నిజంగానే విడిపోతున్నారా? హార్దిక్‌ పాండ్యా సతీమణి పోస్టు వైరల్‌ | Natasa Stankovic says God stands by you amid divorce rumours with Hardik Pandya | Sakshi
Sakshi News home page

నిజంగానే విడిపోతున్నారా? హార్దిక్‌ పాండ్యా సతీమణి పోస్టు వైరల్‌

Published Thu, Jul 4 2024 5:39 PM | Last Updated on Thu, Jul 4 2024 6:42 PM

Natasa Stankovic says God stands by you amid divorce rumours with Hardik Pandya

టీమిండియా స్టార్ ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా.. అత‌డి భార్య నటాషా స్టాంకోవిచ్ విడాకులు వ్యవహారం మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశ‌మైంది.  ఈ ఇద్దరూ విడిపోతున్నారంటూ గ‌త కొన్ని నెల‌ల‌గా  ప్రచారం జరుగుతున్న సంగ‌తి తెలిసిందే.  కానీ ఇప్ప‌టివ‌ర‌కు పాండ్యా గానీ, నటాషా గానీ ఈ విష‌యంపై స్పందించ‌లేదు. అయితే తాజాగా నటాషా పెట్టిన ఓ పోస్టు ఈ విడాకుల వార్త‌ల‌కు మ‌రింత ఊత‌మిచ్చేలా ఉంది.

"జీవితంలో కొన్ని పరిస్థితుల్లో మనం ఒంటరిగా ఉండి నిరుత్సాహానికి లోనవుతుంటాం. అటువంటి పరిస్థితుల్లో మీరు భ‌య‌ప‌డ‌వ‌ద్దు. ఎవ‌రు మిమ్మ‌ల్ని విడిచిపెట్టినా ఆ దేవుడు మాత్రం మీకు తోడుగా ఉంటాడు. మనకు ఏం కావాలో ఆయనకు బాగా తెలుసు" అని నటాషా ఓ వీడియోను పోస్టు చేశారు. 

కాగా టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్-2024 విజేత‌గా భార‌త్ నిలిచిన విష‌యం తెలిసిందే. 13 ఏళ్లగా ఊరిస్తున్న వ‌ర‌ల్డ్‌క‌ప్‌ను సొంతం చేసుకున్న భార‌త జ‌ట్టు.. స‌గ‌ర్వంగా భార‌త గ‌డ్డ‌పై అడుగు పెట్టింది. అయితే భార‌త్ ఛాంపియ‌న్స్‌గా నిల‌వ‌డంలో స్టార్ ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యాది కీల‌క పాత్ర‌. 

టోర్నీ ఆసాంతం పాండ్యా అద్బుత‌మైన  ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన ఫైన‌ల్లోనూ స‌త్తాచాటిన హార్దిక్ భార‌త్‌కు రెండో సారి పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌ను అందించాడు. విజ‌య‌నంత‌రం పాండ్యా తీవ్ర భావోద్వేగానికి లోన‌య్యాడు. 

గ‌త కొన్ని కొన్ని నెల‌ల నుంచి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాని పాండ్యా క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యాడు. భార‌త విజ‌యం త‌ర్వాత కోహ్లి, రోహిత్ స‌తీమ‌ణిలు త‌మ భ‌ర్త‌ల‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించ‌గా.. పాండ్య ప్రదర్శనపై మాత్రం నటాషా ఇప్ప‌టివ‌ర‌కు క‌నీసం ఒక్క పోస్టు కూడా చేయ‌లేదు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement