opening pair
-
ఆసియా కప్, వరల్డ్‌కప్‌లలో రోహిత్‌కు జత ఎవరు..? కొత్తగా రేసులోకి మరో ఆటగాడు
టీమిండియాను ఓపెనర్ల సమస్య చాలా కాలంగా వేధిస్తూనే ఉంది. సచిన్-గంగూలీ, సచిన్-సెహ్వాగ్, గంభీర్-సెహ్వాగ్‌ల శకం ముగిసాక కొంతకాలం పాటు రోహిత్ శర్మ-శిఖర్ ధవన్‌ల జోడీ విజయవంతంగా సాగింది. అయితే కాలక్రమంలో ధవన్ ఫామ్ కోల్పోవడం, కేఎల్ రాహుల్ లాంటి యువ ఆటగాళ్లు సత్తా చాటడంతో ధవన్ క్రమేనా కనుమరుగైపోయాడు. రాహుల్ అన్ని ఫార్మాట్లలో రాణించడంతో ధవన్ స్థానాన్ని ఆక్రమించాడు. అయితే ఇటీవలి కాలంలో బీసీసీఐ ఫార్మాట్‌కు ఓ జట్టును ప్రకటిస్తుండటం.. సిరీస్, సిరీస్‌కు కీలక ఆటగాళ్లను రెస్ట్ పేరుతో పక్కకు పెడుతుండటం.. రెగ్యులర్ ఓపెనర్ కేఎల్ రాహుల్ తరుచూ గాయాల బారిన పడుతుండటంతో ఓపెనర్ల సమస్య మళ్లీ మొదటికొచ్చింది. ఈ క్రమంలో రాహుల్‌కు ప్రత్యామ్నాయంగా ఐపీఎల్ హీరో శుభ్‌మన్ గిల్ తెరపైకి వచ్చాడు. రోహిత్‌కు జతగా గిల్ అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి రాహుల్‌ను మరిపించాడు. అయితే గిల్ ఫామ్ కూడా ఇటీవలికాలంలో ఆశించిన స్థాయిలో లేకపోవడంతో సమస్య పునరావృతం అయ్యింది. త్వరలో ఆసియా కప్, వన్డే వరల్డ్‌కప్ లాంటి మెగా ఈవెంట్లు ఉండటంతో బీసీసీఐకి ఓపెనర్ల సమస్య పెద్ద తలనొప్పిగా మారింది. సీనియర్ ఓపెనర్ కేఎల్ రాహుల్ గాయం నుంచి పూర్తిగా కోలుకోవడం, ఐపీఎల్-2023కి ముందు ఆతర్వాత జరిగిన సిరీస్‌ల్లో ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్ లాంటి యువ ఓపెనర్లు సత్తా చాటడంతో సమస్య మరింత తీవ్రతరమైంది. దీనికి తోడు ప్రస్తుతం జరుగుతున్న రాయల్ లండన్ వన్డే కప్‌లో మరో యంగ్ ఓపెనర్ పృథ్వీ షా ఆకాశమే హద్దుగా చెలరేగుతుండటం (డబుల్ సెంచరీ, సెంచరీ) బీసీసీఐని మరింత ఇరకాటంలో పడేసింది. మరోవైపు వెటరన్ శిఖర్ ధవన్‌కు ఆఖరి అవకాశం ఇవ్వాలన్న డిమాండ్లు కూడా తీవ్రతరమవుతుండటంతో బీసీసీఐకి ఏం చేయాలో పాలుపోక స్తబ్ధతలో ఉండిపోయింది. ప్రస్తుతం లైమ్‌లైట్‌లో ఉన్న అందరు ఓపెనర్లను పరిగణలోకి తీసుకుంటే 90 శాతం అర్హులే ఉండటంతో సెలక్టర్లు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఓపెనింగ్ స్థానాల కోసం రోహిత్‌తో పాటు మొత్తం 8 మంది (పృథ్వీ షా, రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, శిఖర్ ధవన్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్) లైన్లో ఉన్నారు. వీరితోనే సతమతమవుతుంటే యువ ఆటగాళ్లు సాయి సుదర్శన్, దేవ్‌దత్ పడిక్కల్‌లు మేము సైతం అంటున్నారు. మరి ఈ పరిస్థితుల్లో భారత సెలెక్టర్లు ఆసియా కప్, వన్డే వరల్డ్‌కప్‌లకు రోహిత్‌కు జతగా ఎవరిని ఎంపిక చేస్తారో వేచి చూడాలి. -
Ashes 5th Test Day 4: డేవిడ్ వార్నర్ ప్రపంచ రికార్డు
ఆసీస్ వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. టెస్ట్‌ల్లో అత్యధిక సార్లు (25) 100 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాలు నెలకొల్పిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. యాషెస్ సిరీస్ 2023లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్ నాలుగో రోజు ఆటలో ఉస్మాన్ ఖ్వాజాతో తొలి వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేయడంతో వార్నర్ ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో అతను జాక్ హబ్స్, గ్రేమ్ స్మిత్, అలిస్టర్ కుక్ (24)ల పేరిట సంయుక్తంగా ఉన్న రికార్డును అధిగమించాడు. ఈ జాబితాలో మైఖేల్ ఆథర్టన్ (23), వీరేంద్ర సెహ్వాగ్ (23) మూడో స్థానంలో ఉన్నారు. కాగా, యాషెస్ ఆఖరి టెస్ట్‌లో ఇంగ్లండ్ నిర్ధేశించిన 384 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్.. 38 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 135 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం మొదలుకావడంతో అంపైర్లు మ్యాచ్‌కు నిలిపి వేశారు. ఆసీస్ గెలుపుకు ఇంకా 249 పరుగుల దూరంలో ఉంది. డేవిడ్ వార్నర్ (58), ఉస్మాన్ ఖ్వాజా (69) క్రీజ్‌లో ఉన్నారు. 2017-18 సిరీస్ తర్వాత తొలిసారి.. యాషెస్‌లో 2017-18 సిరీస్ తర్వాత తొలిసారి శతక భాగస్వామ్యం నమోదైంది. ఆ సీజన్లో ఆసీస్ ఓపెనింగ్ పెయిర్ వార్నర్-కెమరూన్ బాన్‌క్రాఫ్ట్ తొలి వికెట్‌కు 122 పరుగుల పార్ట్నర్షిప్ నమోదు చేయగా.. తాజాగా జరుగుతున్న మ్యాచ్‌లో వార్నర్-ఖ్వాజా జోడీ అజేయమైన 135 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. ఏ వికెట్‌కైనా అత్యధిక సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేసిన నాలుగో ఆటగాడిగా.. యాషెస్‌లో ఏ వికెట్‌కైనా అత్యధిక సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేసిన జాబితాలో వార్నర్ నాలుగో స్థానానికి ఎగబాకాడు. యాషెస్‌లో వార్నర్ ఇప్పటివరకు 8 సెంచరీ పార్ట్‌నర్‌షిప్స్‌లో భాగమయ్యాడు. ఈ రికార్డుకు సంబంధించిన జాబితాలో జాక్ హబ్స్ (16) టాప్‌లో ఉండగా.. హెర్బర్ట్ సట్చ్క్లిఫ్ (15), మార్క్ టేలర్ (10) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. యాషెస్ ఐదో టెస్ట్ స్కోర్ వివరాలు (నాలుగో రోజు వర్షం అంతరాయం కలిగించే సమయానికి) ఇంగ్లండ్: 283 & 395 ఆసీస్: 295 & 135/0 -
'ఓపెనర్‌గా నాకంటే శుబ్‌మన్ గిల్ బెటర్'
టీమిండియా ఓపెనర్‌గా శిఖర్ ధావన్ ఒక దశాబ్దం పాటు వెలుగొందాడు. వయసు పెరగడంతో పాటు ఫామ్ కోల్పోవడంతో క్రమంగా జట్టుకు దూరమయ్యాడు. ఆటకు రిటైర్మెంట్ ప్రకటించనప్పటికి ఇప్పుడున్న పోటీలో ధావన్ మళ్లీ జట్టులో రావడం అసాధ్యమే. అయితే ధావన్ జట్టుకు దూరమైన తర్వాత ఓపెనింగ్ విషయంలో టీమిండియా సమస్యలు ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో శిఖర్ ధావన్ ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో మాట్లాడుతూ శుబ్‌మన్ గిల్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం టీమిండియాలో ఓపెనింగ్ కొరత కనిపిస్తుంది.. రోహిత్‌కు సరైన జోడి లేదు.. ఒకవేళ ఆ స్థానంలో శిఖర్ ధావన్, శుబ్‌మన్ గిల్లో ఒకరికి చోటు ఇవ్వాల్సి వస్తే ఎవరు బెస్ట్ అనుకుంటున్నారని ధావన్‌ను ప్రశ్నించారు. ఈ ప్రశ్నపై స్పందించిన ధావన్.. తన పేరు చెప్పకుండా ఆ స్థానానికి శుభ్‌మన్ గిల్ బెటర్ అని చెప్పాడు. తాను సెలెక్టర్ ప్లేస్‌లో ఉంటే శుభ్‌మన్‌గిల్‌ను ఓపెనర్‌గా ఎంపిక చేస్తానన్నాడు. టెస్ట్‌లతో పాటు టి20ల్లో గిల్ చక్కగా రాణిస్తున్నాడని పేర్కొన్నాడు. కానీ అతడికి సరైన అవకాశాలు రావడం లేదని తెలిపాడు. అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో తగినన్ని అవకాశాలు లభిస్తే ఆటగాడిగా శుభ్‌మన్ మరింత రాటుదేలుతాడని శిఖర్ ధావన్ అన్నాడు. ఓపెనర్‌గా తనకంటే శుభ్‌మన్ బెస్ట్‌గా భావిస్తోన్నట్లు పేర్కొన్నాడు. జట్టుకు దూరమయ్యాననే బాధ తనలో లేదని పేర్కొన్నాడు. కాగా గిల్‌పై ధావన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 2010లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన ధావన్ టీమిండియా తరపున 34 టెస్టులు, 167 వన్డేలు, 68 టి20 మ్యాచ్‌లు ఆడాడు. Ek hi to Dil hai kitni baar jeetoge Shikhar Dhawan 😭❤️ pic.twitter.com/VfZ4P3FPZi — Professor ngl राजा बाबू 🥳🌈 (@GaurangBhardwa1) March 26, 2023 చదవండి: ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం.. భూమ్మీద నూకలు మిగిలే ఉన్నాయి ఆర్సీబీ గుండె బద్దలయ్యే వార్త.. గాయాల కారణంగా ఇద్దరు స్టార్లు ఔట్..! -
సమయం ఆసన్నమైంది.. వారిద్దరిని విడదీయాల్సిందే!
క్రికెట్లో ఓపెనింగ్ భాగస్వామ్యం చాలా ముఖ్యం. బ్యాటింగ్‌లో ఈ జోడి పోషించే పాత్రపైనే ఇన్నింగ్స్ మొత్తం ఆధారపడి ఉంటుంది. క్రికెట్ చరిత్రలో సచిన్-సెహ్వాగ్, సచిన్-గంగూలీ, మాథ్యూ హెడెన్-గిల్‌క్రిస్ట్, హెడెన్-జస్టిన్ లాంగర్, గ్రేమీ స్మిత్-హర్షలే గిబ్స్ అత్యుత్తమ ఓపెనింగ్ జోడీలుగా ముద్రపడ్డారు. వీళ్లే కాదు ఇంకా చాలా ఓపెనింగ్ జోడీలున్నాయి.. చెప్పుకుంటే పోతే పెద్ద లిస్టు వస్తుంది. మనం చెప్పుకున్న లిస్టులో పాకిస్తాన్ జోడి బాబర్ ఆజం-మహ్మద్ రిజ్వాన్‌లకు కూడా కచ్చితంగా స్థానం ఉంటుంది. గత రెండేళ్లుగా ఈ జోడి పరుగుల మీద పరుగులు చేస్తూ రికార్డులు సృష్టించారు. 2021 ఏడాదిలో ఈ జోడి 50.47 సగటుతో 2019 పరుగులు జోడించారు. దీన్నబట్టే అర్థం చేసుకోవచ్చు.. బాబర్-రిజ్వాన్ జోడి ఎంత సక్సెస్ అయిందనేది. అయితే ఈ సక్సెస్ ఇప్పుడు వారిద్దరిని చిక్కుల్లో పడేసింది. కొంతకాలంగా బాబర్-రిజ్వాన్ జోడి స్థిరంగా పరుగులు చేయలేకపోతుంది. ముఖ్యంగా బాబర్ ఆజం ఆట నాసిరకంగా తయారైంది. టి20 ప్రపంచకప్‌కు ముందు జరిగిన ఇంగ్లండ్ సిరీస్‌లో బాబర్ దారుణంగా విఫలమయ్యాడు. అంతకముందు ఆసియా కప్‌లోనూ ఇదే పరిస్థితి. తాజాగా అదే ఫేలవ ఫామ్‌ను టి20 ప్రపంచకప్‌లోనూ కంటిన్యూ చేస్తున్నాడు. అటు కెప్టెన్‌గానూ విఫలమవుతున్నాడు. టీమిండియాతో మ్యాచ్‌లో ఓటమి పాలైన పాకిస్తాన్‌కు జింబాబ్వే కూడా షాకిచ్చింది. ఈ దెబ్బకు బాబర్ ఆజం కెప్టెన్సీపై విమర్శలు వస్తున్నాయి. అసలే బ్యాటింగ్‌లో విఫలమవుతున్న బాబర్‌కు ఇది పెద్ద దెబ్బ. కొందరైతే ఏకంగా బాబర్ కెప్టెన్సీ నుంచి తొలగించడంతో పాటు జట్టు నుంచి ఉద్వాసన పలకాలని కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు మహ్మద్ రిజ్వాన్ పరిస్థితి మరోలా ఉంది. టి20 ప్రపంచకప్ ముందు వరకు రిజ్వాన్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. చెప్పాలంటే 2021 నుంచి రిజ్వాన్ భీకరమైన ఫామ్ కనబరుస్తున్నాడు. టి20 ర్యాంకింగ్స్‌లో నెంబర్‌వన్ స్థానాన్ని ఆక్రమించిన మహ్మద్ రిజ్వాన్ ఆ స్థానానికి తాను కరెక్టే అన్నట్లుగా ప్రతీ మ్యాచ్‌లోనూ స్థిరంగా ఆడుతూ వచ్చాడు. అయితే టి20 ప్రపంచకప్‌లో మాత్రం రిజ్వాన్ ఆ ఫామ్‌ను చూపెట్టలేకపోతున్నాడు. అయితే ఇప్పటికి ఆడింది రెండు మ్యాచ్‌లు మాత్రమే కాబట్టి.. అతన్ని తక్కువ అంచనా వేయలేము. అతని ఫామ్‌లో ఉన్నానని చెప్పడానికి ఒక నిఖార్సైన ఇన్నింగ్స్ చాలు. కానీ అసలు చిక్కు ఎక్కడ వచ్చిందంటే.. పాకిస్తాన్‌కు ఇప్పుడు మరో ఓపెనింగ్ ఆప్షన్ లేకుండా పోయింది. బాబర్ ఆజం- మహ్మద్ రిజ్వాన్ జోడి మూడు ఫార్మట్లలోనూ ఓపెనింగ్ స్లాట్‌లోనే వస్తున్నారు. అయితే వీరిద్దరికి ప్రత్యామ్నాయంగా మరొకరిని ఆడించకపోవడం పీసీబీ చేసిన తప్పు. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు.. ప్రతీసారి బాబర్-రిజ్వాన్ ఆడుతారని చెప్పలేం. ఇప్పుడు నడుస్తోంది కూడా అదే. వాస్తవానికి పాక్ జట్టులో ఫఖర్ జమాన్ రెగ్యులర్‌గా మూడో స్థానంలో వస్తుంటాడు. తాజాగా టి20 ప్రపంచకప్‌కు దూరంగా ఉన్న ఫఖర్ జమాన్ స్థానంలో షాన్ మసూద్‌ను ఎంపిక చేయడం.. అతను అంచనాలకు మించి రాణిస్తుండడం కలిసొచ్చే అంశం. అయితే ఫఖర్ జమాన్‌ను ఓపెనింగ్ స్లాట్‌లో ఆడించాల్సింది అని క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నారు. ఉదాహరణకు టీమిండియాలో రోహిత్-రాహుల్ జోడి విఫలమయినా.. వారికి ప్రత్యామ్నాయంగా చాలా మంది అందుబాటులో ఉన్నారు. కానీ పాకిస్తాన్‌కు ఆ చాన్స్ లేకుండా పోయింది. అందుకే బాబర్ ఆజం- మహ్మద్ రిజ్వాన్ జోడిని విడదీయాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పటికైనా ఓపెనింగ్ జోడిలో ఒకరి స్థానంలో వేరొకరిని ఆడించడం మంచిదని పేర్కొన్నారు. -
రోహిత్‌కు జతగా ధవన్ ఉండగ, ఈ ప్రయోగాలు ఎందుకు దండగ..!
ఇటీవలి కాలంలో టీమిండియా పొట్టి ఫార్మట్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్నా ఓ విషయం మాత్రం అభిమానులను పెద్ద ఎత్తున కలవరపెడుతుంది. సిరీస్‌కు ఓ కెప్టెన్ మారుతుండటంతో ఇప్పటికే దిక్కుతోచని స్థితిలో ఉన్న సగటు టీమిండియా అభిమానిని.. కొత్తగా ఓపెనింగ్ సమస్య జట్టు పీక్కునేలా చేస్తుంది. ఏడాది కాలంలో టీమిండియా ఏకంగా తొమ్మిది ఓపెనింగ్ జోడీలను మార్చడమే అభిమాని ఈ స్థితికి కారణంగా మారింది. తాజాగా విండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్‌కు రోహిత్ శర్మకు జతగా సూర్యకుమార్ యాదవ్ బరిలోకి దిగడంతో అభిమానులు ఈ విషయాన్ని సోషల్‌మీడియా వేదికగా హైలైట్ చేస్తున్నారు. అన్నీ సజావుగా సాగుతూ, జట్టు వరుస విజయాలు సాధిస్తున్నప్పుడు ఇలాంటి ప్రయోగాలు అవసరమా అని టీమ్ మేనేజ్మెంట్ను ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ వైఖరిని తప్పుబడుతున్నారు. ఓ జోడీకి కనీసం నాలుగైదు అవకాశాలైనా ఇవ్వకుండానే మార్చేయడం పద్దతి కాదని చురకలంటిస్తున్నారు. పేరుకు మాత్రమే రోహిత్-కేఎల్ రాహుల్ రెగ్యులర్ ఓపెనర్లని, వీరిద్దరిలో ఒకరు అందుబాటులో ఉంటే మరొకరు ఉండరన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇలాంటప్పుడు ఏదైన కొత్త జోడీని తయారు చేయాల్సిందిపోయి, వరుస పెట్టి ఓపెనర్లను మార్చడం ఎంతమాత్రం సమంజసంకాదని అభిప్రాయపడుతున్నారు. కొందరైతే రోహిత్‌కు జతగా శిఖర్ ధవన్ ఉండగా.. ఈ ప్రయోగాలెందుకు దండగ అంటూ అని అంటున్నారు. ఎలాగూ ధవన్ ఇటీవలి కాలంలో సూపర్ ఫామ్‌లో ఉన్నాడు కాబట్టి రోహిత్‌కు జతగా అతన్ని పర్మనెంట్‌గా ఆడించాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం నెట్టింట ఈ డిస్కషన్ హాట్ హాట్‌గా సాగుతుంది. 12 నెలల కాలంలో టీమిండియా మార్చిన ఓపెనింగ్ జోడీలు.. 1. రోహిత్ శర్మ-కేఎల్ రాహుల్, 2. కేఎల్ రాహుల్-ఇషాన్ కిషన్ 3. రోహిత్ శర్మ-ఇషాన్ కిషన్ 4. రుతురాజ్ గైక్వాడ్-ఇషాన్ కిషన్ 5. సంజు శాంసన్-రోహిత్ శర్మ 6. దీపక్ హుడా-ఇషాన్ కిషన్ 7. ఇషాన్ కిషన్-సంజు శాంసన్ 8. రోహిత్ శర్మ-రిషభ్ పంత్ 9. రోహిత్ శర్మ-సూర్యకుమార్ యాదవ్ చదవండి: Ind Vs WI: నిజంగా వాళ్లిద్దరు గ్రేట్! ప్రపంచకప్ జట్టులో మనిద్దరం ఉండాలి! -
రికార్డుల కోసమే ఆడుతున్నట్లుంది.. రోహిత్-ధావన్ ద్వయం అరుదైన ఫీట్
ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా ఆటగాళ్లు రికార్డుల పంట పండిస్తున్నారు. ఇప్పటికే బుమ్రా, షమీలు బౌలింగ్‌లో అరుదైన ఫీట్లను అందుకోగా.. తాజాగా బ్యాటింగ్‌లో ఓపెనింగ్ జోడి రోహిత్ శర్మ- శిఖర్ ధావన్ ద్వయం పరుగులు విషయంలో కొత్త రికార్డును అందుకున్నారు. తాజాగా ఇంగ్లండ్‌తో వన్డే ద్వారా ఈ ఓపెనింగ్ జోడి 5వేల పరుగుల మార్క్‌ను క్రాస్ చేసింది. 5వేల పరుగుల మార్క్‌ను అందుకోవడానికి 114 ఇన్నింగ్స్‌లు అవసరం అయ్యాయి. కాగా సచిన్-గంగూలీ జోడి తర్వాత వన్డేల్లో తొలి వికెట్‌కు 5వేల పరుగులు జోడించిన రెండో ఓపెనింగ్ జోడిగా నిలిచి చరిత్రకెక్కింది. ఇంతకముందు వన్డే క్రికెట్లో సచిన్-గంగూలీ ద్వయం 136 ఇన్నింగ్స్‌ల్లో 6609 పరుగులు జోడించి తొలి స్థానంలో ఉన్నారు. వీరి తర్వాతి స్థానాల్లో ఆసీస్ ఆల్‌టైమ్ గ్రేట్ ఓపెనింగ్ జోడీ మాథ్యూ హేడెన్-ఆడమ్ గిల్‌క్రిస్ట్ (114 ఇన్నింగ్స్‌ల్లో 5472), విండీస్ లెజెండరీ ఓపెనింగ్ పెయిర్ గార్డన్ గ్రీనిడ్జ్-డెస్మండ్ హేన్స్ (102 ఇన్నింగ్స్‌ల్లో 5150) ఉన్నారు. తాజాగా వీరి సరసన రోహిత్ శర్మ- ధావన్ జోడి చోటు సంపాదించింది. 5⃣0⃣0⃣0⃣ ODI runs in partnership for this dynamic duo! 👏 👏#TeamIndia captain @ImRo45 & @SDhawan25 become only the 2⃣nd Indian pair after the legendary duo of @sachin_rt & @SGanguly99 to achieve this feat. 👍 👍 Follow the match ▶️ https://t.co/8E3nGmlNOh #ENGvIND pic.twitter.com/gU67Bx4SeE — BCCI (@BCCI) July 12, 2022 చదవండి: Jasprit Bumrah: ఇంగ్లండ్ గడ్డపై బుమ్రా కొత్త చరిత్ర.. Mohammed Shami: షమీ సంచలనం.. టీమిండియా తరపున తొలి బౌలర్‌గా -
వాళ్లిద్దరికీ బ్యాటింగ్ గుర్తుకొస్తుందా?
ఈ సీజన్లో భారత జట్టు మంచి విజయాలు సాధిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. మూడు రంగాల్లోనూ టీమిండియా ప్రతిభ బాగానే ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ, ఈ మూడు రంగాల్లో కూడా కొంతమంది మెరుపులు మెరిపిస్తుంటే మరికొందరు మాత్రం అంతంత మాత్రం ప్రదర్శనతో చూసేవాళ్లకు నీరసం తెప్పిస్తున్నారు. ప్రధానంగా టీమిండియా ఓపెనర్ల ద్వయం రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌ల బ్యాటింగ్ చూస్తుంటే అసలు వీళ్లకు బ్యాటింగ్ చేయడం గుర్తుందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. టి20 ప్రపంచకప్ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన ఏ మ్యాచ్‌లోనూ వీళ్లిద్దరూ అద్భుతంగా ఆడినట్లు చెప్పుకోడానికి లేదు. పైగా.. ఏమైనా అద్భుతమైన బాల్స్‌కు ఔటయ్యారా అంటే అదీ లేదు. దాదాపు ప్రతిసారీ చెత్తషాట్లకు ప్రయత్నించడం.. పెవిలియన్ బాట పట్టడం. ఆస్ట్రేలియా మీద రోహిత్ శర్మకు చాలా మంచి రికార్డు ఉందని, ఆ జట్టుమీదే తన డబుల్ సెంచరీ కూడా నమోదు చేసుకున్నాడని అతడి అభిమానులు భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్‌కి ముందు సంబరపడ్డారు. ఇన్నాళ్లూ ఎలా ఉన్నా, ఈ మ్యాచ్‌తో అతడి ఫామ్ తిరిగొస్తుందని చాలా ఆశించారు. కానీ, పరిస్థితి యథాతథం. శిఖర్ ధావన్ కూడా అంతే. ఉన్న కాసేపు ధాటిగానే బ్యాటింగ్ చేస్తున్నా, దాన్ని భారీ స్కోరు దిశగా మాత్రం తీసుకెళ్లడంలో ఇద్దరూ విఫలం అవుతున్నారు. మిగిలిన జట్లన్నీ పవర్ ప్లే ఆరు ఓవర్లలో 50 నుంచి 70 వరకు పరుగులు పిండుకుంటుంటే, భారత ఓపెనర్లు మాత్రం ఆ సమయంలో ఉండే ఫీల్డింగ్ నిబంధనలను సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. అప్పుడే గట్టి పునాది పడితే.. ఆ తర్వాత వచ్చే మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ పని సులభం అవుతుంది. విరాట్ కోహ్లీ వీరవిహారం చేయడం వల్ల ఇన్ని మ్యాచ్‌లలో విజయం సాధించాం. అయితే ప్రతిసారీ ఒకే బ్యాట్స్‌మన్ మీద భారం మోపడం కూడా సరికాదు. ఇదే విషయాన్ని టీమ్ డైరెక్టర్ రవిశాస్త్రి కూడా జట్టు సభ్యులందరికీ స్పష్టంగా చెప్పాడు. టాపార్డర్ బ్యాట్స్‌మన్.. ముఖ్యంగా ఓపెనర్లు తమ బ్యాట్లు ఝళిపించాలని గట్టిగానే చెప్పినట్లు సమాచారం. అవతల ఉన్నది చాలామంది గట్టి బ్యాట్స్‌మన్ ఉన్న వెస్టిండీస్ లాంటి జట్టు అయినా.. ఐపీఎల్ పుణ్యమాని వాళ్లలో చాలామంది ఆటతీరు తెలుసు కాబట్టి, మన ఓపెనర్లు ఇప్పటికైనా మళ్లీ తమ పాత బ్యాటింగ్ నైపుణ్యాలను గుర్తుకు తెచ్చుకుని.. చకచకా తలో హాఫ్ సెంచరీ చేస్తే భారత జట్టు అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకుంటారు.