Wankhede Stadium Seat-Which MS Dhoni 2011 World Cup Winning Six Lands - Sakshi
Sakshi News home page

MS Dhoni: క్రికెట్‌ చరిత్రలోనే తొలిసారి.. ధోనికి అరుదైన గౌరవం

Published Tue, Apr 4 2023 8:04 PM | Last Updated on Tue, Apr 4 2023 8:24 PM

Wankhede Stadium Seat-Which MS Dhoni 2011 World Cup Winning Six Lands - Sakshi

ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) టీమిండియా మాజీ క్రికెటర్‌ ఎంఎస్‌ ధోనికి అరుదైన గౌరవం ఇవ్వనుంది. వాంఖడే స్టేడియం వేదికగా 12 సంవత్సరాల క్రితం శ్రీలంకతో జరిగిన వన్డే ప్రపంచ కప్ ఫైనల్ స్మారకార్థం స్టాండ్స్‌లోని ఒక సీటుకు ధోని పేరు పెట్టాలని నిర్ణయించింది. 91 పరుగులు నాటౌట్‌గా నిలిచిన ధోని సిక్సర్‌తో విన్నింగ్‌ షాట్‌ కొట్టి 28 ఏళ్ల నిరీక్షణకు తెరదించాడు.

కాగా.. శ్రీలంకతో ఫైనల్‌లో ధోని కొట్టిన విన్నింగ్‌ సిక్స్‌ కొట్టి కోట్లాది భారతీయు కలను నిజం చేశాడు. నాడు ధోని కొట్టిన సిక్స్‌.. స్టేడియంలో ఓ సీటుపై పడింది. ఆ సీటుకు ఇప్పుడు ధోనీ పేరు పెట్టాలని ఎంసీఏ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ముంబై క్రికెట్‌ సంఘం (ఎంసీఏ) ప్రెసిడెంట్‌ అమోల్‌ ఖేల్‌ వెల్లడించారు.

వాంఖడే స్టేడియంలో కొన్ని స్టాండ్స్‌కు ఇప్పటికే సచిన్‌, గవాస్కర్‌, విజయ్ మర్చంట్‌ పేర్లు ఉన్నాయి. ప్రస్తుతం క్రికెట్‌ చరిత్రలోనే తొలిసారి వినూత్నంగా సీటుకు ధోని పేరు పెట్టనుండడం విశేషం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement