భారత పురుషుల క్రికెట్ జట్టు తదుపరి హెడ్ కోచ్ ఎవరన్న అంశంపై పూర్తి స్థాయిలో స్పష్టత రావడం లేదు. ఈ పదవి కోసం మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ ఒక్కడే దరఖాస్తు చేసుకున్నాడని.. అతడి నియామకం దాదాపుగా ఖరారైపోయిందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
అయితే, మంగళవారం నాటి ఇంటర్వ్యూ నేపథ్యంలో రేసులోకి కొత్త పేరు దూసుకువచ్చింది. డబ్ల్యూవీ రామన్ సైతం ప్రధాన కోచ్ పదవి కోసం అప్లై చేసుకున్న విషయం బయటకు వచ్చింది.
సీఏసీని ఇంప్రెస్ చేసింది ఎవరు?
గంభీర్‌తో పాటు రామన్ కూడా క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) ఆన్‌లైన్‌లో మంగళవారం నిర్వహించిన ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. ఈ క్రమంలో భారత జట్టు కోసం వచ్చే మూడేళ్లపాటు తన అనుభవాన్ని ఎలా ఉపయోగిస్తానని, పూర్తిస్థాయిలో ఏమేరకు అందుబాటులో ఉంటాననేది గంభీర్ కమిటీకి తెలిపాడు.
సుమారు 40 నిమిషాల పాటు ఇందుకు సంబంధించి ప్రజెంటేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అదే విధంగా రామన్ సైతం తన ప్రణాళిక గురించి వివరించినట్లు సమాచారం. అయితే, గంభీర్ కంటే కూడా రామన్ ఇచ్చిన ప్రజెంటేషన్ సీఏసీకి ఎక్కువగా నచ్చినట్లు సమాచారం.
ఈ క్రమంలో బుధవారం నాటి సెకండ్ రౌండ్ తర్వాత కమిటి ఎలాంటి నిర్ణయం తీసుకోనుందనే అంశం ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో డబ్ల్యూవీ రామన్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.
రామన్ ట్వీట్ వైరల్
‘‘ఓ డియర్!!’’ అంటూ నిరాశలో కూరుకుపోక తప్పదన్న అర్థం వచ్చేలా రామన్ పోస్ట్ పెట్టాడు. అయితే, అది ఎవరిని ఉద్దేశించి పెట్టాడో అర్థం కావడం లేదంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
గంభీర్ వైపే బోర్డు మొగ్గు చూపుతుందే కాబట్టి రామన్ ఇలా ట్వీట్ చేశాడా? లేదంటే గంభీర్ కంటే తానే బెటర్ అని చెప్తున్నాడా అని బుర్రకు పదునుపెడతున్నారు. ఇక హెడ్ కోచ్ నియామకానికి సంబంధించి బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన వచ్చేంత వరకు ఇలాంటి ఊహాగానాలు తప్పవు.
ద్రవిడ్ తర్వాత
కాగా టీమిండియా ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ టీ20 ప్రపంచకప్-2024 తర్వాత తప్పుకోనున్నాడు. ఈ మెగా టోర్నీలో అమెరికాలో లీగ్ దశలో మూడు మ్యాచ్‌లు గెలిచిన రోహిత్ సేన.. సూపర్-8 కోసం వెస్టిండీస్‌లో అడుగుపెట్టింది. ఈ ఐసీసీ ఈవెంట్ తర్వాత తర్వాత భారత జట్టు తదుపరి జింబాబ్వేతో సిరీస్ ఆడనుంది.
చదవండి: శ్రేయస్ అయ్యర్ రీఎంట్రీ.. జింబాబ్వే టీ20 సిరీస్‌కు ఐపీఎల్ హీరోలు
Comments
Please login to add a commentAdd a comment