Goa cricketer
-
సచిన్ తనయుడికి భారీ షాక్.. జట్టు నుంచి తీసేశారు!
భారత క్రికెట్ దిగ్గజం తనయుడు అర్జున్ టెండూల్కర్‌కు గోవా క్రికెట్ అసోసియేషన్ ఊహించని షాకిచ్చింది. విజయ్ హజారే ట్రోఫీ 2024-25 మధ్యలోనే గోవా జట్టు నుంచి అర్జున్ టెండూల్కర్‌ను జీసీఎ తప్పించింది. దీంతో అతడు శనివారం ఉత్తరఖాండ్‌తో జరిగిన మ్యాచ్‌కు దూరమమయ్యాడు.25 ఏళ్ల అర్జున్ గోవా రెడ్ బాల్ జట్టులో రెగ్యూలర్ సభ్యునిగా కొనసాగుతున్నప్పటికి వైట్ బాట్ స్వ్కాడ్‌లో మాత్రం తన స్ధానాన్ని సుస్థిరం చేసుకోలేకపోతున్నాడు. కాగా అంతకుముందు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024లో కూడా కేవలం మూడు మ్యాచ్‌లు ఆడిన తర్వాత అతడిపై జీసీఎ వేటు వేసింది.మళ్లీ ఇప్పుడు విజయ్ హజారే ట్రోఫీలో సరిగ్గా మూడు మ్యాచ్‌లు ఆడిన తర్వాతే సెలక్టర్లు జట్టు నుంచి తప్పించారు. ఈ టోర్నీలో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన అర్జున్ కేవలం 5 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ఒడిశాతో జరిగిన తొలి మ్యాచ్‌లో అర్జున్ 3 వికెట్లు పడగొట్టినప్పటికి.. తన 10 ఓవర్ల కోటాలో ఏకంగా 61 పరుగులు సమర్పించుకున్నాడు.ఆతర్వాతి రెండు మ్యాచ్‌ల్లో చెరో వికెట్ సాధించినప్పటకి ఆరుకు పైగా ఏకానమీ రేటుతో పరుగులు ఇచ్చాడు. ఈ క్రమంలోనే అతడిపై గోవా క్రికెట్ ఆసోసియేషన్ వేటు వేసింది. దీంతో వైట్‌బాల్ క్రికెట్లో అర్జున్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.మరోసారి ముంబైతో..కాగా అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్లో మరోసారి ముంబై ఇండియన్స్ తరపున ఆడనున్నాడు. ఐపీఎల్-2025 మెగా వేలంలో రూ. 20 లక్షల కనీస ధరకు అర్జున్ను ముంబై సొంతం చేసుకుంది. ఈ మెగా వేలంలో అర్జున్ను తొలుత ఏ ఫ్రాంచైజీ పట్టించుకోలేదు.కానీ ఆఖరికి యాక్సిలరేటెడ్ రౌండ్లో ముంబై దక్కించుకుంది. జూనియర్ టెండూల్కర్ ఐపీఎల్-2021 సీజన్ నుంచి ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీలో భాగంగా ఉన్నాడు. అతడు 5 మ్యాచ్‌లలో 9.37 ఎకానమీ రేటుతో 3 వికెట్లు పడగొట్టాడు. అర్జున్ కనీసం ఈసారైనా రాణిస్తాడో లేదో వేచి చూడాలి.చదవండి: IND Vs AUS: స్టుపిడ్.. స్టుపిడ్! భారత డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లొద్దు: పంత్‌పై సన్నీ ఫైర్ -
సచిన్ కొడుకుకు ఏమైంది..? కనీసం ఒక్క మ్యాచ్‌లో కూడా
రంజీ ట్రోఫీ సీజన్ 2023-24లో సచిన్ టెండూల్కర్ తనయడు, గోవా ఆల్ ఆల్‌రౌండర్ అర్జున్ టెండూల్కర్ తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. తాజాగా తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లోనూ అర్జున్ పేలవ ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ అర్జున్ విఫలమయ్యాడు. బౌలింగ్‌లో కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేకపోయిన జూనియర్ టెండూల్కర్.. బ్యాటింగ్‌లో రెండు ఇన్నింగ్స్‌లు కలిపి కేవలం 9 పరుగులు మాత్రమే చేశాడు. ఓవరాల్‌గా ఈ ఏడాది సీజన్ రంజీ ట్రోఫీలో ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన అర్జున్ టెండూల్కర్.. 9 ఇన్నింగ్స్‌లలో 182 పరుగులు మాత్రమే చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో కేవలం రెండు హాఫ్ సెంచరీలు మాత్రమే ఉన్నాయి. అటు బౌలింగ్‌లోనూ అంతంతమాత్రమే. కేవలం బౌలింగ్‌లో నాలుగు వికెట్లు మాత్రమే తీసాడు. కాగా తన ఫస్ట్‌క్లాస్ కెరీర్‌ను ముంబై తరపున ఆరంభించిన అర్జున్.. ఇప్పుడు గోవాకు ప్రాతినిథ్యం వహించాడు. జట్టులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో ముంబై క్రికెట్ ఆసోషియేషన్ నుంచి ఎన్వోసీ తీసుకుని గోవా జట్టుతో చేరాడు. అక్కడ అవకాశాలు వచ్చిననప్పటికీ వాటిని సద్వినియోగ పరుచుకోవడంలో విఫలమవుతున్నాడు. తన ఫస్ట్‌క్లాస్ కెరీర్లో ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన అర్జున్ టెండూల్కర్.. 882 పరుగులతో పాటు 16 వికెట్లు పడగొట్టాడు. కాగా ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరపున అర్జున్ ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: AUS vs NZ: ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. డేవిడ్ వార్నర్‌కు ఛాన్స్ -
నిరాశపరిచిన సచిన్ కొడుకు.. 135 పరుగులకే ఆలౌట్
రంజీట్రోఫీ-2024 సీజన్‌ను సచిన్ టెండూల్కర్ తనయడు అర్జున్ టెండూల్కర్ పేలవంగా ఆరభించాడు. ఈ టోర్నీలో గోవాకు ప్రాతనిథ్యం వహిస్తున్న అర్జున్.. త్రిపురతో జరుగుతున్న మ్యాచ్‌లో తన మార్క్‌ను చూపించలేకపోయాడు. తొలుత బౌలింగ్‌లో రెండు వికెట్లు పడగొట్టనప్పటికీ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. అనంతరం బ్యాటింగ్‌లో కేవలం 11 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన అర్జున్ జట్టున ఆదుకోవడంలో విఫలమయ్యాడు. కాగా ఈ రంజీ సీజన్ ఆరంభానికి ముందు గతేడాది జరిగిన విజయ్ హాజారే ట్రోఫీలో అర్జున్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. 11 వికెట్లతో అర్జున్ అదరగొట్టాడు.దీంతో ఫస్ట్‌క్లాస్ క్రికెట్ టోర్నీ రంజీ ట్రోఫీలో కూడా అతడిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ తొలి మ్యాచ్‌లో మాత్రం అర్జున్ అంచనాలను అందుకోలేకపోయాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. గోవా తమ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 135 పరుగులకే కుప్పకూలింది. త్రిపుర బౌలింగ్‌లో ఏకే సర్కార్ 4 వికెట్లతో గోవా పతనాన్ని శాసించాడు. అతడితో పాటు మురా సింగ్, రానా దత్తా తలా 3 వికెట్లు సాధించారు. -
రాజకీయాల్లోకి మరో క్రికెటర్
పనాజీ: మరో క్రికెటర్ రాజకీయాల్లోకి వచ్చాడు. గోవా క్రికెటర్ షాదబ్ జకాటి గోవా ఫార్వర్డ్ (జీఎఫ్) పార్టీలో చేరాడు. ఈ ప్రాంతీయ పార్టీని గత జనవరిలో ఏర్పాటు చేశారు. 35 ఏళ్ల జకాటి గోవా జట్టు తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు. ఐపీఎల్లో గుజరాత్ లయన్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. గతంలో చెన్నయ్ సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల తరఫున ఆడాడు. ‘క్రికెట్ నా జీవితం. ఇప్పడు రాజకీయాల్లోకి చేరే సమయం వచ్చింది’ అని జకాటి అన్నాడు. గోవా ఫార్వర్డ్ పార్టీలో చేరుతున్న ప్రకటించాడు. అధికార బీజేపీని ఎదుర్కొనేందుకు జకాటీ సేవలను ఉపయోగించుకుంటామని జీఎఫ్ ప్రతినిధి దుర్గాదాస్ కామత్ చెప్పారు. ఏడాదిలోపు గోవా అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. మాజీ క్రికెటర్లు మహ్మద్ అజరుద్దీన్, నవ్‌జ్యోత్ సింగ్ సిద్దూ, కీర్తీ ఆజాద్ సహా పలువురు క్రీడాకారులు రాజకీయాల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే.