వాంఖడే స్టేడియంలో ఆడాలంటే సెంచరీలు, డబుల్ సెంచరీలు కూడా సరిపోవు. అసాధారణంగా ఆడితేనే అవకాశం దక్కుతుంది... 15 ఏళ్ల కుర్రాడిలో స్ఫూర్తి నింపేందుకు అతని కోచ్ చెప్పిన మాటలివి. అయితే దానిని అతను చాలా సీరియస్‌గా తీసుకున్నాడు. అంతే... వంద, రెండొందలు, మూడొందలు... అలవోకగా దాటేశాడు. బౌండరీలు, సిక్సర్లు వెల్లువెత్తాయి. ప్రత్యర్థి బౌలర్లు బంతి విసరడం తప్ప మరేమీ చేయలేకపోయారు. అదే జోరులో ఆరు వందలు కూడా దాటి ప్రపంచ రికార్డు కూడా కొట్టేశాక తొలి రోజు ముగిసింది.