Suryakumar likely to reclaim opening slot Against New Zealand T20 Series - Sakshi
Sakshi News home page

IND vs NZ: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌.. టీమిండియా ఓపెనర్‌గా సూర్యకుమార్‌

Nov 16 2022 4:52 PM | Updated on Nov 16 2022 5:25 PM

IND vs NZ: Suryakumar likely to reclaim opening slot, - Sakshi

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు టీమిండియా సన్నద్దమవుతోంది. ఇప్పటికే కివీస్‌ గడ్డపై అడుగుపెట్టిన భారత జట్టు ప్రాక్టీస్‌ సెషన్స్‌లో బీజీబీజీగా గడుపుతోంది. అయితే ఈ పర్యటనలో భాగంగా టీమిండియా మూడు టీ20లు వన్డేలు ఆడనుంది. కాగా ఈ కివీస్‌ టూర్‌కు భారత సీనియర్‌ ఆటగాళ్లు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, కేఎల్‌ రాహుల్‌ దూరమయ్యారు.

దీంతో టీ20 సిరీస్‌కు హార్దిక్‌ పాండ్యా.. వన్డే సిరీస్‌కు శిఖర్‌ ధావన్‌ సారథ్యం వహించనున్నారు. మరోవైపు రాహల్‌ ద్రవిడ్‌కు కూడా విశ్రాంతి ఇవ్వడంతో జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) డైరెక్టర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ మరో సారి హెడ్‌ కోచ్‌ బాధ్యతలు చేపట్టాడు.  అదే విధంగా తొలిసారి భారత టీ20 జట్టులో యువ ఆటగాడు శుబ్‌మాన్‌ గిల్‌కు చోటుదక్కింది.

భారత ఓపెనర్లగా గిల్‌, సూర్య
ఇక నవంబర్‌ 18న వెల్లింగ్టన్‌ వేదికగా భారత్‌-న్యూజిలాండ్‌ల మధ్య తొలి టీ20 జరగనుంది. కాగా ఈ సిరీస్‌కు రెగ్యూలర్‌ ఓపెనర్లు రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌ దూరం కావడంతో.. భారత ఇన్నింగ్స్‌ను ఎవరు ప్రారంభిస్తారన్నది అందరి మెదడలను తొలుస్తున్న ప్రశ్న.

అయితే టీ20 సిరీస్‌లో ఓపెనర్లుగా శుబ్‌మాన్‌ గిల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ను పంపాలని టీమిండియా మేనేజేమెంట్‌ భావిస్తున్నట్లు సమాచారం. కాగా శుబ్‌మాన్‌ గిల్‌ వన్డేలతో పాటు ఐపీఎల్‌లో కూడా ఓపెనింగ్‌ చేసిన అనుభవం ఉంది. ఇక సూర్య కూడా ఈ ఏడాది వెస్టిండీస్‌ సిరీస్‌లో రోహిత్‌ జోడిగా బరిలోకి దిగాడు. ఓపెనర్‌గా వచ్చిన సూర్య పర్వాలేదనిపించాడు.

న్యూజిలాండ్‌ పర్యటనకు భారత టీ20 జట్టు..
హార్ధిక్‌ పాండ్యా (కెప్టెన్‌), రిషబ్‌ పంత్‌ (వైస్‌ కెప్టెన్‌), ఇషాన్‌ కిషన్‌, శుభ్‌మన్‌ గిల్‌, దీపక్‌ హుడా, సూర్యకుమార్‌ యాదవ్‌, శ్రేయస్‌ అయ్యర్‌, సంజూ శాంసన్‌, వాషింగ్టన్‌ సుందర్‌, యుజ్వేంద్ర చహల్‌, కుల్దీప్‌ యాదవ్‌, హర్షల్‌ పటేల్‌, మహ్మద్‌ సిరాజ్‌, భువనేశ్వర్‌ కుమార్‌, అర్షదీప్‌ సింగ్‌, ఉమ్రాన్‌ మాలిక్‌
చదవండి: T20 WC 2022: బాబర్‌ చేసిన తప్పు అదే.. అందుకే పాకిస్తాన్‌ ఓడిపోయింది! లేదంటే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement