
న్యూఢిల్లీ: భారత మహిళల క్రికెట్ జట్టు హెడ్ కోచ్ పదవి కోసం భారత మాజీ ప్లేయర్ డబ్ల్యూవీ రామన్ మరోసారి దరఖాస్తు చేయనున్నాడు. 2018 నుంచి మహిళల జట్టుకు కోచ్‌గా పని చేసిన రామన్ రెండేళ్ల ఒప్పందం ఇటీవల ముగిసింది. బీసీసీఐ కొత్త నియమావళి ప్రకారం కోచ్ కాంట్రాక్టు ముగిసిన తర్వాత ఆ పదవిని భర్తీ చేసేందుకు కొత్త నోటిఫికేషన్‌ను విడుదల చేసి దరఖాస్తులను ఆహ్వానించాలి. దాంతో కోచ్‌గా మళ్లీ పని చేసేందుకు మొగ్గు చూపుతోన్న రామన్... దరఖాస్తును దాఖలు చేయనున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. రామన్ పర్యవేక్షణలో భారత జట్టు 2020లో జరిగిన మహిళల టి20 ప్రపంచకప్‌లో ఫైనల్ వరకు చేరింది. అండర్–19 ప్రపంచకప్‌కు ఏడాది మాత్రమే ఉండటంతో బీసీసీఐ కొత్త జూనియర్ సెలక్షన్ కమిటీని కూడా నియమించనుంది.
Comments
Please login to add a commentAdd a comment