
రోహిత్ శర్మకు షాకిచ్చిన మహిళా అభిమాని!(PC: X)
ఐపీఎల్-2024లో ఇంత వరకు బోణీ కొట్టని ఒకే ఒక జట్టు ముంబై ఇండియన్స్. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో మూడో ఓడి.. హ్యాట్రిక్ పరాజయాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది.
ఈ నేపథ్యంలో ఆదివారం నాటి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి తొలి విజయం అందుకోవాలని పట్టుదలగా ఉంది. సొంత మైదానం వాంఖడేలోనైనా సత్తా చాటాలని ఉవ్విళూర్లుతోంది.
మరోవైపు.. ఢిల్లీ క్యాపిటల్స్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. నాలుగు మ్యాచ్‌లలో కేవలం ఒక్కటి మాత్రమే గెలిచిన పంత్ సేనకు ముంబైతో పోరు కీలకంగా మారింది.
ఈ క్రమంలో ఇప్పటికే ఇరు జట్ల ఆటగాళ్లు ‘అస్త్రశస్త్రాల’తో సంసిద్ధులయ్యారు. ఇదిలా ఉంటే.. ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను చూసేందుకు అభిమానులు వాంఖడేకు పోటెత్తుతున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ఓ యువతి హిట్‌మ్యాన్‌ను కలిసేందుకు మైదానానికి వచ్చింది. మ్యాచ్‌కు ముందు సేద తీరుతున్న రోహిత్ దగ్గరకు పరిగెత్తుకు వెళ్లి.. అతడి పాదాలకు నమస్కరించింది.దీంతో రోహిత్ ఒక్కసారిగా షాకయ్యాడు.
A fan meets Rohit Sharma & touches his feet at the Wankhede stadium. 💥 pic.twitter.com/LsWwFUCbRg
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 6, 2024
కాస్త ఇబ్బందిపడుతూనే ఇలా చేయవద్దవంటూ వారించాడు. ఇక తన అభిమాన క్రికెటర్‌ను కలిసిన అనంతరం సదరు యువతి.. రోహిత్ ఫొటోపై అతడి ఆటోగ్రాఫ్ తీసుకుంది. ఆ తర్వాత ఫొటోలు కూడా దిగి ఫ్యాన్‌గర్ల్ మూమెంట్‌ను సెలబ్రేట్ చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
కాగా ఐపీఎల్-2024లో హార్దిక్ పాండ్యా సారథ్యంలో ముంబై ఇండియన్స్ ఆటగాడిగా బరిలోకి దిగుతున్నాడు రోహిత్ శర్మ. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో కలిపి కేవలం 69 పరుగులు మాత్రమే చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లోనైనా బ్యాట్ ఝులిపిస్తాడేమో చూడాలి!!
చదవండి: Virat Kohli: స్లో ఇన్నింగ్స్ అంటూ సెటైర్లు.. కోహ్లి స్పందన ఇదే
Comments
Please login to add a commentAdd a comment