రంజీట్రోఫీ-2024 సీజన్‌ను సచిన్ టెండూల్కర్ తనయడు అర్జున్ టెండూల్కర్ పేలవంగా ఆరభించాడు. ఈ టోర్నీలో గోవాకు ప్రాతనిథ్యం వహిస్తున్న అర్జున్.. త్రిపురతో జరుగుతున్న మ్యాచ్‌లో తన మార్క్‌ను చూపించలేకపోయాడు. తొలుత బౌలింగ్‌లో రెండు వికెట్లు పడగొట్టనప్పటికీ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు.
అనంతరం బ్యాటింగ్‌లో కేవలం 11 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన అర్జున్ జట్టున ఆదుకోవడంలో విఫలమయ్యాడు. కాగా ఈ రంజీ సీజన్ ఆరంభానికి ముందు గతేడాది జరిగిన విజయ్ హాజారే ట్రోఫీలో అర్జున్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. 11 వికెట్లతో అర్జున్ అదరగొట్టాడు.దీంతో ఫస్ట్‌క్లాస్ క్రికెట్ టోర్నీ రంజీ ట్రోఫీలో కూడా అతడిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
కానీ తొలి మ్యాచ్‌లో మాత్రం అర్జున్ అంచనాలను అందుకోలేకపోయాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. గోవా తమ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 135 పరుగులకే కుప్పకూలింది. త్రిపుర బౌలింగ్‌లో ఏకే సర్కార్ 4 వికెట్లతో గోవా పతనాన్ని శాసించాడు. అతడితో పాటు మురా సింగ్, రానా దత్తా తలా 3 వికెట్లు సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment