వెస్టిండీస్తో రెండో టెస్టులో భారత్ విజయం దిశగా దూసుకెళ్తోంది. రోహిత్ శర్మ (111 నాటౌట్), చటేశ్వర్ పుజారా (113) సెంచరీలతో చెలరేగడంతో భారత్ భారీ స్కోరు సాధించింది. ముంబైలో జరుగుతున్న ఈ మ్యాచ్లో రెండో రోజు శుక్రవారం భారత్ 495 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ లో 313 పరుగుల ఆధిక్యం నెలకొల్పింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన విండీస్ ఆట ముగిసేసరికి 43 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.