2011 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్(ఫైల్)
మెల్ బోర్న్: వన్డే ప్రపంచకప్ టైటిల్ వేటలో ఆతిథ్య జట్లు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ నిలిచాయి. గత వరల్డ్ కప్ లోనూ ఇలాగే జరిగింది. ఆతిథ్య దేశాలైన ఇండియా, శ్రీలంక టైటిల్ కోసం పోటీపడ్డాయి.
2011 ప్రపంచకప్ ను భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్ సంయుక్తంగా నిర్వహించాయి. పాకిస్థాన్ కూడా సహా ఆతిథేయిగా వ్యవహరించాల్సి ఉన్నా 2009లో శ్రీలంక క్రికెట్ టీమ్ పై లాహోర్ లో తీవ్రవాదుల దాడి జరగడంతో ఆ దేశాన్ని ఆతిథ్యం నుంచి ఐసీసీ తప్పించింది. 2011 వరల్డ్ కప్ ఫైనల్లో ఆతిథ్య దేశాలు శ్రీలంక, భారత్ పోటీపడ్డాయి. ధోని నేతృత్వంలోని టీమిండియా జగజ్జేతగా నిలిచింది.
సెమీస్ లో పాక్ ను ఓడించి భారత్ ఫైనల్ చేరింది. న్యూజిలాండ్ పై విజయం సాధించి శ్రీలంక ఫైనల్లోకి ప్రవేశించింది. ఒక్క ఇంగ్లండ్ మినహా అప్పుడు నాకౌట్ కు చేరిన జట్లే ఈ ప్రపంచకప్ లోనూ లీగ్ దశ దాటాయి. తొలిసారి క్వార్టర్ ఫైనల్ చేరిన బంగ్లాదేశ్ ను ధోని ఖంగుతినిపించింది. తాజా టైటిల్ పోరులో ఎవరు విజేతగా నిలుస్తారనేది ఆదివారం తేలుతుంది.