ఈనెల 7 నుంచి మూడు టెస్టుల సిరీస్
కరాచీ: పాకిస్తాన్ పర్యటన కోసం బెన్ స్టోక్స్ నేతృత్వంలోని ఇంగ్లండ్ క్రికెట్ జట్టు బుధవారం ఇక్కడికి చేరుకోనుంది. ఇరు జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్ జరుగుతుంది. ఈ నెల 7 నుంచి ముల్తాన్‌లో జరిగే తొలి టెస్టుతో సిరీస్ మొదలవుతుంది. రెండో టెస్టు వేదిక కూడా ముల్తానే! 15 నుంచి ఈ మ్యాచ్ జరుగుతుంది. రావల్పిండిలో 24 నుంచి 28 వరకు జరిగే ఆఖరి టెస్టుతో ఇంగ్లండ్ పర్యటన ముగుస్తుంది.
ఈ సిరీస్‌లో పరిమిత ఓవర్ల మ్యాచ్‌లేమీ నిర్వహించడం లేదు. కాగా పాకిస్తాన్ క్రికెట్ చరిత్రలో సొంతగడ్డపై తొలిసారి బంగ్లాదేశ్ చేతిలో భంగపడటంతో కెపె్టన్ షాన్ మసూద్‌పై విమర్శల వాడి ఇంకా తగ్గడం లేదు. ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలోనూ అందరి లక్ష్యం అతనే అయ్యాడు. జర్నలిస్టులు ఓ పట్టాన విడిచిపెట్టడం లేదు. ఒకరైతే ఏకంగా కెప్టెన్సీ వదులుకోవచ్చుగా అని పరుష పదజాలంతో ప్రశ్నించారు.
‘పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నియామకం ప్రకారం సారథిగా కొనసాగుతానని మీరన్నారు. అత్యంత పేలవంగా జట్టు ఆడి ఓటమి పాలైనా కనీసం నైతిక బాధ్యత వహించరా? ఆత్మాభిమానం గురించి ఆలోచించరా? లేదంటే హుందాగా తప్పుకునే ఉద్దేశమేదీ మీకు లేదా? అని ప్రశ్నల వర్షం కురిపించాడు.
పక్కనే ఉన్న పీసీబీ మీడియా డైరెక్టర్ వెంటనే కలి్పంచుకొని పాక్ జాతీయ జట్టు కెపె్టన్‌ను గౌరవించాలని సదరు జర్నలిస్టుకు సూచించారు. ఇటీవల పీసీబీ నిర్ణయాలపై కూడా పలువురు మండిపడుతున్నారు. కనీస జవాబుదారీతనం లేకుండా ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment