MS Dhoni- World’s most expensive cricket bat: ‘‘ధోని తనదైన స్టైల్‌లో ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు.. అద్భుతమైన షాట్! 28 ఏళ్ల తర్వాత ఇండియా మరోసారి వరల్డ్‌కప్ ట్రోఫీని గెలిచింది’’... మహేంద్ర సింగ్ ధోని సిక్సర్‌తో భారత్ రెండోసారి ప్రపంచకప్ విజేతగా నిలిచిన సందర్భంగా కామెంటేటర్ రవిశాస్త్రి అన్న మాటలు.
2011లో ముంబైలోని వాంఖడేలో శ్రీలంకతో నరాలు తెగే ఉత్కంఠ రేపిన ఫైనల్ మ్యాచ్‌లో ధోని సిక్స్ బాది జట్టును విజయతీరాలకు చేర్చాడు. లంక పేసర్ నువాన్ కులశేఖరకు పీడకలను మిగిల్చి అద్బుత షాట్‌తో.. సొంతగడ్డపై భారత్ జగజ్జేగతగా నిలిచిన సందర్భాన్ని మరింత ప్రత్యేకంగా మార్చుకున్నాడు.
ధోని అలా గాల్లోకి బంతి లేపగానే ఊపిరిబిగపట్టుకుని చూసిన అభిమానులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. దాదాపు మూడు దశాబ్దాల నిరీక్షణకు తెరదించిన తలాను ఆకాశానికెత్తుతూ కరతాళధ్వనులతో స్టేడియాన్ని హోరెత్తించారు.
ధోని బ్యాట్ ప్రపంచ రికార్డు
ఇక ఈ గెలుపుతో కపిల్ దేవ్ తర్వాత భారత్‌కు ఐసీసీ టైటిల్ అందించిన రెండో కెప్టెన్‌గా ధోని చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. మరి.. విన్నింగ్ సిక్సర్ కొట్టిన ధోని బ్యాట్ కూడా గిన్నిస్ ప్రపంచ రికార్డుల్లోకెక్కిందన్న సంగతి తెలుసా?!
వరల్డ్‌కప్-2011 నాటి ఫైనల్ మ్యాచ్‌లో ధోని రీబక్ లేబుల్‌తో ఉన్న బ్యాట్‌ను వాడాడు. దీనిని లండన్‌లోని చారిటీ ఈవెంట్‌లో వేలం వేయగా ఏకంగా 83 లక్షల రూపాలయకు అమ్ముడుపోయింది. ఆర్కే గ్లోబల్ షేర్స్ అండ్ సెక్యూరిటీస్ లిమిటెడ్(ఇండియా) ఈ బ్యాట్‌ను భారీ మొత్తానికి కొనుగోలు చేసింది.
ఆ డబ్బు దేనికోసం వాడారంటే
తద్వారా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బ్యాట్‌గా ధోని వాడిన బ్యాట్ చరిత్రకెక్కింది. ఇక ఇదిలా ఉంటే.. అదే ఏడాది జూలై 18న ఆర్కే గ్లోబల్ షేర్స్ కంపెనీ ధోనితో ఈస్ట్ మీట్స్ వెస్ట్ చారిటీ డిన్నర్‌ను నిర్వహించింది. బ్యాట్‌ను వేలం వేయడం ద్వారా వచ్చిన డబ్బును ధోని సతీమణి పేరిట నిర్వహిస్తున్న సాక్షి ఫౌండేషన్ కోసం వాడినట్లు సమాచారం.
ఇప్పుడు రోహిత్ వంతు
ఇక.. ఇప్పుడు పుష్కరకాలం తర్వాత మరోసారి భారత గడ్డపై వన్డే వరల్డ్‌కప్ ఈవెంట్ జరుగనుంది. ఈ నేపథ్యంలో ధోని మాదిరే.. ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ ఐసీసీ ట్రోఫీ గెలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. భారత్ మరోసారి ప్రపంచ విజేతగా నిలవాలని ఆకాంక్షిస్తున్నారు. ధోని అద్భుత ఇన్నింగ్స్(91- నాటౌట్) గుర్తు చేసుకుంటూ వీడియోలతో సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విన్నింగ్ సిక్సర్ బ్యాట్ గురించి కూడా అభిమానుల్లో చర్చ నడుస్తోంది.
చదవండి: రవీంద్ర జడేజాకే అత్యధిక సార్లు! రోహిత్, కోహ్లిలకు మాత్రం.. షాకింగ్ రిపోర్టు!
"Dhoni finishes off in style!" 🇮🇳🏆
— ICC Cricket World Cup (@cricketworldcup) July 7, 2018
Happy birthday to the man who hit the winning runs in the 2011 @cricketworldcup final, @msdhoni! pic.twitter.com/X0s7Jo7cWp
Comments
Please login to add a commentAdd a comment