ముంబై: వాంఖడే స్టేడియంలో ఉన్న బీసీసీఐ ప్రధాన కార్యాలయాన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ)కు చెందిన బంద్రా కుర్లా కాంప్లెక్స్ మైదానంలోకి మార్చనున్నారు. ఈ మేరకు కార్యాలయానికి సరిపోయేంత ఖాళీ ప్రదేశాన్ని కేటాయించాలని బోర్డు... ఎంసీఏని కోరింది. ప్రస్తుతం సబర్బన్ ప్రాంతమైన బంద్రా కుర్లా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుండటంతో బోర్డు కార్యాలయ మార్పుపై దృష్టిపెట్టినట్లు సమాచారం.
‘బీకేసీలోని క్లబ్ హౌస్‌కు ఎదురుగా ఉన్న ప్రదేశంలో కొత్త భవనాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. దాన్ని బీసీసీఐకి కేటాయిస్తాం. బీకేసీ చత్రపతి శివాజీ ఎయిర్‌పోర్ట్‌కు చాలా దగ్గరగా ఉండటంతో కార్యాలయాన్ని ఇక్కడికి తరలించాలని వాళ్లు భావిస్తున్నట్లు ఉన్నారు. ప్రస్తుత కార్యాలయానికి రావడానికి ఎయిర్‌పోర్ట్ నుంచి రెండు గంటలకు పైగా పడుతోంది. చిన్న మీడియా గ్యాలరీ, నివాసానికి అనువుగా కొన్ని రూమ్‌లను కూడా కొత్త బిల్డింగ్‌లో ఏర్పాటు చేస్తాం’ అని ఎంసీఏ వర్గాలు తెలిపాయి. ఈ అంశంపై ఆదివారం జరిగే ఎంసీఏ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు.
బీకేసీలోకి బీసీసీఐ ప్రధాన కార్యాలయం!
Published Sat, Aug 1 2015 12:37 AM | Last Updated on Sun, Sep 3 2017 6:31 AM
Advertisement
Advertisement