బాల్ బాయ్గా ఆకట్టుకున్నసచిన్ కుమారుడు | sachin Tendulkar junior performs as ball boy in dad's farewell Test | Sakshi
Sakshi News home page

బాల్ బాయ్గా ఆకట్టుకున్నసచిన్ కుమారుడు

Published Fri, Nov 15 2013 5:36 PM | Last Updated on Sat, Sep 2 2017 12:38 AM

బాల్ బాయ్గా ఆకట్టుకున్నసచిన్ కుమారుడు

బాల్ బాయ్గా ఆకట్టుకున్నసచిన్ కుమారుడు

ముంబై: ముంబై వాంఖడే స్టేడియంలో శుక్రవారం ఓ అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. భారత బ్యాటింగ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్ ఈ వేదికలో 26 ఏళ్ల క్రితం బాల్ బాయ్గా పనిచేయగా.. తాజాగా ఇదే వేదికలో జరుగుతున్న మాస్టర్ వీడ్కోలు టెస్టులో అతని కుమారుడు అర్జున్ టెండూల్కర్ బాల్ బాయ్గా వ్యవహరించాడు. ముంబై అండర్-14 జట్టుకు గతేడాది ప్రాతినిధ్యం వహించిన 14 ఏళ్ల అర్జున్.. సచిన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో మైదానంలో కనిపించాడు.

బౌండరీ లైన్కు అవతల కూర్చొన్నఅర్జున్ టెండూల్కర్ స్టేడియంలోని ఆటగాళ్లకు బాల్ను అందిస్తూ ఆకట్టుకున్నాడు. తండ్రి బాటలోనే పయనించాలని యోచిస్తున్నఅర్జున్ ఇది ఏమేరకు లాభిస్తుందో వేచిచూద్దాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement