భారత క్రికెట్ దిగ్గజం తనయుడు అర్జున్ టెండూల్కర్‌కు గోవా క్రికెట్ అసోసియేషన్ ఊహించని షాకిచ్చింది. విజయ్ హజారే ట్రోఫీ 2024-25 మధ్యలోనే గోవా జట్టు నుంచి అర్జున్ టెండూల్కర్‌ను జీసీఎ తప్పించింది. దీంతో అతడు శనివారం ఉత్తరఖాండ్‌తో జరిగిన మ్యాచ్‌కు దూరమమయ్యాడు.
25 ఏళ్ల అర్జున్ గోవా రెడ్ బాల్ జట్టులో రెగ్యూలర్ సభ్యునిగా కొనసాగుతున్నప్పటికి వైట్ బాట్ స్వ్కాడ్‌లో మాత్రం తన స్ధానాన్ని సుస్థిరం చేసుకోలేకపోతున్నాడు. కాగా అంతకుముందు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024లో కూడా కేవలం మూడు మ్యాచ్‌లు ఆడిన తర్వాత అతడిపై జీసీఎ వేటు వేసింది.
మళ్లీ ఇప్పుడు విజయ్ హజారే ట్రోఫీలో సరిగ్గా మూడు మ్యాచ్‌లు ఆడిన తర్వాతే సెలక్టర్లు జట్టు నుంచి తప్పించారు. ఈ టోర్నీలో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన అర్జున్ కేవలం 5 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ఒడిశాతో జరిగిన తొలి మ్యాచ్‌లో అర్జున్ 3 వికెట్లు పడగొట్టినప్పటికి.. తన 10 ఓవర్ల కోటాలో ఏకంగా 61 పరుగులు సమర్పించుకున్నాడు.
ఆతర్వాతి రెండు మ్యాచ్‌ల్లో చెరో వికెట్ సాధించినప్పటకి ఆరుకు పైగా ఏకానమీ రేటుతో పరుగులు ఇచ్చాడు. ఈ క్రమంలోనే అతడిపై గోవా క్రికెట్ ఆసోసియేషన్ వేటు వేసింది. దీంతో వైట్‌బాల్ క్రికెట్‌లో అర్జున్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.
మరోసారి ముంబైతో..
కాగా అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్‌లో మరోసారి ముంబై ఇండియన్స్ తరపున ఆడనున్నాడు. ఐపీఎల్-2025 మెగా వేలంలో రూ. 20 లక్షల కనీస ధరకు అర్జున్‌ను ముంబై సొంతం చేసుకుంది. ఈ మెగా వేలంలో అర్జున్‌ను తొలుత ఏ ఫ్రాంచైజీ పట్టించుకోలేదు.
కానీ ఆఖరికి యాక్సిలరేటెడ్ రౌండ్‌లో ముంబై దక్కించుకుంది. జూనియర్ టెండూల్కర్ ఐపీఎల్-2021 సీజన్ నుంచి ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీలో భాగంగా ఉన్నాడు. అతడు 5 మ్యాచ్‌లలో 9.37 ఎకానమీ రేటుతో 3 వికెట్లు పడగొట్టాడు. అర్జున్ కనీసం ఈసారైనా రాణిస్తాడో లేదో వేచి చూడాలి.
చదవండి: IND Vs AUS: స్టుపిడ్.. స్టుపిడ్! భారత డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లొద్దు: పంత్‌పై సన్నీ ఫైర్
Comments
Please login to add a commentAdd a comment