టీ20 వరల్డ్‌కప్-2024లో టీమిండియా తొలి మ్యాచ్‌కు సిద్దమైంది. న్యూయర్క్ వేదికగా బుధవారం ఐర్లాండ్‌తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా అన్ని విధాల సిద్దమైంది. తొలి మ్యాచ్‌లో గెలిచి టోర్నీని శుభారంభం చేయాలని భారత్ భావిస్తోంది.
ఈ నేపథ్యంలో ప్రీ మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో పాల్గోన్న టీమిండియా కెప్టెన్ న్యూయర్క్ పిచ్‌కు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎటువంటి పరిస్థితులలోనైనా ఆడేందుకు తమ వద్ద బలమైన జట్టు ఉందని రోహిత్ థీమా వ్యక్తం చేశాడు.
"ఈ ఏడాది వరల్డ్‌కప్‌లో స్నిన్నర్లు ప్రధాన పాత్ర పోషిస్తారని నేను అనుకుంటున్నాను. మా జట్టులో జడేజా, అక్షర్ పటేల్ రూపంలో స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు ఉన్నారు. జట్టు బ్యాలెన్స్‌గా ఉండాలంటే వారిద్దరూ అవసరమే.
అదే విధంగా పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే కూడా మా వద్ద ఉన్నారు. కాబట్టి ఈ మెగా టోర్నీలో వారి సేవలను అన్ని విధాలగా ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తాం. న్యూయర్క్ వికెట్ గురించి మాకు ఎటువంటి ఆందోళన లేదు.
ఎందుకంటే ఎటువంటి పరిస్థితులలోనైనా సత్తాచాటేందుకు మా బాయ్స్ సిద్దంగా ఉన్నారు. అదే విధంగా ఐర్లాండ్ జట్టును మేము తక్కువగా అంచనా వేయడం లేదు. ఎందుకంటే ఐర్లాండ్ వద్ద కూడా పటిష్టమైన జట్టు ఉంది.
వారు కూడా ఎక్కువగా టీ20 క్రికెట్ ఆడుతున్నారు. ఐరీష్ జట్టులో చాలా మంది ఆటగాళ్ళకి ప్రపంచవ్యాప్తంగా లీగ్ క్రికెట్‌లో ఆడిన అనుభవం ఉందని" ప్రీమ్యాచ్ కాన్ఫరెన్స్‌లో రోహిత్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment