న్యూఢిల్లీ: బంతిని వైవిధ్యంగా తిప్పడంలో టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ది ప్రత్యేక శైలి. తన ఖాళీ సమయాల్లో కూడా గల్లీ క్రికెట్ ఆడుతూ బంతిని వివిధ రకాల్లో స్పిన్ చేయడానికి యత్నిస్తూ ఉంటాడు అశ్విన్. 2015, 2016, 2017లలో వరుసగా మూడేళ్ల పాటు అతను 50కు పైగా టెస్టు వికెట్లు సాధించడం అతని ప్రతిభకు అద్దం పడుతోంది. తన కెరీర్ 54వ టెస్టులోనే 300 వికెట్లను మార్కును చేరిన ఘనత అశ్విన్‌ది. ఇటీవల కాలంలో తనకు అవకాశాలు తగ్గినా వచ్చిన అవకాశాలతో మళ్లీ గాడిలో పడటానికి ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటివరకూ 71 టెస్టులు ఆడిన అశ్విన్ 365 వికెట్లు సాధించాడు. ఒక టెస్టు మ్యాచ్‌లో పది వికెట్లను ఏడు సార్లు సాధిస్తే, ఐదేసి వికెట్లను 27సార్లు తీశాడు. ఈ గణాంకాలే అశ్విన్‌ను స్పిన్ బౌలింగ్‌లో ‘మాస్టర్’గా మార్చాయనేది కాదనలేని వాస్తవం. (అలా ముంబైలో కుదరదు బ్రదర్: రోహిత్)
అయితే తన బౌలింగ్‌లో రిథమ్‌ను దొరకబుచ్చుకుని మాస్టర్ కావడంలో మాజీ క్రికెటర్ డబ్యూవీ రామన్ పాత్ర చాలా ఉందన్నాడు అశ్విన్. కెరీర్ ఆరంభంలో రామన్ చేసిన సూచనలే తన బౌలింగ్ మెరుగుదలకు, కెరీర్ ఎదుగుదలకు ఎంతగానో దోహదం చేశాయన్నాడు. ఈరోజు తాను ఇక్కడ ఉండటానికి డబ్యూవీ రామనే కారణమన్నాడు. ప్రస్తుతం భారత మహిళా క్రికెట్ జట్టుకు కోచ్‌గా పని చేస్తున్న రామన్.. తన కెరీర్‌ను తీర్చిదిద్దడంలో చాలా ఎక్కువగా సహకరించారని అశ్విన్ తెలిపాడు. అత్యంత క్రమశిక్షణతో ఉండే రామన్ బంతిని ఎంతటి కచ్చితమైన వేగంతో స్పిన్ చేయాలనే విషయాన్ని తనకు నూరిపోశాడన్నాడు. అదే సమయంలో బంతిని ల్యాండ్ చేసే విధానంలో కూడా రామన్ పాత్ర చాలా ఉందన్నాడు. తన బౌలింగ్‌లో రిథమ్ ఉందంటే అందుకు కారణం కచ్చితం డబ్యూవీ రామనేన్నాడు. బౌలింగ్ చేసేటప్పుడు 10 శాతం వేగం మించకూడదని నిబంధనను రామన్ సూచించినదేనన్నాడు. ఒకవేళ వేగాన్ని మార్చాల్సి వస్తే 15 శాతానికి పైగా వేగం ఉండాలని పదే పదే చెబుతూ ఉండేవారన్నాడు. ఇదే తనను ఒక గొప్ప స్థానంలో నిలబెట్టిందన్నాదు. తాను ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడుతున్నప్పట్నుంచీ రామన్ గొప్ప మార్గదర్శకుడిలా ముందుకు తీసుకెళ్లేవారన్నాడు. ఇప్పటికీ ఆయన చేసిన సూచనలు తప్పకుండా పాటిస్తానని అశ్విన్ చెప్పుకొచ్చాడు. (‘నాకు చిర్రెత్తుకొచ్చి.. ఆసీస్‌ను సవాల్ చేశా’)
Comments
Please login to add a commentAdd a comment