టీ20 వరల్డ్‌కప్-2024లో టీమిండియా బోణీ కొట్టిన సంగతి తెలిసిందే. బుధవారం(జూన్ 5)న న్యూయర్క్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఐరీష్‌ను చిత్తు చేసింది.
తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ భారత బౌలర్ల దాటికి కేవలం 96 పరుగులకే ఆలౌటైంది. అనంతరం 97 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత జట్టు కేవలం 12.2 ఓవర్లలో ఊదిపడేసింది.
ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. తమ బౌలర్లు అద్బుతంగా రాణించారని హిట్‌మ్యాన్ కొనియాడాడు. అదే విధంగా తన గాయంపై కూడా రోహిత్ అప్‌డేట్ ఇచ్చాడు.
"నా మో చేయి ఇంకా కొంచెం నొప్పిగా ఉంది. పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇక టాస్ సమయంలోనే నేను చెప్పాను పిచ్‌ను అంచనా వేయడం చాలా కష్టమని. అసలు ఈ వికెట్ నుంచి ఏం ఆశించాలో కూడా అర్థం కావడం లేదు.
కేవలం ఐదు నెలల వయసున్న పిచ్‌పై ఎలా ఆడాలో తెలియడం లేదు. మేము సెకండ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కూడా పిచ్ ఇంకా అలానే ఉంది. ఇది బౌలర్లకు సరిపోయే వికెట్. ఈ వికెట్‌పై ఫాస్ట్ బౌలర్లు సరైన లెంగ్త్‌లో బౌలింగ్ చేస్తే సరిపోతుంది.
మా జట్టులో ఒక్క అర్ష్‌దీప్ సింగ్‌కు తప్ప దాదాపు అంతమంది బౌలర్లకు టెస్టు క్రికెట్‌లో ఆడిన అనుభవం ఉంది. అయినప్పటికి అర్ష్‌దీప్ ఆరంభంలోనే రెండు వికెట్లు పడగొట్టి మాకు మంచి శుభారంభాన్ని ఇచ్చాడు. ఈ వికెట్‌పై నలుగురు స్పిన్నర్లతో ఆడాలనుకోలేదు.
బ్యాలెన్స్‌గా ఉండే తుది జట్టును ఎంపిక చేశాము. మా తుది జట్టులో ముగ్గురు ఫాస్ట్ బౌలర్లతో పాటు, ఇద్దరు పేస్ ఆల్‌రౌండర్లు, ఇద్దరు స్పిన్ ఆల్‌రౌండర్లకు చోటిచ్చాము. పిచ్ సీమర్లకు అనుకూలించినందున స్పిన్నర్లతో కేవలం రెండు ఓవర్లు మాత్రం వేయించాను.
ఒకవేళ స్పిన్‌కు అనుకూలించి ఉంటే వారితో ఫుల్ కోటాను పూర్తి చేసే వాడిని. పరిస్థితులకు తగ్గ జట్టు మా వద్ద వుంది. ఒకవేళ పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు కూడా పిచ్ ఈ విధంగానే ఉంటే అందుకు తగ్గట్టు మేము సన్నద్దమవుతామని" పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో రోహిత్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment