శ్రీలంకతో వన్డే సిరీస్‌ను 2-0 తేడాతో భారత్ కోల్పోయిన సంగతి తెలిసిందే. టీ20 సిరీస్‌లో అదరగొట్టిన భారత్.. వన్డేల్లో మాత్రం చేతులేత్తేసింది. తొలి వన్డేను డ్రా ముగించిన టీమిండియా.. ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమని చవిచూసింది.
శ్రీలంకపై భారత్ వన్డే సిరీస్ ఓడిపోవడం 27 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో భారత జట్టును ఉద్దేశించి పాకిస్థాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ ఘూటు వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా త్రయం లేకపోతే భారత్‌ను పాకిస్తాన్ ఈజీగా ఓడిస్తుందని తన్వీర్ అభిప్రాయపడ్డాడు.
"ముందు మీ జట్టు ప్రదర్శన చూసుకోండి. ఆ తర్వాతే పాకిస్తాన్‌కు సూచనలు చేయండి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, బుమ్రా లేకపోతే టీమిండియాను పాకిస్తాన్ సునాయసంగా ఓడిస్తుంది. శ్రీలంక సిరీస్‌లో భారత బ్యాటింగ్ లైనప్ ఎలా ఉందో మనం చూశాము.
రోహిత్ శర్మ ఔటైతే చాలు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. భవిష్యత్తులో భారత బ్యాటింగ్ విభాగం ఎలా ఉంటుందో చూడాలి. ఈ సిరీస్‌లో బౌలర్లు పర్వాలేదన్పించారు. కానీ బ్యాటింగ్ మాత్రం దారుణంగా ఉంది.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి రిటైర్ అయితే భారత బ్యాటింగ్ యూనిట్ మరింత పేలవంగా మారుతుంది. భారత బ్యాటర్లు వారి సొంత పిచ్‌లపై మాత్రమే పరుగులు చేస్తారు. ఎందుకంటే ఆ పిచ్‌లు చాలా ఫ్లాట్‌గా ఉంటాయి.
కానీ బంతి స్వింగ్, సీమ్ అయ్యే కండీషన్స్‌లో అయితే భారత బ్యాటర్లు ఆడలేరని" క్రికెట్ పాకిస్తాన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన్వీర్ అహ్మద్ పేర్కొన్నాడు. ఈ క్రమంలో తన్వీర్‌కు భారత ఫ్యాన్స్ కౌంటరిస్తున్నారు. మాటలు చెప్పడం కాదు.. ముందు మాపై గెలిచి చూపించండి అంటూ సోషల్ మీడియాలో అభిమానులు పోస్ట్‌లు పెడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment