డబ్ల్యూవీ రామన్
ముంబై: భారత మహిళల క్రికెట్ జట్టు కొత్త కోచ్‌గా డబ్ల్యూవీ రామన్ ఎంపికయ్యారు. గ్యారీ కిర్‌స్టెన్, హెర్షల్ గిబ్స్, ట్రెంట్ జాన్‌స్టన్, మార్క్ కోల్స్ వంటి హేమాహేమీలను అధిగమించి కోచ్ పదవిని దక్కించుకున్నారు. ఆయనను మాజీ క్రికెటర్లు కపిల్‌దేవ్ అన్షుమన్ గైక్వాడ్, శాంతా రంగస్వామిలతో కూడిన కమిటీ గురువారం ఇంటర్వ్యూ చేసి.. ఎంపిక చేసింది. తాత్కాలిక ప్రాతిపదికపై ఇటీవలి ప్రపంచ కప్ వరకు కోచ్ బాధ్యతలు నిర్వహించిన రమేశ్ పొవార్ పదవీకాలం గత నెల 30తో ముగియడంతో కొత్త కోచ్‌ను ఎంపిక చేయాల్సి వచ్చింది. (ఆ ఒక్కరు ఎవరో?)
డబ్ల్యూవీ రామన్ ప్రస్తుతం బెంగాల్ రంజీ టీమ్ కోచ్‌గా ఉన్నారు. క్రికెట్‌పై విశేష పరిజ్ఞానం ఉన్న 53 ఏళ్ల రామన్.. భారత అండర్–19తో పాటు బెంగాల్, తమిళనాడు రంజీ జట్లకు, ఐపీఎల్‌లో కోల్‌కతా, పంజాబ్ జట్లకు శిక్షకుడిగా వ్యవహరించారు. టీమిండియా మాజీ ఓపెనర్ అయిన ఆయన ఆటగాడిగా కంటే కోచ్‌గానే ఎక్కువ పేరు సంపాదించుకున్నారు. టీమిండియా తరపున 11 టెస్టులు ఆడి 448 పరుగులు చేశారు. 27 వన్డేల్లో 617 పరుగులు సాధించారు. ఈ రెండు ఫార్మాట్లలో రెండేసి వికెట్లు తన ఖాతాలో వేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment