రంజీ ట్రోఫీ సీజన్ 2023-24లో సచిన్ టెండూల్కర్ తనయడు, గోవా ఆల్ ఆల్‌రౌండర్ అర్జున్ టెండూల్కర్ తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. తాజాగా తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లోనూ అర్జున్ పేలవ ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ అర్జున్ విఫలమయ్యాడు. బౌలింగ్‌లో కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేకపోయిన జూనియర్ టెండూల్కర్.. బ్యాటింగ్‌లో రెండు ఇన్నింగ్స్‌లు కలిపి కేవలం 9 పరుగులు మాత్రమే చేశాడు.
ఓవరాల్‌గా ఈ ఏడాది సీజన్ రంజీ ట్రోఫీలో ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన అర్జున్ టెండూల్కర్.. 9 ఇన్నింగ్స్‌లలో 182 పరుగులు మాత్రమే చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో కేవలం రెండు హాఫ్ సెంచరీలు మాత్రమే ఉన్నాయి. అటు బౌలింగ్‌లోనూ అంతంతమాత్రమే. కేవలం బౌలింగ్‌లో నాలుగు వికెట్లు మాత్రమే తీసాడు.
కాగా తన ఫస్ట్‌క్లాస్ కెరీర్‌ను ముంబై తరపున ఆరంభించిన అర్జున్.. ఇప్పుడు గోవాకు ప్రాతినిథ్యం వహించాడు. జట్టులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో ముంబై క్రికెట్ ఆసోషియేషన్ నుంచి ఎన్‌వోసీ తీసుకుని గోవా జట్టుతో చేరాడు. అక్కడ అవకాశాలు వచ్చిననప్పటికీ వాటిని సద్వినియోగ పరుచుకోవడంలో విఫలమవుతున్నాడు.
తన ఫస్ట్‌క్లాస్ కెరీర్‌లో ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన అర్జున్ టెండూల్కర్.. 882 పరుగులతో పాటు 16 వికెట్లు పడగొట్టాడు. కాగా ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరపున అర్జున్ ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.
చదవండి: AUS vs NZ: ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. డేవిడ్ వార్నర్‌కు ఛాన్స్
Comments
Please login to add a commentAdd a comment