ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా ఆటగాళ్లు రికార్డుల పంట పండిస్తున్నారు. ఇప్పటికే బుమ్రా, షమీలు బౌలింగ్‌లో అరుదైన ఫీట్లను అందుకోగా.. తాజాగా బ్యాటింగ్‌లో ఓపెనింగ్ జోడి రోహిత్ శర్మ- శిఖర్ ధావన్ ద్వయం పరుగులు విషయంలో కొత్త రికార్డును అందుకున్నారు. తాజాగా ఇంగ్లండ్‌తో వన్డే ద్వారా ఈ ఓపెనింగ్ జోడి 5వేల పరుగుల మార్క్‌ను క్రాస్ చేసింది. 5వేల పరుగుల మార్క్‌ను అందుకోవడానికి 114 ఇన్నింగ్స్‌లు అవసరం అయ్యాయి. కాగా సచిన్-గంగూలీ జోడి తర్వాత వన్డేల్లో తొలి వికెట్‌కు 5వేల పరుగులు జోడించిన రెండో ఓపెనింగ్ జోడిగా నిలిచి చరిత్రకెక్కింది.
ఇంతకముందు వన్డే క్రికెట్‌లో సచిన్-గంగూలీ ద్వయం 136 ఇన్నింగ్స్‌ల్లో 6609 పరుగులు జోడించి తొలి స్థానంలో ఉన్నారు. వీరి తర్వాతి స్థానాల్లో ఆసీస్ ఆల్‌టైమ్ గ్రేట్ ఓపెనింగ్ జోడీ మాథ్యూ హేడెన్-ఆడమ్ గిల్‌క్రిస్ట్ (114 ఇన్నింగ్స్‌ల్లో 5472), విండీస్ లెజెండరీ ఓపెనింగ్ పెయిర్ గార్డన్ గ్రీనిడ్జ్-డెస్మండ్ హేన్స్ (102 ఇన్నింగ్స్‌ల్లో 5150) ఉన్నారు. తాజాగా వీరి సరసన రోహిత్ శర్మ- ధావన్ జోడి చోటు సంపాదించింది.
5⃣0⃣0⃣0⃣ ODI runs in partnership for this dynamic duo! 👏 👏#TeamIndia captain @ImRo45 & @SDhawan25 become only the 2⃣nd Indian pair after the legendary duo of @sachin_rt & @SGanguly99 to achieve this feat. 👍 👍
— BCCI (@BCCI) July 12, 2022
Follow the match ▶️ https://t.co/8E3nGmlNOh #ENGvIND pic.twitter.com/gU67Bx4SeE
చదవండి: Jasprit Bumrah: ఇంగ్లండ్ గడ్డపై బుమ్రా కొత్త చరిత్ర..
Comments
Please login to add a commentAdd a comment