షారూఖ్ ఖాన్ పై నిషేధం ఎత్తివేత
ముంబై: బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్ పై విధించిన నిషేధాన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ) ఎత్తివేసింది. వాంఖేడ్ స్టేడియంలోకి ఆయనను అడుగుపెట్టకుండా విధించిన ఐదేళ్ల నిషేధాన్ని ఎంసీఏ తొలగించింది.
ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ లో ఆరోపణలు ఎదుర్కొన్న అంకిత్ చవాన్ పై బీసీసీఐ కొనసాగిస్తున్న నిషేధాన్ని సవాల్ చేయరాదని ఎంసీఏ నిర్ణయించింది. స్పాట్ ఫిక్సింగ్ కేసులో శ్రీశాంత్, అంకిత్ చవాన్, అజిత్ చండిలా ప్రమేయంపై సాక్ష్యాలు లేవని కోర్టు తీర్పు చెప్పింది. అయితే తమ దగ్గర ఉన్న సాక్ష్యాల కారణంగాపై వీరు ముగ్గురుపై నిషేధం ఎత్తివేసే ప్రసక్తే లేదని బీసీసీఐ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.