DC Vs LSG: నికోల‌స్ పూర‌న్ విధ్వంసం.. వ‌రుస‌గా 4 సిక్స‌ర్లు! | Nicholas Pooran Launches Epic Onslaught in 28-Run Over Vs DC In IPL 2025, Watch Video Goes Viral | Sakshi
Sakshi News home page

IPL 2025 DC Vs LSG: నికోల‌స్ పూర‌న్ విధ్వంసం.. వ‌రుస‌గా 4 సిక్స‌ర్లు!

Published Mon, Mar 24 2025 10:13 PM | Last Updated on Tue, Mar 25 2025 5:42 PM

Nicholas Pooran Launches Epic Onslaught in 28-Run Over vs DC In IPL 2025

PC: BCCI/IPL.com

ఐపీఎల్‌-2025లో వైజాగ్ వేదిక‌గా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో మ్యాచ్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ స్టార్ ప్లేయ‌ర్‌ నికోలస్ పూరన్  విధ్వంసకర ప్రదర్శన చేశాడు. ఫ‌స్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వ‌చ్చిన పూర‌న్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగిపోయాడు. 17 ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోర్ వద్ద ఔట‌య్యే ప్ర‌మాదం నుంచి త‌ప్పించుకున్న పూర‌న్‌.. ఆ త‌ర్వాత సిక్స‌ర్ల వ‌ర్షం కురిపించాడు.

ప్ర‌త్య‌ర్ధి బౌల‌ర్ల‌ను ఊచ‌కోత కోశాడు. ఈ క్ర‌మంలో పూర‌న్ కేవ‌లం 24 బంతుల్లోనే త‌న హాఫ్ సెంచ‌రీ మార్క్‌ను అందుకున్నాడు. ముఖ్యంగా పార్ట్ టైమ్ బౌల‌ర్ ట్రిస్ట‌న్ స్ట‌బ్స్‌ను ఈ కరీబియ‌న్ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్‌ ఊతికారేశాడు. ల‌క్నో ఇన్నింగ్స్ 13వ ఓవ‌ర్ వేసిన స్ట‌బ్స్ బౌలింగ్‌లో పూర‌న్ వ‌రుస‌గా 4 సిక్స‌ర్లు, ఒక ఫోర్ బాదాడు.

దీంతో ఆ ఓవ‌ర్‌లో ఏకంగా 28 ప‌రుగులు వ‌చ్చాయి. అత‌డి ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది. పూర‌న్‌ ఓవ‌రాల్‌గా 30 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్స్‌ల‌తో 75 ప‌రుగులు చేశాడు. అత‌డితో పాటు మిచెల్ మార్ష్ కూడా తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు.

మార్ష్ 36 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌ల‌తో 72 ప‌రుగులు చేశాడు. వీరిద్ద‌రి విధ్వంసం ఫ‌లితంగా తొలుత బ్యాటింగ్ చేసిన ల‌క్నో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 209 ప‌రుగులు చేసింది. ఢిల్లీ బౌల‌ర్ల‌లో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు, కుల్దీప్ యాద‌వ్ రెండు వికెట్లు సాధించ‌గా.. విప్రాజ్ నిగ‌మ్‌, ముఖేష్ కుమార్ త‌లా వికెట్ సాధించారు.
 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement