క్రికెట్ దేవుడి వీడ్కోలు ఉత్సవంలో పాల్గొనండి | send farewell wishes to sachin tendulkar | Sakshi
Sakshi News home page

క్రికెట్ దేవుడి వీడ్కోలు ఉత్సవంలో పాల్గొనండి

Published Thu, Nov 14 2013 12:00 AM | Last Updated on Sat, Sep 2 2017 12:34 AM

క్రికెట్ దేవుడి వీడ్కోలు ఉత్సవంలో పాల్గొనండి

క్రికెట్ దేవుడి వీడ్కోలు ఉత్సవంలో పాల్గొనండి

క్రికెట్ అభిమానులందరి దృష్టి ఇప్పడు ముంబై టెస్టుపైనే. క్రికెట్ దేవుడి నిష్క్రమణకు వేదికయిన వాంఖేడ్ మైదానంలో మాస్టర్ ఆటను వీక్షించేందుకు యావత్ దేశం ఉత్కంఠతో ఎదురుచూస్తోంది. నిలకడైన ఆటతో, ఒద్దికైన ప్రవర్తనతో దాదాపు రెండున్న దశాబ్దాలు తమను అలరించిన 'లిటిల్ మాస్టర్' సచిన్ టెండూల్కర్కు ఘన వీడ్కోలు పలికేందుకు క్రికెట్ లవర్స్ సిద్ధమయ్యారు. రికార్డుల రారాజు కొత్తగా సాధించాల్సింది ఏమీ లేకున్నా అద్భుత ప్రదర్శనతో ఆటకు వీడ్కోలు పలకాలని అంతా కోరుకుంటున్నారు. చివరి అంకంలోనూ చరిత్ర సృష్టించాలని ఆశ పడుతున్నారు. ఎందుకంటే క్రికెట్ చరిత్రలో గొప్ప ఆటగాళ్లుగా నిలిచినవాళ్లలో ఎక్కువ మంది వైఫల్యంతోనే ఇన్నింగ్స్ ముగించారు మరి!

కాశ్మీర్‌నుంచి కన్యాకుమారి వరకు దేశమంతా ఇప్పుడు సచిన్ నామస్మరణతో మార్మోగుతోంది. బ్యానర్ల రెపరెపలు, పోస్టర్ల ప్రదర్శన.. పూలతో బ్యాట్లు, బంతులు.. సైకత శిల్పాలు, కేక్ కటింగ్‌లు, మాస్క్‌లతో పాఠశాలల్లో విద్యార్థులు! ఇలా ఒకటేమిటి.. దేశమంతా ఎక్కడ చూసినా సచిన్‌మయం. ఇక సచిన్ సొంత నగరం ముంబైలో అయితే సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. 200 టెస్టుతో ఆటకు స్వస్తి చెబుతున్న 'ఫ్యాన్స్ క్రికెట్ గాడ్'పై తమ అభిమానాన్ని విభిన్న రీతుల్లో చాటుకుంటున్నారు అభిమానులు. క్రికెట్ దేవుడి వీడ్కోలు ఉత్సవంలో పాల్గొంటూనే ఆట అనంతర జీవితం ఆనందంగా సాగాలని ఆకాంక్షిస్తున్నారు. మీరు కూడా 'సాక్షి డాట్ కామ్' ద్వారా సచిన్కు విషెస్ తెలపండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement