రాజకీయాల్లోకి మరో క్రికెటర్ | Goa cricketer Jakati joins politics | Sakshi
Sakshi News home page

రాజకీయాల్లోకి మరో క్రికెటర్

Published Sat, Jul 23 2016 4:29 PM | Last Updated on Mon, Sep 4 2017 5:54 AM

రాజకీయాల్లోకి మరో క్రికెటర్

రాజకీయాల్లోకి మరో క్రికెటర్

పనాజీ: మరో క్రికెటర్ రాజకీయాల్లోకి వచ్చాడు. గోవా క్రికెటర్ షాదబ్ జకాటి గోవా ఫార్వర్డ్ (జీఎఫ్) పార్టీలో చేరాడు. ఈ ప్రాంతీయ పార్టీని గత జనవరిలో ఏర్పాటు చేశారు. 35 ఏళ్ల జకాటి గోవా జట్టు తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు. ఐపీఎల్లో గుజరాత్ లయన్స్కు ప్రాతినిధ్యం వహించాడు. గతంలో చెన్నయ్ సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల తరఫున ఆడాడు.

‘క్రికెట్ నా జీవితం. ఇప్పడు రాజకీయాల్లోకి చేరే సమయం వచ్చింది’ అని జకాటి అన్నాడు. గోవా ఫార్వర్డ్ పార్టీలో చేరుతున్న ప్రకటించాడు. అధికార బీజేపీని ఎదుర్కొనేందుకు జకాటీ సేవలను ఉపయోగించుకుంటామని జీఎఫ్ ప్రతినిధి దుర్గాదాస్ కామత్ చెప్పారు. ఏడాదిలోపు గోవా అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. మాజీ క్రికెటర్లు మహ్మద్ అజరుద్దీన్, నవ్జ్యోత్ సింగ్ సిద్దూ, కీర్తీ ఆజాద్ సహా పలువురు క్రీడాకారులు రాజకీయాల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement