మాంచెస్టర్: ఇంగ్లండ్, పాకిస్తాన్ మధ్య జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ మూడో రోజు ఆసక్తికర మలుపులు తీసుకుంది. బౌలర్లు చెలరేగడంతో మొత్తం 14 వికెట్లు నేలకూలాయి. తొలి ఇన్నింగ్స్‌లో స్ఫూర్తిదాయక ఆటతీరు కనబర్చిన పాక్ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌లో కుప్పకూలింది. ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 8 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. అసద్ షఫీఖ్ (29), రిజ్వాన్ (27) మాత్రమే కొద్ది సేపు ప్రతిఘటించారు.
ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్, స్టోక్స్, బ్రాడ్ తలా 2 వికెట్లు పడగొట్టారు. బెస్‌కు ఒక వికెట్ లభించింది. ప్రస్తుతం పాక్ ఓవరాల్‌గా 244 పరుగుల ఆధిక్యంలో ఉంది. చివరి రెండు వికెట్లకు మరికొన్ని అదనపు పరుగులు జోడించవచ్చు. అంతకు ముందు ఓవర్‌నైట్ స్కోరు 92/4తో తమ తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ 219 పరుగులకు ఆలౌటైంది. ఒలీ పోప్ (117 బంతుల్లో 62; 8 ఫోర్లు) అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా... జోస్ బట్లర్ (38) ఫర్వాలేదనిపించాడు.
Comments
Please login to add a commentAdd a comment