చివరి మ్యాచ్ ఆడుతున్న క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ అవుటయ్యాడు. మాస్టర్ (74) డియోనరైన్ బౌలింగ్లో సామీకి క్యాచ్ ఇచ్చాడు. సచిన్ సెంచరీ చేస్తాడని ఆశించిన అభిమానులు నిరాశకు గురయ్యారు. ముంబై వాంఖడే స్టేడియంలో ఒక్కసారిగా నిశ్వబ్ద వాతావారణం నెలకొంది. అంతకుముందు సచిన్ అభిమానులకు పరుగుల కనువిందు చేశాడు. మ్యాచ్ రెండో రోజు శుక్రవారం ఉదయం హాఫ్ సెంచరీ చేసిన తర్వాత మాస్టర్ దూకుడు పెంచాడు. పూజారా కూడా హాఫ్ సెంచరీ చేశాడు. సచిన్ అవుటయ్యాక కోహ్లీ బ్యాటింగ్ కు దిగాడు. వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు భారత బౌలర్లు విజృంభించడంతో వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 182 పరుగులకే కుప్పకూలింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ తొలిరోజు తొలి ఇన్నింగ్స్‌లో 34 ఓవర్లలో 2 వికెట్లకు 157 పరుగులు చేసింది. పూజారా (66 బ్యాటింగ్), కోహ్లీ (9 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత్ స్కోరు 236/3. రెండో రోజు సచిన్ (38 బ్యాటింగ్), పుజారా (34 బ్యాటింగ్) వ్యక్తిగత ఓవర్ నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ కొనసాగించారు. మొదటి రెండు బంతుల్లో పరుగులేమీ రాకపోయినా.. తర్వాత వరుసగా రెండు బంతులను సచిన్ బౌండరీకి తరలించడంతో ప్రేక్షకుల్లో ఆనందోత్సాహాలు చెలరేగాయి. టినో బెస్ట్ వేసిన తొలి ఓవర్ ఐదో బంతికి సచిన్ దాదాపు ఔటైనంత పని జరిగినా.. తృటిలో ప్రమాదం తప్పింది. షార్ట్ లెంగ్త్ బాల్ను సచిన్ ఫ్లాష్ చేయడానికి ప్రయత్నించాడు గానీ అది కొద్దిలో తప్పిపోయింది. దీంతో ప్రేక్షకులంతా ఒక్కసారిగా కేకలు పెట్టారు. షిల్లింగ్ ఫోర్డ్ వేసిన రెండో ఓవర్ ఐదో బంతిని సచిన్ బౌండరీకి తరలించాడు. దీంతో మాస్టర్ హాఫ్ సెంచరీ పూర్తయింది. రెండో రోజు ఆట చూసేందుకు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ కూడా హాజరయ్యారు. ఎప్పుడూ కుర్తా పైజమాలో కనిపించే రాహుల్.. ఈ రోజు మాత్రం టీషర్టులో ఆహ్లాదంగా ఉన్నారు.
Published Fri, Nov 15 2013 11:27 AM | Last Updated on Thu, Mar 21 2024 6:35 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement