
దుబాయ్: తాజాగా వెస్టిండీస్‌తో ముగిసిన టి20 సిరీస్... భారత ఆటగాళ్ల ర్యాంకులను మెరుగుపర్చింది. ఐసీసీ సోమవారం విడుదల చేసిన జాబితాలో బౌలర్ల విభాగంలో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కెరీర్ అత్యుత్తమ (23) ర్యాంకులో నిలిచాడు. అతడు 14 స్థానాలు ఎగబాకాడు.
పేసర్ భువనేశ్వర్ (19వ ర్యాంకు) టాప్20లోకి వచ్చాడు. బుమ్రాకు 21వ స్థానం దక్కింది. బ్యాట్స్‌మెన్‌లో రోహిత్‌శర్మ మూడు స్థానాలు మెరుగు పర్చుకుని 7వ ర్యాంకులో, ధావన్ ఐదు స్థానాలు దాటుకుని 16వ ర్యాంకుకు చేరుకున్నారు. జట్లలో పాకిస్తాన్ (138), భారత్ (127) తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment