'వాంఖెడే' నిషేధం బాధించడం లేదు: షారుక్
వాంఖెడే స్టేడియానికి దూరంగా ఉండి ఇంట్లోనే మ్యాచ్ లను వీక్షించడం ఆనందంగా ఉంది అని షారుక్ ఖాన్ అన్నారు. ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు యజమాని షారుక్ పై వాంఖెడే స్టేడియంలో ప్రవేశించకుండా ముంబై క్రికెట్ అసోసియేషన్స్ (ఎంసీఏ) ఐదేళ్ల నిషేధం విధించడం తెలిసిందే.
2012లో ముంబై ఇండియన్స్ పై నైట్ రైడర్స్ విజయం సాధించిన తర్వాత షారుక్ పిల్లలపై సెక్యూరిటీ సిబ్బంది దురుసుగా ప్రవర్తించడంతో షారుక్ అధికారులతో గొడవపడిన పడ్డారు. అయితే తన ప్రవర్తన బాగాలేదనే ఆరోపణల్ని షారుక్ ఖండించారు.
వాంఖెడే స్టేడియంలో ప్రవేశంపై నిషేధించడాన్ని తాను తీవ్రంగా పరిగణించడం లేదని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. 'లివింగ్ విత్ కేకేఆర్' డాక్యుమెంటరీ ప్రదర్శన సందర్భంగా షారుక్ మీడియాతో మాట్లాడారు.