టీ20 వరల్డ్‌కప్-2024లో టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా సత్తాచాటుతున్నాడు. తన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో భారత జట్టుకు అద్బుతమైన విజయాలు అందిస్తున్నాడు.
తాజాగా ఈ మెగా టోర్నీ సూపర్-8లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాండ్యా ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు. బ్యాటింగ్‌లో ఆజేయ అర్ధశతకం సాధించిన పాండ్యా.. బౌలింగ్‌లో ఓ కీలక వికెట్ పడగొట్టాడు. ఈ క్రమంలో హార్దిక్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.
హార్దిక్ సాధించిన రికార్డులు ఇవే..
→టీ20 ప్రపంచకప్ చరిత్రలో 300 పరుగులు, 20+ వికెట్లు సాధించిన తొలి భారత క్రికెటర్‌గా హార్దిక్ రికార్డులకెక్కాడు. టీ20 వరల్డ్‌కప్‌లో ఇప్పటివరకు 21 మ్యాచ్‌లు ఆడిన హార్దిక్ .. 137.89 స్ట్రైక్‌రేట్‌తో 302 పరుగులు చేశాడు. అటు బౌలింగ్‌లోనూ 21 వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన జాబితాలో పాండ్యా ఐదో స్ధానంలో నిలిచాడు.
షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్)- 853 పరుగులు, 50 వికెట్లు
షాహిద్ అఫ్రిది (పాకిస్థాన్)- 546 పరుగులు, 39 వికెట్లు
షేన్ వాట్సన్ (ఆస్ట్రేలియా)- 537 పరుగులు, 22 వికెట్లు
డ్వేన్ బ్రావో (వెస్టిండీస్)- 530 పరుగులు, 27 వికెట్లు
→టీ20 ప్రపంచకప్‌లో ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక స్కోర్ సాధించిన తొలి భారత ప్లేయర్‌గా పాండ్యా రికార్డు సృష్టించాడు.
ఇప్పటివరకు ఈ రికార్డు సురేశ్ రైనా (45 పరుగులు), ధోనీ (45) పేరిట ఉండేది. 2007 టీ20 ప్రపంచకప్‌లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోనీ ఆరో స్థానంలో బ్యాటింగ్ చేసి 33 బంతుల్లో 45 పరుగులు చేశాడు.
2012 టీ20 ప్రపంచకప్‌లో సౌతాఫ్రికాతోనే జరిగిన మ్యాచ్‌లో ఆరోస్థానంలో బ్యాటింగ్ చేసిన సురేశ్ రైనా 34 బంతుల్లో 45 పరుగులే చేశాడు. కాగా తాజా మ్యాచ్‌లో 50 పరుగులు చేసిన పాండ్యా వారిద్దరి రికార్డును బ్రేక్ చేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. బంగ్లాదేశ్‌పై టీమిండియా 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment