం!
IND vs NZ 2nd Test.. అన్ని అనుకూలతలు ఉన్నా న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో చేతులదాకా వచ్చిన విజయాన్ని చేజిక్కించుకోలేకపోయిన భారత్ ఈసారి అలాంటి తప్పును పునరావృతం చేయరాదని పట్టుదలగా ఉంది. రెండో టెస్టులో గెలుపుతో పాటు సిరీస్‌ను కూడా సొంతం చేసుకునేందుకు టీమిండియా సన్నద్ధమైంది. నేటినుంచి వాంఖెడే మైదానంలో జరిగే పోరులో ఇరు జట్లు తలపడనున్నాయి. గత మ్యాచ్‌కు దూరంగా ఉన్న విరాట్ కోహ్లి ఈ టెస్టులో అందుబాటులోకి రావడం భారత జట్టు బలాన్ని పెంచింది. మరోవైపు పర్యాటక న్యూజిలాండ్ జట్టు కూడా తీసికట్టుగా ఏమీలేదు. ఒక్క వికెట్ చేతిలో పెట్టుకొని 11 మంది ఆటగాళ్లతో ఓ ఆటాడుకున్న కివీస్ అంతే ఆత్మవిశ్వాసంలో సమరానికి సన్నద్ధమైంది. ఈ రెండు జట్ల ఉత్సాహంపై చినుకులు కురిపించేందుకు వానా కూడా కాచుకుంది. గురువారం ముంబైలో వర్షం కురిసింది. దీంతో ఇరు జట్ల ఆటగాళ్లు ఇండోర్ నెట్స్‌లో ప్రాక్టీస్ చేయాల్సివచ్చింది. సాహా ఫిట్... వచ్చీ రాగానే భారత కెప్టెన్ కోహ్లికి జట్టు కూర్పు పెను సవాలు విసురుతోంది. మైదానంలో దిగే తుది 11 మంది కోసం పెద్ద కసరత్తే చేయాల్సిన కష్టం వచ్చింది. కోహ్లి గైర్హాజరీలో కాన్పూర్‌లో అరంగేట్రం చేసిన శ్రేయస్ అయ్యర్ సెంచరీ, అర్ధ సెంచరీతో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. దీంతో అతన్ని తప్పించడం విరాట్‌తో పాటు జట్టు మేనేజ్మెంట్కు ఇష్టం లేదు. ఈ నేపథ్యంలో ఫామ్‌లో లేని రహానే, ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌లలో ఒకరిపై వేటు ఖాయం. అయితే సీనియర్‌గా రహానేకు సొంతగడ్డపై మరో అవకాశం దక్కే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. టెస్టు స్పెషలిస్టు కీపర్, అనుభజ్ఞుడైన సాహా ఫిట్‌గా ఉండటంతో ఆంధ్ర వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ అరంగేట్రం చేసే అవకాశాలు తగ్గిపోయాయి. పెద్దగా ప్రభావం చూపలేకపోయిన ఇషాంత్ స్థానంలో సిరాజ్ తుది జట్టులోకి రావచ్చు. భారత బ్యాటింగ్ లైనప్‌ను పుజారా, రహానేల వైఫల్యం కలవరపెడుతోంది. వీళ్లిద్దరు అనుభవజ్ఞులు తమ బ్యాట్లకు పని చెబితే భారత్‌కు భారీస్కోరు ఖాయమవుతుంది. వర్షంతో తేమ ఉన్నప్పటికీ సీమర్లకంటే ముగ్గురు స్పిన్నర్లు అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్‌లపైనే టీమ్ మేనేజ్మెంట్ నమ్మకం పెట్టుకుంది. కివీస్ గెలుపు ఆశలు! టి20 సిరీస్‌ను కోల్పోయిన న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌ను కోల్పోయేందుకు సిద్ధంగా లేదు. భారత్‌కు తగ్గట్టే స్పిన్ అస్త్రాలు, భారత్ కంటే మెరుగైన పేస్ బౌలర్లున్న కేన్ విలియమ్సన్ సేన ఈ టెస్టు విజయంతో సిరీస్‌ను ఎగరేసుకుపోవాలని చూస్తోంది. బౌలర్లకు అండగా బ్యాట్స్‌మెన్ కూడా నిలకడగా రాణిస్తే కివీస్ అనుకున్నది సాధిస్తుంది. ఓపెనర్లు యంగ్, లాథమ్‌లతో పాటు అనుభవజ్ఞుడైన రాస్ టేలర్ ఈ మ్యాచ్‌లో రాణిస్తే భారత్‌కు కష్టాలు తప్పవు. అయితే మిడిలార్డర్లో నికోల్స్, వికెట్ కీపర్ బ్లన్‌డేల్ సత్తా చాటాల్సి ఉంది. రచిన్ రవీంద్ర స్పిన్ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ రాణిస్తుండటం కలిసొచ్చే అంశం. ఉదయం బౌన్స్‌కు అనుకూలించే వికెట్‌పై జేమీసన్, సౌతీ చెలరేగడం ఖాయం. ఇలాంటి పరిస్థితుల్లో భారత టాపార్డర్ ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. జట్లు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), శుబ్‌మన్, పుజారా, రహానే, అయ్యర్, సాహా, జడేజా, అశ్విన్, అక్షర్, సిరాజ్, ఉమేశ్. న్యూజిలాండ్: విలియమ్సన్ (కెప్టెన్), విల్ యంగ్, లాథమ్, టేలర్, నికోల్స్, బ్లన్‌డేల్, రచిన్ రవీంద్ర, కైల్ జేమీసన్, టిమ్ సౌతీ, సోమర్‌విలే /వాగ్నర్, ఎజాజ్ పటేల్. పిచ్, వాతావరణం తొలి రోజైతే వర్షం ముప్పు పొంచి ఉంది. దీంతో తేమ కారణంగా వాంఖెడే పిచ్ పేసర్లకు అనుకూలించవచ్చు. మూడు, నాలుగు రోజుల్లో ఆటపై స్పిన్ ప్రభావం ఉంటుంది. -
రాయల్స్ రాజసం
ఆల్‌రౌండ్ ప్రదర్శనతో రాజస్తాన్ రాయల్స్ అదరగొట్టింది. తొలుత బౌలింగ్‌లో మోరిస్ హడలెత్తించి కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేయగా... ఛేజింగ్‌లో సంజూ సామ్సన్, మిల్లర్ నడిపించడంతో రాయల్స్ సునాయాసంగా విజయతీరం చేరింది. నిరాశాజనక ప్రదర్శనతో మాజీ చాంపియన్ కోల్‌కతా నాలుగో పరాజయం చవిచూసి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి పడిపోయింది. ముంబై: రెండు వరుస ఓటములతో ఒత్తిడిలో ఉన్న రాజస్తాన్ రాయల్స్‌కు ఊరటనిచ్చే విజయం లభించింది. మొదట బౌలింగ్, ఆ తర్వాత బ్యాటింగ్‌లో మెరిసి తమ ఖాతాలో రెండో గెలుపును జమ చేసుకుంది. వాంఖెడే స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ 6 వికెట్లతో కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్)పై నెగ్గింది. తొలి మ్యాచ్‌లో నెగ్గిన కేకేఆర్ వరుసగా నాలుగో పరాభవాన్ని మూట గట్టుకొని ఐపీఎల్ పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి పడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో 9 వికెట్లకు 133 పరుగులు చేసింది. రాహుల్ త్రిపాఠి (26 బంతుల్లో 36; 1 ఫోర్, 2 సిక్స్‌లు), దినేశ్ కార్తీక్ (24 బంతుల్లో 25; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. క్రిస్ మోరిస్ (4/23) బంతితో విజృంభించాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ రాయల్స్ 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ సంజూ సామ్సన్ (41 బంతుల్లో 42 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) చివరి వరకు క్రీజులో నిలిచి జట్టుకు గెలుపును కట్టబెట్టాడు. మిల్లర్ (23 బంతుల్లో 24 నాటౌట్; 3 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. బ్యాటింగ్‌లో తడబాటు... టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌కు మరోసారి శుభారంభం దక్కలేదు. క్రీజులో ఉన్నంతసేపు తీవ్రంగా ఇబ్బంది పడ్డ శుబ్‌మన్ గిల్ (11) బట్లర్ అద్భుతమైన అండర్ ఆర్మ్త్రోకి రనౌటయ్యాడు. 5వ ఓవర్ నాలుగో బంతికి షార్ట్ ఎక్స్ట్రా కవర్లోకి ఆడిన గిల్... లేని పరుగు కోసం ప్రయత్నించగా అక్కడే ఉన్న బట్లర్ బంతిని అందుకొని నాన్ స్ట్రయికింగ్ ఎండ్‌లోని వికెట్లను నేరుగా గురిచూసి కొట్టాడు. దాంతో గిల్ ఇన్నింగ్స్ ముగిసింది. క్రీజులోకి వచ్చిన రాహుల్ త్రిపాఠి ఎదుర్కొన్న తొలి బంతిని ఫోర్ బాదాడు. మరో ఎండ్‌లో ఉన్న నితీశ్ రాణా (22; 1 ఫోర్, 1 సిక్స్) ఉనాద్కట్ బౌలింగ్‌లో మిడ్ వికెట్ మీదుగా సిక్సర్ కొట్టాడు. అయితే సకారియా బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చిన రాణా పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత వచ్చిన సునీల్ నరైన్ (6) యశస్వి జైస్వాల్ పట్టిన అద్భుత క్యాచ్‌కు వెనుదిరిగాడు. దాంతో 10 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 55/3గా ఉంది. ఫామ్‌లో లేని కేకేఆర్ కెప్టెన్ మోర్గాన్ (0)ను ఈ మ్యాచ్‌లో దురదృష్టం వెంటాడింది. మోరిస్ వేసిన 11వ ఓవర్ తొలి బంతిని షార్ట్ ఫైన్‌లెగ్ మీదుగా సిక్సర్ బాదిన త్రిపాఠి... రెండో బంతిని స్ట్రయిట్ డ్రైవ్ ఆడాడు. అయితే ఆ బంతి కాస్తా నాన్ స్ట్రయికింగ్ ఎండ్‌లో ఉన్న మోర్గాన్ బ్యాట్‌ను తాకి... మోరిస్ సమీపంలో పడింది. అయితే అప్పటికే క్రీజును వదిలి ముందుకు వెళ్లిన మోర్గాన్ వెనక్కి వచ్చేలోపు బంతిని అందుకున్న మోరిస్ వికెట్లను గిరాటేశాడు. దాంతో ఒక్క బంతి ఆడకుండానే మోర్గాన్ పెవిలియన్ బాట పట్టాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన దినేశ్ కార్తీక్, త్రిపాఠి కలిసి రాజస్తాన్ బౌలర్లను ప్రతిఘటించారు. అయితే ముస్తఫిజుర్ తన స్లో ఆఫ్కట్టర్ డెలివరీతో త్రిపాఠిని బోల్తా కొట్టించాడు. క్రీజులోకి వచ్చిన రసెల్ సిక్సర్ బాది చెన్నైతో జరిగిన మ్యాచ్‌కు కొనసాగింపు అన్నట్లు కనపించాడు. అయితే బంతిని అందుకున్న మోరిస్... రసెల్ (9)తో పాటు మరో ఎండ్‌లో ఉన్న దినే శ్ కార్తీక్‌ను పెవిలియన్‌కు చేర్చాడు. మళ్లీ చివరి ఓవర్ వేయడానికి వచ్చిన మోరిస్... ఆ ఓవర్లో 6 పరుగులు మాత్రమే ఇచ్చి కమిన్స్ (10), శివమ్ మావి (5)లను అవుట్ చేసి కేకేఆర్‌ను కట్టడి చేశాడు. నడిపించిన నాయకుడు ఛేదనలో రాజస్తాన్‌ను కెప్టెన్ సామ్సన్ విజయం వరకు నడిపించాడు. బట్లర్ (5) వికెట్‌ను త్వరగా కోల్పోగా... వన్‌డౌన్‌లో వచ్చిన సామ్సన్ బౌండరీతో ఖాతా తెరిచాడు. మరో ఎండ్‌లో యశస్వి జైస్వాల్ (22; 5 ఫోర్లు) దూకుడుగా ఆడి శివమ్ మావి బౌలింగ్‌లో వెనుదిరిగాడు. లక్ష్యం చిన్నదే అయినా వెంటవెంటనే వికెట్లను కోల్పోవడంతో రాజస్తాన్‌కు ఒక భాగస్వామ్యం అవసరమైంది. దాంతో ఆ బాధ్యతను కెప్టెన్ సామ్సన్, దూబే తీసుకున్నారు. నరైన్ బౌలింగ్‌లో మిడ్ వికెట్ మీదుగా దూబే సిక్సర్ కొట్టడంతో... పవర్‌ప్లేలో రాజస్తాన్ రెండు వికెట్లకు 50 పరుగులు చేసింది. సామ్సన్, దూబే బౌండరీలతోపాటు సింగిల్స్‌కూ ప్రాధాన్యం ఇచ్చారు. ఫలితంగా రాజస్తాన్ స్కోరు బోర్డు ఎక్కడా నెమ్మదించలేదు. 10 ఓవర్లకు రాజస్తాన్ 80/2గా నిలిచింది. ఈ సమయంలో బౌలింగ్‌కు వచ్చిన వరుణ్ కేకేఆర్‌కు బ్రేక్‌ను అందించాడు. వరుణ్ వేసిన గూగ్లీ బంతిని దూబే షాట్ ప్రయత్నం చేయగా... బంతి బ్యాట్ అంచును తాకుతూ గాల్లోకి లేవగా షార్ట్ థర్డ్‌మ్యాన్ దగ్గర ఉన్న ప్రసిధ్ కృష్ణ క్యాచ్ పట్టాడు. దాంతో 45 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. తెవాటియా (5) విఫలమయ్యాడు. ఈ దశలో సామ్స న్‌తో జత కలిసిన మిల్లర్ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు. మావి, ప్రసిధ్ కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో రాజస్తాన్ విజయ సమీ కరణం 30 బంతుల్లో 30 పరుగులకు వచ్చింది. మిల్లర్ వరుస ఓవర్లలో మూడు బౌండరీలు బాదడంతో రాజస్తాన్‌ను విజయం వరించింది. స్కోరు వివరాలు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: నితీశ్ రాణా (సి) సామ్సన్ (బి) సకారియా 22; గిల్ (రనౌట్) 11; రాహుల్ త్రిపాఠి (సి) పరాగ్ (బి) ముస్తఫిజుర్ 36; సునీల్ నరైన్ (సి) యశస్వి జైస్వాల్ (బి) ఉనాద్కట్ 6; మోర్గాన్ (రనౌట్) 0; దినేశ్ కార్తీక్ (సి) సకారియా (బి) మోరిస్ 25; రసెల్ (సి) మిల్లర్ (బి) మోరిస్ 9; కమిన్స్ (సి) పరాగ్ (బి) మోరిస్ 10; శివమ్ మావి (బి) మోరిస్ 5; ప్రసిధ్ కృష్ణ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 133. వికెట్ల పతనం: 1–24, 2–45, 3–54, 4–61, 5–94, 6–117, 7–118, 8–133, 9–133. బౌలింగ్: జైదేవ్ ఉనాద్కట్ 4–0–25–1, చేతన్ సకారియా 4–0–31–1, ముస్తఫిజుర్ 4–0–22–1, క్రిస్ మోరిస్ 4–0–23–4, రాహుల్ తెవాటియా 3–0–24–0, శివమ్ దూబే 1–0–5–0. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: బట్లర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) వరుణ్ చక్రవర్తి 5; యశస్వి జైస్వాల్ (సబ్) (సి) కమలేశ్ నాగర్కోటి (బి) శివమ్ మావి 22; సంజూ సామ్సన్ (నాటౌట్) 42; శివమ్ దూబే (సి) ప్రసిధ్ కృష్ణ (బి) వరుణ్ చక్రవర్తి 22; తెవాటియా (సి) (సబ్) (సి) కమలేశ్ నాగర్కోటి (బి) ప్రసిధ్ కృష్ణ 5; మిల్లర్ (నాటౌట్) 24; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (18.5 ఓవర్లలో 4 వికెట్లకు) 134. వికెట్ల పతనం: 1–21, 2–40, 3–85, 4–100. బౌలింగ్: శివమ్ మావి 4–0–19–1, కమిన్స్ 3.5–0–36–0, వరుణ్ చక్రవర్తి 4–0–32–2, నరైన్ 4–0–20–0, ప్రసిధ్ కృష్ణ, 3–0–20–1. -
IPL 2021, RCB vs RR: పడిక్కల్ ఫటాఫట్...
అందని ద్రాక్షలా ఉన్న ఐపీఎల్ టైటిల్‌ను ఈసారి ఎలాగైనా చేజిక్కించుకోవాలనే పట్టుదలతో ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఈ సీజన్లో మరో ఘనవిజయం సాధించింది. ముందు బంతితో హడలెత్తించి... ఆ తర్వాత బ్యాట్‌తో గర్జించి... ఈ సీజన్లో వరుసగా నాలుగో విజయంతో ‘టాప్’లోకి వెళ్లింది. సిరాజ్, హర్షల్ పటేల్ బంతితో మెరిపించగా... ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్ రాజస్తాన్ రాయల్స్ బౌలర్లను చితగ్కొట్టి తన ఖాతాలో తొలి శతకాన్ని జమ చేసుకున్నాడు. దేవ్‌దత్‌కు కెప్టెన్ కోహ్లి అండగా నిలువడంతో బెంగళూరు వికెట్ నష్టపోకుండానే లక్ష్యాన్ని ఛేదించి రాజస్తాన్ రాయల్స్‌ను 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. ముంబై: మరోసారి స్ఫూర్తిదాయక ప్రదర్శన కనబరిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్–14 సీజన్లో తమ జైత్రయాత్రను కొనసాగిస్తోంది. వాంఖెడే స్టేడియంలో గురువారం జరిగిన మ్యాచ్‌లో కోహ్లి బృందం 10 వికెట్ల తేడాతో రాజస్తాన్ రాయల్స్‌ను ఓడించింది. 178 పరుగుల ఛేజింగ్‌లో ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్ అజేయ శతకం (52 బంతుల్లో 101 నాటౌట్; 11 ఫోర్లు, 6 సిక్స్‌లు)తో కదం తొక్కగా... కెప్టెన్ విరాట్ కోహ్లి (47 బంతుల్లో 72 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అతడికి సహకరించాడు. దాంతో బెంగళూరు 16.3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 181 పరుగులు చేసి అలవోకగా గెలిచింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 177 పరుగులు చేసింది. ఒకదశలో బెంగళూరు బౌలర్ సిరాజ్ (3/27) ధాటికి 43/4తో కష్టాల్లో ఉన్న రాజస్తాన్‌ను శివమ్ దూబే (32 బంతుల్లో 46; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), రాహుల్ తెవాటియా (23 బంతుల్లో 40; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) తమ వీరోచిత పోరాటంతో జట్టుకు భారీ స్కోరును అందించారు. మరో బౌలర్ హర్షల్ పటేల్ మూడు వికెట్లు తీశాడు. వికెట్ చేజార్చుకోకుండా... రాజస్తాన్ ఆపసోపాలు పడుతూ సాధించిన స్కోరును బెంగళూరు ఓపెనర్లు ఆడుతూ పాడుతూ కొట్టేశారు. రాజస్తాన్ సారథి సామ్సన్ ఇన్నింగ్స్ తొలి ఓవర్‌ను లెగ్ స్పిన్నర్ శ్రేయస్ గోపాల్‌తో వేయించగా... మొదటి మూడు బంతులను ఆచితూచి ఆడిన కోహ్లి నాలుగో బంతిని సిక్సర్ కొట్టి బెంగళూరు స్కోరు బోర్డును తెరిచాడు. అనంతరం పడిక్కల్ మూడు ఓవర్ల వ్యవధిలో ఏకంగా ఐదు ఫోర్లు బాది తన బ్యాటింగ్ సత్తాను ప్రదర్శించాడు. బౌలర్ ఎవరైనా సరే కొడితే సిక్సర్ లేదా ఫోర్ అన్నట్లు పడిక్కల్ ఇన్నింగ్స్ సాగింది. దాంతో మరో ఎండ్‌లో ఉన్న కోహ్లి... పడిక్కల్‌కే ఎక్కువగా స్ట్రయికింగ్ ఇస్తూ ప్రోత్సహించాడు. ఈ క్రమంలో ఎనిమిదో ఓవర్ మూడో బంతిని ఎక్స్ట్రా కవర్ మీదుగా ఫోర్ కొట్టిన పడిక్కల్ 27 బంతుల్లో అర్ధ శతకాన్ని సాధించాడు. 9వ ఓవర్లో రెండు సిక్సర్లు, పదో ఓవర్లో మరో సిక్సర్ బాదిన పడిక్కల్ దెబ్బకు 10 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు 107/0గా నిలిచింది. ఇక ఇక్కడి నుంచి నా వంతు అంటూ కోహ్లి మెరుపులు మెరిపించడం మొదలు పెట్టాడు. పడిక్కల్లా భారీ సిక్సర్లు బాదకపోయినా... కచ్చితమైన టైమింగ్‌తో చూడ చక్కటి షాట్లతో బౌండరీలను రాబడుతూ కోహ్లి 34 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. పడిక్కల్ శతకానికి చేరువగా రావడంతో కోహ్లి భారీ షాట్లకు వెళ్లకుండా సింగిల్స్ తీస్తూ స్ట్రయిక్‌ను రోటేట్ చేశాడు. ఈ క్రమంలో ముస్తఫిజుర్ వేసిన 17వ ఓవర్ తొలి బంతిని ఎక్స్ట్రా కవర్లో బౌండరీ బాదిన పడిక్కల్... 51 బంతుల్లో శతకాన్ని అందుకున్నాడు. ఇది అతడి ఐపీఎల్ కెరీర్లో తొలి సెంచరీ కావడం విశేషం. ఇక అదే ఓవర్లో బెంగళూరు విజయాన్ని అందుకుంది. నిలబెట్టిన భాగస్వామ్యం అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ బ్యాట్స్‌మెన్‌ను బెంగళూరు బౌలర్లు హడలెత్తించారు. రెండు బౌండరీలు సాధించి ఊపు మీదున్న బట్లర్ (8)తో పాటు డేవిడ్ మిల్లర్ (0)ను సిరాజ్ అవుట్ చేయగా... మనన్ వొహ్రా (7) వికెట్‌ను జేమీసన్ దక్కించుకోవడంతో రాజస్తాన్ 18 పరుగులకే మూడు వికెట్లను కోల్పోయింది. ఈ దశలో కెప్టెన్ సామ్సన్ (18 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్స్) రెండు ఫోర్లతో పాటు వాషింగ్టన్ సుందర్ ఓవర్లో డీప్ మిడ్‌వికెట్ మీదుగా భారీ సిక్సర్ కొట్టి జట్టును ఆదుకునేలా కనిపించాడు. అయితే ఒక స్లో డెలివరీతో సామ్సన్ను బోల్తా కొట్టించిన వాషింగ్టన్ సుందర్ బెంగళూరుకు నాలుగో వికెట్ అందించాడు. అయితే ఇక్కడి నుంచే ఒక అద్భుత పోరాటం మొదలైంది. యువ ప్లేయర్లు శివమ్ దూబే, రియాన్ పరాగ్ (16 బంతుల్లో 25; 4 ఫోర్లు) బెంగళూరు బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ రాజస్తాన్ స్కోరు బోర్డును నడిపించారు. ఈ క్రమంలో 12.2 ఓవర్లలో రాజస్తాన్ 100 పరుగుల మార్కును అందుకుంది. హర్షల్ పటేల్ వేసిన ఆ మరుసటి ఓవర్లో హెలికాప్టర్ షాట్‌తో లాంగాన్ మీదుగా బౌండరీని సాధించిన పరాగ్... ఆ తర్వాతి బంతికే పెవిలియన్ చేరాడు. దాంతో దూబే, పరాగ్‌ల 66 పరుగుల కీలక భాగస్వామ్యానికి తెరపడింది. తెవాటియా వచ్చీ రావడంతోనే సిక్సర్ కొట్టి ఖాతా తెరిచాడు. బంతి వ్యవధిలో మరో ఫోర్ కొట్టి బెంగళూరు బౌలర్లకు హెచ్చరికలు జారీ చేశాడు. అయితే అర్ధసెంచరీ వైపు దూసుకెళ్తున్న దూబే... రిచర్డ్సన్ బౌలింగ్‌లో మ్యాక్స్‌వెల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. చివర్లో తెవాటియా బౌండరీలతో వేగంగా పరుగులు సాధించడంతో రాజస్తాన్ ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్నే ఉంచగలిగింది. స్కోరు వివరాలు రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: బట్లర్ (బి) సిరాజ్ 8; మనన్ వొహ్రా (సి) రిచర్డ్సన్ (బి) జేమీసన్ 7; సంజూ సామ్సన్ (సి) మ్యాక్స్‌వెల్ (బి) సుందర్ 21; డేవిడ్ మిల్లర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) సిరాజ్ 0; శివమ్ దూబే (సి) మ్యాక్స్‌వెల్ (బి) రిచర్డ్సన్ 46; రియాన్ పరాగ్ (సి) చహల్ (బి) హర్షల్ పటేల్ 25; రాహుల్ తెవాటియా (సి) షహబాజ్ అహ్మద్ (బి) సిరాజ్ 40; క్రిస్ మోరిస్ (సి) చహల్ (బి) హర్షల్ పటేల్ 10; శ్రేయస్ గోపాల్ (నాటౌట్) 7; చేతన్ సకారియా (సి) డివిలియర్స్ (బి) హర్షల్ పటేల్ 0; ముస్తఫిజుర్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 177. వికెట్ల పతనం: 1–14, 2–16, 3–18, 4–43, 5–109, 6–133, 7–170, 8–170, 9–170. బౌలింగ్: సిరాజ్ 4–0–27–3; జేమీసన్ 4–0–28–1; రిచర్డ్సన్ 3–0–29–1; యజువేంద్ర చహల్ 2–0–18–0; వాషింగ్టన్ సుందర్ 3–0–23–1; హర్షల్ పటేల్ 4–0–47–3. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (నాటౌట్) 72; దేవ్‌దత్ పడిక్కల్ (నాటౌట్) 101; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (16.3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 181. బౌలింగ్: శ్రేయస్ గోపాల్ 3–0–35–0; చేతన్ సకారియా 4–0–35–0; క్రిస్ మోరిస్ 3–0–38–0; ముస్తఫిజుర్ 3.3–0–34–0; తెవాటియా 2–0–23–0; పరాగ్ 1–0–14–0. ► ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన జట్టుగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. బెంగళూరు బ్యాట్స్‌మెన్ మొత్తం 14 సెంచరీలు చేశారు. 13 సెంచరీలతో పంజాబ్ కింగ్స్ రెండో స్థానంలో ఉంది. ► ఐపీఎల్ చరిత్రలో 10 వికెట్ల తేడాతో నాలుగుసార్లు గెలిచిన ఏకైక జట్టు బెంగళూరు. ► ఐపీఎల్లో సెంచరీ చేసిన మూడో పిన్న వయస్కుడిగా పడిక్కల్ (20 ఏళ్ల 289 రోజులు) నిలిచాడు. మనీశ్ పాండే (19 ఏళ్ల 253 రోజలు; 2009లో), పంత్ (20 ఏళ్ల 218 రోజులు; 2018లో) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ► పంజాబ్ కింగ్స్ ప్లేయర్ పాల్ వాల్తాటీ (2011లో చెన్నైపై) తర్వాత భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించకుండా ఐపీఎల్లో సెంచరీ చేసిన రెండో క్రికెటర్ దేవ్‌దత్. -
ధవన్‌ను ఔట్ చేసేందుకు ధోని పక్కా ప్లాన్, కానీ
ముంబై: ఐపీఎల్ 2021 లో భాగంగా శనివారం జరిగిన తమ తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఏడు వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌పై ఘన విజయం సాధించింది. భారీ లక్ష్యం కళ్లముందున్నా ఎక్కడా తొందరపాటు లేకుండా ఢిల్లీ జట్టు ఓపెనర్లు ధవన్, పృథ్వీ షా స్కోరు బోర్డును పరుగెత్తించారు. దీంతో 189 పరుగుల లక్ష్యాన్ని పంత్ సేన సునాయాసంగా ఛేదించింది. అయితే, మాంచి ఊపుమీదున్న ధవన్‌ను ఔట్ చేసేందుకు ధోని వేసిన ప్లాన్ వర్కవుట్ కాలేదు. సామ్ కరాన్ వేసిన నాలుగో ఓవర్లో ధవన్ సిక్స్, ఫోర్ కొట్టి జోరు కొనసాగిసున్నాడు. వికెట్ పడితే తప్ప మ్యాచ్‌పై పట్టు రాదని భావించిన ధోని స్పిన్నర్ మొయిన్ అలీ బౌలింగ్‌లో ధవన్‌ను వెనక్కి పంపేందుకు ఓ చక్కటి పథకం రచించాడు. ధవన్ బ్యాటింగ్ చేస్తుండగా బంతిని స్టంప్స్‌కు దూరంగా.. అంటే వైడ్ దిశగా వేయాలని బౌలర్‌కు సూచించాడు. ఈ క్రమంలో అనుకున్నట్లే ధవన్ బంతిని బౌండరీని తరలించేందుకు ముందుకొచ్చి ఆడే ప్రయత్నం చేశాడు. బంతి కాస్తా ధవన్‌ను దాటిపోయి నేరుగా ధోని చేతుల్లో పడింది. సమయం కోసం వేచి చూస్తున్న చెన్నై సారథి బంతిని అందుకుని మెరుపు వేగంతో స్టంప్ అవుట్ చేశాడు. కానీ చెన్నైని దురదృష్టం వెంటాడింది. ఎందుకంటే ధోని చెప్పినట్టుగా అలీ బంతిని వేయలేదు. వైడ్ బదులు బ్యాట్స్‌మెన్ మీదుగా బౌన్స్ బాల్ వేశాడు. దీంతో అంపైర్ దానిని నో బాల్‌గా ప్రకటించాడు. ధవన్ బతికిపోయాడు. ఇక ధోని ట్రిక్ ఫెయిల్ కావడంపై అభిమానులు ట్విటర్లో స్పందించారు. అలీ మంచి చాన్స్ మిస్ చేశాడు. పాపం ధోని అని కొందరు, ధవన్ కనుక ఔట్ అయి ఉంటే ఢిల్లీ పరిస్థితి మరోలా ఉండేది, చెన్నైనే విజయం వరించేది అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ధోని ట్రిక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ( చదవండి: ఐపీఎల్లో ధోని డకౌట్లు ఇవే..! ) pic.twitter.com/CAqez5vetE— Aditya Das (@lodulalit001) April 10, 2021 -
ఇలా చేస్తే స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ చూడొచ్చు!
ముంబై: తమ రాష్ట్రంలో రోజువారీ కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. బీసీసీఐ ప్రొటోకాల్ ప్రకారం...వాంఖడే వేదికగా జరిగే ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించాలనుకునే తమ అపెక్స్ కౌన్సిల్ సభ్యులకు ఆర్టీ పీసీఆర్ నెగెటివ్ రిపోర్టును తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ పరీక్షను తాము చూడాలనుకునే మ్యాచ్‌కు 48 గంటలలోపు చేయించుకోవాల్సి ఉంటుందని అపెక్స్ కౌన్సిల్ సభ్యులకు ఎంసీఏ కార్యదర్శి సంజయ్ నాయక్ స్పష్టం చేశారు. అందులో నెగెటివ్ అని వస్తేనే మ్యాచ్‌ను చూసేందుకు స్టేడియంలోకి అడుగుపెట్టనిస్తామని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారు కూడా నెగెటివ్ రిపోర్టును కలిగి ఉండాలని సంజయ్ తెలిపారు. ఈ సీజన్లో 10 మ్యాచ్‌లకు వాంఖడే ఆతిథ్యమివ్వనుంది. ప్రత్యేకంగా మహరాష్ట్రలో అత్యధిక కేసులు నమోదవుతూ ఆ రాష్ట్ర ప్రజలను వణికిస్తున్న తెలిసిందే. కొన్ని రోజుల క్రితం స్టేడియం సిబ్బంది కరోనా వైరస్ బారిన పడిన సంగతి తెలిసిందే. ( చదవండి: మరోసారి తన విలువేంటో చూపించిన రైనా ) -
ఐపీఎల్ మ్యాచులు ఇక్కడ వద్దంటు సీఎంకు లేఖ
ముంబై: ప్రస్తుతం కరోనా వైరస్ ముంబైలో విలయ తాండవం చేస్తోంది. ఈ నేపథ్యంలో ముంబైలోని వాంఖడేలో ఐపీఎల్ మ్యాచులు జరుగుతాయా లేదా అన్న సందేహం మొదలైంది. ఇటీవల బీసీసీఐ మెంబర్ మ్యాచులకు సంబంధించి వేదికలో ఎటువంటి మార్పులు లేవని స్పష్టత వచ్చింది. కానీ ప్రస్తుతం వాంఖడే సమీపంలోని స్థానికులు కేసులు కారణంగా ముంబై వేదికను మార్చాలంటూ సీఎం ఉద్దవ్‌ఠాక్రేకు లేఖ రాశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 సీజన్ కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) తన ప్రణాళికను రూపొందించినప్పుడు దేశంలో కోవిడ్ -19 కేసుల పరిస్థితి సాధారణంగానే నమోదు అయ్యేవి. అయితే, గత రెండు వారాలు, దేశంలోని అన్ని నగరాల్లో రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. ప్రత్యేకంగా మహరాష్ట్రలో అత్యధిక కేసలు నమోదవుతూ ఆ రాష్ట్ర ప్రజలను వణికిస్తోంది. వీటి నివారణకు ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ, వారాంతపు లాక్డౌన్ వంటి కఠినమైన ఆంక్షలు అమలు చేస్తోంది. ఐపీఎల్ మ్యాచ్‌ల విషయంలో మాత్రం అనుకున్నట్లుగానే కొనసాగుతాయని స్పష్టం చేసింది. అయితే ప్రస్తుతం ముంబై వేదికను మార్చాలని కోరుతూ వాంఖడే స్టేడియం సమీపంలోని నివాసితులు ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రేకు లేఖ రాశారు. స్టేడియంలోకి ప్రేక్షకులకు అనుమతి లేకపోయినా , ఆటగాళ్లు వేదిక చేరుకున్నాక తమ అభిమాన ఆటగాడిని చూడాలన్న కోరికతో అభిమానులు గూమికూడే అవకాశం ఉంది. తద్వారా కరోనా మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వాంఖడే వేదికను మార్చవలసిందిగా అక్కడి స్థానికులు సీఎంకు లేఖ రాశారు. వివాహాలు, మరణాలు మొదలైన మతపరమైన, ఇతర సామాజిక కార్యకలాపాల విషయంలో ఆంక్షలు విధించిన రాష్ట్ర ప్రభుత్వం ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు ఎలా అనుమతినిస్తుందని వారు తమ లేఖలో పేర్కొన్నారు. ( చదవండి: వాంఖడేలో చాపకింద నీరులా కరోనా.. తాజాగా మరో ముగ్గురికి ) -
IPL 2021: వాంఖడేలో మ్యాచ్‌లపై ఎంసీఏ స్పష్టత
ముంబై: దేశంలో కరోనా మహమ్మారి రెండో దశ కొనసాగుతున్న వేళ ఐపీఎల్ 2021 నిర్వహణ కష్టంగా మారింది. మరోవైపు వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి మహారాష్ట్ర ప్రభుత్వం వారాంతపు లాక్డౌన్ విధించడంతో, వాంఖడే స్టేడియంలో మ్యాచులు జరుగుతాయా లేదా అని సందేహాలు నెలకొన్నాయి. ఈనేపథ్యంలో అభిమానుల ఉత్కంఠకు బీసీసీఐ తెర దించింది. వాంఖడేలో మ్యాచ్‌లపై స్పష్టతనిస్తూ ఐపీఎల్ మ్యాచులు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని, ఇందులో ఎటువంటి మార్పు లేదని ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) కార్యదర్శి సంజయ్ నాయక్ మీడియాకు తెలిపారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం ‘ఆటగాళ్లు మాత్రమే కాదు, సహాయ సిబ్బంది, గ్రౌండ్ స్టాఫ్ ఇలా ప్రతి ఒక్కరినీ బయో సేఫ్టీ బబుల్ లో ఉంచుతున్నాము. ముంబైలో లాక్డౌన్ ఉన్నప్పటికీ మ్యాచ్ రోజులలో స్టేడియానికి ప్రయాణించడం సమస్య కాదు. ఆటగాళ్లతో పాటు వారి సహాయ సిబ్బందికి కూడా క్రమం తప్పకుండా పరీక్షలు జరుగుతున్నాయి. గత సంవత్సరం దుబాయిలో తీసుకున్నజాగ్రత్తలు లానే అన్నింటినీ పాటించేలా బోర్డు చర్యలు తీసుకుంది. కనుక ఐపీఎల్ మ్యాచ్‌లు షెడ్యూల్ ప్రకారమే యధావిధిగా జరుపగలమని బీసీసీఐ భావిస్తోంది’ అని సంజయ్ నాయక్ పేర్కొన్నారు. ఇక ఐపీఎల్లో పాల్గొనే ఆటగాళ్లను కాపాడుకోవాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా చెప్పిన సంగతి తెలిసిందే. ఈ విషయమై ఇప్పటికే ఆరోగ్య మంత్రిత్వ శాఖతో బీసీసీఐ సంప్రదింపులు జరుపుతోంది. కాగా, వాంఖడే స్టేడియం తాజా ఐపీఎల్ సీజన్లో ఏప్రిల్ 10-25 వరకు 10 మ్యాచులకు ఆతిథ్యం ఇవ్వనుంది. స్టేడియంలో జరిగే తొలి మ్యాచ్ ఏప్రిల్ 10 న ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది. ( చదవండి: ఆ జెర్సీ వేసుకోలేను.. ఓకే చెప్పిన సీఎస్కే ) -
ఐపీఎల్‌కు కరోనా సెగ
మామూలుగా అయితే వేసవి వస్తుందంటే పిల్లలకు సెలవులు, అభిమానులకు ఐపీఎల్ మ్యాచ్‌లు ఉంటాయి. ఈ ఆహ్లాదపరిచే ఆనందం ముందు మండే ఎండలైనా చిన్నబోతాయి. కానీ గతేడాది నుంచి ట్రెండ్ మారింది. కొత్త వైరస్ (కరోనా) దాపురించింది. ఐపీఎల్‌ను వణికిస్తోంది. ఆటగాళ్లను, సిబ్బందిని బెంబేలెత్తిస్తోంది. మొత్తానికి ఈ ఏడాదీ కరోనా సెగ లీగ్‌కు తాకింది. ముంబై: ఐపీఎల్ టి20 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభానికి వారమైనా లేదు. కరోనా వైరస్‌తో ఈ టోర్నీలో అలజడి రేపింది. లీగ్ ఏర్పాట్లలో కలకలం మొదలైంది. శ్రీకారానికి ముందే వైరస్ సైరన్ మోగింది. భారత ఆల్‌రౌండర్, ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు అక్షర్ పటేల్ సహా ముంబైలోని వాంఖెడే స్టేడియం సిబ్బంది, పలువురు ఈవెంట్ మేనేజర్లు వైరస్ బారిన పడ్డారు. ఇది లీగ్ వర్గాలను ఠారెత్తించినా... గత అనుభవాల దృష్ట్యా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పెద్దగా కంగారు పడకుండా చేయాల్సిన పనుల్ని చక్కబెడుతూ, ఏర్పాట్లను మరింత కట్టుదిట్టంగా చేయాలని నిర్ణయించింది. ఐసోలేషన్‌లో అక్షర్... ఢిల్లీ ఆటగాడు అక్షర్ పటేల్‌కు పాజిటివ్ రిపోర్టు వచ్చిందని జట్టు వర్గాలు తెలిపాయి. ముంబైలో తను బసచేసిన హోటల్లో గత నెల 28న అతనికి పరీక్ష చేయగా అప్పుడు నెగెటివ్ వచ్చింది. కానీ మరోసారి కోవిడ్ టెస్టు చేస్తే పాజిటివ్ అని తేలింది. దీంతో అతన్ని ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కాగా అక్షర్ ఇంకా బయో బబుల్‌లోకి వెళ్లలేదు. కాబట్టి జట్టు సన్నాహక శిబిరానికి, ఇతర ఆటగాళ్ల ప్రాక్టీస్ సెషన్‌కు ఎలాంటి ఇబ్బంది లేదని ఫ్రాంచైజీ వర్గాలు తెలిపాయి. మొదట కోల్‌కతా నైట్‌రైడర్స్ హిట్టర్ నితీశ్ రాణా వైరస్ బారిన పడ్డట్లు రిపోర్టులో వచ్చింది. ఈ సీజన్లో ఇదే తొలికేసు. అయితే తదుపరి పరీక్షలో తను నెగెటివ్ అని తేలడంతో ఆటగాళ్లకు సంబంధించి తొలి పాజిటివ్ అక్షర్ ఖాతాలోకి వెళ్లింది. ఐపీఎల్ కరోనా ప్రోటోకాల్ ప్రకారం అక్షర్ 10 రోజులు క్వారంటైన్లో గడపాలి. క్వారంటైన్ గడువు ఈనెల 12న ముగియనుంది. ఆ తర్వాత వరుసగా రెండు ఆర్టీ–పీసీఆర్ టెస్టుల్లో కూడా అతనికి నెగెటివ్ రావాలి. అప్పుడే అతను జట్టుతో కలవగలడు. ఫలితంగా ఈనెల 10న చెన్నై సూపర్ కింగ్స్‌తో... 15న రాజస్తాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌ల్లో అక్షర్ ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున బరిలో దిగే అవకాశాలు కనిపించడంలేదు. మరోవైపు చెన్నై సూపర్‌కింగ్స్ (సీఎస్కే) ఆటగాడికి కూడా కోవిడ్ సోకినట్లు తెలిసింది. అయితే అతని పేరు మాత్రం బయటకు పొక్కలేదు. పది మంది సిబ్బందికి... మహారాష్ట్రలో వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. దీంతో ముంబైలోని వాంఖెడే స్టేడియం సిబ్బందిలో 10 మందికి కూడా కోవిడ్ సోకింది. దీంతో పాటు మరో ఆరుగురు ఈవెంట్ మేనేజర్లు కూడా కరోనా బారిన పడటంతో బీసీసీఐ ఆందోళన చెందింది. ఈ నేపథ్యంలో ముంబైలో జరగాల్సిన మ్యాచ్‌లను హైదరాబాద్ లేదంటే ఇండోర్‌లో నిర్వహించనున్నారనే వార్తలు వెలువడ్డాయి. కానీ బీసీసీఐ మాత్రం బయో బబుల్ ఏర్పాట్లు ఉన్నపళంగా మార్చలేమని, ఏదేమైనా కట్టుదిట్టమైన చర్యలతో ముంబైలోనే మ్యాచ్‌లు నిర్వహించేందకు ప్రయత్నిస్తామని చెప్పింది. ‘స్టాండ్‌బై స్టేడియాలలో హైదరాబాద్ ఒకటి. కానీ ఇప్పటికైతే ఆగమేఘాలపై ముంబై మ్యాచ్‌ల్ని అక్కడికి తరలించాలన్న ఆలోచన లేదు. ఎందుకంటే ఇప్పుడున్న ఈ కొద్ది సమయంలోనే మరో బబుల్ ఏర్పాటు అంత సులభం కాదు’ అని ఒక సీనియర్ బీసీసీఐ అధికారి వెల్లడించారు. షెడ్యూల్ ప్రకారం వాంఖెడే మైదానంలో ఈ నెల 10 నుంచి 25 వరకు 10 లీగ్ మ్యాచ్‌లు జరగాల్సివుంది. శుక్రవారం సాయంత్రం దాకా 8 పాజిటివ్ కేసులుంటే శనివారానికి ఆ సంఖ్య పదికి చేరిందని, ఆరేడు మంది ఈవెంట్ మేనేజర్లు కూడా వైరస్ బారిన పడ్డారని ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. -
IPL 2021: ఐపీఎల్‌కు కరోనా కష్టాలు
-
వాంఖడేలో కరోనా కలకలం.. బీసీసీఐ పునరాలోచన
ముంబై: ఐపీఎల్ 14వ సీజన్ ఆరంభానికి ముందే కరోనా కలకలం రేపింది. ముంబైలోని వాంఖడే స్టేడియం సిబ్బందిలో 8 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. కరోనా పాజటివ్‌గా సోకిన వారందరిని ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు. దీంతో ఏప్రిల్ 10న ఢిల్లీ క్యాపిటల్స్, సీఎస్కే మధ్య జరగనున్న లీగ్ మ్యాచ్‌ను నిర్వహించాలా వద్దా అనే దానిపై బీసీసీఐ తర్జన భర్జన పడుతోంది. తాజాగా కరోనా కేసులు వెలుగు చూడడంతో వాంఖడే స్టేడియంలో మ్యాచ్‌ల నిర్వహణపై బీసీసీఐ పునరాలోచన చేస్తుంది. కాగా దేశంలో కరోనా ఉదృతి ఎక్కువగా ఉండడంతో ఈసారి ఐపీఎల్ సీజన్‌ను 6 వేదికల్లోనే నిర్వహించాలని బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. చెన్నై, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, అహ్మదాబాద్, ఢిల్లీ వేదికలుగా మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ఖరారు చేసింది. ఐపీఎల్లో ఉన్న ఎనిమిది ఫ్రాంచైజీలకు హోం అడ్వాంటేజ్ లేకుండా ఆరు వేదికల్లో మ్యాచ్‌లు ఆడేలా ఏర్పాట్లు చేసింది. ఐపీఎల్ 14వ సీజన్‌కు ఇంకా ఆరు రోజులే మిగిలిఉన్న నేపథ్యంలో తాజాగా వాంఖడే స్టేడియం సిబ్బందికి కరోనా సోకడంతో కలవరం మొదలైంది. చదవండి: ఐపీఎల్ చరిత్రలో మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్స్ IPL 2021: మెస్సీని వచ్చే ఏడాది తీసుకుంటాం -
క్వారెంటైన్ కేంద్రంగా వాంఖేడి స్టేడియం
సాక్షి, ముంబై : దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ముంబై వాసులపై ఏమాత్రం కనికరం చూపకుండా తీవ్ర ప్రతాపం చూపుతోంది. మరోవైపు మహారాష్ట్ర వ్యాప్తంగానూ వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. ఇక ముంబైలో కరోనా వైరస్ బాధితులతో ఆస్పత్రులన్నీ ఇప్పటికే నిండిపోయాయి. ఈ క్రమంలో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ముంబైలోని చారిత్రాత్మక వాంఖేడి స్టేడియాన్ని క్వారెంటైన్ కేంద్రంగా మార్చుకోవాలని నిర్ణయించింది. వీలైనంత తొందరగా మైదానాన్ని తమకు అప్పగించాలని మున్సిపల్ కార్పొరేషన్ ఆదేశించింది. ఈ మేరకు ముంబై క్రికెట్ అసోషియేషన్ (ఎంసీఏ)కు ఓ లేఖ రాసింది. కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు తమకు స్టేడియాన్ని అప్పగించాలని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అసిస్టెంట్ కమిషనర్ చందనా జాదవ్ కోరారు. (లాక్డౌన్ 4:0: నేడు కొత్త మార్గదర్శకాలు) అంతేకాకుండా ముంబై మున్సిపాలిటీ పరిధిలోని హోటల్స్, లాడ్జ్, క్లబ్స్, కాలేజీలు, పంక్షన్ హాల్స్ మొదలైన వాటిని కూడా తమ ఆధీనంలోకి తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆయా యాజమాన్యాలకు నోటీసులు జారీచేసింది. వీటిలో కరోనా బాధితులకు వైద్యం అందిస్తున్న డాక్టర్లకు వసతి కల్పించాలని బీఎంసీ భావిస్తోంది. అలాగే వైరస్ బాధితులు నానాటికీ పెరుగుతుండటంతో వాటిల్లో క్వారెంటైన్ కేంద్రాలని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కాగా మహారాష్ట్రంలో ఇప్పటి వరకే 29,100 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... వైరస్ సోకి 1,068 మంది మృత్యువాత పడ్డారు. ఈ క్రమంలోనే లాక్‌డౌన్‌ను మే 31 వరకు పొడిగించింది. (లాక్డౌన్ 4.0: అమిత్ షా కీలక భేటీ) -
పట్టాలి... క్యాచుల్ని, సిరీస్‌ని!
సిరీస్ సొంతం చేసుకోవడానికి భారత్, వెస్టిండీస్ జట్లు ఆఖరి సమరానికి సిద్ధమయ్యాయి. నిలకడలేని బ్యాటింగ్, ఫీల్డర్ల వైఫల్యం టీమిండియాను ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా... ఐపీఎల్ అనుభవంతో నిర్ణాయక మ్యాచ్ ఫలితాన్ని శాసించాలని పొలార్డ్ బృందం పట్టుదలతో ఉంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన రోహిత్ శర్మ సొంత మైదానంలో ‘హిట్’ కావాలని, జట్టుకు సిరీస్ అందించాలని ఉత్సాహంతో ఉన్నాడు. ముంబై: భారత్, వెస్టిండీస్‌ల మధ్య ‘పొట్టి’పోరు ఆఖరి అంకానికి చేరింది. కోహ్లి సేన లోపాలను సరిదిద్దుకొని సమరానికి సన్నద్ధం కాగా... వాంఖెడే స్టేడియం పొలార్డ్‌ను ఊరిస్తోంది. ఐపీఎల్‌తో సొంత మైదానమైన చోట మ్యాచ్‌ను, సిరీస్‌ను చేజిక్కించుకోవాలని విండీస్ కెపె్టన్ పట్టుదలతో ఉన్నాడు. పూర్తిగా యువకులతో కూడిన వెస్టిండీస్ గత మ్యాచ్‌లో గెలిచి భారత్‌కు సవాల్ విసిరింది. టి20ల్లో రెండుసార్లు ప్రపంచ చాంపియన్ అయిన విండీస్‌తో ఈ పోరులో భారత్ ఆదమరిస్తే... మూల్యంగా మ్యాచ్‌నే కాదు, సిరీస్‌నే చెల్లించుకోవాల్సి వస్తుంది. కాబట్టి అనుభవజ్ఞులు, కుర్రాళ్ల కలయికతో ఉన్న టీమిండియా సత్తా చాటాల్సిన సమయమిదే. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరు జట్లు చెరో మ్యాచ్‌లో గెలిచి 1–1తో సమంగా ఉన్న నేపథ్యంలో నేడు జరిగే చివరిదైన మూడో టి20 మ్యాచ్ నిర్ణాయకం కానుంది. రోహిత్‌పై ఆశలు... రోహిత్, కోచ్ రవిశాస్త్రి తన సొంతగడ్డపై రోహిత్ శర్మ మెరుపులు మెరిపిస్తే భారత్ విజయం సులువవుతుంది. గత రెండు మ్యాచ్‌ల్లో అతను నిరాశపరిచాడు. 8, 15 పరుగులే చేసిన ‘హిట్‌మ్యాచ్’ ఈ పోరులో బ్యాట్ ఝుళిపిస్తే పరుగుల వరద ఖాయం. తొలి మ్యాచ్‌లో కోహ్లితో పాటు చెలరేగిన రాహుల్ ఈ మ్యాచ్‌లో తన ప్రభావం చూపేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఛేజింగ్‌లో ఓపెనర్లిద్దరు శుభారంభమిస్తే కోహ్లి సేన ఎంతటి లక్ష్యాన్నైనా ఛేదించగలుగుతుంది. సిరీస్‌ను తేల్చే కీలకమైన ఈ మ్యాచ్‌కు తుదిజట్టులో మార్పులు చేయకపోవచ్చు. పైగా కెపె్టన్ కోహ్లి... వికెట్ కీపర్ రిషభ్ పంత్‌పై నమ్మకముంచడంతో సంజూ సామ్సన్‌కు ఈ సిరీస్‌లోనూ తుది జట్టులో ఆడే చాన్స్ లేకపోయింది. బంగ్లాదేశ్‌తో కూడా అతన్ని ఒక్క మ్యాచ్‌లోనూ ఆడించలేదు. టాపార్డర్‌లో ప్రమోషన్ పొందిన శివమ్ దూబే ఈ మ్యాచ్‌లోనూ మెరుపులు మెరిపించేందుకు తహతహలాడుతున్నాడు. మిడిలార్డర్లో శ్రేయస్ అయ్యర్, పంత్‌లు కూడా పరుగుల ప్రవాహానికి జతకలిస్తే భారత్ భారీ స్కోరు చేయగలుగుతుంది. ముఖ్యంగా స్లాగ్ ఓవర్లపై భారత బ్యాట్స్‌మెన్ దృష్టి పెట్టాల్సి ఉంటుంది. క్యాచ్‌లు పడితేనే... ఈ సిరీస్‌లో భారత ఫీల్డింగ్ వైఫల్యం జట్టు మేనేజ్మెంట్ను కలవరపరుస్తోంది. రెండు మ్యాచ్‌ల్లోనూ విలువైన క్యాచ్‌లు జారవిడువడం సమస్యగా మారింది. తొలి టి20లో ఈ వైఫల్యాన్ని అనుకూలంగా మలుచుకున్న విండీస్ 200 పైచిలుకు పరుగులు చేసింది. కోహ్లి ఆఖరిదాకా చెలరేగడంతో గెలుపు దక్కింది. కానీ రెండో వన్డేలో క్యాచ్‌లు చేజార్చి భారత్ మూల్యం చెల్లించుకుంది. లేదంటే ఈపాటికే సిరీస్‌ను గెలిచేది. నెట్స్‌లోనూ భారత్ ప్రధానంగా ఈ లోపాలపైనే కసరత్తు చేసింది. మరోవైపు బౌలింగ్ విభాగం కూడా మెరుగుపడాలి. పునరాగమనం చేసిన భువనేశ్వర్ పరుగుల్ని కట్టడి చేయలేకపోయాడు. బంగ్లాదేశ్‌పై నిప్పులు చెరిగిన దీపక్ చాహర్ ఈ సిరీస్‌లో లయ కోల్పోయాడు. స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు. వీళ్లంతా రాణిస్తేనే కీలకమైన ఆఖరి మ్యాచ్‌లో భారత్ విజయఢంకా మోగిస్తుంది. పొలార్డ్‌కు కలిసొచ్చే ముంబై... ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్‌గా వాంఖెడేలో విండీస్ సారథి పొలార్డ్‌కు ఎంతో అనుభవముంది. పిచ్, గ్రౌండ్‌పై అతనికి రోహిత్ శర్మకు ఉన్నంత అవగాహన ఉండటం ఈ మ్యాచ్‌లో విండీస్‌కు కలిసిరావొచ్చు. టాపార్డర్‌లో సిమన్స్, లూయిస్ ఫామ్‌లో ఉన్నారు. హిట్టర్లు హెట్‌మైర్, నికోలస్ పూరన్ అందుబాటులో ఉండటం కరీబియన్ బ్యాటింగ్ ఆర్డర్‌ను పటిష్టం చేసింది. జట్టు మొత్తం యువకులే. పొట్టి ఫార్మాట్‌కు తగిన దూకుడు కుర్రాళ్లలోనే ఉంటుంది. బ్రాండన్ కింగ్ భారీషాట్లు ఆడగల సమర్థుడు. గత మ్యాచ్‌లో బౌలర్లు విలియమ్స్, కాట్రెల్ భారత జోరుకు కళ్లెం వేశారు. ముఖ్యంగా ఆఖరి ఓవర్లలో అద్భుతంగా కట్టడి చేశారు. అనుభవజ్ఞుడైన పేసర్ హోల్డర్, లెగ్ స్పిన్నర్ హేడెన్ వాల్ష్ టీమిండియాపై తప్పకుండా ప్రభావం చూపే అవకాశం ఉంది. ►ముంబైలోని వాంఖెడే స్టేడియంలో భారత్ ఇప్పటివరకు మూడు టి20 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో ఒక మ్యాచ్‌లో గెలిచి (శ్రీలంకపై 5 వికెట్లతో; డిసెంబర్ 24న, 2017)... రెండింటిలో (ఇంగ్లండ్ చేతిలో 6 వికెట్లతో; డిసెంబర్ 22న, 2012... విండీస్ చేతిలో 7 వికెట్లతో; మార్చి 31న, 2016) ఓడిపోయింది. వాంఖెడేలో జరిగిన ఈ మూడు మ్యాచ్‌ల్లోనూ ఛేజింగ్ చేసిన జట్టే గెలుపొందడం విశేషం. మేం ఎప్పుడో జరిగే పొట్టి ప్రపంచకప్‌పై ఆలోచించడం లేదు. ఈ మ్యాచ్‌తో సిరీస్ గెలవడంపైనే దృష్టి పెట్టాం. ఇప్పుడైతే మా లోపాలను సవరించుకునే పనిలో ఉన్నాం. లక్ష్యాన్ని ఛేదించడమే భారత్‌కు సులువు. ఈ సిరీస్‌లో కూడా అదే జరిగింది. ప్రస్తుతం పటిష్టమైన జట్టును ఎదుర్కొంటున్నాం. ఆ తర్వాత శ్రీలంకతో ఆడాలి. అనంతరం న్యూజిలాండ్‌కు వెళ్లాలి. పది నెలల తర్వాత జరిగే మెగా ఈవెంట్‌కు ముందు మేం ఎన్నో టి20లు ఆడాల్సి ఉంటుంది. –భారత ఓపెనర్ రోహిత్ క్యాచ్‌లు చేజార్చుతుంటే మ్యాచ్‌ల్ని నెగ్గలేం. ఫీల్డర్లు ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి. ఫ్లడ్‌లైట్ల వల్ల కనబడలేదనో, మరే ఇతర కారణాల్ని సాకులుగా చెప్పడానికి వీల్లేదు. అవసరమైతే ప్రాక్టీస్‌లో కఠోరంగా శ్రమించైనా పట్టు సాధించాలి. కెపె్టన్ పొలార్డ్‌కు ఈ వేదికపై విశేషంగా ఆడిన అనుభవముంది. ఇది మా జట్టుకు పనికొస్తుంది. ఇక్కడ 200 చేసినా ఛేదించవచ్చు. మొదట బ్యాటింగ్ కంటే చేజింగే సులువు. –వెస్టిండీస్ కోచ్ ఫిల్ సిమన్స్ పిచ్, వాతావరణం వాంఖెడేలో లక్ష్యఛేదన సులువు. టాస్ నెగ్గిన జట్టు ఫీల్డింగే ఎంచుకుంటుంది. మంచుకురిసే రాత్రి వేళ బౌలర్లకు పట్టుదొరకడం కష్టం కావొచ్చు. మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదు. జట్లు (అంచనా) భారత్: కోహ్లి (కెపె్టన్), రోహిత్ శర్మ, రాహుల్, పంత్, శ్రేయస్, శివమ్ దూబే, జడేజా, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, భువనేశ్వర్, చహల్. వెస్టిండీస్: కీరన్ పొలార్డ్ (కెపె్టన్), లెండిల్ సిమన్స్, లూయిస్, కింగ్, హెట్‌మైర్, నికోలస్ పూరన్, జేసన్ హోల్డర్, పియరీ, విలియమ్స్, కాట్రెల్, హేడెన్ వాల్ష్ -
మాజీ జట్టును చీల్చిచెండాడాడు!
‘ఇది మా హోమ్‌గ్రౌండ్. ఇక్కడ మేం చాలా మ్యాచ్‌లు ఆడాం. మ్యాచ్ గెలువడానికి సీక్రెట్ అంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండదు. అందరూ ఉమ్మడిగా ఆడి గెలువాల్సిందే. అందరూ బాధ్యత తీసుకోవాల్సిందే’.. ఇవి రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్ సందర్భంగా టాస్ ఓడిన అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అన్న మాటలు. కానీ, చావోరేవో తేల్చుకోవాల్సిన ఈ మ్యాచ్‌లో సొంతగడ్డ వాంఖడే స్టేడియంలో ముంబైకి పరాభవమే ఎదురైంది. వాంఖడే స్టేడియంలో కీలక ఇన్నింగ్స్ ఆడిన జోస్ బట్లర్ 94 పరుగులు చేసి.. ముంబై ప్లేఆఫ్ ఆశలను కకావికలం చేశాడు. అతను ముంబై మాజీ ఆటగాడు కావడం గమనార్హం. అంతేకాదు, గతంలో ముంబై సభ్యుడిగా వాంఖడేలో ఆడిన అనుభవమే.. తన తాజా ఇన్నింగ్స్‌కు తోడ్పడిందని బట్లర్ చెప్పడం కొసమెరుపు. నిజానికి ముంబై జట్టు ఈసారి మెరికల్లాంటి ఆటగాళ్లను కోల్పోయినందుకు చాలా బాధపడి ఉంటుంది. ఆ జట్టు వదులుకున్న అంబటి రాయుడు చెన్నై సూపర్‌కింగ్స్ తరఫున మెరుపులు మెరిపిస్తున్నాడు. కీలక ఇన్నింగ్స్‌లతో చెలరేగుతున్న రాయుడు అత్యధిక పరుగుల బ్యాట్స్‌మెన్ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. ముంబై వదులుకున్న మరో ఆటగాడు జోస్ బట్లర్.. వరుస అర్ధసెంచరీలతో రాజస్తాన్ రాయల్స్ జట్టులో కొత్త ఉత్సాహాన్ని తెచ్చాడు. తాజా సీజన్లో వరుసగా ఐదు అర్ధ సెంచరీలు సాధించిన బట్లర్.. జట్టు ఫ్లేఆఫ్ ఆశలను ఇంకా సజీవంగా నిలిపిన ఏకైక యోధుడిగా నిలిచాడు. తాజాగా ముంబైతో మ్యాచ్‌లో 54 బంతుల్లో 94 పరుగులు చేసి.. చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో ఓడటంతో ముంబై ఇండియన్స్ ఫ్లేఆఫ్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. వాంఖడే అనుభవమే..! ముంబై విసిరిన 169 పరుగుల లక్ష్యాన్ని 12 బంతులు మిగిలి ఉండగానే రాజస్తాన్ జట్టు ఛేదించింది. మ్యాచ్ అనంతరం జోస్ బట్లర్ విలేకరులతో మాట్లాడుతూ.. గతంలో తాను ముంబై జట్టులో ఆడిన విషయాన్ని గుర్తుచేసుకున్నాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో గత అనుభవాలు తాను సూపర్ పర్ఫార్మెన్స్ ఇవ్వడంలో తోడ్పడ్డాయని చెప్పాడు. ‘మంచి ఫామ్‌లో ఉండటంతో దానిని కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నా. డూ ఆర్ డై పరిస్థితుల్లో మేం ఉన్నాం. మిడిలార్డర్లో నేను ఎంతోకాలంగా బ్యాటింగ్ చేస్తున్నాను. కాబట్టి ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ ముగిసే వరకు బ్యాటింగ్ చేయాలనుకున్నా. మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి ముంబై జట్టును 15 పరుగుల వరకు కట్టడి చేశారు. మైదానం గురించి, వికెట్ గురించి తెలిసి ఉండటం కలిసొచ్చింది. తదుపరి మ్యాచ్‌లోనూ బాగా ఆడాలని అనుకుంటున్నా’ అని జోస్ బట్లర్ వివరించాడు. -
పాండ్యా నాటౌట్..! చిర్రెత్తిన కోహ్లీ
ముంబై: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీకి కోపమొచ్చింది. హార్దిక్ పాండ్యా ఔటైనా నాటౌట్‌గా ప్రకటించారంటూ అతడు అసహనానికి గురయ్యాడు. ఫీల్డ్ అంపైర్‌ని కలిసి ఇదేంటని ప్రశ్నించాడు. ఈ సంఘటన ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్ల మధ్య వాంఖడే స్టేడియంలో మంగళవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో చోటుచేసుకుంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆర్సీబీ బౌలర్ క్రిస్ వోక్స్ వేసిన 19వ ఓవర్ తొలి బంతికి కీరన్ పొలార్డ్ ఔటవడంతో హార్దిక్ పాండ్యా బ్యాటింగ్‌కి వచ్చాడు. అదే ఓవర్లో వోక్స్ వేసిన మరో బంతికి హార్దిక్ క్యాచ్ ఔట్ అంటూ ఆర్సీబీ అప్పీల్ చేయడం ఫీల్డ్ అంపైర్ వేలెత్తడం చకచక జరిగిపోయాయి. అయితే దీనిపై రివ్యూ కోరిన ముంబై ఇండియన్స్ జట్టుకు అనుకూలంగా నిర్ణయం వచ్చింది. థర్డ్ అంపైర్ హార్దిక్‌ను నాటౌట్‌గా ప్రకటించాడు. హార్దిక్ నాటౌట్ అంటూ బిగ్ స్ర్కీన్‌పై చూసిన కోహ్లీకి చిర్రెత్తుకొచ్చింది. వెంటనే ఫీల్డ్‌లో ఉన్న అంపైర్ దగ్గరికి వెళ్లి ఆరా తీశాడు. మైదానంలో కూల్‌గా వ్యవహరించే కోహ్లీ ఈ నిర్ణయం సరైంది కాదని అడ్డంగా తల ఊపుతూ.. అసహనం వ్యక్తం చేశాడు. అయితే స్టికో మీటర్లో సైతం బంతి పాండ్యా బ్యాట్ అంచును తాకుతూ వెళ్లినట్లు నిర్ధారణ కావడం గమనార్హం. కాగా, ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 46 పరుగుల తేడాతో బెంగుళూరుపై ఘన విజయం సాధించింది. ముంబైకి ఈ సీజన్లో ఇదే తొలి విజయం కావడం విశేషం. -
ఐపీఎల్: 10 నిమిషాలకు తమన్నా అంత తీసుకుందా!
ముంబై : మరి కొద్ది గంటల్లో ప్రారంభమయ్యే ఐపీఎల్-2018 ఆరంభోత్సవ వేడుకల్లో సౌత్‌బ్యూటీ తమన్నా చిందేయనుంది. పదినిమిషాల ప్రదర్శనకు ఈ అమ్మడు ఏకంగా 50 లక్షల రూపాయలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ముంబైలోని వాంఖడే మైదానంలో ప్రారంభమయ్యే ఈ వేడుకల్లో తమన్నాతో కలిసి డ్యాన్సింగ్ మ్యాస్ట్రో ప్రభుదేవా ప్రేక్షకులను అలరించనున్నాడు. నాలుగు దక్షిణాది పాటల్లో చిందేసే వీరి నృత్యాన్ని శైమక్ దేవర్ కొరియోగ్రఫి చేసినట్లు సమాచారం. ఇక ఈ అవకాశంపై తమన్నా ఆనందం వ్యక్తం చేసింది. తొలిసారి క్రీడా ఈవెంట్లో ప్రదర్శన చేస్తున్నానని సంబరపడిపోయింది. ఇంతకముందు ఇలాంటి వేడుకల్లో ఎప్పుడు పాల్గొనలేదని, ఐపీఎల్ వంటి అద్భుతమైన టోర్నీకి అవకాశం రావడం సంతోషంగా ఉందని ఈ మిల్కీబ్యూటీ చెప్పుకొచ్చింది. సినిమాల్లో నటించడం వేరు స్టేడియంలో ప్రేక్షకుల ముందు చేయడం వేరని, మనమంతా పిచ్చిగా ఆరాధించే క్రికెట్ పండుగ ఈ రాత్రి మొదలవుతుందని ఆనందం వ్యక్తం చేసింది. అయితే ఈ వేడుకల్లో తమన్నా చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ప్రదర్శన చేయనుంది. దీనిపై స్పందిస్తూ.. ముంబై, హైదరాబాద్, చెన్నైలు తన సొంత నగరాలని తెలిపింది. తాను తెలుగు, తమిళం, హిందీ, కన్నడ నాలుగు భాషలకు చెందిన నాలుగు పాటలకు డ్యాన్స్ చేస్తున్నట్లు పేర్కొంది. ఈ సాయంత్రం ఆరు గంటలకు మొదలయ్యే ఈ వేడుకల్లో తమన్నా, ప్రభుదేవాలతో పాటు స్టార్ హీరోలు హృతిక్ రోషన్, వరుణ్ ధావన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌లు డ్యాన్సులతో అభిమానులను కనువిందు చేయనున్నారు. అయితే ఈ వేడుకల నుంచి భుజగాయంతో రణవీర్‌సింగ్, షూటింగ్ బిజీతో పరణితీ చోప్రాలు తప్పుకున్న విషయం తెలిసిందే. ఈ ఆరంభ వేడుకలు అనంతరం చెన్నైసూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మ్యాచ్ మొదలవుతుంది. It's time for some great adrenaline, it's time for IPL!! #vivoipl A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) on Apr 6, 2018 at 10:47pm PDT -
రోడ్డు సేఫ్టీపై క్రికెట్ మ్యాచ్
ముంబై : రోడ్డు ప్రమాదలపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు భారత క్రికెటర్లు నడుం బిగించారు. కిక్రెట్ ను అమితంగా ప్రేమించే దేశంలో ప్రజలకు క్రికెట్ ద్వారానే మంచి సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో పలువురు క్రికెటర్లు ముందుకొచ్చారు. రోడ్డు భద్రతపై అవగాహన పెంచేలా.. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ నెల 24న క్రికెట్ మ్యాచ్ నిర్వహిస్తున్నట్టు టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ తెలిపారు. ఈ మ్యాచ్‌లో యువరాజ్ సింగ్, దినేశ్ కార్తీక్, శిఖర్ ధావన్, అంజిక్యా రహానేలతో పాటు పలువురు దేశవాళీ కిక్రెటర్లు పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రోడ్డు ప్రమాదాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సోషల్ మీడియా వేదికగా ప్రచారం మొదలు పెట్టిన విషయం తెలిసిందే. రాజ్యసభ సభ్యుడిగా నకిలీ హెల్మెట్లు తయారు చేస్తున్న కంపెనీలపై చర్యలు తీసుకోవాలని కేంద్ర రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి సచిన్ లేఖ కూడా రాశారు. ఇక దేశంలో రోడ్డు ప్రమాదాల వలన ఎక్కవ మంది చనిపోతున్నారు. రోడ్డు భద్రతా నిబంధనలు పాటించకపోవడంవల్లే ఎక్కవగా ప్రమాదాలు జరుగుతున్నాయని పలు సర్వేల్లో వెల్లడైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రజలకు అవగాహన కలిగించేందుకు క్రికెటర్లు ముందుకొచ్చారు. -
ఐపీఎల్ నిర్వాహకులకు షాక్
సాక్షి, న్యూఢిల్లీ: నెల రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-11 సీజన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ ఆరంభ వేడుకలను అట్టహాసంగా జరుపడానికి నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగా క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా వేదికగా ఏప్రిల్ 6 న అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహించేందుకు బీసీసీఐ భావించింది. అయితే తాజాగా ప్రారంభ వేడుకలపై సుప్రీంకోర్టు నియమిత పాలక కమిటీ(సీవోఏ) తీసుకున్న నిర్ణయం బీసీసీఐను షాక్‌కు గురి చేసింది. అయితే ఏప్రిల్ 7న ఓపెనింగ్ మ్యాచ్ జరిగే రోజున వాంఖేడే స్టేడియంలో వేడుకలు నిర్వహించాలని సీవోఏ తాజాగా నిర్ణయించింది. అంతే కాకుండా రూ. 50 కోట్లతో ప్రారంభ వేడుకులు జరపాలన్న ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయానికి సీవోఏ బ్రేక్ వేస్తూ.. ఆ బడ్జెట్ మొత్తాన్ని రూ. 30 కోట్లకు కుదించింది. బడ్జెట్లో కోత, వేడుకల తేదీలో మార్పుతో లీగ్‌లో తొలి మ్యాచ్ (ఏప్రిల్ 7) ఆరంభానికి కొన్ని గంటల ముందే వేడుకలు నిర్వహించడానికి బీసీసీఐ ప్రస్తుతం సన్నాహాలు చేస్తోందని ఓ అధికారి తెలిపారు. కాగా ఐపీఎల్-11 సీజన్లో తొలి మ్యాచ్ డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)ల మధ్య జరుగనుంది. రెండేళ్ల నిషేధం తర్వాత బరిలోకి దిగుతున్న సీఎస్కే సీజన్ తొలి మ్యాచ్‌లోనే సత్తాచాటేందుకు కసరత్తులు చేస్తోంది. -
100 కోట్లకు స్టేడియం పేరు!
సాక్షి, ముంబై : నగరంలో ప్రసిద్ధి చెందిన వాంఖెడే క్రికెట్ స్టేడియం పేరు త్వరలోనే మారబోతుంది. రిలయన్స్ వాంఖెడే, డీడీబీ ముద్ర వాంఖెడే, బేస్‌లైన్ వాంఖెడే....మూడింటిలో ఒక్క పేరు ఖరారు కానుంది. వాంఖెడే క్రికెట్ స్టేడియంకు యజమాని అయిన ముంబై క్రికెట్ అసోసియేషన్ వాంఖెడే స్టేడియం పేరును అమ్మకానికి పెట్టగా రిలయెన్స్, డీడీబీ ముద్ర, బేస్‌లైన్ కంపెనీలు పోటీ పడ్డాయి. ఐదేళ్ల కాలానికిగాను 100 కోట్ల రూపాయల చెల్లించి పేరు హక్కులను కొనుగోలు చేసేందుకు ఈ కంపెనీలు ముందుకు వచ్చాయి. వాంఖెడే పేరును అలాగే ఉంచి ఆ పేరుకు ముందుగానీ, లేదా వెనకగానీ తమ కంపెనీ బ్రాండెడ్ పేరును పేరు హక్కులు దక్కించుకున్న కంపెనీ పెట్టుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం మూడు కంపెనీల ప్రతినిధులతో ముంబై క్రికెట్ అసోసియేషన్ తుది చర్చలు జరుపుతోంది. మాజీ ముంబై క్రికెట్ బోర్డు అధ్యక్షుడు, ప్రముఖ రాజకీయ వేత్త ఎస్కే వాంఖెడే పేరుతో ఈ స్టేడియంను నిర్మించారు. నాగపూర్‌లో జన్మించిన శేశ్రావు కష్ణారావు వాంఖెడే లండన్‌లో లా చదువుకొని నాగపూర్‌లో ప్రాక్టీస్ పెట్టుకున్నారు. ఆ తర్వాత రాజకీయాల్లో ప్రవేశించి స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు. జైలుకెళ్లారు. నాగపూర్ మేయర్‌గా పనిచేశారు. అప్పటి ముంబై రాష్ట్రానికి ఎన్నికై డిప్యూటి స్పీకర్‌గా, మహారాష్ట్ర శాసన సభకు ఎన్నికై స్పీకర్‌గా పనిచేశారు. భారత క్రికెట్ బోర్డుకు అధ్యక్షుడిగా పనిచేశారు. భారత్‌లో ఓ స్టేడియం పేరును ఇలా అమ్మకానికి లేదా లీజ్‌కు పెట్టడం ఇది రెండవసారి. పుణె శివారులో కొత్తగా నిర్మించిన సహరా స్టేడియం పేరు హక్కులను 2013లో సహరా ఇండియా పరివార ం కంపెనీ 200 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. అయితే ఒప్పందం మేరకు అందులో 98 కోట్ల రూపాయలను కంపెనీ చెల్లించకపోవడంతో సహరా స్టేడియం పేరును మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంగా మార్చివేశారు. పాశ్చాత్య దేశాల్లో మాత్రం ఇలా స్టేడియం పేర్లను అమ్మడం సాధారణమే. లండన్‌లోని ఎమిరేట్స్ స్టేడియం హోమ్ ఆఫ్ ఆర్సనల్ ఫుట్‌బాల్ క్లబ్‌గా మారింది. అలాగే లాస్‌ఏంజెలిస్‌లోని స్టాపుల్స్ సెంటర్ ఎల్ఏ లేకర్స్ బాస్కెట్‌బాల్ టీమ్‌గా పేరు మార్చుకుంది. పాశ్చాత్య దేశాల్లో 1912లో ఈ పేర్లు అమ్మే ప్రక్రియ ప్రారంభంకాగా, ఇప్పటికీ కొనసాగుతోంది. పలు స్టేడియంలు ఇప్పటికి పలు పేర్లు మార్చుకున్నాయి. భారత్‌లో ఇలా పేర్లు అమ్మకానికి పెట్టే పద్ధతి ఇంత ఆలస్యంగా ప్రారంభం కావడానికి ఎక్కువ వరకు స్టేడియంలు ప్రభుత్వమే నిర్మించడం లేదా ప్రభుత్వం ఇచ్చిన స్థలాల్లో నిర్మించడమని క్రీడా విశ్లేషకులు తెలియజేశారు. పాశ్చాత్య దేశాల్లో ఎక్కువగా ప్రైవేటు వ్యక్తులు లేదా కంపెనీలు స్టేడియంలను నిర్మిస్తాయి కనుక వారు డబ్బుల కోసం పేర్లను విక్రయిస్తారు లేదా స్పాన్సర్ షిప్‌ల కోసం ఇస్తారని వారు చెప్పారు. భారత్‌లో క్రికెట్ అసోసియేషన్లకు మినహా ఏ అసోసియేషన్లకు సొంత స్టేడియంలు లేవని వారన్నారు. పైగా పాశ్చాత్య దేశాల్లో ఏడాదంతా క్రీడా పోటీలు కొనసాగుతాయని, భారత్‌లో అతిపెద్ద లీగ్ మ్యాచ్ అయితే నాలుగు నెలలు కొనసాగుతుందని చెప్పారు. లీగ్ మ్యాచ్‌లను స్పాన్సర్ చేస్తున్న వాళ్లే భారత్‌లో స్టేడియం పేర్లను కూడా కొనుగోలు చేస్తే క్రీడల ప్రోత్సాహానికి నిధులు మరిన్ని సమకూరుతాయని వారు అభిప్రాయపడ్డారు. ఇలా పేర్లు అమ్మడం వల్ల కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. క్రీడలను స్పాన్సర్ చేసే కంపెనీలు ఎలాంటి బ్రాండెyŠ యాడ్స్‌లేని స్టేడియంలు తమకు కావాలని సహజంగా డిమాండ్ చేస్తాయని వారన్నారు. విదేశాల్లో ఎక్కువ స్టేడియంలు ఉండడం వల్ల ఇలాంటి ఇబ్బందుల వారికి రాకపోవచ్చని అన్నారు. -
కొనసాగుతున్న ధోని 'లవ్ ఎఫైర్'
ముంబై: వాంఖెడే మైదానంతో ఎంఎస్ ధోని లవ్ ఎఫైర్ కొనసాగుతోంది. ఈ స్టేడియంలో 'మిస్టర్ కూల్' ఎన్నో మెమరబుల్ ఇన్నింగ్స్ ఆడాడు. 2011 వన్డే ప్రపంచకప్‌లో ఇదే వేదికపై శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో నువాన్ కులశేఖర బౌలింగ్‌లో అద్భుతమైన సిక్సర్ కొట్టి చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. 28 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మరోసారి టీమిండియా వరల్డ్‌కప్‌ను కైవసం చేసుకోవడంతో కీలకపాత్ర పోషించాడు. అప్పటివరకు 8 మ్యాచుల్లో 150 పరుగులు మాత్రమే చేసిన ధోని ఫైనల్లో 91 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. తాజాగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడి వాంఖేడ్తో తన అనుబంధాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. పుణే సూపర్ జెయింట్- ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మంగళవారం జరిగిన మొదటి ప్లేఆఫ్ మ్యాచ్‌లో సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ధోని బ్యాటింగ్‌కు వచ్చేటప్పటికీ పుణె స్కోరు 89/3గా ఉంది. ధోని ధనాధన్ బ్యాటింగ్‌తో స్కోరుకు పరుగులు పెట్టించాడు. 26 బంతుల్లో 5 సిక్సర్లతో 40 పరుగులతో అజేయంగా నిలిచాడు. మెక్లీనగన్ వేసిన 19వ ఓవర్లో ధోని 2 భారీ సిక్సర్లు బాదాడు. 20 పరుగులతో ముంబైను చిత్తు చేయడంతో ఐపీఎల్–10 ఫైనల్లోకి దూసుకెళ్లింది. తుదిపోరులోనూ ధోని చెలరేగాలని అభిమానులు కోరుకుంటున్నారు. -
మూడో రోజు నుంచి ‘స్పిన్’
ముంబై వాంఖడే మైదానం సిద్ధం ముంబై: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో ఇప్పటికే 2-0 ఆధిక్యం సాధించిన భారత జట్టు నాలుగో టెస్టుతోనే సిరీస్‌ను సొంతం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో గత రెండు టెస్టులలాగే ముంబైలోని వాంఖడే స్టేడియంలో పిచ్ కూడా స్పిన్‌కు అనుకూలంగా సిద్ధమవుతోంది. ఈ పిచ్‌పై మూడో రోజు ఉదయం నుంచి బంతి తిరగవచ్చని భావిస్తున్నారు. గురువారం నుంచి టెస్టు ప్రారంభం కానుండగా, ఇప్పటికే పిచ్‌పై ఉన్న పచ్చికను కత్తిరించి, నీళ్లు చిలకరించడం కూడా తగ్గించేశారు. ఈ విషయాన్ని పిచ్ క్యురేటర్ మమున్కర్ ధ్రువీకరించారు. ఇటీవల జరిగిన రంజీ మ్యాచ్‌లో ఈ వేదిక బౌలింగ్‌కు అనుకూలించలేదు. అరుుతే కొత్తగా మార్పులు చేర్పులు చేసిన తర్వాత వాంఖడే వికెట్ లెఫ్టార్మ్ స్పిన్నర్లకు కలిసొచ్చింది. గతంలో మురళీ కార్తీక్, ఓజా, పనేసర్ ఇక్కడ అద్భుత గణాంకాలు నమోదు చేశారు. -
వెస్టిండీస్xన్యూజిలాండ్
మహిళల రెండో సెమీస్ నేడు ముంబై: వాంఖడే స్టేడియంలోనే పురుషుల మ్యాచ్‌కు ముందు వెస్టిండీస్ మహిళల జట్టు కూడా సెమీఫైనల్ ఆడనుంది. మహిళల టి20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది. వెస్టిండీస్ ఈ టోర్నీ చరిత్రలో ఒక్కసారి కూడా ఫైనల్‌కు చేరలేదు. మరోవైపు న్యూజిలాండ్ జట్టు లీగ్ దశలో ఆస్ట్రేలియాపై సహా నాలుగు మ్యాచ్‌లు గెలిచి ఫామ్‌లో ఉంది. -
థౌజండ్ వాలా
-
థౌజండ్ వాలా
► 1009 పరుగులతో చెలరేగిన బ్యాట్స్‌మన్ ► ముంబై కుర్రాడు ప్రణవ్ అత్యద్భుత ప్రదర్శన ► ఏ స్థాయి క్రికెట్లోనైనా ఒకే ఇన్నింగ్స్‌లో ► వేయి పరుగులు చేసిన తొలి ఆటగాడు ‘ఇన్నింగ్స్ ప్రారంభించినప్పుడు రికార్డుల గురించి ఆలోచించలేదు. అయితే తొలిబంతి నుంచి భారీషాట్లు కొట్టాలని ముందే నిర్ణయించుకున్నా. 300 పరుగులు పూర్తయ్యాక మా కోచ్ ఆటను కొనసాగించమని చెప్పారు. ప్రపంచ రికార్డు గురించి అయితే మాకు ఎవరికీ తెలీదు గానీ... ఇండియా రికార్డు ముంబైకే చెందిన పృథ్వీ పేరిట ఉందని, దానిని బద్దలు కొడుతున్నానని తెలుసు. గతంలో నా అత్యధిక స్కోరు 152. ఈ టోర్నీలో 80 ఒకసారి చేశాను. ముంబై అండర్-19 జట్టులో స్థానమే నా తదుపరి లక్ష్యం’ -ప్రణవ్ ధనావ్‌డే వాంఖడే స్టేడియంలో ఆడాలంటే సెంచరీలు, డబుల్ సెంచరీలు కూడా సరిపోవు. అసాధారణంగా ఆడితేనే అవకాశం దక్కుతుంది... 15 ఏళ్ల కుర్రాడిలో స్ఫూర్తి నింపేందుకు అతని కోచ్ చెప్పిన మాటలివి. అయితే దానిని అతను చాలా సీరియస్‌గా తీసుకున్నాడు. అంతే... వంద, రెండొందలు, మూడొందలు... అలవోకగా దాటేశాడు. బౌండరీలు, సిక్సర్లు వెల్లువెత్తాయి. ప్రత్యర్థి బౌలర్లు బంతి విసరడం తప్ప మరేమీ చేయలేకపోయారు. అదే జోరులో ఆరు వందలు కూడా దాటి ప్రపంచ రికార్డు కూడా కొట్టేశాక తొలి రోజు ముగిసింది. కానీ కథ అక్కడే ముగిసిపోలేదు... రెండో రోజు మళ్లీ కొత్తగా బాదుడు మొదలు పెట్టాడు. అడ్డుకునే బౌలర్ గానీ, ఫీల్డర్ గానీ లేక పరుగులు వెల్లువెత్తాయి. చివరికి వేయి పరుగులు దాటాక ఈ సునామీకి బ్రేక్ లభించింది. జట్టు ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడంతో సరిపోయింది గానీ లేదంటే ఈ పరుగుల ప్రవాహం ఎక్కడి దాకా చేరేదో! రికార్డులతో చరిత్ర తిరగరాసిన ఆ సంచలనం పేరు ప్రణవ్ ధనావ్‌డే. ఒకే ఇన్నింగ్స్‌లో ఏకంగా 1009 పరుగులు చేసిన అతను అద్భుతానికి కొత్త అర్థాన్ని చెప్పాడు. ముంబై: వేయి మైళ్లు కాదు, అది వేయి పరుగుల ప్రయాణం... మొదలు కావడం ఒక్క అడుగుతోనే అయినా అక్కడ పడిన ప్రతీ అడుగు సంచలనానికి కారణమైంది. అడుగు వేస్తే ఫోర్... అడుగు తీస్తే సిక్సర్... క్రికెట్ చరిత్రలో ఎన్నడూ చూడని విధ్వంసం. పేరుకు పదహారేళ్ల క్రికెట్టే అయినా ఏ స్థాయిలో కూడా ఎవరూ ఊహించడానికి కూడా సాహసించని ఘనత అది. ప్రత్యర్థి బలహీనం, మైదానం చిన్నదిలాంటి మాటలతో తక్కువ చేసే ఆట కాదు అది. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ 15 ఏళ్ల ప్రణవ్ ధనావ్‌డే ముంబై అండర్-16 స్కూల్ టోర్నీ భండారి కప్ (రెండు రోజుల మ్యాచ్)లో ఒకే ఇన్నింగ్స్‌లో 1009 పరుగులు చేశాడు. ముంబై శివార్లలో థానే జిల్లాలోని కళ్యాణ్ ప్రాంతంలో ఈ అద్భుతం చోటు చేసుకుంది. ఇందులో 129 ఫోర్లు, 59 సిక్సర్లు ఉన్నాయి. ఆగని జోరు: సోమవారం మొదలైన ఈ పరుగుల సునామీ రెండో రోజు మంగళవారం కూడా కొనసాగింది. ఆర్య గురుకుల్ స్కూల్‌తో జరిగిన మ్యాచ్‌లో కేసీ గాంధీ స్కూల్ తరఫున బరిలోకి దిగిన ప్రణవ్ తొలి రోజు 652 పరుగులతో అజేయంగా నిలిచి... చివరకు 1009 పరుగుల చేసి కూడా నాటౌట్‌గా నిలిచాడు. గాంధీ స్కూల్ తమ ఇన్నింగ్స్‌ను 1465/3 స్కోరు వద్ద డిక్లేర్ చేయడంతో ప్రణవ్ పరుగుల ప్రవాహం ఆగింది. ఇది కూడా ప్రపంచ రికార్డు కావడం విశేషం. 1926లో జరిగిన మ్యాచ్‌లో 1107 పరుగులు చేసిన విక్టోరియా జట్టు రికార్డును గాంధీ స్కూల్ సవరించింది. 652 పరుగుల ఓవర్‌నైట్ వ్యక్తిగత స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన ప్రణవ్... తన స్కోరుకు మరో 357 పరుగులు జోడించాడు. ఇప్పటి వరకు ఇంగ్లండ్‌లో ఏఈజే కొలిన్స్ (628 నాటౌట్-1899లో) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును మొదటి రోజే ఈ ముంబైకర్ బద్దలు కొట్టాడు. ప్రపంచ క్రికెట్లో మైనర్ లీగ్‌ల మొదలు టెస్టు క్రికెట్ వరకు ఏ స్థాయిలోనైనా వేయి పరుగులు చేసిన తొలి ఆటగాడు ప్రణవ్ కావడం విశేషం. 2014లో రిజ్వి స్ప్రింగ్ ఫీల్డ్ స్కూల్ ఆటగాడు పృథ్వీ షా చేసిన 546 పరుగులు ఇప్పటి వరకు భారత రికార్డుగా ఉంది. దీనితో పాటు పలు రికార్డులు ప్రణవ్ ధాటికి చెల్లాచెదురయ్యాయి. ప్రణవ్ బాదిన ఫోర్లు, సిక్సర్లు కూడా పోటీ క్రికెట్లో రికార్డు కావడం అతని ధాటిని సూచిస్తోంది. చిత్తుగా ఓడిన ప్రత్యర్థి: రికార్డులు వెల్లువెత్తిన ఈ మ్యాచ్‌లో కేసీ గాంధీ జట్టు భారీ విజయాన్ని నమోదు చేసింది. ప్రణవ్ విధ్వంసానికి ముందు ఆర్య గురుకుల్ స్కూల్ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 31 పరుగులకే కుప్పకూలింది. ప్రత్యర్థి పరుగుల సునామీతో భీతిల్లిన ఆ జట్టు అనంతరం రెండో ఇన్నింగ్స్‌లోనూ చేతులెత్తేసి 52 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా కేసీ గాంధీ జట్టు... ఇన్నింగ్స్ 1382 పరుగుల తేడాతో గురుకుల్‌ను చిత్తుగా ఓడించింది. సాధారణ నేపథ్యం... ప్రణవ్ తండ్రి ప్రశాంత్ ధనావ్‌డే ఆటోడ్రైవర్‌గా పని చేస్తుంటారు. ‘నీ కొడుకు అద్భుతం చేస్తున్నాడు. ఇంకా ఇక్కడే ఉన్నావా’ అంటూ ఒక మిత్రుడు చెప్పడంతో ఆయన హడావుడిగా మైదానానికి వెళ్లి తన కుమారుడు రికార్డులు తిరగరాయడం కళ్లారా చూశారు. ‘ప్రణవ్‌కు ఆటపై ఉన్న ఆసక్తితో ప్రోత్సహించాను. 11 ఏళ్లనుంచి కష్టపడుతున్నాడు. దానికి ఫలితమే ఇది. ముంబై అండర్-16 జట్టులో చోటు దక్కితే చాలు’ అని ప్రశాంత్ ఆనందంతో చెప్పారు. పదో తరగతి చదువుతున్న ఈ కుర్రాడు సీనియర్ కోచ్ ముబీన్ షేక్ వద్ద శిక్షణ పొందుతున్నాడు. ‘తొమ్మిదేళ్లుగా అతడికి నేను శిక్షణ ఇస్తున్నాను. అతను సాధారణంగానే మంచి హిట్టర్. అండర్-16 స్థాయికి సరిపోయేలా నిబంధనల ప్రకారమే ఈ మైదానం ఉంది కాబట్టి రికార్డుపై సందేహాలు అనవసరం. పైగా ఇది ఎంసీఏ గుర్తింపు పొందిన టోర్నీ. ఈ కుర్రాడి రికార్డు ఈ ప్రాంతంలో క్రికెట్‌కు ఊపు తేవడం ఖాయం’ అని షేక్ వ్యాఖ్యానించారు. మరో వైపు ప్రణవ్ రికార్డుపై ప్రశంసలు కురిపించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్... అతని చదువు, క్రికెట్ కోచింగ్‌కు సంబంధించిన అన్ని ఖర్చులను ఇకపై ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు. అభినందనల వెల్లువ... ‘ఇన్నింగ్స్‌లో వేయి పరుగులు చేసిన తొలి ఆటగాడికి అభినందనలు. చాలా బాగా ఆడావు. ఇంకా కష్టపడి మరింత ఎత్తుకు ఎదగాలి’ - సచిన్ ‘మరో సచిన్ తయారవుతున్నాడు. ఏ స్థాయి క్రికెట్ అనేది ముఖ్యం కాదు. అంకెలు చూస్తేనే తెలుస్తుంది ఎంత అద్భుతమో’ -హర్భజన్ సింగ్ ‘అన్ని పరుగులు చేయడం అంటే జోక్ కాదు. పరిస్థితులు ఎలా ఉన్నా ఆ వయసును బట్టి చూస్తే అలాంటి బ్యాటింగ్ అసాధారణం. ఇదో అద్భుతం. అతను కచ్చితంగా ప్రత్యేకమైన ఆటగాడు. నేనైతే బోర్ అయ్యేవాడినేమో’ - ధోని ‘ఇది మాటల్లో చెప్పలేని ఘనత. వేయి పరుగులు అనే మాట చెప్పడమే పెద్దగా కనిపిస్తోంది. అలాంటిది అతను చేసి చూపించాడు. ఏదో ఒక రోజు భారత్‌కు ఆడాలని కోరుకుంటున్నా’ -రహానే ‘అతని ఫిట్నెస్ చాలా బాగుంది. సాధారణంగా ఈ స్థాయి పిల్లలు సెంచరీ కాగానే సర్ వాటర్ కావాలి అని అడుగుతారు. అయితే అతను ఇదేమీ పట్టించుకోకుండా దూసుకుపోయాడు’ -సునిమల్ సేన్, ఈ మ్యాచ్ అంపైర్ నాటి కుర్రాడి కథ... ప్రణవ్‌కు ముందు అత్యధిక పరుగుల రికార్డు నెలకొల్పిన ఆర్థర్ కొలిన్స్ జీవితం కూడా ఆసక్తికరం. 1899లో 13 ఏళ్ల వయసులో కొలిన్స్ 628 పరుగుల రికార్డు నమోదు చేశాడు. ఇంగ్లండ్‌లో క్లార్క్స్ హౌస్, నార్త్ టౌన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ అద్భుతం జరిగింది. అతని ఇన్నింగ్స్‌లో 31 బౌండరీలు ఉండగా ఒకే సిక్సర్ కొట్టాడు. నాలుగు సార్లు 5 పరుగులు, 33 సార్లు అతను 3 పరుగులు తీశాడు. అయితే ఆర్మీలో చేరడంతో అతను పూర్తి స్థాయిలో క్రికెట్‌పై దృష్టి పెట్టలేకపోయాడు. కలకత్తాలో పుట్టిన కొలిన్స్ సైనికుడిగా లెఫ్టినెంట్ స్థాయికి ఎదిగాడు. ఫ్రాన్స్‌లో జరిగిన తొలి ప్రపంచ యుద్ధంలో పాల్గొంటూ 29 ఏళ్ల వయసులోనే అతను వీరమరణం పొందాడు. -
షారూఖ్ ఖాన్ పై నిషేధం ఎత్తివేత
ముంబై: బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్ పై విధించిన నిషేధాన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ) ఎత్తివేసింది. వాంఖేడ్ స్టేడియంలోకి ఆయనను అడుగుపెట్టకుండా విధించిన ఐదేళ్ల నిషేధాన్ని ఎంసీఏ తొలగించింది. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ లో ఆరోపణలు ఎదుర్కొన్న అంకిత్ చవాన్ పై బీసీసీఐ కొనసాగిస్తున్న నిషేధాన్ని సవాల్ చేయరాదని ఎంసీఏ నిర్ణయించింది. స్పాట్ ఫిక్సింగ్ కేసులో శ్రీశాంత్, అంకిత్ చవాన్, అజిత్ చండిలా ప్రమేయంపై సాక్ష్యాలు లేవని కోర్టు తీర్పు చెప్పింది. అయితే తమ దగ్గర ఉన్న సాక్ష్యాల కారణంగాపై వీరు ముగ్గురుపై నిషేధం ఎత్తివేసే ప్రసక్తే లేదని బీసీసీఐ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. -
బీకేసీలోకి బీసీసీఐ ప్రధాన కార్యాలయం!
ముంబై: వాంఖడే స్టేడియంలో ఉన్న బీసీసీఐ ప్రధాన కార్యాలయాన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ)కు చెందిన బంద్రా కుర్లా కాంప్లెక్స్ మైదానంలోకి మార్చనున్నారు. ఈ మేరకు కార్యాలయానికి సరిపోయేంత ఖాళీ ప్రదేశాన్ని కేటాయించాలని బోర్డు... ఎంసీఏని కోరింది. ప్రస్తుతం సబర్బన్ ప్రాంతమైన బంద్రా కుర్లా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుండటంతో బోర్డు కార్యాలయ మార్పుపై దృష్టిపెట్టినట్లు సమాచారం. ‘బీకేసీలోని క్లబ్ హౌస్‌కు ఎదురుగా ఉన్న ప్రదేశంలో కొత్త భవనాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. దాన్ని బీసీసీఐకి కేటాయిస్తాం. బీకేసీ చత్రపతి శివాజీ ఎయిర్‌పోర్ట్‌కు చాలా దగ్గరగా ఉండటంతో కార్యాలయాన్ని ఇక్కడికి తరలించాలని వాళ్లు భావిస్తున్నట్లు ఉన్నారు. ప్రస్తుత కార్యాలయానికి రావడానికి ఎయిర్పోర్ట్ నుంచి రెండు గంటలకు పైగా పడుతోంది. చిన్న మీడియా గ్యాలరీ, నివాసానికి అనువుగా కొన్ని రూమ్‌లను కూడా కొత్త బిల్డింగ్‌లో ఏర్పాటు చేస్తాం’ అని ఎంసీఏ వర్గాలు తెలిపాయి. ఈ అంశంపై ఆదివారం జరిగే ఎంసీఏ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. -
'షారూఖ్ ఖాన్ ను రానీయం'
ముంబై: బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ వరుసగా మూడో ఏడాది వాంఖడే స్టేడియంలో మ్యాచ్ చూసే అవకాశాన్ని కోల్పోయాడు. 2012లో వాంఖడే స్టేడియంలో రభస చేయడంతో అతడిపై ఐదేళ్ల నిషేధం విధించారు. దీంతో ఈనెల 14న కోల్ కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరగనున్న కీలక మ్యాచ్ ను ప్రత్యక్షంగా చూసే అవకాశం లేకుండా పోయింది. షారూఖ్ ఖాన్ పై నిషేధం కొనసాగుతున్నందున, వాంఖడే స్టేడియంలోకి అతన్ని అనుమతించబోమని ముంబై క్రికెట్ అసోసియేషన్ అధికారి ఒకరు తెలిపారు. అయితే గతేడాది వాంఖడేలో ఫైనల్ మ్యాచ్ చూసేందుకు షారూఖ్ అనుమతినిచ్చింది. తర్వాత ఫైనల్ మ్యాచ్ వేదికను బెంగళూరుకు మార్చడంతో కింగ్ ఖాన్ ఇక్కడ మ్యాచ్ ను చూడలేకపోయాడు. వాంఖడేకు కూతవేటు దూరంలో ఉన్న బ్రాబోర్న్ స్టేడియం ఈనెల 16న కోల్ కతా, రాజస్థాన్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ ను చూసేందుకు షారూఖ్ కు వీలుంది. -
విజయం దిశగా కర్ణాటక
రెండో ఇన్నింగ్స్‌లో తమిళనాడు 113/3 రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ముంబై: రంజీ ట్రోఫీ డిఫెండింగ్ చాంపియన్ కర్ణాటక టైటిల్ నిలబెట్టుకునేందుకు సిద్ధమైంది. వాంఖడే స్టేడియంలో తమిళనాడుతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆ జట్టు విజయానికి చేరువైంది. తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 628 పరుగులు వెనుకబడిన తమిళనాడు మ్యాచ్ నాలుగో రోజు బుధవారం ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసింది. ప్రస్తుతం మరో 515 పరుగులు వెనుకబడిన ఆ జట్టుకు చివరి రోజు ఓటమి తప్పకపోవచ్చు! ఒక వేళ ఆలౌట్ కాకపోయినా, తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కారణంగా కర్ణాటక రంజీ విజేతగా నిలవడం ఖాయం. అంతకు ముందు 618/7 పరుగుల ఓవర్‌నైట్ స్కోరు తో ఆట ప్రారంభించిన కర్ణాటక తమ తొలి ఇన్నిం గ్స్‌లో 762 పరుగులకు ఆలౌట్ అయింది. రంజీ ఫైనల్లో ఇది రెండో అత్యధిక స్కోరు. వినయ్ కుమార్ (319 బంతుల్లో 105 నాటౌట్; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీ సాధించడం విశేషం. తద్వారా ఒకే మ్యాచ్‌లో సెంచరీ, 5 వికెట్లు సాధించిన రెండో ఆటగాడు, తొలి కెప్టెన్‌గా వినయ్ నిలిచాడు. మరో వైపు రంజీ ఫైనల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా గుల్ మొహమ్మద్ (319) రికార్డును అధిగమించిన అనంతరం కరుణ్ నాయర్ (560 బంతుల్లో 328; 46 ఫోర్లు, 1 సిక్స్) నిష్ర్కమించాడు. -
ప్రమాణ స్వీకారం ఖర్చు రూ.98 లక్షలు
ముంబై: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత బీజేపీ ప్రభుత్వం వాంఖడే స్టేడియంలో నిర్వహించిన పదవీ ప్రమాణ స్వీకారోత్సవానికి చేసిన ఖర్చు రూ.98.33 లక్షలని సమాచార హక్కు చట్టం ద్వారా వెల్లడైంది. ఒకవైపు మహారాష్ట్రలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొనగా, ఖజానా ఖాళీగా ఉందని చెప్పిన బీజేపీ విలాసవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంపై అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. ఆర్టీఐ కార్యకర్త అనిల్ గల్గాలి కోరిన సమాచారాన్ని ప్రభుత్వ అండర్ సెక్రటరీ ఎస్జీ మోఘె అందించారు. ఫడ్నవీస్ నేతృత్వంలోని ప్రభుత్వం నిర్వహించిన ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి రూ.98,33,830 ఖర్చయినట్లు ఆయన తెలిపారు. తాను కోరిన సమాచారాన్ని బీజేపీ ముంబై నగర శాఖ ఇచ్చేందుకు నిరాకరించిందని, దీంతో తాను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించానని గల్గాలి తెలిపారు. -
దేవధర్ ఫైనల్లో వెస్ట్‌జోన్
ముంబై: అక్షర్ పటేల్ (38 బంతుల్లో 64 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (56 బంతుల్లో 80; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) సంచలన ఇన్నింగ్స్‌తో... దేవధర్ ట్రోఫీలో వెస్ట్‌జోన్ జట్టు ఫైనల్‌కు చేరింది. వాంఖడే స్టేడియంలో సోమవారం జరిగిన సెమీఫైనల్లో వెస్ట్ 2 వికెట్లతో సౌత్‌జోన్‌ను ఓడించింది. టాస్ గెలిచిన వెస్ట్ ఫీల్డింగ్ ఎంచుకోగా... సౌత్‌జోన్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 314 పరుగులు చేసింది. మయాంక్ (86), అపరాజిత్ (56), మనీష్ పాండే (55) అర్ధసెంచరీలు చేశారు. వెస్ట్‌జోన్ జట్టు 47.1 ఓవర్లలో 8 వికెట్లకు 319 పరుగులు చేసి నెగ్గింది. జాక్సన్ (51), రాయుడు (54) అర్ధసెంచరీలు చేశారు. 174 పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయి ఓటమి కోరల్లో చిక్కుకున్న వెస్ట్‌జోన్‌ను... అక్షర్, సూర్యకుమార్ కలిసి గట్టెక్కించారు. బుధవారం జరిగే ఫైనల్లో వెస్ట్‌జోన్, ఈస్ట్‌జోన్ తలపడతాయి. -
‘ప్రొటోకాల్’ పాటించని వ్యక్తి అరెస్టు
సాక్షి, ముంబై: ఇటీవల వాంఖడే స్టేడియంలో జరిగిన ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలో ప్రధాని భద్రతను చేధించుకుని వేదికపైకి వచ్చిన వ్యక్తిని మెరైన్ డ్రైవ్ పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు. అతడిపై అక్రమ చొరబాటు తదితర కేసులు నమోదు చేశారు. అక్టోబరు 31న సాయంత్రం వాంఖ డే స్టేడియంలో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సహా పది మంత్రుల ప్రమాణస్వీకారోత్సవం జరిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీతోపాటు అనేక మంది వీవీఐపీలు వేదికపై ఆసీనులయ్యారు. కాగా, అనిల్ మిశ్రా అనే వ్యక్తి కొంతసేపు వేదికపై హడావుడిగా తిరిగాడు. పీఎం, సీఎంలకు అతి దగ్గరగా వెళ్లి వారితో నిలబడి తన వ్యక్తిగత కెమెరామెన్తో ఫొటోలు తీయించుకున్నాడు. ఆ సమయంలో ఎవరూ మిశ్రాను అంతగా పట్టించుకోలేదు. అయితే, తర్వాత వీడియో ఫుటేజ్‌లను చూసిన బీజేపీ నాయకుల మధ్య అతడు ఎవరనే విషయంపై చర్చ జరిగింది. దీంతో ఆరా తీయగా అతను మలాడ్ ప్రాంతానికి చెందిన వాడని, అయితే అతనివద్ద వీవీఐపీ పాస్ లేదని, కేవలం వీఐపీ పాస్ ఉందని తెలిసింది. ప్రొటోకాల్ ప్రకారం వీవీఐపీలు మినహా ఇతరులెవరూ వేదికపైకి వెళ్లరాదు. ప్రముఖులకు అతి దగ్గరగా నిలబడే వీలు కూడా లేదు. కాని మిశ్రా భద్రత సిబ్బంది కళ్లుగప్పి మోదీకి, ఫడ్నవిస్‌కు అతి దగ్గరగా వెళ్లాడు. దీంతో అతనిపై కేసు నమోదుచేసి కోర్టులో శనివారం హాజరుపర్చగా ఈ నెల 11వ తేదీ వరకు పోలీసు కస్టడిలో ఉంచాలని న్యాయమూర్తి ఆదేశించారు. -
దేవేంద్రుడు నెగ్గుకొచ్చేనా..
సాక్షి, ముంబై: మహారాష్ట్ర తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం భవితవ్యంపై తీవ్ర ఉత్కంఠత నెలకొంది. పూర్తిమెజార్టీకి కావాల్సిన సంఖ్యాబలం లేకపోయినప్పటికీ బీజేపీ కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమైంది. ఈ మేరకు శుక్రవారం అంగరంగవైభవంగా సీఎంతో పాటు మరికొంత మంది మంత్రులతో ప్రమాణస్వీకారాలు పూర్తిచేసింది. అయితే 15 రోజుల్లోగా ఫడ్నవీస్ సర్కారు అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో శివసేన మద్దతు తీసుకుంటుందా..లేక ఎన్సీపీ మద్దతు తీసుకుంటుందా.. అనే విషయంపై ఎలాంటి స్పష్టతలేదు. ఇదిలా ఉండగా, బీజేపీ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, అరుణ్ జైట్లీ, దేవేంద్ర ఫడ్నవీస్ ఫోన్ చేయడంతో ప్రమాణస్వీకారోత్సవానికి చివరి క్షణంలో హాజరయ్యారు. అయితే బీజేపీకి ఆ పార్టీ మద్దతుపై మాత్రం ఉద్ధవ్ ఠాక్రే ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కాగా, శివసేనతో చర్చలు జరిపి వారిని ప్రభుత్వంలో భాగస్వాములను చేసిన తర్వాతే పూర్తిస్థాయి మంత్రివర్గ ఏర్పాటు జరుగుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. మైనార్టీ ప్రభుత్వ ఏర్పాటుకూ యోచన...? శివసేనతో చర్చలు విఫలమైతే మైనార్టీ ప్రభుత్వంతో ముందుకు వెళ్లేందుకు కూడా బీజేపీ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితిలో బీజేపీ ప్రభుత్వానికి మరో 23 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంది. ఈ నేపథ్యంలో శివసేన లేదా ఎన్సీపీ మద్దతు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. ఇప్పటికే ఎన్సీపీ బయటినుంచి మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. అదే విధంగా అవసరమైతే బలనిరూపణ రోజున తమ ఎమ్మెల్యేలు గైర్హాజర వుతారని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ ప్రకటించారు. ఎన్సీపీ ఎమ్మెల్యేలు గైర్హాజరైతే బీజేపీ సర్కారు మైనార్టీలో ఉన్నప్పటికీ బలనిరూపణలో నెగ్గుతుంది. అయితే ఎన్సీపీ మద్దతు తీసుకోవడంపై అనేక మంది బీజేపీ నాయకులు సుముఖంగా లేరు. ముఖ్యంగా ప్రచారసమయంలో అవసరమైతే అధికారాన్ని వదులుకుంటాం కాని ఎన్సీపీ మద్దతు తీసుకునే ప్రసక్తేలేదని స్వయంగా దేవేంద్ర ఫడ్నవీస్ చాలాసార్లు పేర్కొన్నారు. ఇలాంటి నేపథ్యంలో ఎన్సీపీ మద్దతు తీసుకున్నట్టయితే ప్రజల్లో తప్పుడు సందేశం వెళుతుందని పలువురు బీజేపీ నాయకులు పేర్కొంటున్నారు. దీంతో శివసేన మద్దతు తీసుకునేందుకు మొదటిప్రాధాన్యం ఇవ్వాలని, అది కుదరకపోతే ఇండిపెండెంట్లు, ఇతర ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నించాలని బీజేపీ నాయకులు భావిస్తున్నట్టు సమాచారం.ఇప్పటికే అనేక మంది ఎమ్మెల్యేలతో బీజేపీ సంప్రదింపులు జరిపింది. ఇలాంటి నేపథ్యంలో రాబోయే రోజుల్లో దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం బలనిరూపణపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. -
మంత్రుల వివరాలివే..
సాక్షి, ముంబై: ముంబైలోని వాంఖడే స్టేడియంలో శుక్రవారం ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సీఎంతోపాటు ఎనిమిది మంత్రి కేబినెట్ మంత్రులు, ఇద్దరు సహాయ మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. వారి వివరాలిలా ఉన్నాయి... ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ : మహారాష్ట్రంలో బీజేపీ మొదటి ముఖ్యమంత్రి. విదర్భ రీజియన్ నుంచి నాలుగో ముఖ్యమంత్రి. నాగపూర్ నియోజకవర్గంలో వరుసగా నాలుగోసారి ఎమ్మెల్యేగా ఎన్నిక. కార్పొరేటర్, మేయర్, ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి పదవులు చేపట్టారు. 2013లో బీజేపీ మహారాష్ట్ర ప్రదేశ్ అధ్యక్షుడిగా నియామకం. క్యాబినెట్ మంత్రులు ఏక్నాథ్ ఖడ్సే: ముక్తాయినగర్ నియోజకవర్గంలో వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక. కాషాయ కూటమి ప్రభుత్వంలో ఆర్థిక, ఉన్నత విద్యాశాఖల మంత్రిగా పనిచేశారు. ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు. సుధీర్ మునగంటివార్ : వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. బీజేపీ ప్రదేశ్ అధ్యక్షుడి గా పనిచేశారు. కాషాయ కూటమి సర్కారులో పర్యటన, వినియోగదారుల సంరక్షణ మంత్రిగా పనిచేశారు. వినోద్ తావ్డే : విధాన్ పరిషత్‌లో ప్రతిపక్ష నాయకుడు. ముంబై బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. అన్ని పార్టీల నాయకులతో సత్సంబంధాలు ఉన్నాయి. పంకజా ముండే: పర్లీ నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నిక. బీజేపీ కోర్ కమిటిలో సభ్యురాలు. దివంగత గోపినాథ్ ముండేకు రాజకీయ వారసురాలు. ప్రకాశ్ మెహతా: ఘాట్కోపర్ నుంచి వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ముంబై బీజేపీ మాజీ అధ్యక్షుడిగా, కాషాయ కూటమి సర్కారులో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. విష్ణు సావరా : విక్రంగఢ్ సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆరు పర్యాయాలు విధాన్సభకు ఎన్నికయ్యారు. ఆదివాసుల నాయకుడిగా గుర్తింపు. కాషాయ కూటమి సర్కారులో గిరిజిన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. చంద్రకాంత్ పాటిల్: కొల్హాపూర్ ప్రజా సమస్యలపై పోరాడిన నాయకుడిగా గుర్తింపు పొందారు. బీజేపీ మహారాష్ట్ర ప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. సహాయ మంత్రులు విద్యా ఠాకూర్ : గోరేగావ్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. బీజేపీ తరఫున ఉత్తర భారతీయ మహిళగా గుర్తింపు పొందారు. ముంబై డిప్యూటీ మేయర్‌గా పనిచేశారు. బీఎంసీనుంచి నాలుగు పర్యాయాలు కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. దిలీప్ కాంబ్లే : పుణే కంటోన్మెంట్ నుంచి రెండోసారి గెలిచారు. కాషాయ కూటమి ప్రభుత్వంలో సహాయ మంత్రిగా పనిచేశారు. బీజేపీలో దళిత నాయకుడిగా గుర్తింపు ఉంది. -
దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణస్వీకారం
-
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణస్వీకారం
మహారాష్ట్రలో తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా దేవేంద్ర గంగాధర్ రావు ఫడ్నవిస్ శుక్రవారం సాయంత్రం ప్రమాణస్వీకారం చేశారు. ముంబైలోని ప్రఖ్యాత వాంఖడే స్టేడియంలో ఫడ్నవిస్ ప్రమాణ స్వీకారం చేశారు. మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్, రాజస్థాన్ సీఎం వసుంధరా రాజె, గుజరాత్ సీఎం ఆనందిబెన్ పటేల్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే తదితరులు హాజరయ్యారు. సినీ ప్రముఖులు అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, లతా మంగేష్కర్, ప్రముఖ పారిశ్రామిక వేత్తలు రతన్ టాటా, ముఖేష్ అంబానీ, ఎన్సీపీ నాయకులు ప్రఫుల్ పటేల్, అజిత్ పవార్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ సీనియర్ నాయకులు కూడా హాజరయ్యారు. -
‘వాంఖడే’ సిద్ధం..!
సాక్షి, ముంబై: బీజేపీ ఎంతో ఆర్భాటంగా నిర్వహిస్తున్న సీఎం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి వాంఖడే స్టేడియం సిద్ధవుతోంది. ఈ ఉత్సవానికి అన్ని రాజకీయ పార్టీ ప్రముఖులతోపాటు, ప్రసిద్ధి గాంచిన సినీ, క్రీడా, పారిశ్రామిక వేత్తలు, వైద్యులు, లాయర్లు ఇలా ఇతర రంగాల కీలక వ్యక్తులందరికీ ఆ పార్టీ నాయకులు లాంఛనంగా ఆహ్వానం పంపించారు. ఆ ప్రకారం భారీగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇదిలా ఉండగా, సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావాలని శివసేనకు ఆహ్వానం అందిననప్పటికీ ఉద్ధవ్‌తోపాటు ఇతర నాయకులు, ఎమ్మెల్యేలెవరూ పాల్గొనబోరని పార్టీ వర్గాలు వెల్లడించాయి. బీజేపీలో తగిన విలువ, గౌరవం లభించనప్పుడు వేడుకలకు ఎందుకు హాజరుకావాలని సీనియర్ నాయకులు వినాయక్ రావుత్, నీలం గోర్హే అన్నారు. కాగా గురువారం రాత్రి మాతోశ్రీ బంగ్లాలో శివసేన-బీజేపీ నాయకుల మధ్య జరగాల్సిన సమావేశం రద్దయిందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అదేవిధంగా, మహారాష్ట్ర న వనిర్మాణ్ సేనా (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావడం లేదని ప్రకటించారు. ముఖ్యమంత్రిగా శుక్రవారం ప్రమాణం చేయనున్న దేవేంద్ర ఫడణ్వీస్కు ఫోన్లో రాజ్ గురువారం ముందస్తుగా శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని తను ఇంట్లో ఉండి టీవీలో ప్రత్యక్ష ప్రసారాన్ని చూస్తానని తెలిపారు. దీంతో వేడుకలకు ఎంత మంది ఇతర పార్టీల నాయకులు హాజరవుతారనేది శుక్రవారం తేలనుంది. వాంఖడే స్టేడియం బయట ఏర్పాట్లు... రాష్ట్రం నలుమూలల నుంచి బీజేపీ కార్యకర్తలతోపాటు వివిధ రంగాల ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరు కానుండటంతో స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దూరప్రాంతాల నుంచి ముఖ్యంగా నాగపూర్ నుంచి ప్రైవేటు, టూరిస్టు, సొంత వాహనాల్లో వచ్చే వారికి ఇబ్బందులు ఏర్పడకుండా ప్రత్యేకంగా సిబ్బందిని నియమించారు. వాహనాలు పార్కింగ్ చేసేందుకు సమీపంలో ఉన్న ఖాళీ స్థలాలన్నింటినీ సిద్ధం చేశారు. రోడ్లపై కూడా తగిన స్థలం సేకరించారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు చర్చిగేట్ రైల్వే స్టేషన్, ఇండియన్ మర్చంట్ చాంబర్స్ రోడ్, బాంబే హాకీ అసోసియేషన్ రోడ్ తదితర స్టేడియానికి సమీపంలో ఉన్న రహదారులన్నింటినీ నో పార్కింగ్ జోన్‌గా ప్రకటించారు. మరికొన్ని రోడ్లను వన్ వే గామార్చారు. స్టేడియంవద్ద ట్రాఫిక్ జాం కాకుండా వాహనాలను దారి మళ్లిం చేందుకు ప్రత్యామ్నాయ రోడ్లను ఎంపిక చేసి సిద్ధంగా ఉంచారు. స్టేడియానికి వెళ్లే రహదారులపై నివాసముంటున్న స్థానికులు అపరిచితులెవరికీ అనుమతించకూడదని ఆదేశించారు. -
మహోత్సవం మాదిరిగా ప్రమాణ స్వీకారం
ముంబై: తొలిసారిగా ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం రావడంతో బీజేపీలో ఉత్సాహం ఉరకలేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఓ మహా ఉత్సవం మాదిరిగా నిర్వహించేందుకు నానాతంటాలూ పడుతోంది. దాదాపు 40 వేలమంది అతిథులు రానుండడంతో అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ప్రమాణ స్వీకారానికి ముందు అశోక్ హండే నేతృత్వంలోని బృందం సంగీత విభావరి నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి లతామంగేష్కర్, అమితాబ్బచ్చన్లతోపాటు అన్నిరంగాలకు చెందిన ప్రముఖులు రానుండడంతో స్టేజీకి రూపకల్పన చేయడం కోసం ప్రముఖ కళాదర్శకుడు నితిన్ దేశాయ్‌ని రంగంలోకి దింపింది. సముద్రతీరం వద్ద వికసించిన కమలాన్ని ఏర్పాటు చేయనుంది.దీంతోపాటు వేదిక సమీపంలో భారీ ఎల్ఈడీ తెరను కూడా అమర్చనుంది. శివాజీ మహారాజు ప్రతిమను కూడా ఉంచనుంది. ప్రమాణ స్వీకారానికి ‘వాంఖడే’ ఉచితం ప్రమాణ స్వీకారోత్సవ వేదికగా వాంఖడే స్టేడియంను వాడుకుంటున్నందుకుగాను శరద్పవార్నేతృత్వంలోని ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) బీజేపీ వద్ద ఎటువంటి చార్జీ వసూలు చేయడం లేదు. ఈ విషయాన్ని ఎంసీఏ సంయుక్త కార్యదర్శి నితిన్ దయాళ్ వెల్లడించారు. ఇది ప్రభుత్వ కార్యక్రమం అయినందువల్లనే మేము వారి వద్దనుంచి ఎటువంటి చార్జీ వసూలు చేయబోవడం లేదన్నారు. ప్రమాణ స్వీకారోత్సవం కోసం స్టేడియంలో అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్వాధీన్ క్షత్రియ తమను కలిశాడన్నారు. ఈ నెల 31వ తేదీన ఈ స్టేడియంలో బీజేపీ తొలి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి విదితమే. సాధారణంగా ప్రమాణ స్వీకారోత్సవాలు రాజ్‌భవన్‌లోనే జరుగుతాయి. అయితే 1995లో మనోహర్ జోషి నేతృత్వంలోని కాషాయకూటమి ప్రభుత్వం శివాజీ పార్కులో ప్రమాణ స్వీకారం చేసిన సంగతి విదితమే. -
కుదిరిన ముహూర్తం 31న వాంఖడే స్టేడియంలో ప్రమాణస్వీకారం
కొద్దిరోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. బీజేపీ నేతృత్వంలోని నూతన ప్రభుత్వం ఈ నెల 31వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనుంది. రాష్ట్రంలో బీజేపీ తొలిసారి అధికార పగ్గాలు చేపట్టనుండడంతో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీతోపాటు ఆ పార్టీకి చెందిన అతిరథ మహారథులంతా వాణిజ్య రాజధానికి రానున్నారు. సాక్షి, ముంబై: నూతన ప్రభుత్వ ఏర్పాటుకు ముహుర్తం ఖరారైంది. ఈ నెల 31వ తేదీన బీజేపీ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయనుంది. ఈ విషయాన్ని ఆ పార్టీ వర్గాలు సోమవారం వెల్లడించాయి. స్థానిక మెరీన్లైన్స్ ప్రాంతృంలోని వాంఖడే స్టేడియంలో బీజేపీకి చెందిన తొలి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతోపాటు మరో 20 మంది మంత్రులు కూడా ప్రమాణం చేస్తారని తెలియవచ్చింది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇవ్వలేదు. దీంతో రాష్ట్రంలో తొలిసారిగా అతి పెద్దపార్టీగా అవతరించిన బీజేపీ... ఏ పార్టీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందనే విషయంపై కొద్దిరోజులుగా ఉత్కంఠ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఉత్కంఠతకు మంగళవారం తెరపడనుంది. ఈ నెల 31వ తేదీన కొత్త ముఖ్యమంత్రితోపాటు ఇతర మంత్రులంతా ప్రమాణస్వీకారం చేసేందుకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్రంలో బీజేపీ తొలిసారిగా అధికారంలోకి రానున్నందున ప్రధానమంత్రి నరేంద్ర మోడీతోపాటు బీజేపీకి చెందిన ముఖ్యమంత్రులు, సీనియర్ నాయకులందరూ ప్రమాణ స్వీకారాత్సోవానికి హాజరుకానున్నట్టు తెలిసింది. తొలుత ఈ నెల 30వ తేదీన ప్రమాణం చేస్తారని పేర్కొన్నప్పటికీ ప్రధాని నరేంద్రమోడీ సౌకర్యార్ధం కారణంగా మరో రోజు వాయిదావేశారు. దేవేంద్ర ఫడ్విస్ ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలను చేపట్టాలని బీజేపీకి చెందిన అనేకమంది మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో బీజేపీ తొలి ముఖ్యమంత్రిగా దేవేంద్ర ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. -
అక్టోబర్ 31న మహారాష్ట్ర సర్కార్ ఏర్పాటు?
ముంబై: మహారాష్ట్రలో నూతన ఎన్నికైన బీజేపీ ప్రభుత్వం అక్టోబర్ 31 తేదిన ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. దక్షిణ ముంబైలోని వాంఖెడే స్టేడియంలో నిర్వహించే ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ హాజరవుతారని పార్టీ నేతలు తెలిపారు. బీజేపీ లెజిస్టేచర్ పార్టీ సమావేశం మంగళవారం జరుగుతుందని, ఆ భేటిలోనే శాసనసభ నాయకుడిని ఎన్నుకుంటారన్నారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్ సి. విద్యసాగర్ రావును కొత్త నేత కలుసుకుంటారని, అయితే ఎప్పుడు భేటి అవుతారనే విషయంపై ఇంకా స్పష్టత లేదన్నారు. పార్టీ శాసన సభ్యుల సమావేశానికి కేంద్ర పరిశీలకులు రాజ్ నాత్ సింగ్, జేపీ నద్దా, ఓం ప్రకాశ్ మాథూర్, రాజీవ్ ప్రతాప్ రూడీలు హాజరవుతారు. -
ప్రీతి జింటా పోలీసులకు అంతా చెప్పేసింది!
ముంబై: తనకు, మాజీ బాయ్ ఫ్రెండ్, వ్యాపార భాగస్వామి నస్ వాడియాకు తనకు మధ్య జరిగిన ఎపిసోడ్ ను బాలీవుడ్ నటి ప్రీతి జింటా పోలీసులకు వివరించిందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. రెండుగంటలకు పైగా సాగిన విచారణలో అన్ని వివరాలు ప్రీతి వెల్లడించిందని పోలీసు అధికారులు తెలిపారు. జూన్ 12 తేదిన నెస్ వాడియాపై దాఖలు చేసిన ఆరోపణలపై పోలీసులు స్టేట్ మెంట్ ను మంగళవారం రికార్డు చేశారు. తనను దూషించిన విధానాన్ని, తనపై ఎలా అరిచాడో, తనను నిందించిన వైనాన్ని, దాడి చేసిన తీరును పోలీసులకు వివరంగా ప్రీతి జింటా తెలిపినట్టు అధికారులు తెలిపారు. ఆ రోజు జరిగిన ఘటనలో తనను పదే పదే హెచ్చరించడమే కాకుండా బెదిరింపులకు పాల్పడినట్టు ప్రీతి చెప్పిన స్టేట్ మెంట్ ను పోలీసులు రికార్డు చేశారు. 'స్పాట్ పంచనామా'లో భాగంగా వాంఖెడే స్టేడియంలో మే 30 తేదిన జరిగిన ఐపీఎల్ మ్యాచ్ సందర్బంగా నెస్ వాడియాతో కలిసి కూర్చున్న ప్రదేశాన్ని ప్రీతిజింటా పోలీసులకు చూపించారు. వాంఖెడే స్టేడియానికి తన సోదరుడితో కలిసి పోలీసులకు వివరాల్ని అందించినట్టు సమాచారం. ఈ కేసులో ప్రీతి జింటా ఫిర్యాదులో పేర్కొన్న మరో 14 మందిని పోలీసులు ప్రశ్నించనున్నారు. Follow @sakshinews -
ప్రీతి వాంగ్మూలం నమోదు
ముంబై: మాజీ ప్రియుడు నెస్ వాడియాపై పెట్టిన వేధింపుల కేసులో బాలీవుడ్ నటి ప్రీతిజింటా మంగళవారం సాయంత్రం ముంబైలోని వాంఖడే క్రికెట్ స్టేడియంలో పోలీసులకు సుమారు గంటన్నరపాటు వాంగ్మూలం ఇచ్చారు. స్టేడియం ఆవరణలోని బీసీసీఐ కార్యాలయంలో రాత్రి 8:20 గంటల వరకూ ఆమె నుంచి పోలీసులు వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. అనంతరం 20 నిమిషాలపాటు నాటి ఘటన పరిణామక్రమాన్ని అంచనా వేయడంలో సాయపడ్డారు. మే 30న ఈ స్టేడియంలో ఐపీఎల్ టోర్నమెంట్లో భాగంగా కింగ్స్-11 పంజాబ్ (ప్రీతి, వాడియా ఈ జట్టు సహ యజమానులు), చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా వాడియా తనను వేధించినట్లు, తన గౌరవానికి భంగం కలిగించినట్లు ప్రీతిజింటా ఈ నెల 12న పోలీసులకు ఫిర్యాదు చేయడం తెలిసిందే. వాడియాపై ఫిర్యాదు చేసిన అనంతరం ప్రీతి అమెరికా వెళ్లిపోవడంతో ఈ సంఘటన కచ్చితంగా ఏ ప్రదేశంలో జరిగింది? ఆ సమయంలో చుట్టూ ఎవరున్నారు? అనే విషయాలపై వాంగ్మూలం నమోదు చేసుకునేందుకు స్వదేశం తిరిగి రావాల్సిందిగా పోలీసులు ప్రీతిని కోరారు. దీంతో ఆదివారం ముంబై చేరుకున్న ప్రీతి మంగళవారం సాయంత్రం స్టేడియానికి వచ్చి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. -
వాడియాపై ప్రీతి జింటా కేసు
ముంబై: ఈ ఏడాది ఐపీఎల్ వివాదాల్లేకుండా పూర్తయిందనుకుంటే... టోర్నీ ముగిశాక కొత్త వివాదం మొదలైంది. పంజాబ్ జట్టు సహ యజమాని ప్రీతి జింటా... ఆ జట్టుకే చెందిన మరో యజమాని, తన మాజీ ప్రేమికుడు నెస్‌వాడియాపై కేసు పెట్టింది. మే 30న వాంఖడే స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా... నెస్వాడియా తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, లైంగిక వేధింపులకు గురి చేయడంతో పాటు బెదిరించాడని ప్రీతిజింటా గురువారం రాత్రి ముంబైలోని మెరీన్ డ్రైవ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో వాడియాపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయడంతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ మ్యాచ్ జరుగుతున్నప్పుడు 39 ఏళ్ల జింటా గర్వారే పెవిలియన్‌లో ఉండగా వాడియా (44) అక్కడికి వచ్చి విష్ చేసి ఆ తర్వాత అందరి ముందు ఆమెను తిట్టినట్టు సమాచారం. వీరిద్దరు గతంలో ఐదేళ్ల పాటు డేటింగ్ కూడా చేశారు. ఆ తర్వాత విడిపోయినప్పటికీ వేధింపులు మానలేదని జింటా పేర్కొంది. ఇది తనకు కష్టకాలమని, మీడియా ఈ విషయంలో సంయమనం పాటించాలని కోరింది. ఏ మహిళ కూడా ఇలాంటి వివాదాల్లో ఇరుక్కోవాలని భావించదని, తాను ఎవరికీ హాని చేయాలని చూడడం లేదని ప్రీతి పేర్కొంది. పోలీసుల విచారణ మొదలు ప్రీతి ఇచ్చిన ఫిర్యాదుపై ముంబై మెరైన్ డ్రైవ్ పోలీసులు తమ విచారణను ప్రారంభించారు. ఐపీఎల్ సీఈవో సుందర్ రామన్, వాంఖడే స్టేడియం సిబ్బందిని వీరు ప్రశ్నించే అవకాశం ఉంది. వీరితో పాటు పంజాబ్‌కు చెందిన చాలా మంది ఆట గాళ్లు, సహాయక సిబ్బంది కూడా సంఘటన జరిగినప్పుడు అక్కడే ఉన్నారని, వీరి స్టేట్మెంట్ రికార్డు చేస్తామని పోలీసు వర్గాలు తెలిపాయి. మరోవైపు 24 గంటల్లో వాడియాను అరెస్ట్ చేయాలని మహారాష్ట్ర మహిళా హక్కుల కమిషన్ డిమాండ్ చేసింది. షాక్ అయ్యాను: నెస్ వాడియా ప్రీతి జింటా ఇచ్చిన ఫిర్యాదుపై నెస్ వాడియా స్పందించారు. ‘నిజంగా ఇది నన్ను షాక్‌కు గురిచేసింది. ఆమె ఆరోపణలు పూర్తిగా అవాస్తవం, నిరాధారం. అసలు జింటాపై దాడి చేయడమనేది అసంభవం. ఎందుకంటే ఆమె ఎప్పుడూ తన చుట్టూ బౌన్సర్లను రక్షణగా పెట్టుకుంటుంది’ అని వాడియా అన్నారు. వాడియా కొంతకాలంగా మరో అమ్మాయితో స్నేహంగా ఉంటున్నాడని, ఇది చూసి ఓర్వలేకే ప్రీతి ఇలాంటి ఆరోపణలు చేస్తోందని వాడియా సన్నిహితులు పేర్కొంటున్నారు. -
ఎంసీఏ లేఖపై నేడు నిర్ణయం
ముంబై: ఐపీఎల్-7 ఫైనల్ మ్యాచ్ వేదికను వాంఖడే స్టేడియం నుంచి తరలించ డాన్ని నిరసిస్తూ ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) రాసిన లేఖపై లీగ్ పాలక మండలి నేడు (మంగళవారం) నిర్ణయం తీసుకోనుంది. ‘సోమవారం మా మేనేజింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఫైనల్ వేదికను బెంగళూరుకు మార్చడాన్ని సభ్యులు వ్యతిరేకించారు. ఈ విషయంపై బీసీసీఐతో పాటు ఐపీఎల్ పాలకమండలితో టచ్‌లో ఉన్నాం. బోర్డు తాత్కాలిక అధ్యక్షుడు సునీల్ గవాస్కర్ కూడా మా లేఖపై చర్చించి తుది విషయం నేడు చెబుతామని అన్నారు. ఎంసీఏకు అనుకూలంగానే అంతా జరుగుతుందని ఆశిస్తున్నాం’ అని కమిటీకి అధ్యక్షత వహించిన ఎంసీఏ ఉపాధ్యక్షుడు రవి సావంత్ తెలిపారు. జూన్ 1న జరగాల్సిన ఫైనల్ మ్యాచ్‌ను ఎలాంటి కారణాలు చూపకుండానే ముంబై నుంచి బెంగళూరుకు తరలిస్తూ శనివారం ఐపీఎల్ పాలక మండలి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. -
ఎవరినీ మర్చిపోవద్దనుకున్నా...
ముంబై: దాదాపు రెండున్నర దశాబ్దాల క్రికెట్ కెరీర్‌ను ముగిస్తున్న సందర్భంగా వాంఖడే స్టేడియంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఇచ్చిన వీడ్కోలు ప్రసంగం అందరినీ కదిలించిన విషయం తెలిసిందే. తన సుదీర్ఘ క్రీడా జీవితంలో సహకరించిన వారందరికీ పేరుపేరునా అందులో కృతజ్ఞతలు తెలిపాడు. 20 నిమిషాలపాటు ఇచ్చిన ఈ ప్రసంగం ఆలోచన కోల్‌కతా నుంచి ముంబైకి విమానంలో వస్తున్నప్పుడు కలిగిందని మాస్టర్ చెప్పాడు. ఎవరినీ మర్చిపోకూడదని అప్పుడే నిర్ణయించుకున్నానని తెలిపాడు. అయితే ఇలాగే మాట్లాడాలని ఏమీ అనుకోలేదని, అంతా అప్పటికప్పుడు హృదయం నుంచి వచ్చిందేనని ఆదివారం తన నివాసం సమీపంలో 25 అడుగులకు పైగా ఎత్తున్న స్టీల్ బ్యాట్ ఆవిష్కరణ కార్యక్రమం సందర్భంగా సచిన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. రెండు టన్నుల బరువున్న ఈ బ్యాట్ కింది భాగంలో సచిన్ వీడ్కోలు ప్రసంగాన్ని కూడా ముద్రించారు. ఈ కార్యక్రమంలో సచిన్ అభిప్రాయాలు అతని మాటల్లోనే... కోల్‌కతా టెస్టు ఆడాక అక్కడి నుంచి ముంబైకి విమానంలో ప్రయాణిస్తున్నాం. అప్పుడు నేను ఒంటరిగానే కూర్చునున్నాను. ఆ సమయంలో ఇక వాంఖడేలో ఆడే మ్యాచ్ నా చివరిదని అర్థం చేసుకోవడం ప్రారంభించాను. కెరీర్లో తోడ్పాటునందించిన ప్రతి ఒక్కరినీ తలుచుకోవాలని అనిపించింది. ఇక ముంబై టెస్టు కూడా ముగిశాక ప్రపంచమంతా నేను మాట్లాడాలని కోరుకుంది. పూర్తిగా నా మనసులో నుంచి వచ్చిన ఆ ఉపన్యాసంలో ఎవరి పేరునూ నేను మర్చిపోలేదు. ఆ సమయంలో నేను భావోద్వేగానికి గురయ్యాను. ఆరోజు నేను అనుకున్నదానికన్నా బాగానే మాట్లాడాను. అంతా భగవంతుడి దయగా భావిస్తాను. రిటైర్మెంట్ ప్రకటించినప్పుడు అభిమానులు నా మీద చూపిన ఆపేక్షను నమ్మలేకపోయాను. గతంలో నేనెప్పుడూ చవిచూడని అనుభవమది. నా జీవితంలోనే ప్రత్యేక అనుభూతిగా నిలిచిపోయే సంఘటన అది. నేను కొద్దికాలం క్రితమే రిటైర్ అయ్యాను. కాబట్టి తిరిగి క్రికెట్ ఆడే విషయాన్ని ఆలోచించలేను. నా సెకండ్ ఇన్నింగ్స్‌ను పూర్తిగా ఆస్వాదిస్తున్నాను. రెండు మూడు సార్లు మాత్రం అర్జున్, అతడి స్నేహితులతో కలిసి ఇంట్లో క్రికెట్ ఆడాను. కఠినంగా శ్రమించడం ద్వారానే ఏ రంగంలోనైనా పైకి వస్తారు. వర్థమాన ఆటగాళ్లు ఈ సూత్రాన్ని పాటించాలి. ఇందుకోసం ఎలాంటి దగ్గరి దారులు ఉండవు.కలలు కనడం తప్పుకాదు. వాటిని నిజం చేసుకోవడం అంతకన్నా ముఖ్యం. -
'వాంఖెడే' నిషేధం బాధించడం లేదు: షారుక్
వాంఖెడే స్టేడియానికి దూరంగా ఉండి ఇంట్లోనే మ్యాచ్ లను వీక్షించడం ఆనందంగా ఉంది అని షారుక్ ఖాన్ అన్నారు. ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు యజమాని షారుక్ పై వాంఖెడే స్టేడియంలో ప్రవేశించకుండా ముంబై క్రికెట్ అసోసియేషన్స్ (ఎంసీఏ) ఐదేళ్ల నిషేధం విధించడం తెలిసిందే. 2012లో ముంబై ఇండియన్స్ పై నైట్ రైడర్స్ విజయం సాధించిన తర్వాత షారుక్ పిల్లలపై సెక్యూరిటీ సిబ్బంది దురుసుగా ప్రవర్తించడంతో షారుక్ అధికారులతో గొడవపడిన పడ్డారు. అయితే తన ప్రవర్తన బాగాలేదనే ఆరోపణల్ని షారుక్ ఖండించారు. వాంఖెడే స్టేడియంలో ప్రవేశంపై నిషేధించడాన్ని తాను తీవ్రంగా పరిగణించడం లేదని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. 'లివింగ్ విత్ కేకేఆర్' డాక్యుమెంటరీ ప్రదర్శన సందర్భంగా షారుక్ మీడియాతో మాట్లాడారు. -
అందరికీ కృతజ్ఞతలు.. అర్థం చేసుకుంటారనుకుంటున్నా!!
-
అందరికీ కృతజ్ఞతలు.. అర్థం చేసుకుంటారనుకుంటున్నా!!
వాంఖడే స్టేడియంలో సచిన్ రిటైర్మెంట్ వేడుక ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సచిన్ ఉద్వేగ భరితంగా మాట్లాడాడు. ఆ మాటల్లోని ముఖ్యాంశాలు... ''ఇంత అద్భుతమైన ప్రయాణం ముగిసిందంటే ఆశ్చర్యంగా ఉంది. ఈ సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి.. నా తండ్రి. ఆయన నాకు చిన్నతనంలోనే స్వేచ్ఛనిచ్చి, కోరుకున్న కెరీర్ ఎంచుకొమ్మన్నారు. నేను ఆయన అడుగుజాడల్లోనే నడిచాను. ఆయన అద్భుతమైన వ్యక్తి కూడా. ఆయన ఆశీస్సుల వల్లే ఇంత స్థాయికి ఎదిగాను. నన్ను పెళ్లి చేసుకోవడం అంత సులభం కాదు. కానీ అంజలి చాలా ఓర్పు, సహనంతో వ్యవహరించింది. ఆమె తన ఇద్దరు బిడ్డలతో పాటు.. నన్ను కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంది. గడిచిన 24 ఏళ్లుగా దేశం కోసం ఆడాను. ఆమె ఎప్పుడూ ప్రార్థస్తూ ఉంది. ఆ ప్రార్థనల ఫలితం వల్లే నేను బాగా ఆడగలిగాను. మా పెద్ద అన్నయ్య ఎప్పుడూ నాకు వెన్నంటి ఉండి ప్రోత్సహించారు. అందుకే నేను దృష్టి పెట్టగలిగాను. మా సోదరి సబిత నాకు మొదటి బ్యాట్ కొనిచ్చింది. అందుకు చాలా కృతజ్ఞతలు. మా సోదరుడు అజిత్ గురించి ఎంత చెప్పినా తక్కువే. రమాకాంత్ ఆచ్రేకర్ సార్ దగ్గరకి తనే తీసుకెళ్లాడు. ఆయన నాకు అన్నీ చెప్పకపోతే నేను క్రికెట్లో చాలా కిందిస్థాయిలో ఉండేవాడినేమో. 1990లో నేను అంజలిని కలవడం నా జీవితంలో చాలా అద్భుతమైన క్షణం. నేను అలా అడుగులో అడుగు వేసుకుంటూ తనవద్దకు వెళ్లాను. ఆమె ఓ డాక్టర్. తాను నన్ను క్రికెట్ ఆడమంది, తాను కుటుంబ బాధ్యతలు తీసుకుంటానంది. నా తప్పులు, ఒత్తిళ్లు తట్టుకున్నందుకు చాలా థాంక్స్. జీవితంలోని ఎత్తుపల్లాలన్నింటిలో తోడున్నందుకు థాంక్స్. (ఈమాట అనగానే అంజలి కంటివెంట కన్నీరు వచ్చింది). జీవితం నాకిచ్చిన రెండు వరాలు.. సారా, అర్జున్. ఇప్పుడు ఇప్పటికే పెరిగారు. వాళ్లకు కూడా నేను చాలా థాంక్స్ చెప్పాలి. వాళ్ల పుట్టినరోజులు, స్పోర్స్ట్ డేలు, ఏం జరిగినా ఎప్పుడూ నేను ఉండేవాడిని కాను. వాళ్లు నాకు ఎంత ప్రత్యేకమో వాళ్లు ఊహించలేరు. ఇన్నాళ్లుగా నేను మీకు సమయం కేటాయించలేకపోయాను. కానీ రాబోయే 16 ఏళ్లు పూర్తిగా మీతోనే ఉంటాను. చిన్నతనంలో నాకు చాలామంది స్నేహితులుండేవారు. వాళ్లను నెట్స్‌లోకి పిలిచి నాకు బౌలింగ్ చేయమనేవాడిని. సెలవులు వచ్చినప్పుడల్లా నేను సరిగా ఆడుతున్నానో లేదోనని వాళ్లను వేధించేవాడిని. తెల్లవారుజామున మూడు గంటలకు కూడా నాతోపాటు వాళ్లు వచ్చి, నీ కెరీర్ అయిపోలేదని ప్రోత్సహించేవాళ్లు. వాళ్లందరికీ చాలా థాంక్స్. నేను 11 ఏళ్ల వయసులో క్రికెట్ కెరీర్ మొదలుపెట్టాను. ఆచ్రేకర్ సార్ నా కోచ్ అయిన తర్వాత జీవితం చాలా మారింది. ఆయనను చూసినప్పుడు చాలా ఉద్వేగానికి లోనయ్యాను. సార్ నన్ను స్కూటర్ మీద ఎక్కించుకుని ముంబై మొత్తం మ్యాచ్‌ల కోసం తిప్పేవారు. గత 29 ఏళ్లుగా ఆయన నన్ను నడిపిస్తూనే ఉన్నారు. ఇక జీవితంలో మ్యాచ్‌లు చూడటమే తప్ప ఆడటం ఉండదు!! ముంబైలో.. ఇదే మైదానంలో నా ఆట మొదలైంది. అందుకే ఇప్పుడు కూడా ఇక్కడే ఆడాలనుకున్నాను. బీసీసీఐ నన్ను 16 ఏళ్ల వయసులో ఎంపిక చేసింది. అప్పుడు నన్ను తీసుకున్న సెలెక్టర్లందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. మీ అందరి మద్దతు నాకు చాలా ఉంది. గాయపడినప్పుడు కూడా దగ్గరుండి చికిత్సలు చేయించి మళ్లీ భారత్ తరఫున ఆడేలా చేశారు. రాహుల్, లక్ష్మణ్, సౌరవ్... ఇలా వీళ్లందరూ నేను కుటుంబానికి ఊదరంగా ఉన్నప్పుడు డ్రస్సింగ్ రూంలో నాతో ఉండేవారు. వాళ్ల సాహచర్యం నాకు చాలా స్పెషల్. ఎంఎస్ ధోనీ నాకు 200 టెస్టు మ్యాచ్ క్యాప్ ఇచ్చినప్పుడు టీమ్ కోసం ఓ సందేశం ఇచ్చాను. మనమంతా భారత క్రికెట్ జట్టులో భాగమైనందుకు ఎంతో గర్వపడాలి. మీరు మీ పూర్తి సామర్థ్యంతో జాతికి సేవలు అందిండచం కొనసాగిస్తారని ఆశిస్తున్నా. నా డాక్టర్లు, ఫిజియోలు, ట్రైనర్లు.. వాళ్లను ప్రస్తావించకపోతే పెద్ద తప్పు చేసినట్లే. వాళ్లు చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. నేను ఎక్కడున్నా గాయపడినప్పుడు వెంటనే వచ్చి, తీసుకెళ్లి మళ్లీ మామూలు సచిన్‌ను చేసేవారు. వినోద్ నాయుడు గత 14 ఏళ్లుగా మా కుటుంబంతో ఉన్నాడు. తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి నా కోసం పనిచేశాడు. స్కూలు సమయంలో ఆడుతున్నప్పటి నుంచి ఇప్పటివరకు నన్ను ప్రోత్సహించిన మీడియాకు కృతజ్ఞతలు. ఫొటోగ్రాఫర్లు నావి మంచిమంచి ఫొటోలు తీశారు. చివరిగా ఒక్కమాట.. ప్రపంచంలోని నలుమూలల నుంచి వచ్చిన ప్రేక్షకులు కూడా నన్ను చాలా చాలా ప్రోత్సహించారు. వాళ్ల ప్రోత్సాహమే లేకపోతే ఇదంతా ఉండేది కాదు. వాళ్లకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. సాచిన్.. సాచిన్.. అని అరుస్తుంటే నా గుండెల్లోంచి ఉద్వేగం పొంగుకొచ్చేది. థాంక్యూ వెరీమచ్. మీరంతా అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. థాంక్యూ.. -
క్రికెట్ లేని జీవితాన్ని ఊహించుకోలేను: సచిన్
-
భారత్ తిరుగులేని ఆధిక్యం.. వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్ 43/3
-
బాల్ బాయ్‌గా ఆకట్టుకున్నసచిన్ కుమారుడు
ముంబై: ముంబై వాంఖడే స్టేడియంలో శుక్రవారం ఓ అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. భారత బ్యాటింగ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్ ఈ వేదికలో 26 ఏళ్ల క్రితం బాల్ బాయ్‌గా పనిచేయగా.. తాజాగా ఇదే వేదికలో జరుగుతున్న మాస్టర్ వీడ్కోలు టెస్టులో అతని కుమారుడు అర్జున్ టెండూల్కర్ బాల్ బాయ్‌గా వ్యవహరించాడు. ముంబై అండర్-14 జట్టుకు గతేడాది ప్రాతినిధ్యం వహించిన 14 ఏళ్ల అర్జున్.. సచిన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో మైదానంలో కనిపించాడు. బౌండరీ లైన్‌కు అవతల కూర్చొన్నఅర్జున్ టెండూల్కర్ స్టేడియంలోని ఆటగాళ్లకు బాల్‌ను అందిస్తూ ఆకట్టుకున్నాడు. తండ్రి బాటలోనే పయనించాలని యోచిస్తున్నఅర్జున్ ఇది ఏమేరకు లాభిస్తుందో వేచిచూద్దాం. -
భారత్ తిరుగులేని ఆధిక్యం.. వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్ 43/3
వెస్టిండీస్‌తో రెండో టెస్టులో భారత్ విజయం దిశగా దూసుకెళ్తోంది. రోహిత్ శర్మ (111 నాటౌట్), చటేశ్వర్ పుజారా (113) సెంచరీలతో చెలరేగడంతో భారత్ భారీ స్కోరు సాధించింది. ముంబైలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రెండో రోజు శుక్రవారం భారత్ 495 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ లో 313 పరుగుల ఆధిక్యం నెలకొల్పింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన విండీస్ ఆట ముగిసేసరికి 43 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. అశ్విన్ రెండు, ఓజా వికెట్ తీశారు. కరీబియన్లు ఓవరాల్ గా 270 పరుగులు వెనుకబడి ఉన్నారు. భారత బౌలర్లు జోరు ఇలాగే సాగితే ఇన్నింగ్స్ విజయం సాధించే అవకాశాలున్నాయి. రోహిత్ శామ్యూల్స్ బౌలింగ్ లో సిక్సర్ బాది సెంచరీ చేశాడు. అంతకుముందు పుజారా కెరీర్లో ఐదో టెస్టు సెంచరీ నమోదు చేశాడు. 415/9 వద్ద రోహిత్ 46 పరుగులతో ఉన్నాడు. అనంతరం రోహిత్ ఒంటరి పోరాటం చేసి సెంచరీ చేయడం విశేషం. రోహిత్ కిది వరుసగా రెండో సెంచరీ. షిల్లింగ్ ఫోర్డ్ బౌలింగ్ లో రోహిత్ క్యాచవుట్ అయినా నోబాల్ గా ప్రకటించడంతో ఊపిరి పీల్చుకున్నాడు. టీ విరామానికి ముందు అశ్విన్ అవుటవగా, ఆ తర్వాత భువనేశ్వర్, ఓజా వెంటవెంటనే అవుటయ్యాడు. అంతకుముందు టీమిండియా కెప్టెన్ ధోనీ నాలుగు పరుగులకే వెనుదిరిగాడు. కోహ్లీ (57), పుజారా ఇద్దరూ షిల్లింగ్ ఫోర్డ్ బౌలింగ్ లో అవుటయ్యారు. ధోనీని బెస్ట్ పెవిలియన్ చేర్చాడు. చివరి మ్యాచ్ ఆడుతున్న క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ (74) డియోనరైన్ బౌలింగ్‌లో సామీకి క్యాచ్ ఇచ్చాడు. రెండో రోజు ఆట మొదలైన కొద్ది సేపటికే సచిన్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. రెండో రోజు సచిన్ (38 బ్యాటింగ్), పుజారా (34 బ్యాటింగ్) వ్యక్తిగత ఓవర్ నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ కొనసాగించారు. మొదటి రెండు బంతుల్లో పరుగులేమీ రాకపోయినా.. తర్వాత వరుసగా రెండు బంతులను సచిన్ బౌండరీకి తరలించడంతో ప్రేక్షకుల్లో ఆనందోత్సాహాలు చెలరేగాయి. టినో బెస్ట్ వేసిన తొలి ఓవర్ ఐదో బంతికి సచిన్ దాదాపు ఔటైనంత పని జరిగినా.. తృటిలో ప్రమాదం తప్పింది. షార్ట్ లెంగ్త్ బాల్‌ను సచిన్ ఫ్లాష్ చేయడానికి ప్రయత్నించాడు గానీ అది కొద్దిలో తప్పిపోయింది. దీంతో ప్రేక్షకులంతా ఒక్కసారిగా కేకలు పెట్టారు. షిల్లింగ్ ఫోర్డ్ వేసిన రెండో ఓవర్ ఐదో బంతిని సచిన్ బౌండరీకి తరలించాడు. దీంతో మాస్టర్ హాఫ్ సెంచరీ పూర్తయింది. రెండో రోజు ఆట చూసేందుకు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ కూడా హాజరయ్యారు. ఎప్పుడూ కుర్తా పైజమాలో కనిపించే రాహుల్.. ఈ రోజు మాత్రం టీషర్టులో ఆహ్లాదంగా ఉన్నారు. విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 182 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. -
74 పరుగుల వద్ద సచిన్ అవుట్
-
అభిమానుల్లో సచిన్ మానియా!
క్రికెట్ కెరీర్ కు గుడ్ బై చెప్తూ చివరిటెస్ట్ ఆడుతున్న సచిన్ టెండూల్కర్ కు అభిమానులు ఘనంగా వీడ్కోలు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా పిల్లులు, పెద్దలు, వృద్దులందరూ సచిన్ కు విషెష్ చెపుతున్నారు. ముంబై లోని వాంఖేడి స్టేడియంలో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ తొలి రోజు ఆటకు అభిమానులు పోటెత్తారు. వివిధ రకాల వేషాలతో, పలు విధాలైన బ్యానర్లు, ప్లకార్డులతో స్టేడియంలో పండగ వాతావరణాన్ని సందడిని సృష్టించారు. -
సచిన్ కోసం కామెంటేటర్ గా మారిన అమీర్ ఖాన్
సచిన్ టెండూల్కర్ ఆడుతున్న చివరి టెస్ట్ అనేక విశేషాలకు వేదికైంది. సచిన్ ఆటనే కాకుండా బాలీవుడ్ తారల్లో కొందరు వాంఖెడే స్టేడియానికి తరలివచ్చారు. సచిన్ ఆటను చూడటానికి వచ్చిన బాలీవుడ్ తారల్లో అమీర్ ఖాన్ కూడా ఉన్నారు. మ్యాచ్ చూడటానికి వచ్చిన అమీర్ ఖాన్ కామెంటేటర్ గా మారడం క్రికెట్ అభిమానులను ఆకర్షించింది. క్రికెట్ కామెంటేటర్లు రవిశాస్త్రి, హర్షా భోంగ్లేతో కలిసి అమీర్ ఖాన్ కామెంటేటర్ అవతారం ఎత్తారు. కామెంటరీ బాక్సులో సచిన్ తో ఉన్న అనుబంధాన్ని, గడిపిన క్షణాలను అమీర్ ఖాన్ నెమరు వేసుకున్నారు. దూమ్ 3 చిత్రంలోని దూమ్ మచాలే పాటను క్రికెట్ దేవుడికి అంకితమిచ్చిన సంగతి తెలిసిందే. వాస్తవానికి దూమ్3 చిత్ర ప్రమోషన్ ఈవెంట్ ఈ సాయంత్రం 4.30 గంటలకు ఉండగా, ఈ సాయంత్రం 6 గంటలకు వాయిదా వేశారు. వెస్టిండీస్ ఆలౌట్ అయిందనే సమాచారం అందుకున్న అమీర్ ఖాన్ స్టూడియోలో అన్ని పనులు వదులకొని తాను అదృష్టంగా భావించే నీలం రంగు టీషర్ట్ వేసుకుని స్టేడియంలో అడుగుపెట్టారు. -
వాంఖడే స్టేడియంలో క్రికెట్ దేవుడు సచిన్
-
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్
వాంఖడే స్టేడియంలో ఈరోజు భారత్, వెస్టిండీస్‌ల మధ్య జరగనున్న రెండో టెస్టు మ్యాచ్‌లో బారత్ టాస్ గెలిచింది. దాంతో ఫీల్డింగ్ ఎంచుకుంది. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ ఆ మ్యాచ్‌తో క్రికెట్ నుంచి రిటైర్ కాబోతున్నారు.ఈ నేపథ్యంలో సచిన్ చివరి మ్యాచ్‌ను వీక్షించ ఇప్పటికే క్రికెట్ దిగ్గజాలు, రాజకీయ నాయకులు, సినీతారలు, సచిన్ అభిమానులతో స్టేడియం కిక్కిరిసింది. క్రికెట్ దిగ్గజం సచిన్‌కు ఘనంగా వీడ్కోలు పలికేందుకు ముంబై క్రికెట్ అసోసియేషన్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. క్రికెట్ ప్రపంచ చరిత్రలో ఇన్ని మ్యాచ్ లు ఆడిన వ్యక్తిగా సచిన్ రికార్డు బద్దలు కొట్టాడు. అలాగే క్రికెట్ సచిన్ చేసిన సేవలకు గుర్తుగా ఆయన అభిమానులు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. -
క్రికెట్ దేవుడి వీడ్కోలు ఉత్సవంలో పాల్గొనండి
క్రికెట్ అభిమానులందరి దృష్టి ఇప్పడు ముంబై టెస్టుపైనే. క్రికెట్ దేవుడి నిష్క్రమణకు వేదికయిన వాంఖేడ్ మైదానంలో మాస్టర్ ఆటను వీక్షించేందుకు యావత్ దేశం ఉత్కంఠతో ఎదురుచూస్తోంది. నిలకడైన ఆటతో, ఒద్దికైన ప్రవర్తనతో దాదాపు రెండున్న దశాబ్దాలు తమను అలరించిన 'లిటిల్ మాస్టర్' సచిన్ టెండూల్కర్‌కు ఘన వీడ్కోలు పలికేందుకు క్రికెట్ లవర్స్ సిద్ధమయ్యారు. రికార్డుల రారాజు కొత్తగా సాధించాల్సింది ఏమీ లేకున్నా అద్భుత ప్రదర్శనతో ఆటకు వీడ్కోలు పలకాలని అంతా కోరుకుంటున్నారు. చివరి అంకంలోనూ చరిత్ర సృష్టించాలని ఆశ పడుతున్నారు. ఎందుకంటే క్రికెట్ చరిత్రలో గొప్ప ఆటగాళ్లుగా నిలిచినవాళ్లలో ఎక్కువ మంది వైఫల్యంతోనే ఇన్నింగ్స్ ముగించారు మరి! కాశ్మీర్‌నుంచి కన్యాకుమారి వరకు దేశమంతా ఇప్పుడు సచిన్ నామస్మరణతో మార్మోగుతోంది. బ్యానర్ల రెపరెపలు, పోస్టర్ల ప్రదర్శన.. పూలతో బ్యాట్లు, బంతులు.. సైకత శిల్పాలు, కేక్ కటింగ్‌లు, మాస్క్‌లతో పాఠశాలల్లో విద్యార్థులు! ఇలా ఒకటేమిటి.. దేశమంతా ఎక్కడ చూసినా సచిన్‌మయం. ఇక సచిన్ సొంత నగరం ముంబైలో అయితే సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. 200 టెస్టుతో ఆటకు స్వస్తి చెబుతున్న 'ఫ్యాన్స్ క్రికెట్ గాడ్'పై తమ అభిమానాన్ని విభిన్న రీతుల్లో చాటుకుంటున్నారు అభిమానులు. క్రికెట్ దేవుడి వీడ్కోలు ఉత్సవంలో పాల్గొంటూనే ఆట అనంతర జీవితం ఆనందంగా సాగాలని ఆకాంక్షిస్తున్నారు. మీరు కూడా 'సాక్షి డాట్ కామ్' ద్వారా సచిన్‌కు విషెస్ తెలపండి. -
‘మాస్టర్ సెంచరీ చేయాలి’
ముంబై: సచిన్ టెండూల్కర్ తన ఆఖరి టెస్టులో సెంచరీ చేసి కెరీర్‌కు ఘనంగా వీడ్కోలు పలకాలని కోట్లాది మంది అభిమానులు కోరుకుంటున్నారు. మాస్టర్ 200వ టెస్టు ఆడుతున్న వేదిక వాంఖడే క్యూరేటర్ సుధీర్ నాయక్ కూడా దీనికి అతీతమేం కాదు. అంత గొప్ప ఆటగాడు సెంచరీతోనే వీడ్కోలు పలకాలని ఆయన కూడా కోరుకుంటున్నారు. అయితే దానికి తన సహాయం అవసరం లేదని, పని చేసే సమయంలో భావోద్వేగాలకు తావులేదని అంటున్నారు. ‘సచిన్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడిన మొదటి రోజు నుంచి నాకు తెలుసు. అప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. దీనికి తోడు తను మా నగరానికి చెందిన దిగ్గజం. కాబట్టి ఇక తన ఆటను చూడలేం అనే ఆలోచనే బాధపెడుతోంది. తను సెంచరీ చేయాలని నేను కూడా కోరుకుంటున్నాను. అందుకోసం నేనేదో ప్రత్యేకంగా పిచ్‌ను తయారు చేయాల్సిన పని లేదు. నేను కూడా కొన్ని నిబంధనలకు లోబడి పని చేయాలి. పనిలో భావోద్వేగాలకు తావు లేదు’ అని సుధీర్ నాయక్ చెప్పారు. ఎలాంటి పిచ్ తయారు చేయాలో తనకెవరూ చెప్పలేదని, ఎప్పుడూ స్పోర్టింగ్ వికెట్ ఉండాలని తాను కోరుకుంటానని నాయక్ అన్నారు. -
సచిన్ నామస్మరణే...
ముంబై: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఆఖరి టెస్టు కోసం ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) భారీగా సన్నాహాలు చేస్తోంది. ఈ దిగ్గజ ఆటగాడి 24 ఏళ్ల కెరీర్‌కు ఘనమైన రీతిలోనే వీడ్కోలు పలకాలని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా స్టేడియంలో ఎటు చూసినా సచిన్ కనిపించే విధంగా కటౌట్లు... అలాగే సచిన్ తల్లి స్టేడియంలో మ్యాచ్ చూసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వాంఖడేలో జరిగే తన 200వ టెస్టు కోసం జరుగుతున్న సన్నాహకాల్లో మరికొన్ని... స్టేడియం చుట్టూ ‘సచిన్’: మాస్టర్ క్రికెట్ ఆరంభించిన తొలినాళ్ల నుంచి ఇప్పటిదాకా రకరకాల ఫొటోలను వాంఖడే చుట్టూ కటౌట్లుగా ఏర్పాటు చేయనున్నారు. దీంతో అభిమానులకు సర్వం సచిన్‌మయం అనే రీతిలో స్టేడియం కనువిందు చేయనుంది. టిక్కెట్లపై ‘సచిన్’: వాంఖడే టెస్టు కోసం అమ్మే టిక్కెట్లపై సచిన్ ఫొటోను ముద్రించనున్నారు. అలాగే టెస్టుల్లో చేసిన 51 సెంచరీల వివరాలు కూడా పొందుపరుస్తారు. 500 టిక్కెట్లు సచిన్ కోసమే: చివరి టెస్టును చూసేందుకు తన ఆత్మీయులను సచిన్ ఆహ్వానిస్తున్నాడు. దీని కోసం 500 టిక్కెట్లు కావాలని ఎంసీఏను కోరాడు. మాస్టర్ వినతిని అంగీకరించిన ఎంసీఏ పెవిలియన్‌లో 200, నార్త్ స్టాండ్‌లో 300 టిక్కెట్లను కేటాయించింది. తల్లి కోసం ప్రత్యేక ఏర్పాట్లు: 24 ఏళ్ల కెరీర్లో సచిన్ వందలాది వన్డేలు.. రికార్డు టెస్టులు ఆడినప్పటికీ ఇప్పటిదాకా అతడి తల్లి రజనీ మాత్రం ఒక్క మ్యాచ్ కూడా ప్రత్యక్షంగా వీక్షించింది లేదు. అయితే తన కుమారుడు చివరిసారిగా ఆడబోతున్న టెస్టును ‘తొలిసారిగా’ చూసేందుకు మాత్రం ఈసారి వాంఖడేకు రావాలని భావిస్తున్నారు. ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతూ వీల్‌చెయిర్‌కే పరిమితమైన ఆమె రాక కోసం స్టేడియంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా తన తల్లికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుగానే సచిన్ అధికారులను కలిసి పలు సూచనలు చేశాడు. ప్రెసిడెంట్ బాక్స్‌కు వెళ్లే ప్రవేశ ద్వారం వద్ద ర్యాంప్‌ను ఏర్పాటు చేయాలని చెప్పాడు. బహుమతిగా ముఖచిత్రం: వీడ్కోలు బహుమతిగా ఎంసీఏ మాస్టర్‌కు అతడి పెయింటింగ్నే బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించింది. ఈమేరకు ఇది ఏరకంగా ఉండాలో తెలుసుకునేందుకు ఆర్టిస్టును సచిన్ ఇంటికి పంపింది. క్లబ్‌కు సచిన్ పేరు: తమ రాష్ట్రానికి చెందిన సచిన్ పేరు స్థిరస్థాయిగా నిలిచిపోయేలా ఎంసీఏకు చెందిన కాందివలీ క్లబ్‌కు సచిన్ టెండూల్కర్ జింఖానా క ్లబ్గా నామకరణం చేశారు. 11న సచిన్‌కు సన్మానం ముంబై: సచిన్ టెండూల్కర్‌కు ముంబై క్రికెట్ అసోసియేషన్ నవంబర్ 11న సన్మానం చేయనుంది. ‘కాందివలీ క్లబ్ హౌజ్‌కు సచిన్ పేరును పెడుతున్నాం. ఆవిష్కరణ కార్యక్రమం వచ్చే నెల 11న జరుగుతుంది. అదే రోజు సచిన్‌కు సన్మానం జరపాలని నిర్ణయించాం. కోల్‌కతా నుంచి ముంబైలో అడుగుపెట్టే భారత్, వెస్టిండీస్ జట్లు నేరుగా ఈ కార్యక్రమానికి హాజరై ఆ తర్వాత తమ హోటళ్లకు వెళతాయి. మహారాష్ర్ట సీఎం పృధ్వీరాజ్ చౌహాన్, బోర్డు అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్, ఇతర అధికారులు, ముంబైకి చెందిన మాజీ ఆటగాళ్లు కూడా పాల్గొంటారు. అలాగే 14న మ్యాచ్ జరిగే పది నిమిషాల ముందు బీసీసీఐ కూడా సచిన్‌ను సన్మానించనుంది’ అని ఎంసీఏ అధ్యక్షుడు శరద్ పవార్ అన్నారు. -
సచిన్ ఆఖరి టెస్టు వేదిక ముంబై
ముంబైలో ‘మాస్టర్’ సచిన్ టెండూల్కర్ తన సుదీర్ఘ కెరీర్లో మొత్తం 11 టెస్టు మ్యాచ్‌లు ముంబైలో ఆడాడు. ఇందులో ఒక టెస్టుకు బ్రబోర్న్ స్టేడియం వేదికగా నిలవగా, మరో పది టెస్టులు వాంఖెడేలో జరిగాయి. బ్రబోర్న్ జ్ఞాపకం: డిసెంబర్ 2-6, 2009లో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్, శ్రీలంకను ఇన్నింగ్స్ 24 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. సచిన్ తొలి ఇన్నింగ్స్‌లో 53 పరుగులు చేశాడు. ఈ విజయంతోనే భారత జట్టు తొలిసారి ఐసీసీ ర్యాంకింగ్స్‌లో వరల్డ్ నంబర్‌వన్ స్థానానికి చేరుకోవడం విశేషం. వాంఖెడేలో రికార్డు: ఈ మైదానంలో మొత్తం 18 ఇన్నింగ్స్‌లలో సచిన్ 47.05 సగటుతో 847 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 7 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 1997లో శ్రీలంకపై చేసిన 148 పరుగులే సొంత మైదానంలో సచిన్ ఏకైక సెంచరీ. ఈ 10 మ్యాచుల్లో భారత్ 4 గెలిచి, 3 ఓడింది. మరో మూడు ‘డ్రా’గా ముగిశాయి. ముంబై: కోట్లాది మంది భారత అభిమానుల ఆరాధ్య దైవం సచిన్ టెండూల్కర్ ‘ముంబైకర్’ గానే తన కెరీర్‌ను ముగించాలని నిర్ణయించుకున్నాడు. కెరీర్లో తొలి ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ ఆడి పరుగుల ప్రవాహాన్ని ప్రారంభించిన చోటే పరుగు ఆపాలని కోరుకున్నాడు. తన 200వ టెస్టు మ్యాచ్ వేదికగా అతను సొంత నగరాన్నే ఎంచుకున్నాడు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, గురువులు, సన్నిహితులు, సహచరుల సమక్షంలోనే తన ఆఖరి మ్యాచ్ ఆడాలన్న మాస్టర్ విజ్ఞప్తిని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మన్నించింది. వచ్చే నెల 14 నుంచి 18 వరకు వెస్టిండీస్‌తో జరిగే రెండో టెస్టు కోసం ముంబైలోని వాంఖెడే మైదానాన్ని వేదికగా ఎంపిక చేసినట్లు బోర్డు అధికారికంగా ప్రకటించింది. ఈ టెస్టు మ్యాచ్‌తోనే అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ కానున్నట్లు సచిన్ ఇటీవలే ప్రకటించాడు. భారత్-వెస్టిండీస్ సిరీస్ షెడ్యూల్‌ను బీసీసీఐ ఫిక్చర్స్ కమిటీ చైర్మన్ రాజీవ్ శుక్లా మంగళవారం విడుదల చేశారు. ‘చివరి మ్యాచ్‌ను తన తల్లి చూడాలనే కోరికతో ముంబైలో ఏర్పాటు చేయమని సచిన్ కోరాడు. బీసీసీఐ దీనిపై చర్చించి సచిన్ విజ్ఞప్తిని అంగీకరించింది. అతని సెంటిమెంట్‌ను దృష్టిలో పెట్టుకొని 200వ టెస్టును ముంబైకి కేటాయించాం’ అని రాజీవ్ శుక్లా చెప్పారు. సిరీస్‌లో భాగంగా నవంబర్ 6 నుంచి 10 వరకు జరిగే తొలి టెస్టును కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌కు కేటాయించారు. రొటేషన్ పాలసీని పక్కన పెట్టి బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ‘ఈ రెండు టెస్టులకు ఉన్న ప్రాధాన్యత కారణంగా ఎక్కువ సంఖ్యలో ప్రేక్షకులు చూసే అవకాశం ఉన్న పెద్ద వేదికలను ఎంపిక చేయాలని భావించాం. అందుకే ఈడెన్‌ను ఎంచుకున్నాం’ అని శుక్లా స్పష్టం చేశారు. సచిన్‌కు భారీ ఎత్తున వీడ్కోలు ఇచ్చే విషయంపై నిర్ణయం తీసుకునేందుకు ఇంకా చాలా సమయముందని ఆయన అన్నారు. చిరస్మరణీయం చేస్తాం: దాల్మియా సచిన్ 199వ టెస్టు వేదికగా కోల్‌కతాను ఎంపిక చేయడం పట్ల బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా ఆనందం వ్యక్తం చేశారు. నిర్వహణ పరంగా ఈ మ్యాచ్‌ను చిరస్మరణీయంగా మారుస్తామని ఆయన అన్నారు. ‘భారత స్టార్ క్రికెటర్ ఎప్పటికీ ఈడెన్ టెస్టును గుర్తుంచుకునే విధంగా ఏర్పాట్లు చేస్తాం. మరో రెండు రోజుల్లో దీనిపై స్పష్టత వస్తుంది. ముంబైకి చివరి టెస్టు ఇవ్వాలన్న బోర్డు నిర్ణయాన్ని అభినందిస్తున్నాను. అదే విధంగా ఈ మ్యాచ్ అవకాశం రావడం గొప్ప విషయం’ అని దాల్మియా అన్నారు. ఎలా స్పందిస్తానో తెలీదు: కోహ్లి సచిన్ ఆఖరిసారి క్రీజ్‌లోకి వెళ్లే సమయంలో తన స్పందన ఎలా ఉండబోతోందో చెప్పలేనని భారత బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి చెప్పాడు. ‘ సచిన్ ఆట చూస్తూ పెరిగా. అతనిలాగే ఆడాలనుకున్నా. అతను రిటైరయ్యే సమయం నాకు కఠినమైంది. 24 ఏళ్లలో సచిన్ లేకుండా భారత జట్టు ఉండగలదని మేం ఎప్పుడూ ఊహించలేదు. అతను చివరిసారి మైదానంలో వెళ్లే సమయంతో నాతో పాటు జట్టు సభ్యుల స్పందన ఎలా ఉండనుందో ఊహించలేను’ అని కోహ్లి ఉద్వేగంగా అన్నాడు. -
సచిన్ చివరి టెస్టుకు వేదిక ముంబై వాంఖడే స్టేడియం
-
సచిన్ చివరి టెస్టుకు వేదిక ముంబై వాంఖడే స్టేడియం
క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ఆడబోయే చిట్ట చివరి, 200వ టెస్టుమ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలోనే జరగబోతోంది. ఈ విషయాన్ని బీసీసీఐ ఖరారు చేసింది. ముంబైలో బీసీసీఐ పాలకవర్గం మంగళవారం సమావేశమై, సచిన్ కోరిక మేరకు అతడి చిట్టచివరి టెస్టును అతడి హోం గ్రౌండ్ అయిన ముంబై వాంఖడే స్టేడియంలో్నే ఆడించాలని నిర్ణయించింది. వాస్తవానికి సచిన్ టెండూల్కర్ 24 సంవత్సరాల కెరీర్లో అతడి తల్లి రజనీ ఒక్క మ్యాచ్ కూడా మైదానానికి వచ్చి ప్రత్యక్షంగా చూడలేదు. కాస్త ఆశ్చర్యకరంగా ఉన్నా ఇది నిజం. అందుకే చివరిసారి తాను ఆడబోయే టెస్టు (200వ మ్యాచ్)ను తన తల్లి ప్రత్యక్షంగా చూడాలని మాస్టర్ కోరాడు. ప్రస్తుతం ఆమె పూర్తి ఆరోగ్యంగా లేరు. ఒకవేళ మైదానానికి వచ్చినా వీల్‌చెయిర్‌లోనే రావాలి. అటు గురువు రమాకాంత్ ఆచ్రేకర్ కూడా సచిన్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్నారు. మాస్టర్ ఇప్పటికే వాంఖడేలో తన చివరి మ్యాచ్ ఆడతానని బోర్డును కోరాడు. దీనికి బోర్డు కూడా సానుకూలంగా స్పందించింది.