టీ20 వరల్డ్‌కప్-2024ను విజయంతో ఆరంభించిన టీమిండియా మరో రసవత్తర పోరుకు సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా జూన్ 9న న్యూయర్క్ వేదికగా చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి పాకిస్తాన్‌పై తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని భారత్ భావిస్తోంది.
అయితే ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు గుడ్‌న్యూస్ అందింది. బుధవారం ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయం కారణంగా రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ.. ఇప్పుడు పూర్తి ఫిట్‌నిస్ సాధించినట్లు తెలుస్తోంది.
ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో రోహిత్ శర్మ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 52 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఐరీష్ పేసర్ మార్క్ అడైర్ వేసిన ఓ రాకాసి బౌన్సర్ హిట్‌మ్యాన్ చేతికి తాకింది. దీంతో రోహిత్ నొప్పితో విల్లవిల్లాడు. వెంటనే ఫిజియో చికిత్స అందించినప్పటికి నొప్పి తగ్గకపోవడంతో రోహిత్ మైదానాన్ని వీడాడు.
దీంతో భారత అభిమానులు రోహిత్ గాయంపై ఆందోళన చెందారు. అయితే రోహిత్ గాయం అంత తీవ్రమైనది కాదని, అతడు ప్రస్తుతం బాగానే ఉన్నాడని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఈ క్రమంలో అతడు పాకిస్తాన్‌తో జరిగే బ్లాక్‌బ్లాస్టర్ మ్యాచ్‌కు అందుబాటులో ఉండనున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment