టీమిండియా తదుపరి హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ పేరు దాదాపుగా ఖరారైన తరుణంలో రేసులోకి కొత్తగా మరో పేరు తెరపైకి వచ్చింది. భారత క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్, భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ హెడ్ కోచ్ డబ్ల్యూవీ రామన్ టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం గంభీర్‌తో పాటు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తుంది.
బీసీసీఐ క్రికెట్ అడ్వైజరీ కమిటీ (CAC) ఇవాళ (జూన్ 18) గంభీర్‌తో పాటు రామన్‌ను కూడా ఇంటర్వ్యూ చేసిందని సమాచారం. CAC ముందు రామన్ ఇన్ పర్సన్ హాజరయ్యారని.. గంభీర్ వర్చువల్‌గా హాజరయ్యాడని బీసీసీఐ వర్గాల సమాచారం.
భారత హెడ్ కోచ్ పదవి కోసం గంభీర్, రామన్‌తో పాటు మరో వ్యక్తి కూడా దరఖాస్తు చేసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఓ విదేశీ మాజీ క్రికెటర్ గంభీర్, రామన్‌లకు పోటీగా దరఖాస్తు సమర్పించినట్లు తెలుస్తుంది.
CAC సదరు విదేశీ మాజీని రేపు ఇంటర్వ్యూ చేయనున్నట్లు ప్రచారం జరుగుతుంది. CAC ఎంత మందిని ఇంటర్వ్యూ చేసినా మరో 48 గంటల్లో భారత తదుపరి హెడ్ కోచ్ పేరును ప్రకటించాలని బీసీసీఐ డెడ్‌లైన్ పెట్టుకున్నట్లు సమాచారం. కాగా, టీమిండియా ప్రస్తుత హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనున్న విషయం తెలిసిందే. ఈ పదవిలో కొనసాగేందుకు ద్రవిడ్ మరోసారి దరఖాస్తు చేసుకోలేదు.
ఇదిలా ఉంటే, ప్రస్తుతం టీమిండియా టీ20 ప్రపంచకప్ 2024తో బిజీగా ఉంది. మెగా టోర్నీలో భారత్ సూపర్-8కు అర్హత సాధించింది. సూపర్-8లో టీమిండియా.. ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌లతో తలపడనుంది.
గ్రూప్-ఏ నుంచి భారత్‌తో పాటు యూఎస్‌ఏ సూపర్-8కు అర్హత సాధించగా, గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా , ఇంగ్లండ్ , గ్రూప్-సి నుంచి ఆఫ్ఘనిస్తాన్ , వెస్టిండీస్, గ్రూప్-డి నుంచి సౌతాఫ్రికా , బంగ్లాదేశ్ సూపర్-8లోకి ప్రవేశించాయి.
సూపర్-8 గ్రూప్-1లో గ్రూప్-ఏ నుంచి భారత్ (A1).. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా (B1).. గ్రూప్-సి నుంచి ఆఫ్ఘనిస్తాన్ (C1).. గ్రూప్-డి నుంచి బంగ్లాదేశ్ (D2) జట్లు ఉన్నాయి.
సూపర్-8 గ్రూప్ 2లో గ్రూప్-ఏ నుంచి యూఎస్‌ఏ (A2).. గ్రూప్-బి నుంచి ఇంగ్లండ్ (B2).. గ్రూప్-సి నుంచి వెస్టిండీస్ (C2).. గ్రూప్-డి నుంచి సౌతాఫ్రికా (D1) జట్లు ఉన్నాయి.
సూపర్-8లో గ్రూప్-1 మ్యాచ్‌లు..
జూన్ 20- ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఇండియా (బార్బడోస్)
జూన్ 20- ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్ (ఆంటిగ్వా)
జూన్ 22- ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ (ఆంటిగ్వా)
జూన్ 22- ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా (సెయింట్ విన్సెంట్)
జూన్ 24- ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా (సెయింట్ లూసియా)
జూన్ 24- ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ (సెయింట్ విన్సెంట్)
సూపర్-8లో గ్రూప్-2 మ్యాచ్‌లు..
జూన్ 19- యూఎస్‌ఏ వర్సెస్ సౌతాఫ్రికా (ఆంటిగ్వా)
జూన్ 19- ఇంగ్లండ్ వర్సెస్ వెస్టిండీస్ (సెయింట్ లూసియా)
జూన్ 21- ఇంగ్లండ్ వర్సెస్ సౌతాఫ్రికా (సెయింట్ లూసియా)
జూన్ 21- యూఎస్‌ఏ వర్సెస్ వెస్టిండీస్ (బార్బడోస్)
జూన్ 23- యూఎస్‌ఏ వర్సెస్ ఇంగ్లండ్ (బార్బడోస్)
జూన్ 23- వెస్టిండీస్ వర్సెస్ సౌతాఫ్రికా (ఆంటిగ్వా)
Comments
Please login to add a commentAdd a comment