
ముంబై: ప్రతిష్టాత్మక వాంఖెడె మైదానంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ విగ్రహం ఏర్పాటు కానుంది. బుధవారం జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఈ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. సచిన్ స్టాండ్ పక్కనే దీనిని ఏర్పాటు చేయనుండగా...ఆఫ్‌సైడ్‌లో షాట్ ఆడుతున్న చిత్రాన్ని ఈ విగ్రహం కోసం ఎంచుకున్నారు.
అహ్మదాబాద్‌కు చెందిన ప్రమోద్ కాంబ్లే దీనిని రూపొందించారు. స్వయంగా సచిన్‌తో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, బీసీసీఐ కార్యదర్శి జై షా తదితరులు దీనికి హాజరవుతారు. తన సొంత మైదానమైన ముంబై వాంఖెడె స్టేడియంలోనే 2011 వన్డే వరల్డ్ కప్ ట్రోఫీ అందుకున్న సచిన్... తన ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్‌ను ఇక్కడే నవంబర్ 16, 2013న ఆడాడు.
Comments
Please login to add a commentAdd a comment