టీ20 వరల్డ్‌కప్-2024లో టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఐపీఎల్‌లో పేలవ ప్రదర్శన చేసి విమర్శలు ఎదుర్కొన్న హార్దిక్.. ఇప్పుడు తనపై ఉన్న అపవాదును చెరిపేసుకున్నాడు. ఈ పొట్టి ప్రపంచకప్‌లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సత్తాచాటుతున్నాడు.
ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన హార్దిక్ 116 పరుగులతో పాటు 8 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో హార్దిక్‌పై భారత మాజీ పేసర్ ఎస్ శ్రీశాంత్ ప్రశంసల వర్షం కురిపించాడు. హార్దిక్ అద్భుతమైన ఆల్‌రౌండర్‌ని, భారత్‌ను ఛాంపియన్స్‌గా నిలబెడతాడని శ్రీశాంత్ కొనియాడాడు.
"హార్దిక్ పాండ్యాకు అద్బుతమైన ఆల్‌రౌండ్ స్కిల్స్ ఉన్నాయి. భారత జట్టులో అతడు కీలకమైన ఆటగాడు. ఇదే విషయాన్ని కెప్టెన్ రోహిత్ శర్మ సైతం పలుమార్లు చెప్పాడు. 2011 వన్డే వరల్డ్‌కప్‌లో ఆల్‌రౌండర్‌గా యువరాజ్ సింగ్ ఏ విధమైన ప్రదర్శన చేశాడో మనకు ఇప్పటికి బాగా గుర్తుంది.
బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో సత్తాచాటి భారత్‌కు టైటిల్‌ను అందించాడు. ఇప్పుడు హార్దిక్ కూడా నాకౌట్స్‌లో యువీ లాంటి ప్రదర్శనే చేస్తాడని నేను భావిస్తున్నాను. భారత్ కచ్చితంగా ఛాంపియన్స్‌గా నిలుస్తుందని" స్టార్‌స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీశాంత్ పేర్కొన్నాడు. కాగా భారత్ రెండో సెమీఫైనల్లో గురువారం గయానా వేదికగా ఇంగ్లండ్‌తో తలపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment