
మూడో టెస్టులో విండీస్ విజయం
ఇంగ్లండ్‌తో సిరీస్ 1-1తో డ్రా
బ్రిడ్జిటౌన్: ఇంగ్లండ్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను వెస్టిండీస్ జట్టు 1-1తో డ్రా చేసుకుంది. చివరిదైన మూడో టెస్టులో విండీస్ 5 వికెట్ల తేడాతో నెగ్గింది. 192 పరుగుల లక్ష్యంతో ఆదివారం మూడో రోజు తమ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆతిథ్య జట్టు డారెన్ బ్రేవో (148 బంతుల్లో 82; 7 ఫోర్లు; 3 సిక్సర్లు), బ్లాక్‌వుడ్ (104 బంతుల్లో 47 నాటౌట్; 4 ఫోర్లు; 1 సిక్స్) ఆటతీరుతో 62.4 ఓవర్లలో ఐదు వికెట్లకు 194 పరుగులు చేసి నెగ్గింది.
వీరిద్దరు ఐదో వికెట్‌కు 108 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించి విజయంలో కీలక పాత్ర పోషించారు. 2009 అనంతరం ఇంగ్లండ్ జట్టుపై విండీస్ గెలువడం ఇదే తొలిసారి. ఈ సిరీస్‌లో తొలి టెస్టు డ్రాగా ముగియగా రెండో టెస్టులో ఇంగ్లండ్ నెగ్గింది. బ్లాక్‌వుడ్ మ్యాచ్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలువగా... అండర్సన్‌కు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ పురస్కారం లభించింది.