WV Raman
-
శ్రీలంక సిరీస్ నుంచి టీమిండియాకు కొత్త కోచ్.. రేసులో ఇద్దరు..!
టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ పేరు ఖరారైందని గత కొద్ది రోజులుగా సోషల్‌మీడియాలో భారీ ఎత్తున ప్రచారం జరిగిన విషయం విధితమే. అయితే ఈ ప్రచారంలో వాస్తవం కొంతమాత్రమే ఉందని బీసీసీఐ కార్యదర్శి జై షా తాజా స్టేట్మెంట్ను బట్టి తెలుస్తుంది. భారత్ హెడ్ కోచ్ రేసులో ఇద్దరు ఉన్నట్లు షా పేర్కొన్నాడు. షా చెప్పిన మాటల ప్రకారం గంభీర్‌తో పాటు మరో వ్యక్తి (డబ్ల్యూవీ రామన్) భారత హెడ్ కోచ్ పదవి రేసులో ఉన్నట్లు తెలుస్తుంది.కొత్త హెడ్ కోచ్ అంశంపై మాట్లాడుతూ షా మరిన్ని విషయాలను కూడా రివీల్ చేశాడు. కొత్తగా ఎంపిక కాబోయే కోచ్ ఈ నెల (జులై) చివర్లో ప్రారంభమయ్యే శ్రీలంక సిరీస్ నుంచి బాధ్యతలు చేపడతాడని తెలిపాడు. అలాగే ఈనెల (జులై) 6 నుంచి ప్రారంభం కాబోయే జింబాబ్వే టీ20 సిరీస్‌కు టీమిండియా హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరిస్తాడని షా పేర్కొన్నాడు.కాగా, ప్రస్తుత టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం టీ20 ప్రపంచకప్‌తో ముగిసిన విషయం తెలిసిందే. ద్రవిడ్‌కు హెడ్ కోచ్ పదవిలో కొనసాగే ఇష్టం లేకపోవడంతో బీసీసీఐ కొత్త అభ్యర్దుల వేటలో పడింది. ఐపీఎల్ పెర్పార్మెన్స్ నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్ పదవి రేసులో గంభీర్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. క్రికెట్ అడ్వైజరీ కమిటీ (CAC) కూడా గంభీర్వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది.ఇదిలా ఉంటే, టీ20 ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా.. సౌతాఫ్రికాను ఓడించి రెండోసారి పొట్టి ప్రపంచకప్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రపంచకప్ ముగిసిన అనంతరం భారత సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు.మరోవైపు ఈ నెల 6వ తేదీ నుంచి టీమిండియా జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భారత్.. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని టీమిండియాను ఇదివరకే ఎంపిక చేశారు. జింబాబ్వే పర్యటన అనంతరం భారత జట్టు శ్రీలంకలో పర్యటిస్తుంది. జులై 27 నుంచి ప్రారంభమయ్యే ఈ పర్యటనలో 3 టీ20లు, 3 వన్డేలు జరుగనున్నాయి. -
BCCI: గంభీర్‌తో పోటాపోటీ.. రామన్ ట్వీట్ వైరల్
భారత పురుషుల క్రికెట్ జట్టు తదుపరి హెడ్ కోచ్ ఎవరన్న అంశంపై పూర్తి స్థాయిలో స్పష్టత రావడం లేదు. ఈ పదవి కోసం మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ ఒక్కడే దరఖాస్తు చేసుకున్నాడని.. అతడి నియామకం దాదాపుగా ఖరారైపోయిందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.అయితే, మంగళవారం నాటి ఇంటర్వ్యూ నేపథ్యంలో రేసులోకి కొత్త పేరు దూసుకువచ్చింది. డబ్ల్యూవీ రామన్ సైతం ప్రధాన కోచ్ పదవి కోసం అప్లై చేసుకున్న విషయం బయటకు వచ్చింది.సీఏసీని ఇంప్రెస్ చేసింది ఎవరు?గంభీర్‌తో పాటు రామన్ కూడా క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) ఆన్లైన్లో మంగళవారం నిర్వహించిన ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. ఈ క్రమంలో భారత జట్టు కోసం వచ్చే మూడేళ్లపాటు తన అనుభవాన్ని ఎలా ఉపయోగిస్తానని, పూర్తిస్థాయిలో ఏమేరకు అందుబాటులో ఉంటాననేది గంభీర్ కమిటీకి తెలిపాడు.సుమారు 40 నిమిషాల పాటు ఇందుకు సంబంధించి ప్రజెంటేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అదే విధంగా రామన్ సైతం తన ప్రణాళిక గురించి వివరించినట్లు సమాచారం. అయితే, గంభీర్ కంటే కూడా రామన్ ఇచ్చిన ప్రజెంటేషన్ సీఏసీకి ఎక్కువగా నచ్చినట్లు సమాచారం.ఈ క్రమంలో బుధవారం నాటి సెకండ్ రౌండ్ తర్వాత కమిటి ఎలాంటి నిర్ణయం తీసుకోనుందనే అంశం ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో డబ్ల్యూవీ రామన్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.రామన్ ట్వీట్ వైరల్‘‘ఓ డియర్!!’’ అంటూ నిరాశలో కూరుకుపోక తప్పదన్న అర్థం వచ్చేలా రామన్ పోస్ట్ పెట్టాడు. అయితే, అది ఎవరిని ఉద్దేశించి పెట్టాడో అర్థం కావడం లేదంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.గంభీర్ వైపే బోర్డు మొగ్గు చూపుతుందే కాబట్టి రామన్ ఇలా ట్వీట్ చేశాడా? లేదంటే గంభీర్ కంటే తానే బెటర్ అని చెప్తున్నాడా అని బుర్రకు పదునుపెడతున్నారు. ఇక హెడ్ కోచ్ నియామకానికి సంబంధించి బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన వచ్చేంత వరకు ఇలాంటి ఊహాగానాలు తప్పవు.ద్రవిడ్ తర్వాతకాగా టీమిండియా ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ టీ20 ప్రపంచకప్-2024 తర్వాత తప్పుకోనున్నాడు. ఈ మెగా టోర్నీలో అమెరికాలో లీగ్ దశలో మూడు మ్యాచ్‌లు గెలిచిన రోహిత్ సేన.. సూపర్-8 కోసం వెస్టిండీస్‌లో అడుగుపెట్టింది. ఈ ఐసీసీ ఈవెంట్ తర్వాత తర్వాత భారత జట్టు తదుపరి జింబాబ్వేతో సిరీస్ ఆడనుంది. చదవండి: శ్రేయస్ అయ్యర్ రీఎంట్రీ.. జింబాబ్వే టీ20 సిరీస్‌కు ఐపీఎల్ హీరోలు -
టీమిండియా హెడ్ కోచ్ రేసులో కొత్త పేరు
టీమిండియా తదుపరి హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ పేరు దాదాపుగా ఖరారైన తరుణంలో రేసులోకి కొత్తగా మరో పేరు తెరపైకి వచ్చింది. భారత క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్, భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ హెడ్ కోచ్ డబ్ల్యూవీ రామన్ టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం గంభీర్‌తో పాటు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తుంది. బీసీసీఐ క్రికెట్ అడ్వైజరీ కమిటీ (CAC) ఇవాళ (జూన్ 18) గంభీర్‌తో పాటు రామన్‌ను కూడా ఇంటర్వ్యూ చేసిందని సమాచారం. CAC ముందు రామన్ ఇన్ పర్సన్ హాజరయ్యారని.. గంభీర్ వర్చువల్‌గా హాజరయ్యాడని బీసీసీఐ వర్గాల సమాచారం.భారత హెడ్ కోచ్ పదవి కోసం గంభీర్, రామన్‌తో పాటు మరో వ్యక్తి కూడా దరఖాస్తు చేసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఓ విదేశీ మాజీ క్రికెటర్ గంభీర్, రామన్‌లకు పోటీగా దరఖాస్తు సమర్పించినట్లు తెలుస్తుంది. CAC సదరు విదేశీ మాజీని రేపు ఇంటర్వ్యూ చేయనున్నట్లు ప్రచారం జరుగుతుంది. CAC ఎంత మందిని ఇంటర్వ్యూ చేసినా మరో 48 గంటల్లో భారత తదుపరి హెడ్ కోచ్ పేరును ప్రకటించాలని బీసీసీఐ డెడ్‌లైన్ పెట్టుకున్నట్లు సమాచారం. కాగా, టీమిండియా ప్రస్తుత హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనున్న విషయం తెలిసిందే. ఈ పదవిలో కొనసాగేందుకు ద్రవిడ్ మరోసారి దరఖాస్తు చేసుకోలేదు.ఇదిలా ఉంటే, ప్రస్తుతం టీమిండియా టీ20 ప్రపంచకప్ 2024తో బిజీగా ఉంది. మెగా టోర్నీలో భారత్ సూపర్-8కు అర్హత సాధించింది. సూపర్-8లో టీమిండియా.. ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌లతో తలపడనుంది.గ్రూప్-ఏ నుంచి భారత్‌తో పాటు యూఎస్ఏ సూపర్-8కు అర్హత సాధించగా, గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా , ఇంగ్లండ్ , గ్రూప్-సి నుంచి ఆఫ్ఘనిస్తాన్ , వెస్టిండీస్, గ్రూప్-డి నుంచి సౌతాఫ్రికా , బంగ్లాదేశ్ సూపర్-8లోకి ప్రవేశించాయి.సూపర్-8 గ్రూప్-1లో గ్రూప్-ఏ నుంచి భారత్ (A1).. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా (B1).. గ్రూప్-సి నుంచి ఆఫ్ఘనిస్తాన్ (C1).. గ్రూప్-డి నుంచి బంగ్లాదేశ్ (D2) జట్లు ఉన్నాయి.సూపర్-8 గ్రూప్ 2లో గ్రూప్-ఏ నుంచి యూఎస్ఏ (A2).. గ్రూప్-బి నుంచి ఇంగ్లండ్ (B2).. గ్రూప్-సి నుంచి వెస్టిండీస్ (C2).. గ్రూప్-డి నుంచి సౌతాఫ్రికా (D1) జట్లు ఉన్నాయి.సూపర్-8లో గ్రూప్-1 మ్యాచ్‌లు..జూన్ 20- ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఇండియా (బార్బడోస్)జూన్ 20- ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్ (ఆంటిగ్వా)జూన్ 22- ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ (ఆంటిగ్వా)జూన్ 22- ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా (సెయింట్ విన్సెంట్)జూన్ 24- ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా (సెయింట్ లూసియా)జూన్ 24- ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ (సెయింట్ విన్సెంట్)సూపర్-8లో గ్రూప్-2 మ్యాచ్‌లు..జూన్ 19- యూఎస్ఏ వర్సెస్ సౌతాఫ్రికా (ఆంటిగ్వా)జూన్ 19- ఇంగ్లండ్ వర్సెస్ వెస్టిండీస్ (సెయింట్ లూసియా)జూన్ 21- ఇంగ్లండ్ వర్సెస్ సౌతాఫ్రికా (సెయింట్ లూసియా)జూన్ 21- యూఎస్ఏ వర్సెస్ వెస్టిండీస్ (బార్బడోస్)జూన్ 23- యూఎస్ఏ వర్సెస్ ఇంగ్లండ్ (బార్బడోస్)జూన్ 23- వెస్టిండీస్ వర్సెస్ సౌతాఫ్రికా (ఆంటిగ్వా) -
'ఐర్లాండ్‌తో టీ20 సిరీస్.. అతడికి ఓపెనర్‌గా అవకాశం ఇవ్వాలి'
ఐర్లాండ్ సిరీస్‌లో టీమిండియా తరపున వెంకటేష్ అయ్యర్ ఇన్నింగ్స్‌ను ఆరంభించాలని భారత మాజీ ఆటగాడు వివి రామన్ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్-2021లో కేకేఆర్ తరపున అదరగొట్టిన వెకంటేష్ అయ్యర్‌కు.. అదే ఏడాది స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో భారత జట్టులో చోటు దక్కింది. ఈ సిరీస్‌లో అయ్యర్ పర్వాలేదనపించుకున్నాడు. అయితే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో అయ్యర్ తీవ్రంగా నిరాశ పరిచాడు. అయినప్పటికీ దక్షిణాఫ్రికా, ఐర్లాండ్ సిరీస్‌లకు అయ్యర్‌కు సెలక్టర్లు మరో అవకాశం ఇచ్చారు. కాగా ప్రోటీస్ సిరీస్‌లో అయ్యర్ కేవలం బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఇక ఐర్లాండ్‌తో సిరీస్‌లోనైనా భారత తుది జట్టులో అయ్యర్‌కు చోటు దక్కుతుందో లేదో వేచి చూడాలి. ఈ పర్యటనలో భాగంగా టీమిండియా రెండు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. తొలి టీ20 ఆదివారం(జూన్26) డబ్లిన్ వేదికగా జరగనుంది. "కొత్త ఆటగాళ్లకు ఈ సిరీస్‌లో అవకాశం ఇస్తే బాగుటుంది. ఈ జట్టులో చాలా మంది ఆటగాళ్లు కొన్ని మ్యాచ్‌ల నుంచి బెంచ్‌కే పరిమితమవుతున్నారు. అటువంటి ఆటగాళ్లకు కూడా అవకాశం ఇవ్వాలని భావిస్తున్నాను. ఇక వెంకటేష్ అయ్యర్ గత కొంత కాలంగా జట్టులో ఉన్నాడు. కానీ అతడికి తగినన్ని అవకాశాలు లభించడం లేదు. కాబట్టి ఈ సిరీస్‌లో అతడికి టీమిండియా తరపున ఓపెనింగ్ చేసే ఛాన్స్ ఇవ్వాలి" అని రామన్ పేర్కొన్నారు. చదవండి: ENG vs NZ: టెస్టుల్లో బెన్ స్టోక్స్ అరుదైన ఫీట్.. తొలి ఇంగ్లండ్ ఆటగాడిగా..! -
మిథాలీ రాజ్‌ను టార్గెట్ చేసి ఆ వ్యాఖ్యలు చేశాడా?
ఢిల్లీ: టీమిండియా ఉమెన్స్ క్రికెట్ మాజీ కోచ్ డబ్ల్యూవీ రామన్.. మహిళల జట్టులోనూ స్టార్ క్రికెటర్ల ఆధిపత్యం పెరిగిపోయిదంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. బీసీసీఐ గత గురువారం రామన్ స్థానంలో రమేశ్ పొవార్‌ను ప్రధాన కోచ్‌గా ఎంపిక చేసిన క్రమంలో రామన్ తన గళం పెంచాడు. ఒకవైపు పొవార్‌కు ఆల్ ద బెస్ట్ చెబుతూనే, కొన్ని విమర్శలు చేశాడు. మహిళల క్రికెట్లో స్టార్ కల్చర్ పెరిగిపోయిందంటూ బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్కి ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేశాడు. దీన్ని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు ధృవీకరించారు. కాగా, ఈ వ్యాఖ్యలు భారత మహిళా క్రికెట్ జట్టు సీనియర్ క్రికెటర్ మిథాలీ రాజ్‌ను టార్గెట్ చేసినట్లే కనబడుతోంది. ''ఉమెన్స్ టీమ్‌లో కొంత మంది క్రికెటర్ల ఆధిపత్యం పెరిగిపోయింది. జట్టుకి మించి ఎవరూ ఎక్కువ కాకూడదనేది నా ఉద్ధేశం. ఇప్పటికైనా టీమ్‌లో స్టార్ కల్చర్‌కి స్వస్తి పలకాలని కోరుతున్నా’ అని రామన్ విమర్శించాడు. డబ్ల్యూవీ రామన్ 2018 డిసెంబర్లో మహిళల జట్టు కోచ్‌గా ఎంపికయ్యారు. కానీ గత రెండున్నరేళ్లలో కరోనా దెబ్బకు పెద్దగా మ్యాచ్‌లే జరగలేదు. 2020 మార్చిలో జరిగిన టి20 ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరిన భారత్... ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. ఆ తర్వాత ఏడాదిపాటు టీమ్ బరిలోకి దిగలేదు. గత మార్చిలో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌ను భారత్ 1–4తో... టి20 సిరీస్‌ను 1–2తో ఓడిపోయింది. ఇదే రామన్‌పై వేటుకు కారణం కావచ్చు. కానీ సుదీర్ఘ విరామం తర్వాత జరిగిన ఒక సిరీస్‌లో ఓటమికి కోచ్‌ను బాధ్యుడిని చేయడం ఆశ్చర్యకరం. నిజానికి కోచ్‌గా రామన్‌కు మంచి గుర్తింపు ఉంది. టెక్నిక్‌పరమైన అంశాల్లో తమ ఆటతీరు ఆయన వల్లే మెరుగైందని భారత అమ్మాయిలు పలు సందర్భాల్లో చెప్పారు. ఇక రెండేళ్ల క్రితం కోచ్‌గా ఉన్న రమేశ్ పొవార్‌పై తీవ్రస్థాయిలో మిథాలీ రాజ్ ఆరోపణలు గుప్పించింది. ‘ఉద్దేశపూర్వకంగా నా కెరీర్‌ను నాశనం చేసేందుకు ప్రయత్నించాడు’ అంటూ పొవార్‌పై నిప్పులు చెరిగింది. దీనిపై పొవార్ కూడా గట్టిగా బదులిచ్చాడు. ఓపెనర్‌గా అవకాశం ఇవ్వకపోతే టోర్నీ మధ్యలో తప్పుకుంటానని మిథాలీ బెదిరించిందని, జట్టులో సమస్యలు సృష్టించిందని పొవార్ వ్యాఖ్యానించాడు. తదనంతర పరిణామాల్లో పొవార్‌ను కోచ్ పదవి నుంచి బోర్డు తప్పించింది. అయితే అదే పొవార్ మళ్లీ జట్టుకు ప్రధాన కోచ్‌గా రాగా.. మిథాలీ ఇప్పుడు వన్డే టీమ్ కెప్టెన్‌గా ఉంది. ఇప్పుడు రామన్ ఎవరు పేరు ప్రస్తావించకుండా స్టార్ కల్చర్ పెరిగిపోయిందంటూ రాసిన లేఖ మహిళా క్రికెట్ జట్టులో చర్చనీయాంశంగా మారింది. చదవండి: ఆమె బాధలో ఉంది.. బీసీసీఐ పట్టించుకోకపోవడం దారుణం రమేశ్ పొవార్‌కు బీసీసీఐ బంపర్ ఆఫర్.. రెండోసారి -
స్టార్ క్రికెటర్ల వంతపాట ఆగాలి
న్యూఢిల్లీ: క్రికెట్ జట్టులో స్టార్ల మాటే నెగ్గాలనే ఆటలు ఆగాలని భారత మహిళా జట్టు మాజీ కోచ్ డబ్ల్యూవీ రామన్ అన్నారు. జట్టుపై తన అభిప్రాయాలను జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీలకు ఈ–మెయిల్లో తెలియజేశారు. ఏ ఒక్క క్రికెటర్ పేరు చెప్పకపోయినా... జట్టులో ప్రస్తుతమున్న స్టార్ క్రికెటర్ అనే సంస్కృతి మారాలని గట్టిగా లేఖలో సూచించినట్లు తెలిసింది. బోర్డు అధ్యక్షుడికి మాజీ కోచ్ రామన్ ఈ–మెయిల్ పంపింది నిజమేనని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. స్టార్ సంస్కృతి జట్టుకు చేటు చేస్తోందని రామన్ చెప్పినట్లు తెలిసింది. దీనిపై అధ్యక్షుడు గంగూలీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆ అధికారి తెలిపారు. మొత్తం మీద సీనియర్ క్రికెటర్, హైదరాబాదీ స్టార్ మిథాలీ రాజ్ మళ్లీ వార్తల్లో నిలిచినట్లయింది. పేరు చెప్పకపోయినా ఇప్పుడు అందరికళ్లూ మిథాలీపైనే కేంద్రీకృతమయ్యాయి. మదన్‌లాల్ నేతృత్వంలోని క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) గురువారం 42 ఏళ్ల రమేశ్ పొవార్‌కు మళ్లీ అమ్మాయిల కోచింగ్ బాధ్యతలు అప్పజెప్పింది. 2018లో కోచ్‌గా పనిచేసిన పొవార్... మిథాలీతో వివాదం కారణంగా పదవి నుంచి వైదొలిగాడు. -
పొవార్ మళ్లీ వచ్చాడు...
దాదాపు రెండున్నరేళ్ల క్రితం భారత మహిళల క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్ రమేశ్ పొవార్. ఆ తర్వాత డబ్ల్యూవీ రామన్ ఆ స్థానంలోకి వచ్చాడు. ఇప్పుడు రామన్‌కు కొనసాగింపు ఇవ్వని బీసీసీఐ, ఇంటర్వ్యూ ద్వారా పొవార్‌కే మరో అవకాశం కల్పించింది. నాడు మిథాలీ రాజ్‌తో వివాదం తర్వాత పొవార్ తన పదవి పోగొట్టుకోగా... టి20 ప్రపంచకప్‌లో భారత జట్టు ఫైనల్ చేరిన తర్వాత కూడా రామన్‌కు మరో అవకాశం దక్కకపోవడం విశేషం. ముంబై: భారత మహిళల క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా రమేశ్ పొవార్ నియమితుడయ్యాడు. మదన్‌లాల్, ఆర్పీ సింగ్, సులక్షణా నాయక్ సభ్యులుగా ఉన్న బీసీసీఐ క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) ఇంటర్వ్యూ ద్వారా పొవార్‌ను ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. ఈ పదవి కోసం 35 మంది పోటీ పడటం విశేషం. ఇందులో ఇప్పటి వరకు కోచ్‌గా వ్యవహరించిన డబ్ల్యూవీ రామన్‌తోపాటు హృషికేశ్ కనిత్కర్, అజయ్ రాత్రా, మమతా మాబెన్, దేవిక పల్షికర్, హేమలత కలా, సుమన్ శర్మ తదితరులు ఉన్నారు. ‘పొవార్ చాలా కాలంగా కోచింగ్‌లో ఉన్నాడు. జట్టు కోసం అతను రూపొందించిన విజన్ మాకు చాలా నచ్చింది. టీమ్‌ను అత్యున్నత స్థాయికి చేర్చేందుకు అతని వద్ద చక్కటి ప్రణాళికలు ఉన్నాయి. ఆటపై అన్ని రకాలుగా స్పష్టత ఉన్న పొవార్ ఇకపై ఫలితాలు చూపించాల్సి ఉంది’ అని ïసీఏసీ సభ్యుడు మదన్‌లాల్ వెల్లడించారు. 42 ఏళ్ల పొవార్‌ను ప్రస్తుతం రెండేళ్ల కాలానికి కోచ్‌గా నియమించారు. మహిళల సీనియర్ టీమ్‌తో పాటు ‘ఎ’ టీమ్, అండర్–19 టీమ్‌లను కూడా అతనే పర్యవేక్షించాల్సి ఉంటుంది. మిథాలీ రాజ్‌తో వివాదం తర్వాత... రమేశ్ పొవార్ కోచ్‌గా ఉన్న సమయంలోనే భారత మహిళల జట్టు వరుసగా 14 టి20 మ్యాచ్‌లు గెలిచింది. అతడిని మొదటిసారి జూలై 2018లో జట్టుకు హెడ్ కోచ్‌గా తాత్కాలిక ప్రాతిపదికన నియమించారు. ఆ తర్వాత అదే ఏడాది నవంబర్‌లో వెస్టిండీస్‌లో జరిగిన టి20 ప్రపంచకప్ వరకు కాంట్రాక్ట్ పొడిగించారు. ఈ టోర్నీలో భారత్ సెమీఫైనల్ వరకు చేరింది. ఇంగ్లండ్ చేతిలో 8 వికెట్లతో భారత్ చిత్తుగా ఓడిన ఈ మ్యాచ్‌లో సీనియర్ బ్యాటర్ మిథాలీ రాజ్‌కు తుది జట్టులో స్థానం లభించలేదు. అయితే టోర్నీ ముగిశాక పొవార్‌పై మిథాలీ తీవ్ర వ్యాఖ్యలు చేయడం సంచలనం రేపింది. ‘ఉద్దేశపూర్వకంగా నా కెరీర్‌ను నాశనం చేసేందుకు ప్రయత్నించాడు’ అంటూ పొవార్‌పై మిథాలీ నిప్పులు చెరిగింది. దీనిపై పొవార్ కూడా గట్టిగా బదులిచ్చాడు. ఓపెనర్‌గా అవకాశం ఇవ్వకపోతే టోర్నీ మధ్యలో తప్పుకుంటానని మిథాలీ బెదిరించిందని, జట్టులో సమస్యలు సృష్టించిందని పొవార్ వ్యాఖ్యానించాడు. తదనంతర పరిణామాల్లో పొవార్‌ను కోచ్ పదవి నుంచి బోర్డు తప్పించింది. టి20 కెప్టెన్ హర్మన్‌ప్రీత్, స్మృతి మంధాన కలిసి పొవార్‌నే కొనసాగించమంటూ బీసీసీఐకి ప్రత్యేకంగా లేఖ రాసినా బోర్డు పట్టించుకోలేదు. రమేశ్ పొవార్ కెరీర్... ఆఫ్‌స్పిన్నర్‌గా భారత్ తరఫున 2 టెస్టులు, 31 వన్డేలు ఆడిన రమేశ్ పొవార్ 40 వికెట్లు పడగొట్టాడు. ముంబైకి చెందిన పొవార్ ఫస్ట్ క్లాస్ కెరీర్లో 470 వికెట్లు, 4,245 పరుగులు ఉన్నాయి. ఐపీఎల్లో అతను పంజాబ్ కింగ్స్ ఎలెవన్, కొచ్చి టస్కర్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. కోచ్‌గా ఈసీబీ లెవల్–2 సర్టిఫికెట్ అతనికి ఉంది. మహిళల జట్టు కోచ్ పదవి నుంచి తప్పించిన తర్వాత ఎన్సీఏలో కోచ్‌గా పని చేసిన పొవార్ శిక్షణలోనే ముంబై ఈ ఏడాది విజయ్ హజారే ట్రోఫీలో విజేతగా నిలిచింది. రామన్‌కు అవకాశం దక్కేనా? డబ్ల్యూవీ రామన్ 2018 డిసెంబర్లో మహిళల జట్టు కోచ్‌గా ఎంపికయ్యారు. కానీ గత రెండున్నరేళ్లలో కరోనా దెబ్బకు పెద్దగా మ్యాచ్‌లే జరగలేదు. 2020 మార్చిలో జరిగిన టి20 ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరిన భారత్... ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. ఆ తర్వాత ఏడాదిపాటు టీమ్ బరిలోకి దిగలేదు. గత మార్చిలో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌ను భారత్ 1–4తో... టి20 సిరీస్‌ను 1–2తో ఓడిపోయింది. ఇదే రామన్‌పై వేటుకు కారణం కావచ్చు. కానీ సుదీర్ఘ విరామం తర్వాత జరిగిన ఒక సిరీస్‌లో ఓటమికి కోచ్‌ను బాధ్యుడిని చేయడం ఆశ్చర్యకరం. నిజానికి కోచ్‌గా రామన్‌కు మంచి గుర్తింపు ఉంది. టెక్నిక్‌పరమైన అంశాల్లో తమ ఆటతీరు ఆయన వల్లే మెరుగైందని భారత అమ్మాయిలు పలు సందర్భాల్లో చెప్పారు. జట్టు సభ్యులందరికీ రామన్‌పై గౌరవ మర్యాదలు ఉన్నాయి. జూలైలో శ్రీలంకలో పర్యటించే భారత పురుషుల ద్వితీయ శ్రేణి జట్టుకు రామన్ కోచ్‌గా వెళ్లవచ్చని, అందుకే తప్పించారని వినిపిస్తోంది. ఇదే నిజమైతే ఓకే కానీ లేదంటే సరైన కారణం లేకుండా కొనసాగింపు ఇవ్వకపోవడం మాత్రం బోర్డు నిర్ణయంపై సందేహాలు రేకెత్తించేదే. మిథాలీతో పొసగేనా... త్వరలో ప్రారంభం కానున్న ఇంగ్లండ్ పర్యటన కోచ్‌గా పొవార్‌కు తొలి బాధ్యత. ఈ సిరీస్‌లో పాల్గొనే జట్టు ఎంపిక కోసం నీతూ డేవిడ్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీతో పొవార్ సమావేశం కానున్నాడు. ఇప్పటికే టి20ల నుంచి తప్పుకున్న మిథాలీ రాజ్ వన్డేల్లో ఇప్పటికీ కీలక బ్యాటర్ కావడంతోపాటు కెప్టెన్‌గా కొనసాగుతోంది. వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్‌కప్ వరకు ఆడతానని కూడా ఆమె స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ టూర్ కోసం ఆమె కెప్టెన్సీ నిలబెట్టుకోగలదా అనేది మొదటి సందేహం. భవిష్యత్తు పేరు చెప్పి ఆమెను తప్పించినా ఆశ్చర్యం లేదు. ఇక వరల్డ్‌కప్‌కు ముందు ఆస్ట్రేలియా పర్యటన కూడా ఉంది. అంటే దాదాపు ఏడాది పాటు మిథాలీ మెరుగైన ప్రదర్శన ఇవ్వడంతోపాటు కోచ్‌తో కూడా సరైన సంబంధాలు కొనసాగించడం పెద్ద సవాల్. నాటి ఘటన తర్వాత ఇద్దరూ కలిసి పని చేయడం అంత సులువు కాదు. గతానుభవాన్ని బట్టి చూస్తే పొవార్ అనూహ్యంగా ఏదో ఒక రోజు జట్టు ప్రయోజనాల కోసం అంటూ మిథాలీని పక్కన పెట్టినా ఆశ్చర్యం లేదు. ఇంటర్వ్యూ సందర్భంగా మిథాలీతో వివాదం గురించి కూడా పొవార్‌తో మాట్లాడినట్లు మదన్‌లాల్ చెప్పారు. ‘ఆ ఘటనలో తన తప్పేమీ లేదని, అందరు ప్లేయర్లతో కలిసి పని చేసేందుకు తాను సిద్ధమని పొవార్ స్పష్టం చేశాడు’ అని మదన్‌లాల్ వివరణ ఇచ్చారు. -
రమేశ్ పొవార్‌కు బీసీసీఐ బంపర్ ఆఫర్.. రెండోసారి
ముంబై: టీమిండియా మాజీ క్రికెటర్ రమేశ్ పొవార్ మరోసారి భారత మహిళల జట్టు ప్రధాన కోచ్‌గా ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ గురువారం తన ట్విటర్లో షేర్ చేసింది. టీమిండియా వుమెన్స్ హెడ్‌కోచ్ పదవికి మొత్తం 35 అప్లికేషన్స్ రాగా.. ఆర్పీ సింగ్, మదన్ లాల్, సులక్షణ నాయక్ నేతృత్వంలోని క్రికెట్ అడ్వైజరీ కమిటీ హెడ్‌కోచ్‌గా పొవార్‌కే ఓటు వేసింది. కమిటీ సిఫార్సు మేరకు బీసీసీఐ కూడా పొవార్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకుంది. కాగా ప్రస్తుతం టీమిండియా మహిళల కోచ్‌గా ఉన్న డబ్ల్యూవీ రామన్ నుంచి పొవార్ బాధ్యతలు తీసుకోనున్నారు. 2018 డిసెంబర్లో పొవార్ నుంచే బాధ్యతలు తీసుకున్న రామన్ జట్టును విజయవంతంగా నడిపాడు. 2020 టీ20 ప్రపంచకప్‌లో హర్మన్ ప్రీత్ సేన ఫైనల్‌దాకా వెళ్లడంలో రామన్ కీలకపాత్ర పోషించాడు. అంతకముందు పొవార్ 2018లో టీమిండియా మహిళల జట్టుకు కొంతకాలం పాటు హెడ్ కోచ్‌గా సేవలందించాడు. అప్పటి కోచ్ తుషార్ ఆరోతే పదవికి రాజీనామా చేయడంతో బాధ్యతలు తీసుకున్న పొవార్ నవంబర్ 30, 2018 వరకు హెడ్ కోచ్‌గా ఉన్నాడు. ఇక పొవార్ టీమిండియా తరపున 31 వన్డే మ్యాచ్‌లాడి 34 వికెట్లు.. 2 టెస్టులాడి 6 వికెట్లు తీశాడు. గతంలో సీనియర్ క్రికెటర్‌తో పొడచూపిన విబేధాల కారణం గా పొవార్ గతంలో మూడు నెలల కాలనికి మాత్రమే కోచ్‌గా వ్యవహరించాడు. ఆ తర్వాత పొవార్‌ను కొనసాగించడానికి ఇష్టపడని బీసీసీఐ.. డబ్యూవీ రామన్‌ను కోచ్‌గా నియమించింది. కాగా, మళ్లీ తాను కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్న పొవార్.. అందరికంటే ఎక్కువ మార్కులు కొట్టేసి భారత మహిళా క్రికెట్ జట్టు కోచ్‌గా మరొకసారి ఎంపిక కావడం విశేషం. చదవండి: ICC Rankings: టాప్‌లో టీమిండియా.. దక్షిణాఫ్రికా చెత్త రికార్డు మమ్మల్ని చూసే ద్రవిడ్ అలా... NEWS: Ramesh Powar appointed Head Coach of Indian Women’s Cricket team Details 👉 https://t.co/GByGFicBsX pic.twitter.com/wJsTZrFrWF — BCCI Women (@BCCIWomen) May 13, 2021 -
క్రికెట్ జట్టు హెడ్‌కోచ్ పదవి కోసం భారీ పోటీ
ముంబై: భారత మహిళల క్రికెట్ జట్టు హెడ్ కోచ్ పదవి కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. అనేక మంది ఈ పదవి కోసం దరఖాస్తులు దాఖలు చేశారు. ఇందులో ప్రస్తుత కోచ్ డబ్ల్యూవీ రామన్‌తో పాటు గతంలో జట్టుకు కోచ్‌గా పని చేసిన రమేశ్ పొవార్, తుషార్ అరోథే కూడా ఉన్నారు. రామన్ శిక్షణలో భారత జట్టు 2020 టి20 ప్రపంచకప్ ఫైనల్ చేరింది. ఈ ఏడాది మార్చితో ఆయన పదవీకాలం పూర్తి కావడంతో బీసీసీఐ కొత్తగా దరఖాస్తులు కోరింది. రామన్‌కు కూడా మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. అయితే ఆసక్తికరంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఐదుగురు మహిళలు ఈసారి కోచ్ పదవిపై ఆసక్తి కనబరుస్తున్నారు. మాజీ చీఫ్ సెలక్టర్ హేమలత కలా, మమతా మాబెన్, జయా శర్మ, సుమన్ శర్మ, నూషీన్ అల్ ఖదీర్ కోచ్ పదవిని ఆశిస్తున్నారు. భారత మహిళల సెలక్షన్ కమిటీ చైర్మన్ నీతూ డేవిడ్ ఇటీవల జాతీయ జట్టు మహిళల కోచ్ ఉంటే బాగుంటుందని అభిప్రాయం వెల్లడించిన నేపథ్యంలో ఇలాంటి స్పందన రావడం ఆసక్తికరం. గతంలో పూర్ణిమా రావు 2017 ఏప్రిల్ వరకు టీమ్‌కు కోచ్‌గా వ్యవహరించారు. మదన్‌లాల్ నేతృత్వంలోనే క్రికెట్ సలహా కమిటీ కొత్త కోచ్‌ను ఎంపిక చేస్తుంది. అయితే ఇంటర్వూ్య తేదీలను బోర్డు ఇంకా ప్రకటించలేదు. దరఖాస్తు చేసుకున్నవారిలో హేమలత ఇటీవల యూపీ టీమ్‌కు కోచ్‌గా వ్యవహరించింది. సుమన్ కూడా భారత జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా పని చేయగా... మాబెన్కు బంగ్లాదేశ్, చైనా జట్లకు కోచింగ్ ఇచ్చిన అనుభవం ఉంది. మాజీ క్రికెటర్ నూషీన్ కూడా కోచ్‌గా ఎంతో అనుభవం గడించింది. చదవండి: రామన్‌కే అవకాశం! -
రామన్‌కే అవకాశం
న్యూఢిల్లీ: భారత మహిళల క్రికెట్ జట్టు హెడ్ కోచ్ పదవి కోసం భారత మాజీ ప్లేయర్ డబ్ల్యూవీ రామన్ మరోసారి దరఖాస్తు చేయనున్నాడు. 2018 నుంచి మహిళల జట్టుకు కోచ్‌గా పని చేసిన రామన్ రెండేళ్ల ఒప్పందం ఇటీవల ముగిసింది. బీసీసీఐ కొత్త నియమావళి ప్రకారం కోచ్ కాంట్రాక్టు ముగిసిన తర్వాత ఆ పదవిని భర్తీ చేసేందుకు కొత్త నోటిఫికేషన్‌ను విడుదల చేసి దరఖాస్తులను ఆహ్వానించాలి. దాంతో కోచ్‌గా మళ్లీ పని చేసేందుకు మొగ్గు చూపుతోన్న రామన్... దరఖాస్తును దాఖలు చేయనున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. రామన్ పర్యవేక్షణలో భారత జట్టు 2020లో జరిగిన మహిళల టి20 ప్రపంచకప్‌లో ఫైనల్ వరకు చేరింది. అండర్–19 ప్రపంచకప్‌కు ఏడాది మాత్రమే ఉండటంతో బీసీసీఐ కొత్త జూనియర్ సెలక్షన్ కమిటీని కూడా నియమించనుంది. -
అదంతా ఆయన చలవే: అశ్విన్
న్యూఢిల్లీ: బంతిని వైవిధ్యంగా తిప్పడంలో టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ది ప్రత్యేక శైలి. తన ఖాళీ సమయాల్లో కూడా గల్లీ క్రికెట్ ఆడుతూ బంతిని వివిధ రకాల్లో స్పిన్ చేయడానికి యత్నిస్తూ ఉంటాడు అశ్విన్. 2015, 2016, 2017లలో వరుసగా మూడేళ్ల పాటు అతను 50కు పైగా టెస్టు వికెట్లు సాధించడం అతని ప్రతిభకు అద్దం పడుతోంది. తన కెరీర్ 54వ టెస్టులోనే 300 వికెట్లను మార్కును చేరిన ఘనత అశ్విన్‌ది. ఇటీవల కాలంలో తనకు అవకాశాలు తగ్గినా వచ్చిన అవకాశాలతో మళ్లీ గాడిలో పడటానికి ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటివరకూ 71 టెస్టులు ఆడిన అశ్విన్ 365 వికెట్లు సాధించాడు. ఒక టెస్టు మ్యాచ్‌లో పది వికెట్లను ఏడు సార్లు సాధిస్తే, ఐదేసి వికెట్లను 27సార్లు తీశాడు. ఈ గణాంకాలే అశ్విన్‌ను స్పిన్ బౌలింగ్‌లో ‘మాస్టర్’గా మార్చాయనేది కాదనలేని వాస్తవం. (అలా ముంబైలో కుదరదు బ్రదర్: రోహిత్) అయితే తన బౌలింగ్‌లో రిథమ్‌ను దొరకబుచ్చుకుని మాస్టర్ కావడంలో మాజీ క్రికెటర్ డబ్యూవీ రామన్ పాత్ర చాలా ఉందన్నాడు అశ్విన్. కెరీర్ ఆరంభంలో రామన్ చేసిన సూచనలే తన బౌలింగ్ మెరుగుదలకు, కెరీర్ ఎదుగుదలకు ఎంతగానో దోహదం చేశాయన్నాడు. ఈరోజు తాను ఇక్కడ ఉండటానికి డబ్యూవీ రామనే కారణమన్నాడు. ప్రస్తుతం భారత మహిళా క్రికెట్ జట్టుకు కోచ్‌గా పని చేస్తున్న రామన్.. తన కెరీర్‌ను తీర్చిదిద్దడంలో చాలా ఎక్కువగా సహకరించారని అశ్విన్ తెలిపాడు. అత్యంత క్రమశిక్షణతో ఉండే రామన్ బంతిని ఎంతటి కచ్చితమైన వేగంతో స్పిన్ చేయాలనే విషయాన్ని తనకు నూరిపోశాడన్నాడు. అదే సమయంలో బంతిని ల్యాండ్ చేసే విధానంలో కూడా రామన్ పాత్ర చాలా ఉందన్నాడు. తన బౌలింగ్‌లో రిథమ్ ఉందంటే అందుకు కారణం కచ్చితం డబ్యూవీ రామనేన్నాడు. బౌలింగ్ చేసేటప్పుడు 10 శాతం వేగం మించకూడదని నిబంధనను రామన్ సూచించినదేనన్నాడు. ఒకవేళ వేగాన్ని మార్చాల్సి వస్తే 15 శాతానికి పైగా వేగం ఉండాలని పదే పదే చెబుతూ ఉండేవారన్నాడు. ఇదే తనను ఒక గొప్ప స్థానంలో నిలబెట్టిందన్నాదు. తాను ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడుతున్నప్పట్నుంచీ రామన్ గొప్ప మార్గదర్శకుడిలా ముందుకు తీసుకెళ్లేవారన్నాడు. ఇప్పటికీ ఆయన చేసిన సూచనలు తప్పకుండా పాటిస్తానని అశ్విన్ చెప్పుకొచ్చాడు. (‘నాకు చిర్రెత్తుకొచ్చి.. ఆసీస్‌ను సవాల్ చేశా’) -
మహిళల క్రికెట్ జట్టు కోచ్ ఎంపికపై సమీక్ష
న్యూఢిల్లీ: భారత మహిళల క్రికెట్ జట్టు కోచ్ డబ్ల్యూవీ రామన్ నియామకాన్ని సమీక్షించాలని క్రికెట్ పరిపాలక కమిటీ(సీఓఏ) ఎట్టకేలకు బీసీసీఐ అంబుడ్స్‌మన్ డీకే జైన్‌ను కోరింది. నిజానికి ఏప్రిల్‌లోనే నియామకంపై సమీక్ష చేయాలని భావించినా ఇన్నాళ్లకు సీఓఏ ఈ నిర్ణయం తీసుకుంది. వివాదాస్పద పరిస్థితుల్లో కపిల్, అన్షుమన్, శాంతా రంగస్వామి నేతృత్వంలోని తాత్కాలిక కమిటీ రామన్‌ను గతేడాది డిసెంబర్లో కోచ్‌గా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లలోనే రామన్ ఎంపిక విషయంలో సీఓఏ సభ్యులు వినోద్ రాయ్, డయానా ఎడుల్జీ మధ్య విభేదాలు తలెత్తాయి. కోచ్‌ను తాత్కాలిక కమిటీ ఎంపిక చేయడం నిబంధనలకు విరుద్ధమని ఎడుల్జీ విమర్శించారు. గంగూలీ, సచిన్, లక్ష్మణ్ నేతృత్వంలోని క్రికెట్ సలహా సంఘానికే మాత్రమే ఆ అధికారం ఉందన్నారు. అప్పుడు ఆమెతో రాయ్ విభేదించారు. ఇప్పుడు మళ్లీ తాత్కాలిక కమిటీకే పురుషుల కోచ్ బాధ్యతను అప్పగించడం గమనార్హం. పరస్పర విరుద్ధ ప్రయోజనాల దృష్ట్యా గంగూలీ, లక్ష్మణ్ ఏదో ఒక పదవికే పరిమితం కావాలని జైన్ ఇంతకుముందే సూచించడంతో కపిల్ కమిటీకి బాధ్యత అప్పగించారు. కొత్తగా బీసీసీఐ ఆటగాళ్ల సంఘం ఏర్పాటులో కపిల్, శాంతా రంగస్వామి కీలకంగా పనిచేస్తుండటంతో వీరూ పరస్పర విరుద్ధ ప్రయోజనాల పరిధిలోకి వచ్చారు. దాంతో మహిళ క్రికెట్ కోచ్‌గా డబ్యూవీ రామన్ నియామకం సరిగా జరిగిందా.. లేదా అనే దానిపై స్పష్టత ఇవ్వాలని డీకే జైన్‌ను సీఓఏ విజ్ఞప్తి చేసింది. -
మహిళల క్రికెట్ జట్టు కోచ్ ఎవరో తెలుసా?
ముంబై: భారత మహిళల క్రికెట్ జట్టు కొత్త కోచ్‌గా డబ్ల్యూవీ రామన్ ఎంపికయ్యారు. గ్యారీ కిర్‌స్టెన్, హెర్షల్ గిబ్స్, ట్రెంట్ జాన్స్టన్, మార్క్ కోల్స్ వంటి హేమాహేమీలను అధిగమించి కోచ్ పదవిని దక్కించుకున్నారు. ఆయనను మాజీ క్రికెటర్లు కపిల్‌దేవ్ అన్షుమన్ గైక్వాడ్, శాంతా రంగస్వామిలతో కూడిన కమిటీ గురువారం ఇంటర్వ్యూ చేసి.. ఎంపిక చేసింది. తాత్కాలిక ప్రాతిపదికపై ఇటీవలి ప్రపంచ కప్ వరకు కోచ్ బాధ్యతలు నిర్వహించిన రమేశ్ పొవార్ పదవీకాలం గత నెల 30తో ముగియడంతో కొత్త కోచ్‌ను ఎంపిక చేయాల్సి వచ్చింది. (ఆ ఒక్కరు ఎవరో?) డబ్ల్యూవీ రామన్ ప్రస్తుతం బెంగాల్ రంజీ టీమ్ కోచ్‌గా ఉన్నారు. క్రికెట్‌పై విశేష పరిజ్ఞానం ఉన్న 53 ఏళ్ల రామన్.. భారత అండర్–19తో పాటు బెంగాల్, తమిళనాడు రంజీ జట్లకు, ఐపీఎల్లో కోల్‌కతా, పంజాబ్ జట్లకు శిక్షకుడిగా వ్యవహరించారు. టీమిండియా మాజీ ఓపెనర్ అయిన ఆయన ఆటగాడిగా కంటే కోచ్‌గానే ఎక్కువ పేరు సంపాదించుకున్నారు. టీమిండియా తరపున 11 టెస్టులు ఆడి 448 పరుగులు చేశారు. 27 వన్డేల్లో 617 పరుగులు సాధించారు. ఈ రెండు ఫార్మాట్లలో రెండేసి వికెట్లు తన ఖాతాలో వేసుకున్నారు.