odi world cup 2011 final
-
WC 2011: ఊహించని షాకులు.. ఆ మధుర జ్ఞాపకాలు మరువగలమా?!
‘‘2011.. మేము ప్రపంచకప్ ఎత్తిన రోజు. ఆ చారిత్రాత్మక క్షణాన్ని గుర్తు చేసుకుంటే ఇప్పటికీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అద్భుతమైన జట్టుతో మరుపురాని జ్ఞాపకాలు’’.. ‘‘ఆ అద్భుత క్షణంలోకి మరొక్కసారి’’.. టీమిండియా వన్డే వరల్డ్‌కప్ గెలిచిన జట్టులో సభ్యులైన సురేశ్ రైనా, యువరాజ్ సింగ్ భావోద్వేగం.సరిగ్గా పదమూడేళ్ల క్రితం ఇదే రోజున.. ఇరవై ఎనిమిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ భారత క్రికెట్ జట్టు జగజ్జేతగా అవతరించింది. సొంత గడ్డపై ప్రఖ్యాత వాంఖడే మైదానంలో మువ్వన్నెల జెండాను రెపరెపలాడించింది ధోని సేన.క్రికెట్ దేవుడిగా పేరొందిన సచిన్ టెండుల్కర్ చిరకాల కలను నెరవేర్చి.. అపూర్వ విజయాన్ని అతడికి బహుమతిగా అందించింది. నాడు శ్రీలంకతో ఫైనల్ మ్యాచ్‌లో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సిక్స్ బాదగానే కోట్లాది మంది భారతీయుల హృదయాలు సంతోషంతో ఉప్పొంగిపోయాయి.వాంఖడేలో ఉన్న దాదాపు 33 వేల మంది మా తుజే సలాం అంటూ జట్టును ఉత్సాహపరిచారు. మైదానంలో ఉన్న ప్రేక్షకులతో పాటు యావత్ భారతావని ఆనందంతో పులకించిపోయింది. ఆ అపురూప క్షణాన్ని చెరగని జ్ఞాపకంగా గుండెల్లో పదిలపరచుకున్నారు అభిమానులు. వారిలో మీరూ ఒకరా?!.. మరి ఆనాటి మ్యాచ్ విశేషాలు మరోసారి గుర్తుచేసుకుందామా?శుభారంభం లభించినాముంబైలోని వాంఖడే స్టేడియం.. టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ కుమార్ సంగక్కర తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత పేసర్ జహీర్ ఖాన్ ఆరంభంలోనే ఓపెనర్ ఉపుల్ తరంగ(2)ను పెవిలియన్‌కు పంపాడు. అనంతరం హర్భజన్ సింగ్ మరో ఓపెనర్ తిలకరత్రె దిల్షాన్(33)ను అవుట్ చేయగా.. యువరాజ్ సింగ్.. కెప్టెన్ కుమార్ సంగక్కర(48) వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.వరుస వికెట్లు తీసిన టీమిండియా ఆనందాన్ని ఆవిరి చేస్తూ.. నాలుగో నంబర్ బ్యాటర్ మహేళ జయవర్ధనే అజేయ శతకం(103)తో విరుచుకుపడ్డాడు. అయితే, మిగతా వాళ్లలో మళ్లీ ఒక్కరు కూడా కనీసం 35 పరుగుల మార్కు అందుకోలేకపోయారు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 274 పరుగుల వద్ద శ్రీలంక ఇన్నింగ్స్ ముగిసింది.ఊహించని షాకులుఇక లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియాకు ఊహించని షాకిచ్చాడు లసిత్ మలింగ. ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(0)ను డకౌట్ చేశాడు. మైదానమంతా నిశ్శబ్దం. ఆ తర్వాత కాసేపటికే సచిన్ టెండుల్కర్(18) కూడా అవుట్!ఊపిరులూదిన గంభీర్ఆ సమయంలో నిలకడగా బ్యాటింగ్ చేస్తూ భారత శిబిరంతో పాటు అభిమానుల్లో ఉత్సాహం నింపాడు వన్‌డౌన్ బ్యాటర్ గౌతం గంభీర్. 122 బంతులు ఎదుర్కొని 97 పరుగులు సాధించాడు. సెంచరీకి మూడు పరుగుల దూరంలో నిలిచిపోయినా.. అంతకంటే విలువైన ఇన్నింగ్సే ఆడాడు.ధనాధన్ ధోనిమిగిలిన వాళ్లలో విరాట్ కోహ్లి 35 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. ధనాధన్ బ్యాటింగ్‌తో దంచికొట్టాడు కెప్టెన్ ధోని. యువరాజ్ సింగ్(21 నాటౌట్)తో కలిసి ఆఖరి వరకు అజేయంగా నిలిచి టీమిండియాను గెలిపించాడు. ఆ క్షణాన్ని మర్చిపోగలమా?ఇక నలభై తొమ్మిదవ ఓవర్ రెండో బంతికి అతడు కొట్టిన విన్నింగ్ సిక్స్ భారత క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ క్షణంగా నిలిచిపోతుందనడం అతిశయోక్తి కాదు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 79 బంతులు ఎదుర్కొన్న ధోని 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 91 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.ఆరు వికెట్ల తేడాతో శ్రీలంకపై జయభేరి మోగించిన భారత జట్టు రెండోసారి వన్డే వరల్డ్‌కప్ ట్రోఫీని ముద్దాడింది. దీంతో వాంఖడేతో పాటు దేశమంతటా సంబరాలు అంబరాన్నంటాయి.Probably the greatest ever night for any Indian fan which came under MS Dhoni's captaincy. The atmosphere and feeling were unmatched. pic.twitter.com/bzrIKRbsts— Mufaddal Vohra (@mufaddal_vohra) July 7, 2022చదవండి: IPL 2024: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. తొలి జట్టుగాReliving this feeling ❤️🇮🇳🏆#CWC2011 pic.twitter.com/zT9C0FSusg— Yuvraj Singh (@YUVSTRONG12) April 2, 2024 -
WC 2011: ఊహించని షాకులు.. ఆ మధుర జ్ఞాపకాలు మరువగలమా?!
‘‘2011.. మేము ప్రపంచకప్ ఎత్తిన రోజు. ఆ చారిత్రాత్మక క్షణాన్ని గుర్తు చేసుకుంటే ఇప్పటికీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అద్భుతమైన జట్టుతో మరుపురాని జ్ఞాపకాలు’’.. ‘‘ఆ అద్భుత క్షణంలోకి మరొక్కసారి’’.. టీమిండియా వన్డే వరల్డ్‌కప్ గెలిచిన జట్టులో సభ్యులైన సురేశ్ రైనా, యువరాజ్ సింగ్ భావోద్వేగం. సరిగ్గా పదమూడేళ్ల క్రితం ఇదే రోజున.. ఇరవై ఎనిమిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ భారత క్రికెట్ జట్టు జగజ్జేతగా అవతరించింది. సొంత గడ్డపై ప్రఖ్యాత వాంఖడే మైదానంలో మువ్వన్నెల జెండాను రెపరెపలాడించింది ధోని సేన. క్రికెట్ దేవుడిగా పేరొందిన సచిన్ టెండుల్కర్ చిరకాల కలను నెరవేర్చి.. అపూర్వ విజయాన్ని అతడికి బహుమతిగా అందించింది. నాడు శ్రీలంకతో ఫైనల్ మ్యాచ్‌లో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సిక్స్ బాదగానే కోట్లాది మంది భారతీయుల హృదయాలు సంతోషంతో ఉప్పొంగిపోయాయి. వాంఖడేలో ఉన్న దాదాపు 33 వేల మంది మా తుజే సలాం అంటూ జట్టును ఉత్సాహపరిచారు. మైదానంలో ఉన్న ప్రేక్షకులతో పాటు యావత్ భారతావని ఆనందంతో పులకించిపోయింది. ఆ అపురూప క్షణాన్ని చెరగని జ్ఞాపకంగా గుండెల్లో పదిలపరచుకున్నారు అభిమానులు. వారిలో మీరూ ఒకరా?!.. మరి ఆనాటి మ్యాచ్ విశేషాలు మరోసారి గుర్తుచేసుకుందామా? శుభారంభం లభించినా ముంబైలోని వాంఖడే స్టేడియం.. టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ కుమార్ సంగక్కర తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత పేసర్ జహీర్ ఖాన్ ఆరంభంలోనే ఓపెనర్ ఉపుల్ తరంగ(2)ను పెవిలియన్‌కు పంపాడు. అనంతరం హర్భజన్ సింగ్ మరో ఓపెనర్ తిలకరత్రె దిల్షాన్(33)ను అవుట్ చేయగా.. యువరాజ్ సింగ్.. కెప్టెన్ కుమార్ సంగక్కర(48) వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. వరుస వికెట్లు తీసిన టీమిండియా ఆనందాన్ని ఆవిరి చేస్తూ.. నాలుగో నంబర్ బ్యాటర్ మహేళ జయవర్ధనే అజేయ శతకం(103)తో విరుచుకుపడ్డాడు. అయితే, మిగతా వాళ్లలో మళ్లీ ఒక్కరు కూడా కనీసం 35 పరుగుల మార్కు అందుకోలేకపోయారు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 274 పరుగుల వద్ద శ్రీలంక ఇన్నింగ్స్ ముగిసింది. ఊహించని షాకులు ఇక లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియాకు ఊహించని షాకిచ్చాడు లసిత్ మలింగ. ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(0)ను డకౌట్ చేశాడు. మైదానమంతా నిశ్శబ్దం. ఆ తర్వాత కాసేపటికే సచిన్ టెండుల్కర్(18) కూడా అవుట్! ఊపిరులూదిన గంభీర్ ఆ సమయంలో నిలకడగా బ్యాటింగ్ చేస్తూ భారత శిబిరంతో పాటు అభిమానుల్లో ఉత్సాహం నింపాడు వన్‌డౌన్ బ్యాటర్ గౌతం గంభీర్. 122 బంతులు ఎదుర్కొని 97 పరుగులు సాధించాడు. సెంచరీకి మూడు పరుగుల దూరంలో నిలిచిపోయినా.. అంతకంటే విలువైన ఇన్నింగ్సే ఆడాడు. ధనాధన్ ధోని మిగిలిన వాళ్లలో విరాట్ కోహ్లి 35 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. ధనాధన్ బ్యాటింగ్‌తో దంచికొట్టాడు కెప్టెన్ ధోని. యువరాజ్ సింగ్(21 నాటౌట్)తో కలిసి ఆఖరి వరకు అజేయంగా నిలిచి టీమిండియాను గెలిపించాడు. ఆ క్షణాన్ని మర్చిపోగలమా? ఇక నలభై తొమ్మిదవ ఓవర్ రెండో బంతికి అతడు కొట్టిన విన్నింగ్ సిక్స్ భారత క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ క్షణంగా నిలిచిపోతుందనడం అతిశయోక్తి కాదు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 79 బంతులు ఎదుర్కొన్న ధోని 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 91 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఆరు వికెట్ల తేడాతో శ్రీలంకపై జయభేరి మోగించిన భారత జట్టు రెండోసారి వన్డే వరల్డ్‌కప్ ట్రోఫీని ముద్దాడింది. దీంతో వాంఖడేతో పాటు దేశమంతటా సంబరాలు అంబరాన్నంటాయి. Probably the greatest ever night for any Indian fan which came under MS Dhoni's captaincy. The atmosphere and feeling were unmatched. pic.twitter.com/bzrIKRbsts — Mufaddal Vohra (@mufaddal_vohra) July 7, 2022 చదవండి: IPL 2024: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. తొలి జట్టుగా Reliving this feeling ❤️🇮🇳🏆#CWC2011 pic.twitter.com/zT9C0FSusg — Yuvraj Singh (@YUVSTRONG12) April 2, 2024 -
ప్రపంచకప్‌లో ధోని విన్నింగ్ సిక్సర్! అత్యంత ఖరీదు.. ధర తెలిస్తే షాక్!
MS Dhoni- World’s most expensive cricket bat: ‘‘ధోని తనదైన స్టైల్లో ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు.. అద్భుతమైన షాట్! 28 ఏళ్ల తర్వాత ఇండియా మరోసారి వరల్డ్‌కప్ ట్రోఫీని గెలిచింది’’... మహేంద్ర సింగ్ ధోని సిక్సర్‌తో భారత్ రెండోసారి ప్రపంచకప్ విజేతగా నిలిచిన సందర్భంగా కామెంటేటర్ రవిశాస్త్రి అన్న మాటలు. 2011లో ముంబైలోని వాంఖడేలో శ్రీలంకతో నరాలు తెగే ఉత్కంఠ రేపిన ఫైనల్ మ్యాచ్‌లో ధోని సిక్స్ బాది జట్టును విజయతీరాలకు చేర్చాడు. లంక పేసర్ నువాన్ కులశేఖరకు పీడకలను మిగిల్చి అద్బుత షాట్‌తో.. సొంతగడ్డపై భారత్ జగజ్జేగతగా నిలిచిన సందర్భాన్ని మరింత ప్రత్యేకంగా మార్చుకున్నాడు. ధోని అలా గాల్లోకి బంతి లేపగానే ఊపిరిబిగపట్టుకుని చూసిన అభిమానులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. దాదాపు మూడు దశాబ్దాల నిరీక్షణకు తెరదించిన తలాను ఆకాశానికెత్తుతూ కరతాళధ్వనులతో స్టేడియాన్ని హోరెత్తించారు. ధోని బ్యాట్ ప్రపంచ రికార్డు ఇక ఈ గెలుపుతో కపిల్ దేవ్ తర్వాత భారత్‌కు ఐసీసీ టైటిల్ అందించిన రెండో కెప్టెన్‌గా ధోని చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. మరి.. విన్నింగ్ సిక్సర్ కొట్టిన ధోని బ్యాట్ కూడా గిన్నిస్ ప్రపంచ రికార్డుల్లోకెక్కిందన్న సంగతి తెలుసా?! వరల్డ్‌కప్-2011 నాటి ఫైనల్ మ్యాచ్‌లో ధోని రీబక్ లేబుల్‌తో ఉన్న బ్యాట్‌ను వాడాడు. దీనిని లండన్‌లోని చారిటీ ఈవెంట్లో వేలం వేయగా ఏకంగా 83 లక్షల రూపాలయకు అమ్ముడుపోయింది. ఆర్కే గ్లోబల్ షేర్స్ అండ్ సెక్యూరిటీస్ లిమిటెడ్(ఇండియా) ఈ బ్యాట్‌ను భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. ఆ డబ్బు దేనికోసం వాడారంటే తద్వారా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బ్యాట్‌గా ధోని వాడిన బ్యాట్ చరిత్రకెక్కింది. ఇక ఇదిలా ఉంటే.. అదే ఏడాది జూలై 18న ఆర్కే గ్లోబల్ షేర్స్ కంపెనీ ధోనితో ఈస్ట్ మీట్స్ వెస్ట్ చారిటీ డిన్నర్‌ను నిర్వహించింది. బ్యాట్‌ను వేలం వేయడం ద్వారా వచ్చిన డబ్బును ధోని సతీమణి పేరిట నిర్వహిస్తున్న సాక్షి ఫౌండేషన్ కోసం వాడినట్లు సమాచారం. ఇప్పుడు రోహిత్ వంతు ఇక.. ఇప్పుడు పుష్కరకాలం తర్వాత మరోసారి భారత గడ్డపై వన్డే వరల్డ్‌కప్ ఈవెంట్ జరుగనుంది. ఈ నేపథ్యంలో ధోని మాదిరే.. ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ ఐసీసీ ట్రోఫీ గెలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. భారత్ మరోసారి ప్రపంచ విజేతగా నిలవాలని ఆకాంక్షిస్తున్నారు. ధోని అద్భుత ఇన్నింగ్స్(91- నాటౌట్) గుర్తు చేసుకుంటూ వీడియోలతో సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విన్నింగ్ సిక్సర్ బ్యాట్ గురించి కూడా అభిమానుల్లో చర్చ నడుస్తోంది. చదవండి: రవీంద్ర జడేజాకే అత్యధిక సార్లు! రోహిత్, కోహ్లిలకు మాత్రం.. షాకింగ్ రిపోర్టు! "Dhoni finishes off in style!" 🇮🇳🏆 Happy birthday to the man who hit the winning runs in the 2011 @cricketworldcup final, @msdhoni! pic.twitter.com/X0s7Jo7cWp — ICC Cricket World Cup (@cricketworldcup) July 7, 2018 -
కోహ్లి లేకుంటే జట్టులోకి వచ్చేవాడినే కాదు.. ధోని నా కళ్లు తెరిపించాడు: యువీ
Yuvraj Singh: టీమిండియా స్టార్ యువరాజ్ సింగ్ పలు చిరస్మరణీయ విజయాల్లో భాగమయ్యాడు. అండర్-19 వరల్డ్‌కప్ మొదలు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ, టీ20 ప్రపంచకప్-2007, వన్డే వరల్డ్‌కప్-2011 టోర్నీల్లో భారత్ గెలుపులో తన వంతు పాత్ర పోషించాడు. ముఖ్యంగా 2007లో ఒకే ఓవర్లో యువీ ఆరు సిక్సర్లు బాదిన ఫీట్‌ను క్రికెట్ అభిమానులు అంత తేలికగా మర్చిపోలేరు. భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ ఈవెంట్లోనూ యువీ తన అద్భుత ఆట తీరుతో అభిమానులకు వినోదం పంచాడు. అంతా సవ్యంగా సాగుతోందనుకున్న సమయంలో క్యాన్సర్ రూపంలో యువీ కెరీర్‌కు బ్రేక్ పడింది. మహమ్మారి బారిన పడినప్పటికీ ఆత్మవిశ్వాసం సడలనివ్వని యువరాజ్.. క్రమక్రమంగా కోలుకున్నాడు. అంతేకాదు 2017లో టీమిండియా తరఫున రీ ఎంట్రీ ఇచ్చాడు. అప్పటికి విరాట్ కోహ్లి కెప్టెన్‌గా ఉన్నాడు. ఇదిలా ఉంటే.. 2019 వరల్డ్‌కప్‌లో ఆడాలని యువీ భావించినప్పటికీ సెలక్టర్లు అతడికి మొండిచేయి చూపారు. ఈ నేపథ్యంలో అదే ఏడాది జూన్ 10న యువరాజ్ అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. ఈ విషయాల గురించి గతంలో న్యూస్18 ఇంటర్వ్యూలో మాట్లాడిన యువీ పంచుకున్న ఆసక్తికర విషయాలను నెటిజన్లు తాజాగా తెరమీదకు తెచ్చారు. నాటి విషయాలు యువీ పంచుకుంటూ.. పునరాగమనంలో కోహ్లి తనకు పూర్తి మద్దతుగా నిలిచాడని.. అదే విధంగా మహేంద్ర సింగ్ ధోనితో తన అనుబంధం ఎలా ఉండేదో వివరించాడు. ఈ మేరకు.. ‘‘నేను తిరిగి జట్టులోకి వచ్చినపుడు విరాట్ కోహ్లి నాకు అండగా నిలబడ్డాడు. ఒకవేళ తన సహకారమే గనుక లేకుండా నేనసలు జట్టులోకి వచ్చేవాడినే కాదు. అదే సమయంలో ధోని నాకు వాస్తవాలేమిటో కళ్లకు కట్టినట్లు చూపాడు. 2019 ప్రపంచకప్ జట్టు ఎంపిక సమయంలో సెలక్టర్లు నా పేరును పరిశీలించడం లేదన్న నిజాన్ని ధోని నాకు చెప్పాడు’’ అని యువరాజ్ సింగ్ పేర్కొన్నాడు. నువ్వే నా ప్రధాన ప్లేయర్‌వి.. గుర్తుపెట్టుకో 2011 ప్రపంచకప్ టోర్నీ నాటి పరిస్థితుల గురించి చెబుతూ.. ‘‘ధోనికి నాపై నమ్మకం ఎక్కువ. ప్రతిసారి.. ‘‘నువ్వే నా ప్రధాన ప్లేయర్‌వి.. గుర్తుపెట్టుకో’’ అని చెప్పేవాడు. కానీ 2015 ప్రపంచకప్ నాటికి పరిస్థితులు మారిపోయాయి. కానీ అప్పుడు మాత్రం నేను ఎవరినీ వేలెత్తిచూపాలని అనుకోవడం లేదు. కెప్టెన్‌గా ఒక్కోసారి కఠిన నిర్ణయాలు తీసుకోకతప్పదు. సారథిగా ఉన్నపుడు జట్టు ప్రదర్శన మొత్తానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతిసారి తమను తాము సమర్థించుకునే అవకాశం ఉండదు’’ అని యువీ నర్మగర్భ వ్యాఖ్యలు చేశాడు. కాగా ధోని వల్లే తన కుమారుడి కెరీర్ నాశనమైందంటూ యువీ తండ్రి యోగ్రాజ్ గతంలో ఆరోపించిన విషయం తెలిసిందే. తాను ధోని ఆటకు అభిమానినే అయినా.. తన కుమారుడి విషయంలో అతడు చేసిన పని ఆమోదయోగ్యనీయం కాదంటూ మండిపడ్డాడు. చదవండి: ధోని నమ్మకం నిలబెట్టిన ప్రపంచకప్ విజేత, 2 సార్లు ఐపీఎల్ ‘విన్నర్’.. ఇప్పుడు పోలీస్ లెజండరీ ఓపెనర్ దిల్షాన్.. డీకే మాదిరే! ఉపుల్ తరంగతో భార్య ‘బంధం’.. అతడినే పెళ్లాడి! -
2011 ప్రపంచకప్ ఫైనల్ ఆడాడు.. ధోని సహచర ఆటగాడు! బస్ డ్రైవర్‌గా.. ఒక్కడే కాదు!
జీవితం ఎప్పుడు, ఎలాంటి మలుపులు తిరుగుతుందో ఊహించడం కష్టం. బండ్లు ఓడలు.. ఓడలు బండ్లు కావొచ్చు. శ్రీలంక మాజీ క్రికెటర్ సూరజ్ రాందీవ్కు ఈ మాటలు సరిగ్గా సరిపోతాయి. ఒకప్పుడు జాతీయ జట్టులో రెగ్యులర్ మెంబర్‌గా ఉన్న అతడు.. ఇప్పుడు బస్ డ్రైవర్‌గా మారాడు. ప్రపంచకప్ టోర్నీలో ఆడిన ఈ స్పిన్నర్.. ఇప్పుడు ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చే వృత్తిలో కొనసాగుతున్నాడు. కుడిచేతి వాటం గల స్పిన్ బౌలర్ అయిన సూరజ్.. 1985, జనవరి 30న శ్రీలంకలో జన్మించాడు. 2009లో శ్రీలంక తరపున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. టీమిండియాతో మ్యాచ్‌తో అరంగేట్రం టీమిండియాతో భారత్‌లో జరిగిన వన్డేతో సూరజ్ అరంగేట్రం చేశాడు. ఆ మరుసటి ఏడాది టెస్టుల్లో, టీ20 ఫార్మాట్లో ఎంట్రీ ఇచ్చాడు. భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్‌కప్-2011 ఆడిన లంక జట్టులో అతడు సభ్యుడు. టీమిండియాతో ఫైనల్లో సూరజ్ రాందీవ్ 9 ఓవర్లు బౌలింగ్ చేసి 43 పరుగులు మాత్రమే ఇచ్చాడు. మెరుగైన ఎకానమీతో బౌలింగ్ చేశాడు. సీఎస్కే తరఫున ఆడిన సూరజ్ ఇక తన కెరీర్లో మొత్తంగా 12 టెస్టులు, 31 వన్డేలు, 7 టీ20 మ్యాచ్‌లు ఆడిన సూరజ్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోనూ పాల్గొన్నాడు. మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్(2011)కు ప్రాతినిథ్యం వహించిన అతడు.. మొత్తం 8 మ్యాచ్‌లు ఆడాడు. అంతర్జాతీయ కెరీర్లో టెస్టుల్లో 43, వన్డేల్లో 36, టీ20లలో 7 వికెట్లు తీసిన ఈ రైట్ ఆర్మ్ స్పిన్నర్.. ఐపీఎల్లో 6 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. 2016లో చివరి అంతర్జాతీయ(వన్డే) మ్యాచ్ ఆడిన సూరజ్ రాందీవ్.. ఆ తర్వాత ఆస్ట్రేలియాకు మకాం మార్చాడు. మరో ఇద్దరు క్రికెటర్లు కూడా ఇంటర్నేషనల్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అతడు.. మెల్బోర్న్లోని లోకల్ క్లబ్ ఆటగాడిగా కొనసాగాడు. ఈ క్రమంలో బస్ డ్రైవర్‌గా అవతారమెత్తిన సూరజ్ ట్రాన్స్‌డెవ్ అనే కంపెనీ ఉద్యోగిగా మారాడు. దాదాపు వెయ్యి మందికి ఉపాధి కల్పిస్తున్న ఈ కంపెనీలో సూరజ్‌తో మరో ఇద్దరు క్రికెటర్లు కూడా డ్రైవర్లుగా పనిచేస్తుండటం మరో విశేషం. ఆటను మరువలేదు శ్రీలంక మాజీ ఆటగాడు చింతక జయసింఘే, జింబాబ్వే క్రికెటర్ వాడింగ్టన్ మ్వేంగా కూడా ఇక్కడే డ్రైవర్లుగా ఉన్నారు. ఇదిలా ఉంటే.. డ్రైవర్‌గా మారినప్పటికీ సూరజ్ రాందీవ్.. ఆటను మరువలేదు. ఈ ఏడాది టీతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ నేపథ్యంలో టెస్టు సిరీస్‌కు సన్నద్ధమయ్యే క్రమంలో క్రికెట్ ఆస్ట్రేలియా సూరజ్ సేవలను వినియోగించుకున్నట్లు సమాచారం. ఆసీస్ బ్యాటర్లకు నెట్స్‌లో బౌలింగ్ చేసేందుకు ఈ స్పిన్నర్‌ను పిలిపించినట్లు వార్తలు వచ్చాయి. ఇక సూరజ్ కథను నెటిజన్లు తాజాగా ప్రస్తావిస్తూ మీమ్స్‌తో హల్చల్ చేస్తున్నారు. చదవండి: మీరు వెనక్కి తగ్గకండి.. ముందు భారత జట్టు పాక్‌కు రాని! ఆ తర్వాతే ఏదైనా -
సచిన్ నన్ను బ్యాట్‌తో కొట్టాడు.. పిచ్చివాడిని చేస్తావా అంటూ ఫైర్ అయ్యాడు: సెహ్వాగ్
వీరేంద్ర సెహ్వాగ్.. భారత క్రికెట్ చరిత్రలో తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడు. ఒక యువ క్రికెటర్‌గా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌ను ఆదర్శంగా తీసుకుని భారత జట్టులో అడుగుపెట్టిన సెహ్వాగ్.. తన ఆరాధ్య దైవంతోనే ఓపెనింగ్ స్థానాన్ని పంచుకున్నాడు. మాస్టర్ బ్లాస్టర్‌తో కలిసి భారత జట్టుకు ఎన్నో అద్భుతమైన విజయాలను వీరేంద్రుడు అందించాడు. సొంత గడ్డపై 2011 వన్డే ప్రపంచకప్‌ను టీమిండియా సొంతం చేసుకోవడంలో వీరిద్దరూ కీలక పాత్ర పోషించారు. కాగా వీరూ, సచిన్ ఫీల్డ్‌లోనే కాకుండా బయట కూడా మంచి స్నేహితులు. ఈ విషయం చాలా సందర్భాల్లో రుజువైంది. అయితే 2011 వన్డే ప్రపంచకప్ సందర్భంగా సచిన్‌తో జరిగిన ఓ ఫన్నీ సంఘటనను సెహ్వాగ్ స్టార్‌స్పోర్ట్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. కాగా సెహ్వాగ్‌కు బ్యాటింగ్ చేసేటప్పుడు పాటలు పాడే అలవాటు ఉందని మనందరికీ తెలుసు. అతడు తన రిథమ్‌ను పొందడానికి బ్యాటింగ్ చేసేటప్పుడు పాటలు పాడుతూ ఉంటాడు. అయితే 2011 వన్డే ప్రపంచకప్‌లో తన అలవాటు సచిన్‌కు చిరాకు తెప్పించిందని సెహ్వాగ్ తెలిపాడు. అంతేకాకుండా మాస్టర్ బ్యాట్‌తో తనను సరదగా కొట్టాడని సెహ్వాగ్ చెప్పాడు. "మేము 2011 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాతో ఆడుతున్నాం. నేను బ్యాటింగ్ చేస్తూ పాటలు పాడుతున్నాను. ఈ సమయంలో సచిన్ కూడా మంచి టచ్‌లో బ్యాటింగ్ చేస్తున్నాడు. మాస్టర్‌కు ఓవర్ల మధ్య మాట్లాడే అలవాటు ఉంది, కానీ నేను అస్సలు మాట్లాడను. నేను ఏకాగ్రత పొందేందుకు పాటలు పాడుతుంటాను. అలా తొలి మూడు ఓవర్ల పాటు జరిగింది. నాలుగో ఓవర్ తర్వాత సచిన్ వెనుక నుండి వచ్చి నన్ను బ్యాట్‌తో కొట్టాడు. సచిన్ నా దగ్గరకు వచ్చి నీవు అలా కిషోర్ కుమార్లా పాటలు పాడుతూ ఉంటే నేను పిచ్చివాడిని అవుతాను అంటూ అన్నాడు" అంటూ సెహ్వాగ్ స్టార్‌స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. కాగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో వీరిద్దరూ తొలి వికెట్‌కు 142 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. సెహ్వాగ్(73) పరుగులు చేయగా.. సచిన్(111) సెంచరీతో చెలరేగాడు. అయితే ఈ మ్యాచ్‌లో భారత్ అనూహ్యంగా ప్రోటీస్ జట్టు చేతిలో ఓటమిపాలైంది. చదవండి: IPL 2023: ఓటమి బాధలో ఉన్న చెన్నైకి బిగ్ షాక్! ధోనికి గాయం.. -
క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. ధోనికి అరుదైన గౌరవం
ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) టీమిండియా మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోనికి అరుదైన గౌరవం ఇవ్వనుంది. వాంఖడే స్టేడియం వేదికగా 12 సంవత్సరాల క్రితం శ్రీలంకతో జరిగిన వన్డే ప్రపంచ కప్ ఫైనల్ స్మారకార్థం స్టాండ్స్‌లోని ఒక సీటుకు ధోని పేరు పెట్టాలని నిర్ణయించింది. 91 పరుగులు నాటౌట్‌గా నిలిచిన ధోని సిక్సర్‌తో విన్నింగ్ షాట్ కొట్టి 28 ఏళ్ల నిరీక్షణకు తెరదించాడు. కాగా.. శ్రీలంకతో ఫైనల్లో ధోని కొట్టిన విన్నింగ్ సిక్స్ కొట్టి కోట్లాది భారతీయు కలను నిజం చేశాడు. నాడు ధోని కొట్టిన సిక్స్.. స్టేడియంలో ఓ సీటుపై పడింది. ఆ సీటుకు ఇప్పుడు ధోనీ పేరు పెట్టాలని ఎంసీఏ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) ప్రెసిడెంట్ అమోల్ ఖేల్ వెల్లడించారు. వాంఖడే స్టేడియంలో కొన్ని స్టాండ్స్‌కు ఇప్పటికే సచిన్, గవాస్కర్, విజయ్ మర్చంట్ పేర్లు ఉన్నాయి. ప్రస్తుతం క్రికెట్ చరిత్రలోనే తొలిసారి వినూత్నంగా సీటుకు ధోని పేరు పెట్టనుండడం విశేషం. -
ఇవాళ్టికి పుష్కరకాలం.. మరి ఈసారి కప్ కొట్టేనా?
టీమిండియా 2011 వన్డే వరల్డ్‌కప్ గెలిచి ఇవాళ్టికి(ఏప్రిల్ 2, 2011) 12 ఏళ్లు పూర్తయింది. సొంతగడ్డపై జరిగిన ఈ వన్డే వరల్డ్‌కప్‌లో ధోని సారధ్యంలోని టీమిండియా 28 ఏళ్ల తర్వాత ప్రపంచకప్ సాధించి మువ్వన్నెల జెండాను రెపరెపలాడించింది. ''ధోనీ.. ఫినిషెస్ ఆఫ్ ఇన్ స్టైల్.. ఇట్స్ మెగ్నిఫిషెంట్ స్ట్రైక్ ఇంటూ ది క్రౌడ్. ఇండియా లిఫ్ట్ ది వరల్డ్ కప్ ఆఫ్టర్ 28 ఈయర్స్...'' అంటూ కామెంట్రీ బాక్స్ లో రవిశాస్త్రి పలికిన ఆ నాలుగు ముక్కలు నాలుగు కాలాల పాటు అభిమానుల గుండెల్లో నిలిచిపోయాయి. ఐదు కాదు పది కాదు.. ఏకంగా 28 ఏండ్ల ఐసీసీ ప్రపంచకప్ ట్రోఫీ కరువును తీరుస్తూ ముంబైలోని ప్రఖ్యాత వాంఖెడే స్టేడియంలో ధోని సేన సృష్టించిన చరిత్రకు నేటికి పుష్కర కాలం. 2011, ఏప్రిల్ 02 రాత్రి వాంఖెడే హోరెత్తి దేశాన్ని ఊపేసిన ఆ అపురూప క్షణాలకు అప్పుడే 12 ఏండ్లు గడిచాయి. అయితే సరిగ్గా పుష్కరకాలం తర్వాత ఈ ఏడాది అక్టోబర్‌లో మన భారత్‌లో వన్డే వరల్డ్‌కప్ జరగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మరోసారి ఆ ఫీట్‌ను పునరావృతం చేస్తుందా అన్నది చూడాలి. 1983లో కపిల్ డెవిల్స్ భారత్ కు తొలి ఐసీసీ వన్డే వరల్డ్ కప్ అందించిన తర్వాత సుదీర్ఘకాలం టీమిండియాకు ప్రపంచకప్ అందని ద్రాక్షే అయింది. సచిన్, అజారుద్దీన్, గంగూలీ, ద్రావిడ్ వంటి మహామహుల వల్ల కాని అసాధ్యాన్ని ధోని సేన సుసాధ్యం చేసిన ఆ క్షణాలు భారత క్రికెట్ లో ఎప్పటికీ మధురమే. స్వదేశంలో జరిగిన ఈ వన్డే వరల్డ్ కప్ లో భారత్ తో పాటు శ్రీలంక కూడా ఫైనల్ చేరాయి. ఫైనల్ లో ఇలా.. క్వార్టర్స్ లో ఆస్ట్రేలియాను, సెమీస్ లో పాకిస్తాన్ ను ఓడించి ఫైనల్ కు చేరిన టీమిండియా.. ఫైనల్ లో లంకతో తలపడింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. ఆ జట్టులో మహేళ జయవర్దెనే (103) సెంచరీ చేయగా తిలకర్నతే దిల్షాన్ (48), నువాన్ కులశేఖర (32) రాణించారు. 275 పరుగుల లక్ష్యంలో భారత జట్టు.. 31కే ఓపెనర్లిద్దరి వికెట్లనూ కోల్పోయింది. వీరేంద్ర సెహ్వాగ్ డకౌట్ అవగా టోర్నీ ఆసాంతం రాణించిన సచిన్ టెండూల్కర్ (18) కూడా విఫలమయ్యాడు. అప్పుడే కొత్తగా టీమ్ లోకి వస్తున్న విరాట్ కోహ్లీ (35) తో కలిసి గౌతం గంభీర్ (97) భారత ఇన్నింగ్స్ ను కుదుటపరిచాడు. ఈ ఇద్దరూ మూడో వికెట్ కు 83 పరుగులు జోడించారు. కానీ కోహ్లీని దిల్షాన్ ఔట్ చేశాడు. ధోని మ్యాజిక్ కోహ్లీ నిష్క్రమణ తర్వాత వాస్తవానికి ఐదో స్థానంలో యువరాజ్ సింగ్ బ్యాటింగ్ కు రావాలి. కానీ సారథి ధోని.. క్రీజులోకి వచ్చాడు. గంభీర్ తో కలిసి ఒక్కో పరుగు కూడదీసుకుంటూ భారత్ ను విజయం వైపునకు నడిపించాడు. గంభీర్ - ధోనిలు నాలుగో వికెట్ కు 109 పరుగులు జోడించారు. గంభీర్ ను పెరీరా ఔట్ చేసినా అప్పటికే భారత విజయానికి చేరువలో ఉంది. చివర్లో యువరాజ్ (21 నాటౌట్) తో కలిసి ధోని.. 91 పరుగులతో నాటౌట్ గా నిలవడమే గాక భారత్ కు వన్డే వరల్డ్ కప్ అందించాడు. ఈ ఏడాదైనా.. 2011 తర్వాత భారత్ మళ్లీ వన్డే వరల్డ్ కప్ గెలవలేదు. వన్డేలే కాదు టీ20లలో కూడా భారత్ కు నిరాశే ఎదురవుతున్నది. 2013లో ఇంగ్లాండ్ లో నిర్వహించిన ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత భారత్.. ఐసీసీ ట్రోఫీలలో విఫలమవుతూనే ఉన్నది. ఈ ఏడాది భారత్ కు ఐసీసీ ట్రోఫీగా నిలవడానికి రెండు ఛాన్స్ లు ఉన్నాయి. 2023 జూన్ లో ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఉంది. ఇప్పటికే ఫైనల్ చేరిన భారత జట్టు.. ఆస్ట్రేలియాతో తలపడనుంది. అంతేగాక ఈ ఏడాది అక్టోబర్ లో స్వదేశంలోనే వన్డే వరల్డ్ కప్ జరుగనుంది. మరి ఈ రెండింటిలో టీమిండియా ప్రదర్శన ఎలా ఉండనుందో..? -
మెస్సీ, సచిన్.. నమ్మశక్యం కాని రీతిలో ఒకేలా..!
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ గ్రేట్ లియోనల్ మెస్సీ వరల్డ్‌కప్ జర్నీ నమ్మశక్యం కాని రీతిలో ఒకేలా కొనసాగడం క్రీడాభిమానులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంది. ఈ ఇద్దరు దిగ్గజాలు తమ కెరీర్లో తొలి వరల్డ్‌కప్ సాధించే క్రమంలో చాలా విషయాల్లో దగ్గరి పోలికలు (దాదాపు ఒకేలా) కలిగి ఉన్నారు. Sports has paid its due to the GOATS 🐐#CricketTwitter #fifaworldcup2022 pic.twitter.com/vQJ3AguTf3 — Sportskeeda (@Sportskeeda) December 18, 2022 10 నంబర్ జెర్సీ ధరించే ఈ ఇద్దరు లెజెండ్స్.. తమ కెరీర్లో చివరి వరల్డ్‌కప్ ఆడుతున్నామని ముందే ప్రకటించి మరీ తమ జట్లను జగజ్జేతలుగా నిలిపారు. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (GOAT)గా కీర్తించబడే సచిన్, మెస్సీ వారివారి వరల్డ్‌కప్ జర్నీలో 8 ఏళ్ల క్రితం చివరిసారి ఛాంపియన్‌గా నిలిచే అవకాశాన్ని తృటిలో చేజార్చుకున్నారు. #OnThisDay In 23/3/2003 Australia Defeated India in WC final 💔 Sachin Tendulkar Received M.O.S Award for his 673 runs & 2 wickets In 2003WC Most runs in a WC tournament 673 - Sachin (2003)* 659 - Hayden (2007) 648 - Rohit (2019) 647 - Warner (2019) pic.twitter.com/7kj56s1Rod — 𝑺𝒉𝒆𝒃𝒂𝒔 (@Shebas_10dulkar) March 23, 2022 సచిన్ ప్రాతినిధ్యం వహించిన టీమిండియా 2003 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ దాకా చేరి, తుది సమరంలో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలై రన్నరప్‌తో సరిపెట్టుకుంది. సరిగ్గా 8 సంవత్సరాల తర్వాత టీమిండియా 2011లో వన్డే వరల్డ్‌కప్‌ను ముద్దాడింది. మెస్సీ విషయంలో ఇలానే జరిగింది. One of my most distinct memories from reporting on the 2014 World Cup was Messi’s dejected face staring at the trophy after losing the final to Germany. Good to see him finally be able to lift it at his last tournament pic.twitter.com/8tLoDyTQOp — Citizen of Paldea (@westcoastrepz) December 18, 2022 2014 ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్లో మెస్సీ ప్రాతినిధ్యం వహించిన అర్జెంటీనా.. జర్మనీ చేతిలో ఓటమిపాలై ఛాంపియన్‌షిప్‌కు అడుగు దూరంలో నిలిచిపోయింది. అయితే సరిగ్గా 8 ఏళ్ల తర్వాత సచిన్ విషయంలో జరిగినట్టే మెస్సీ విషయంలోనూ జరిగింది. 2022 ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్లో ఫ్రాన్స్‌ను ఓడించి మెస్సీ సారధ్యంలోని అర్జెంటీనా జగజ్జేతగా అవతరించింది. June 25, 1983: The iconic image of Kapil Dev holding the World Cup Trophy at Lord’s is a watershed moment in Indian cricket history. It changed cricket in India. This win inspired the next generation to achieve the impossible & dream BIG pic.twitter.com/hoyEobpuwL — Mohammad Kaif (@MohammadKaif) June 25, 2020 #WorldCupFinal with Argentina playing are so exhilarating because - they are vulnerable! Remember 1986... pic.twitter.com/Vy6dJ5zyc3 — Dibyendu Nandi (@ydnad0) December 19, 2022 యాదృచ్చికంగా ఈ ఇద్దరు ప్రాతినిధ్యం వహించే జట్లు చివరిసారిగా వరల్డ్‌కప్‌ను 1980ల్లోనే నెగ్గాయి. లెజెండ్ కపిల్ దేవ్ సారధ్యంలో భారత్ 1983లో వన్డే వరల్డ్‌కప్ కైవసం చేసుకోగా.. 80వ దశకంలోనే (1986లో) ఫుట్‌బాల్ మాంత్రికుడు డీగో మారడోనా నేతృత్వంలో అర్జెంటీనా వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచింది. 30 Mar 2011 - India beat their arch-rivals Pakistan in semifinal of 2011 WC. Sachin Tendulkar's 85 proved to be a match-winning knock for India. He was awarded player of the match for 3rd time against Pakistan in World Cup tournament. He is always Man of big tournaments 🙏🙏 pic.twitter.com/O8d6WtQjHO — Sachinist (@Sachinist) March 30, 2021 ఇవే కాక సచిన్, మెస్సీ తమతమ వరల్డ్‌కప్ జర్నీలను సంబంధించి మరిన్ని విషయాల్లో పోలికలు కలిగి ఉన్నారు. సచిన్ 2011 వరల్డ్‌కప్‌లో అత్యధిక పరుగులు (9 మ్యాచ్‌ల్లో 482 పరుగులు) చేసిన భారత ఆటగాడిగా నిలువగా.. మెస్సీ 2022 ఫిఫా వరల్డ్‌కప్‌లో అత్యధిక గోల్స్ (7 గోల్స్) సాధించిన అర్జెంటీనా ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. Messi wins man of the match against Croatia. (Yeah he's won it again... 4th this World Cup, he's insane.) pic.twitter.com/1suL2E1K9X — K.Shah (@kshitijshah23) December 13, 2022 అలాగే ఈ ఇద్దరు దిగ్గజాలు తమ ప్రపంచకప్ ప్రయాణంలో సెమీఫైనల్ మ్యాచ్‌ల్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నారు. సచిన్.. పాకిస్తాన్‌తో జరిగిన సెమీస్‌లో 85 పరుగుల మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడి ఈ అవార్డుకు ఎంపిక కాగా.. క్రొయేషియాతో జరిగిన సెమీస్‌లో మెస్సీ ఒక గోల్ సాధించడంతో పాటు మరో రెండు గోల్స్ కొట్టడంలో జూలియన్ అల్వారెజ్‌కు సహకరించి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నాడు. Leo Messi. The living legend just secured his legacy. 1,003 games. 793 goals. 7 Ballon d’Or wins. 1 World Cup. Messi just completed the set. If you’re still debating who TBE is, it’s time to rest your case. He is him. Game over. pic.twitter.com/Lsfvep2bef — VERSUS (@vsrsus) December 18, 2022 వీటితో పాటు తమ చిరకాల కోరిక నెరవేరిన అనంతరం ఈ ఇద్దరు దిగ్గజాలను సహచర సభ్యులు యాదృచ్చికంగా ఒకేలా సత్కరించారు. ప్రపంచకప్ నెగ్గిన అనంతరం ఈ ఇద్దరిని సహచరులు భుజాలపై ఎక్కించుకుని స్టేడియం మొత్తం ఊరేగించారు. Sachin Tendulkar top-scored for 🇮🇳 with 482 runs in their victorious 2011 @cricketworldcup campaign 🏆 Vote to help his ‘Carried on the shoulders of a nation’ moment enter the final round of Laureus Sporting Moment: https://t.co/tqBHY3AyDB#OneFamily @sachin_rt pic.twitter.com/nD3OGSDuF2 — Mumbai Indians (@mipaltan) February 1, 2020 Parallels between FIFA WC 2022 and Cricket World Cup 2011. GOATs (?) of respective sports without the World Cup trying to win it in the last try and doing it. They both lost in the final 8 years before. 2003 vs Australia for Sachin & 2014 vs Germany for Messi pic.twitter.com/yJ4oqf8ceq — NYY (@adi_nyy) December 18, 2022 -
ఫిక్సింగ్ ఆరోపణలపై బీసీసీఐ విచారణ జరపాలి
కొలంబో: 2011 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ ఫిక్స్ అయ్యిందంటూ శ్రీలంక మాజీ క్రీడల మంత్రి మహిందనంద అలుత్గమగే చేసిన ఆరోపణలపై ఆ దేశ మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. ఇప్పటికే శ్రీలంక మాజీ క్రికెటర్లు కుమార సంగక్కరా, మహేళ జయవర్ధనే ఆ ఆరోపణల్ని తీవ్రంగా ఖండించగా, తాజాగా వారి జాబితాలో మరో లంక మాజీ క్రికెటర్ అరవింద డిసిల్వా చేరాడు. అవి ఎటువంటి ఆధారాలు లేని తప్పుడు ఆరోపణలంటూ ధ్వజమెత్తిన డిసిల్వా.. వాటిని ప్రజలు నమ్మవద్దని పేర్కొన్నాడు. అదే సమయంలో ‘ఫిక్సింగ్’ ఆరోపణలపై భారత ప్రభుత్వం, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)లు నిష్పాక్షిక విచారణ జరపాలని డిమాండ్ చేశాడు. ‘ఇవి చాలా సీరియస్ ఆరోపణలు. చాలామంది ప్రజల్ని ప్రభావితం చేస్తాయి. ఇది కేవలం క్రికెటర్లు, సెలక్టర్లు, టీమ్ మేనేజ్మెంట్ కోసం మాత్రమే కాదు. క్రికెట్ గేమ్‌లో మరింత పారదర్శకత తీసుకురావడం కోసం పూర్తిస్థాయి విచారణ చేయాల్సి ఉంది. ఆ మ్యాచ్‌లో భారత గెలవడానికి అన్ని అర్హతలు ఉన్నాయి. మేము మా ప్రపంచ కప్ విజయాన్ని ఎంతో ఆదరించినట్లే, సచిన్ టెండూల్కర్ వంటి ఆటగాళ్ళు 2011 వరల్డ్‌కప్ విజయాన్ని జీవితాంతం ఆ క్షణాలను ఎంతో ఆస్వాదిస్తారు. భారత్‌లోని కోట్లాది మంది క్రికెట్ అభిమానుల అభిరుచి, ఆసక్తి నాకు తెలుసు. ఈ ఆరోపణలపై భారత ప్రభుత్వం, బీసీసీఐ నిష్పాక్షిక విచారణ జరిపి నిజాలను వెలికి తీయండి. విచారణ పూర్తయ్యే వరకూ ప్రజలు లేని పోని అపోహల్ని నమ్మవద్దు. విచారణ పూర్తయితే అన్ని బయటకొస్తాయి’ అని 1996 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో సెంచరీ సాధించి లంక టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన డిసిల్వా పేర్కొన్నాడు. కొన్ని రోజుల క్రితం స్థానిక టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహిందనంద మాట్లాడుతూ ‘మీకు నేనో విషయం చెప్పాలనుకుంటున్నా. 2011 ప్రపంచకప్ అమ్ముడుపోయింది. ఈ విషయాన్ని నేను క్రీడల మంత్రిగా ఉన్నప్పుడే చెప్పాను. (వాళ్లెందుకు అంతగా స్పందిస్తున్నారు?) ఫైనల్ మ్యాచ్ మేం గెలవాల్సింది. అయితే ఇది తెలియజేయడం నా బాధ్యతని చెబుతున్నా... ఆ మ్యాచ్ ఫిక్సయింది. ఇది వాస్తవం’ అని సరికొత్త వివాదానికి తెరలేపాడు. దాంతో ఆ మ్యాచ్‌లో సభ్యులైన జయవర్ధనే, సంగక్కరాలకు చిర్రెత్తుకొచ్చింది. ‘ఎన్నికలకు ముందు ఈ తరహా సర్కస్‌లు మొదలు కావడం కొత్త కాదు.. మళ్లీ సర్కస్ చేస్తున్నారు’ అని జయవర్ధనే విమర్శించగా, ప్రపంచకప్ ఫైనల్‌ను ఫిక్స్ చేయడం అంత చిన్న విషయమేమీ కాదు. మ్యాచ్ ఆడిన తుది జట్టులో భాగం కాని వ్యక్తి అలా ఎలా చేయగలడో మాకైతే తెలీదు. 9 ఏళ్ల తర్వాత ఇప్పుడైనా మాకు జ్ఞానోదయం కలిగించండి’ అంటూ మాజీ కెప్టెన్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. దీనిపై ఇప్పటికే శ్రీలంక ప్రభుత్వం విచారణ ప్రారంభించగా, భారత ప్రభుత్వం, బీసీసీఐ కూడా విచారణ జరపాలని డిసిల్వా సూచించాడు. (2011 ఫైనల్ ఫిక్సయింది!) -
2011 ఫైనల్ ఫిక్సయింది!
కొలంబో: శ్రీలంక మాజీ క్రీడల మంత్రి మహిందనంద అలుత్గమగే 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌పై ఆరోపణలు గుప్పించారు. భారత్, శ్రీలంకల మధ్య జరిగిన టైటిల్ పోరు ఫిక్సయిందన్నారు. దీనిపై అప్పటి లంక సారథి కుమార సంగక్కర, మహేల జయవర్ధనే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆరోపణలపై ఆధారాలు చూపాలని వారు డిమాండ్ చేశారు. స్థానిక టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహిందనంద మాట్లాడుతూ ‘మీకు నేనో విషయం చెప్పాలనుకుంటున్నా. 2011 ప్రపంచకప్ అమ్ముడుపోయింది. ఈ విషయాన్ని నేను క్రీడల మంత్రిగా ఉన్నప్పుడే చెప్పాను. 2011 లేదంటే 2012 ఏడాదో సరిగ్గా గుర్తుకు రావడం లేదు కానీ... ఫైనల్ మ్యాచ్ మేం గెలవాల్సింది. అయితే ఇది తెలియజేయడం నా బాధ్యతని చెబుతున్నా... ఆ మ్యాచ్ ఫిక్సయింది. ప్రజలు దీనిపై కలత చెందారని తెలుసు. దీనిపై ఏ చర్చకైనా నేను సిద్ధం’ అని అన్నారు. అయితే ఈ ఫిక్సింగ్‌లో లంక ఆటగాళ్లెవరూ పాల్గొనలేదని, కొన్ని వర్గాలు ఇందులో భాగమయ్యాయని చెప్పుకొచ్చారు. అప్పట్లో ఆయన క్రీడల మంత్రిగా పనిచేశారు. మాజీ మంత్రి ఆరోపణలపై జయవర్ధనే ట్విట్టర్లో స్పందించాడు. ‘ఎన్నికలొస్తే చాలు... ఇలాంటి సర్కస్ చేష్టలకు కొదవుండదు. మరి ఫిక్సర్ల పేర్లు, ఆధారాలు చూపాలిగా’ అని చురకలంటించాడు. ఆ ఫైనల్లో అతను సెంచరీ సాధించాడు. అప్పటి సారథి సంగక్కర సాక్ష్యాధారాలు చూపాలని డిమాండ్ చేశాడు. ‘మాజీ మంత్రి వద్ద ఉన్న ఆధారాలను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి, అవినీతి నిరోధక విభాగానికి సమర్పిస్తే విచారణ చేపట్టేందుకు వీలవుతుంది’ అని అన్నాడు. -
అప్పుడూ ఇలాగే జరిగింది!
మెల్ బోర్న్: వన్డే ప్రపంచకప్ టైటిల్ వేటలో ఆతిథ్య జట్లు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ నిలిచాయి. గత వరల్డ్ కప్ లోనూ ఇలాగే జరిగింది. ఆతిథ్య దేశాలైన ఇండియా, శ్రీలంక టైటిల్ కోసం పోటీపడ్డాయి. 2011 ప్రపంచకప్ ను భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్ సంయుక్తంగా నిర్వహించాయి. పాకిస్థాన్ కూడా సహా ఆతిథేయిగా వ్యవహరించాల్సి ఉన్నా 2009లో శ్రీలంక క్రికెట్ టీమ్ పై లాహోర్ లో తీవ్రవాదుల దాడి జరగడంతో ఆ దేశాన్ని ఆతిథ్యం నుంచి ఐసీసీ తప్పించింది. 2011 వరల్డ్ కప్ ఫైనల్లో ఆతిథ్య దేశాలు శ్రీలంక, భారత్ పోటీపడ్డాయి. ధోని నేతృత్వంలోని టీమిండియా జగజ్జేతగా నిలిచింది. సెమీస్ లో పాక్ ను ఓడించి భారత్ ఫైనల్ చేరింది. న్యూజిలాండ్ పై విజయం సాధించి శ్రీలంక ఫైనల్లోకి ప్రవేశించింది. ఒక్క ఇంగ్లండ్ మినహా అప్పుడు నాకౌట్ కు చేరిన జట్లే ఈ ప్రపంచకప్ లోనూ లీగ్ దశ దాటాయి. తొలిసారి క్వార్టర్ ఫైనల్ చేరిన బంగ్లాదేశ్ ను ధోని ఖంగుతినిపించింది. తాజా టైటిల్ పోరులో ఎవరు విజేతగా నిలుస్తారనేది ఆదివారం తేలుతుంది.