India vs England 4th Test Day2 Live Updates And Highlights: టీమిండియా- ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. రాంచి వేదికగా శుక్రవారం మొదలైన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో 302/7 ఓవర్ నైట్ స్కోరుతో శనివారం నాటి ఆట మొదలుపెట్టి 353 పరుగులకు ఆలౌట్ అయింది.
ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఆట పూర్తయ్యేసరికి 73 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి కేవలం 219 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇంగ్లండ్ బౌలర్లలో స్పిన్నర్ షోయబ్ బషీర్ అత్యధికంగా నాలుగు వికెట్లు తీయగా.. టామ్ హార్లే రెండు, జేమ్స్ ఆండర్సన్ ఒక వికెట్ దక్కించుకున్నారు.
ఇక భారత తొలి ఇన్నింగ్స్‌లో ఇప్పటి వరకు ఓపెనర్ యశస్వి జైస్వాల్(73) ఒక్కడే అర్థ శతకం బాదాడు. మిగతా వాళ్లలో శుబ్‌మన్ గిల్ 38 పరుగలతో ఫర్వాలేదనిపించాడు. ఆట ముగిసే సరికి ధ్రువ్ జురెల్ 30, కుల్దీప్ 17 పరుగులతో క్రీజులో ఉన్నారు.
Jaiswal has cracked the code for run-making! 🙌🏻
— JioCinema (@JioCinema) February 24, 2024
He brings up his fiery 5️⃣0️⃣ in style to keep #TeamIndia's momentum. 🔥#INDvENG #IDFCFirstBankTestSeries #BazBowled #JioCinemaSports pic.twitter.com/nFAmYZPaX4
నిలకడగా ఆడుతున్న టీమిండియా ప్లేయర్లు
జురెల్ 30, కుల్దీప్ 17 పరుగులతో నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నారు. టీమిండియా స్కోరు: 219-7(72)
61.4: 200 పరుగుల మార్కు అందుకున్న టీమిండియా
కుల్దీప్ 14, జురెల్ 20 పరుగులతో ఆడుతున్నారు.
55.2: ఏడో వికెట్ కోల్పోయిన టీమిండియా
అశ్విన్ రూపంలో టీమిండియా ఏడో వికెట్ కోల్పోయింది. టామ్ హార్లే బౌలింగ్లో అశూ (1) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. స్కోరు: 177/7 (55.2).
ఆరో వికెట్ డౌన్
51.3: రాంచి టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 171 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. హార్లే బౌలింగ్‌లో సర్ఫరాజ్ ఖాన్ రూట్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.
మొత్తంగా 53 బంతులు ఎదుర్కొని ఓపికగా క్రీజులో నిలబడిన ఈ ముంబై బ్యాటర్ కేవలం 14 పరుగులు మాత్రమే చేసి నిష్క్రమించాడు. స్కోరు: 171/6 (51.3). అశ్విన్ క్రీజులోకి వచ్చాడు.
ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియా
46.4: యశస్వి జైస్వాల్ రూపంలో టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. 73 పరుగులతో నిలకడగా ఆడుతున్న జైస్వాల్‌ను ఇంగ్లండ్ యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ బౌల్డ్ చేశాడు. టీమిండియా స్కోరు: 161/5 (46.4). ధ్రువ్ జురెల్ క్రీజులోకి వచ్చాడు. సర్ఫరాజ్ 10 పరుగులతో ఉన్నాడు.
టీ బ్రేక్ సమయానికి టీమిండియా స్కోరు: 131/4 (38)
జైస్వాల్ 54, సర్ఫరాజ్ ఖాన్ ఒక పరుగుతో క్రీజులో ఉన్నారు.
జడేజా ఔట్..
టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన రవీంద్ర జడేజా.. షోయబ్ బషీర్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. భారత్ స్కోర్: 130/4. క్రీజులోకి సర్ఫరాజ్ ఖాన్ వచ్చాడు.
మూడో వికెట్ డౌన్.. పాటిదార్ ఔట్
టీమిండియా ఆటగాడు రజిత్ పాటిదార్ మరోసారి విఫలమయ్యాడు. రాంఛీ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 17 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. పాటిదార్ రూపంలో భారత్ మూడో వికెట్ కోల్పోయింది. 35 ఓవర్లు ముగిసే సరికి భార స్కోర్: 112/3. క్రీజులోకి జడేజా వచ్చాడు.
యశస్వీ జైశ్వాల్ హాఫ్ సెంచరీ...
టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. రాంఛీ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 89 బంతుల్లో అర్ధ శతకాన్ని యశస్వీ పూర్తి చేసుకున్నాడు. 32 ఓవర్లకు భారత్ స్కోర్: 105/2. జైశ్వాల్‌తో పాటు రజిత్ పాటిదార్(12) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు.
రెండో వికెట్ కోల్పోయిన భారత్.. గిల్ ఔట్
86 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 38 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్.. షోయబ్ బషీర్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. క్రీజులోకి రజిత్ పాటిదార్ వచ్చాడు.
నిలకడగా ఆడుతున్న భారత్..
టీమిండియా యువ ఆటగాళ్లు యశస్వీ జైశ్వాల్(40), శుబ్‌మన్ గిల్(27) నిలకడగా ఆడుతున్నారు. 21 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టానికి 74 పరుగులు చేసింది.
లంచ్ విరామానికి భారత్ స్కోర్: 34/1
లంచ్ విరామానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 34 పరుగులు చేసింది. క్రీజులో యశస్వీ జైశ్వాల్(16), శుబ్‌మన్ గిల్(4) ఉన్నారు.
5 ఓవర్లకు భారత స్కోర్: 20/1
5 ఓవర్లు ముగిసే సరికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 20 పరుగులు చేసింది. క్రీజులో యశస్వీ జైశ్వాల్(16), శుబ్‌మన్ గిల్ ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా.. రోహిత్ శర్మ ఔట్
తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాకు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ వికెట్‌ను బారత్ కోల్పోయింది. కేవలం 2 పరుగులు చేసిన రోహిత్.. ఆండర్సన్ బౌలింగ్‌లో వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి శుబ్‌మన్ గిల్ వచ్చాడు.
353కు ఇంగ్లండ్ ఆలౌట్..
మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లీష్ జట్టు 353 పరుగులకు ఆలౌటైంది. 302/7 ఓవర్ నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ అదనంగా 51 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 4 వికెట్లు పడగొట్టగా.. ఆకాష్ దీప్ 3, సిరాజ్ 2, అశ్విన్ ఒక్క వికెట్ సాధించారు. అదే విధంగా ఇంగ్లండ్ బ్యాటర్లలో జో రూట్(122 నాటౌట్) అద్భుత శతకంతో చెలరేగగా.. బెన్ ఫోక్స్(47), ఓలీ రాబిన్సన్(58) పరుగులతో రాణించారు.
తొమ్మిదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్..
ఇంగ్లండ్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో షోయబ్ బషీర్.. పాటిదార్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 103 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 351/9
ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్
347 పరుగుల వద్ద ఇంగ్లండ్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 58 పరుగులు చేసిన ఓలీ రాబిన్సన్.. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ఔటయ్యాడు.
నిలకడగా ఆడుతున్న ఇంగ్లండ్..
ఇంగ్లండ్ ఆటగాళ్లు జో రూట్(119), ఓలీ రాబిన్సన్(58) నిలకడగా ఆడుతున్నారు. 102 ఓవర్లు ముగిసే సరికి తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 7 వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసింది.
దూకుడుగా ఆడుతున్న ఇంగ్లండ్..
302/7 ఓవర్ నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ దూకుడుగా ఆడుతోంది. భారత పేసర్లను ఓలీ రాబిన్సన్, జో రూట్‌ను ఎటాక్ చేస్తున్నారు. 94 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 324/7, క్రీజులో జో రూట్(107), ఓలీ రాబిన్సన్(49) ఉన్నారు.
►రాంఛీ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టు రెండో రోజు ఆట ప్రారంభమైంది. భారత బౌలింగ్ ఎటాక్‌ను మహ్మద్ సిరాజ్ ప్రారంభించాడు. క్రీజులో జో రూట్(106), ఓలీ రాబిన్సన్(31) పరుగులతో ఉన్నారు. కాగా తొలి రోజు ఆటముగిసే సమయానికి ఇంగ్లండ్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది.
తుది జట్లు
భారత్: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభమన్ గిల్, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ దీప్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్
ఇంగ్లండ్ : జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్(కెప్టెన్), బెన్ ఫోక్స్(వికెట్ కీపర్), టామ్ హార్ట్లీ, ఆలీ రాబిన్సన్, షోయబ్ బషీర్, జేమ్స్ ఆండర్సన్
Comments
Please login to add a commentAdd a comment