వాంఖడే స్టేడియంలో ఈరోజు భారత్, వెస్టిండీస్ల మధ్య జరగనున్న రెండో టెస్టు మ్యాచ్లో బారత్ టాస్ గెలిచింది. దాంతో ఫీల్డింగ్ ఎంచుకుంది. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ ఆ మ్యాచ్తో క్రికెట్ నుంచి రిటైర్ కాబోతున్నారు.ఈ నేపథ్యంలో సచిన్ చివరి మ్యాచ్ను వీక్షించ ఇప్పటికే క్రికెట్ దిగ్గజాలు, రాజకీయ నాయకులు, సినీతారలు, సచిన్ అభిమానులతో స్టేడియం కిక్కిరిసింది.
క్రికెట్ దిగ్గజం సచిన్కు ఘనంగా వీడ్కోలు పలికేందుకు ముంబై క్రికెట్ అసోసియేషన్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. క్రికెట్ ప్రపంచ చరిత్రలో ఇన్ని మ్యాచ్ లు ఆడిన వ్యక్తిగా సచిన్ రికార్డు బద్దలు కొట్టాడు. అలాగే క్రికెట్ సచిన్ చేసిన సేవలకు గుర్తుగా ఆయన అభిమానులు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.