Kuldip Yadav
-
విదేశాల్లో కుల్దీపే బెస్ట్!
వెల్లింగ్టన్: విదేశీ గడ్డపై భారత జట్టు ప్రధాన స్పిన్నర్‌గా చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్‌కే తన ఓటని జట్టు హెడ్ కోచ్ రవిశాస్త్రి స్పష్టం చేశారు. కుల్దీప్ ఇప్పటికే అశ్విన్, జడేజాలను దాటి భారత నంబర్‌వన్ స్పిన్నర్‌గా ఎదిగాడని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవలే సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియాపై కుల్దీప్ ఐదు వికెట్లు తీశాడని కోచ్ గుర్తు చేశారు. ‘విదేశీ గడ్డపై టెస్టు ఆడటమే తరువాయి అతను ఐదు వికెట్లతో చెలరేగాడు. కాబట్టి విదేశాల్లో జట్టు ప్రధాన స్పిన్నర్‌గా స్థానం ఖాయమైంది. సిడ్నీలో అతని ప్రదర్శన నన్ను ఎంతో ఆకట్టుకుంది. గతంలో అశ్విన్ తదితరులకూ అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం మా నంబర్‌వన్ స్పిన్నర్ కుల్దీపే. విదేశాల్లో భారత్ ఒకే స్పిన్నర్‌తో ఆడాల్సి వస్తే అది కచ్చితంగా కుల్దీపే అవుతాడు’ అని శాస్త్రి ప్రశంసలతో ముంచెత్తారు. మరో వైపు ఇంగ్లండ్‌తో బర్మింగ్‌హామ్‌లో జరిగిన తొలి టెస్టునుంచి పుజారాను తప్పించడం అన్ని విధాలా ఆలోచించి తీసుకున్న నిర్ణయమేనని కోచ్ స్పష్టం చేశారు. అతను క్రీజ్‌లో నిలబడే విషయంలో చిన్నపాటి సమస్య కనిపించిందని, దానిని సరిదిద్దకుండా ఆడిస్తే తర్వాత 7–8 టెస్టుల పాటు అదే ఇబ్బందికరంగా మారేదన్న కోచ్... ఆ సమస్యను అధిగమించేందుకు తగిన సమయం ఇవ్వాలని భావించినట్లు చెప్పారు. మరోసారి కెప్టెన్ విరాట్ కోహ్లిపై ప్రశంసలు కురిపించిన శాస్త్రి...అతడిని నాటి దిగ్గజాలు రిచర్డ్స్, ఇమ్రాన్ ఖాన్‌లతో పోల్చారు. -
గెలుపు ఘడియ వచ్చేసింది
ఎప్పుడో స్వాతంత్య్రం సాధించిన కొత్తలో 1947లో తొలిసారి ఆస్ట్రేలియాలో భారత్ పర్యటన... ఆ తర్వాత మరో పదిసార్లు కంగారు గడ్డకు వెళ్లొచ్చాము... మొత్తంగా ఎనిమిది సార్లు ఓడితే, మరో మూడు సార్లు ‘డ్రా’ చేసుకొని రావడం తప్ప ఒక్కసారి కూడా సిరీస్ గెలుపు రుచి చూడలేదు. కానీ గత తరంలో దిగ్గజాలకు కూడా సాధ్యం కాని ఘనతను ఇప్పటి టీమిండియా చేసి చూపిస్తోంది. ఆస్ట్రేలియాను వారి వేదికపైనే చిత్తు చేసి తొలిసారి సిరీస్ తమ ఖాతాలో వేసుకోబోతోంది. చివరి టెస్టుకు నేడు చివరి రోజు కాగా ప్రత్యర్థిని ఆలౌట్ చేసి 3–1తో దర్జాగా పోరును ముగించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంటే... ఆ 10 వికెట్లు కాపాడుకొని కనీసం ‘డ్రా’తోనైనా పరువు నిలబెట్టుకోవాలనేది ఆసీస్ ఆశ. నాలుగో రోజు వర్షం, వెలుతురులేమి కారణంగా 25.2 ఓవర్ల ఆట మాత్రమే జరగడంతో ఆసీస్ పోరాటం చివరి రోజుకు చేరింది. చచ్చీ చెడి 300 పరుగుల మార్క్‌ను చేరిన ఆ జట్టు ఏకంగా 322 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కోల్పోయింది. 31 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై ఫాలోఆన్ ఆడుతూ నాలుగు ఓవర్లే ఎదుర్కొన్న ఆ జట్టు ఆఖరి రోజు మొత్తం నిలబడి పరాజయం తప్పించుకుంటుందా లేక భారత బౌలర్లకు దాసోహమై తలవంచుతుందా చూడాలి. అయితే ‘డ్రా’ కోసం కూడా తమ ఆటతో పాటు నాలుగో రోజు తమను కాపాడిన వరుణుడి సహాయాన్ని కూడా కంగారూలు కోరుకుంటున్నారు. సిడ్నీ: బోర్డర్–గావస్కర్ ట్రోఫీలో ఆద్యంతం ఆధిపత్యం కనబర్చిన భారత జట్టు సిరీస్‌కు ఘనమైన ముగింపు ఇచ్చేందుకు మరింత చేరువగా నిలిచింది. నాలుగో టెస్టులో కోహ్లి సేన చేతిలో ఓటమిని తప్పించుకునేందుకు పోరాడుతున్న ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 6 పరుగులు చేసింది. చేతిలో 10 వికెట్లు ఉన్న ఆ జట్టు సోమవారం మొత్తం ఆడినా 316 పరుగుల లోటును అధిగమించి భారత్‌ను బ్యాటింగ్‌కు దించడం దాదాపుగా అసాధ్యం. కాబట్టి భారత్ సిరీస్ విజయం 2–1తోనా లేక 3–1తోనే అనేదే ఇక తేలాల్సి ఉంది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 236/6తో ఆట కొనసాగించిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 300 పరుగులకు ఆలౌటైంది. కుల్దీప్ యాదవ్ (5/99) ఐదు వికెట్లతో చెలరేగాడు. 322 పరుగుల ఆధిక్యం దక్కడంతో కోహ్లి ఆసీస్‌కు ‘ఫాలోఆన్’ ఇచ్చాడు. వెలుతురులేమితో నాలుగు ఓవర్లకే ఆట నిలిచిపోయింది. మరో 64 పరుగులు... వర్షం ఆగి ఆట మొదలైన తర్వాత తొలి వికెట్ కోసం భారత్‌కు ఎక్కువ సమయం పట్టలేదు. నాలుగో రోజు ఆరో బంతికే కమిన్స్ (25)ను షమీ బౌల్డ్ చేశాడు. కుల్దీప్ బౌలింగ్‌కు రాగానే తొలి ఓవర్లో రెండు ఫోర్లు కొట్టి హ్యాండ్స్కోంబ్ (111 బంతుల్లో 37; 5 ఫోర్లు) ఆధిపత్యం ప్రదర్శించే ప్రయత్నం చేసినా అది ఎంతో సేపు నిలవలేదు. బుమ్రా వేసిన బంతిని అతను వికెట్లపైకి ఆడుకున్నాడు. ఆ వెంటనే లయన్ (0)ను కుల్దీప్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఇక మరో వికెట్ తీసేందుకు ఎంతో సేపు లేదనిపించింది. అయితే ఆసీస్ చివరి జోడీ స్టార్క్ (55 బంతుల్లో 29 నాటౌట్; 3 ఫోర్లు), హాజల్‌వుడ్ (45 బంతుల్లో 21; 2 ఫోర్లు) భారత్‌ను కొంత అసహనానికి గురి చేసింది. హాజల్‌వుడ్ ‘సున్నా’ వద్ద ఉన్నప్పుడు అతను ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను మిడాన్‌లో విహారి వదిలేయడం కూడా ఆసీస్‌కు కలిసొచ్చింది. 14 ఓవర్ల పాటు క్రీజ్‌లో నిలిచిన వీరు పదో వికెట్‌కు 42 పరుగులు జోడించారు. ఎట్టకేలకు హాజల్‌వుడ్ ఎల్బీగా ఔట్ చేసి కంగారూ ఇన్నింగ్స్‌కు తెరదించిన కుల్దీప్ ఐదో వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. బ్యాట్స్‌మన్ రివ్యూ చేసినా లాభం లేకపోయింది. నాలుగో రోజు ఆటలో ఆసీస్ మరో 64 పరుగులు జోడించి చివరి 4 వికెట్లు కోల్పోయింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ ఆసీస్ ఓపెనర్లు తడబడినా... నాలుగు ఓవర్లలో ఎలాంటి ప్రమాదం లేకుండా వారు ఆటను ముగించారు. భారత్ అసంతృప్తి ఆసీస్ రెండో ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో బుమ్రా వేసిన షార్ట్ పిచ్ బంతి అనూహ్యంగా పైకి లేచింది. దానిని హారిస్ సరిగా ఆడలేకపోవడంతో బంతి అతని వేలికి బలంగా తాకింది. నిజానికి ఇక్కడ బ్యాట్స్‌మన్ వైఫల్యమే తప్ప బంతి సరిగా కనబడకపోవడం కాదు. ఆ సమయంలో మైదానంలోని ఎనిమిది ఫ్లడ్‌లైట్లు కూడా పని చేస్తున్నాయి. కానీ అంపైర్లు ఈ ఘటనను దృష్టిలో ఉంచుకొని వెలుతురు తగ్గిందంటూ టీ విరామానికి ముందు మైదానం వీడారు. నాలుగో రోజు భారత్ కెప్టెన్ కోహ్లి దృష్టంతా విజయంపైనే ఉంది. సిరీస్ సాధిస్తున్నా ఈ టెస్టు కూడా గెలవాలని అతను భావించాడు. అందుబాటులో ఉన్న సమయంలో 14 వికెట్లు పడగొట్టడమే టీమిండియా లక్ష్యం. అందుకే తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ ఆలౌట్ కాగానే మరో ఆలోచన లేకుండా ఫాలోఆన్ ఇచ్చేశాడు. కానీ రెండో ఇన్నింగ్స్ అర్ధాంతరంగా ముగియడం భారత్‌కు అసంతృప్తిని మిగిల్చింది. ఆట రద్దును అంపైర్లు ప్రకటించడానికి గంట ముందు అంపైర్లతో కోహ్లి, రవిశాస్త్రి సుదీర్ఘంగా దీనిపై చర్చించారు. షెడ్యూల్ సమయం ప్రకారం అప్పటి నుంచి ఇంకా 31 ఓవర్లు మిగిలే ఉన్నాయి. ఆదివారం ఆట చూద్దామని వచ్చిన స్థానిక అభిమానులు కూడా తీవ్ర నిరాశ చెందారు. చిన్న చినుకు పడినా, లైట్లు అందుబాటులో ఉన్నా కూడా లైట్ మీటర్ రీడింగ్ కాస్త తక్కువ చూపించినా సరే ఆటను నిలిపివేయవచ్చనే ఐసీసీ నిబంధనపై కూడా వారు అసహనం వ్యక్తం చేశారు. మైదానంలో తమ మొబైల్ ఫోన్ లైట్లు ఆన్ చేసి తమ అసంతృప్తిని ప్రదర్శించారు. వాతావరణం ఆడుకుంది... ఊహించినట్లుగానే సిడ్నీ మ్యాచ్‌కు నాలుగో రోజు వాన అడ్డంకిగా మారింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్షం, వెలుతురు లేమి అంతరాయం కలిగించడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 21.2 ఓవర్లు, రెండో ఇన్నింగ్స్‌లో 4 ఓవర్ల ఆట మాత్రమే జరిగింది. వర్షం తగ్గకపోవడంతో మొదటి సెషన్ ఆట పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. మూడు గంటల తర్వాత ఎట్టకేలకు రెండో సెషన్లో కూడా నిర్ణీత సమయంకంటే ఆలస్యంగా మొదలు కాగా... టీ విరామానికి ఎనిమిది నిమిషాల ముందే తగిన వెలుతురు లేక ఆటగాళ్లు మైదానం వీడారు. ఆ తర్వాత మరో బంతి పడలేదు. అంపైర్లు సుదీర్ఘ సమయం పాటు వేచి చూస్తూ పదే పదే తనిఖీలు చేసినా లాభం లేకపోయింది. మరోసారి చినుకులు పడటంతో ఆదివారం ఆట రద్దయింది. -
టి20ల్లో కెరీర్ అత్యుత్తమ ర్యాంకుకు కుల్దీప్
దుబాయ్: తాజాగా వెస్టిండీస్‌తో ముగిసిన టి20 సిరీస్... భారత ఆటగాళ్ల ర్యాంకులను మెరుగుపర్చింది. ఐసీసీ సోమవారం విడుదల చేసిన జాబితాలో బౌలర్ల విభాగంలో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కెరీర్ అత్యుత్తమ (23) ర్యాంకులో నిలిచాడు. అతడు 14 స్థానాలు ఎగబాకాడు. పేసర్ భువనేశ్వర్ (19వ ర్యాంకు) టాప్20లోకి వచ్చాడు. బుమ్రాకు 21వ స్థానం దక్కింది. బ్యాట్స్‌మెన్‌లో రోహిత్‌శర్మ మూడు స్థానాలు మెరుగు పర్చుకుని 7వ ర్యాంకులో, ధావన్ ఐదు స్థానాలు దాటుకుని 16వ ర్యాంకుకు చేరుకున్నారు. జట్లలో పాకిస్తాన్ (138), భారత్ (127) తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. -
300 మ్యాచ్‌లు... 30 మ్యాచ్‌లు
విశాఖపట్నం: రెండో వన్డే చివరి ఓవర్లో విజయానికి 14 పరుగులు చేయాల్సిన దశలో తొలి ఐదు బంతులకు వెస్టిండీస్ 9 పరుగులు రాబట్టింది. అనుకోకుండా వెళ్లిన లెగ్ బై బౌండరీని మినహాయిస్తే ఇద్దరు బ్యాట్స్‌మెన్ కూడా ఆ ఐదు బంతులను ఆడటంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఈ ఓవర్‌కు వ్యూహ రచన చేసిన ధోని ఆఖరి బంతికి మాత్రం ఫీల్డింగ్‌ను మార్చేశాడు. థర్డ్‌మ్యాన్‌ను మరి కాస్త లోపలకు తీసుకొచ్చి పాయింట్ ఫీల్డర్‌ను డీప్ బ్యాక్వర్డ్ పాయింట్ వద్దకు పంపించాడు. స్వీపర్ కవర్, లాంగాఫ్‌ను కూడా తప్పించాడు. అయితే ఈ వ్యూహం వ్యతిరేకంగా పని చేసి ఆఖరి బంతిని హోప్ ఫోర్ కొట్టి మ్యాచ్‌ను ‘టై’ చేయగలిగాడు. ఇదే విషయంపై మ్యాచ్ తర్వాత మీడియా సమావేశంలో కుల్దీప్ యాదవ్‌ను ప్రశ్నించగా అతను సమాధానం చెప్పేందుకు ఇష్టపడలేదు. ‘ఇది ధోని ప్రణాళిక. దాని గురించి తెలిసేంత పెద్దవాడిని కాను. నేను 30 మ్యాచ్‌లు మాత్రమే ఆడాను. మహి భాయ్ 300 మ్యాచ్‌లు ఆడాడు. మా అందరికంటే అతనికి చాలా ఎక్కువ అనుభవం ఉంది. ఆ సమయంలో అతను అనుకున్నది అమలు చేశాడు’ అని కుల్దీప్ జవాబిచ్చాడు. దాదాపు పది నెలల క్రితం జరిగిన ఒక ఘటనను గుర్తు చేసుకొని కుల్దీప్ ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా అనిపించింది. ఇండోర్‌లో శ్రీలంకతో జరిగిన టి20 మ్యాచ్‌లో ధోని ఫీల్డింగ్ మార్పులు చేస్తూ కవర్‌ను తప్పించి పాయింట్‌ను మరింత ముందుకు తీసుకు రమ్మని బౌలర్ కుల్దీప్కు సూచించాడు. అయితే దీనిని పట్టించుకోని కుల్దీప్ తనకు ఈ ఫీల్డింగ్ బాగుందని చెప్పాడు. దాంతో చిర్రెత్తిన ధోని ‘300 మ్యాచ్‌లు ఆడిన నేనేమైనా పిచ్చివాడినా’ అంటూ ఏడో మ్యాచ్ ఆడుతున్న కుల్దీప్పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మరో వైపు మంచు కారణంగా బంతిపై పట్టు చిక్కక పోవడం వల్లే గెలుపు చేజారిందని ఈ చైనామన్ బౌలర్ విశ్లేషించాడు. -
భవిష్యత్తు ఆ ముగ్గురిదే!
ఆసక్తికర ఆరంభమే లభించినా... రెండో టెస్టు మ్యాచ్ కూడా మూడు రోజుల్లోనే ముగిసిపోయి భారత్‌కు మరో సిరీస్‌ను అందించింది. ఒకప్పుడు క్రికెట్ ప్రపంచపు రారాజులుగా వెలిగిన జట్టు ఇంత అధమ స్థాయికి దిగజారడం క్రికెట్ అభిమానులను కలతకు గురి చేస్తున్నా... నాడు వారి చేతుల్లో ఇదే తరహాలో చావుదెబ్బ తిన్న మాకు మాత్రం ఈతరం యువ భారత క్రికెటర్లు ఆడుతున్న అద్భుత ఆట చూస్తే సంతృప్తి కలుగుతుంది. వెస్టిండీస్ అగ్రశ్రేణి క్రికెటర్లు కొందరు ప్రపంచవ్యాప్తంగా డబ్బులు బాగా వచ్చే టి20 లీగ్‌లు ఆడటానికే ఆసక్తి కనబరుస్తుండటంతో విండీస్ బాగా బలహీనంగా మారిందనేది వాస్తవం. గత పదేళ్లుగా ఆ జట్టు పూర్తి స్థాయి బలంతో బరిలోకి దిగడం అరుదుగా మారింది. కరీబియన్ దీవులు చూసేందుకు చాలా అందంగా ఉంటాయి కానీ అక్కడ బతుకుదెరువు కోసం ఉద్యోగావకాశాలు చాలా తక్కువ. కాబట్టి టెస్టు మ్యాచ్‌లు ఆడటంకంటే టి20 లీగ్‌లతో తమ భవిష్యత్తును భద్రం చేసుకోవాలని వారు భావించడాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఆ జట్టులో అత్యుత్తమ బౌలర్లు లేకపోవడం అనూహ్యమేమీ కాదు కానీ మరీ ప్రమాదకరంగా ఏమీ లేని పిచ్‌లపై కూడా జట్టు బ్యాట్స్‌మన్ ఆడుతున్న తీరు మాత్రం తీవ్రంగా నిరాశపరుస్తోంది. కనీసం బ్యాటింగ్ ఆర్డర్‌ను కూడా మార్చకుండా, ఒకే తరహా మూసలో ఆడటం వల్ల వారికి మరింత నష్టం జరిగింది. ఛేజ్, హోల్డర్ ఇద్దరూ ప్రస్తుతం తాము ఆడుతున్న స్థానాలకంటే మరింత పైన బ్యాటింగ్‌కు రావాల్సింది. భారత్‌కు మరో సిరీస్ విజయం పూర్తిగా సంతృప్తినిచ్చింది. ముఖ్యంగా ముగ్గురు యువ ఆటగాళ్లు తమ సత్తా చాటడం జట్టుకు అదనపు బలంగా మారింది. మరిన్ని పరుగులు సాధించే తపన పృథ్వీ షాలో కనిపించగా... అటు బ్యాటింగ్, ఇటు కీపింగ్‌లో రిషభ్ పంత్ ఆకట్టుకున్నాడు. తన లైన్ అండ్ లెంగ్త్‌పై పట్టు సాధించిన కుల్దీప్ యాదవ్ కూడా తొలిసారి ఐదు వికెట్ల ఘనతను నమోదు చేశాడు. ఈ ముగ్గురిని భారత భవిష్యత్తుగా చెప్పవచ్చు. చాలా మందిలాగే కెరీర్లో మున్ముందు ఎత్తుపల్లాలు వచ్చే అవకాశం ఉన్నా వీరిలో పోరాట తత్వం ఉండటం వల్ల పరుగులు సాధించగలరు, వికెట్లు పడగొట్టగలరు. టెస్టులో పది వికెట్లు సాధించిన ఉమేశ్ యాదవ్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాలి. కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్‌కు బౌలింగ్ చేసేటప్పుడు బంతిని అతను అద్భుతంగా రివర్స్ స్వింగ్ చేస్తూ ప్యాడ్, బ్యాట్ మధ్యలోంచి దూసుకుపోయేలా చేశాడు. కొత్త బంతిని అద్భుతంగా ఉపయోగించగల బౌలింగ్ దళం ఇప్పుడు భారత్ వద్ద ఉంది. టెస్టు సిరీస్‌ను భారత్ అతి సునాయాసంగా గెలుచుకోవడంతో ఇప్పుడు అందరి దృష్టి వన్డే సిరీస్‌పై నిలిచింది. -
కొత్త జంట కుదిరింది
ఆరు నెలల క్రితం వరకు... టీమిండియా మూడు ఫార్మాట్లలోనూ స్పిన్ బౌలర్లెవరంటే మరో మాట లేకుండా రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా పేర్లే చెప్పేవారు. ఇంకొకరికి అవకాశం వచ్చినా అది వీరు తప్పుకొంటేనో, గాయపడితేనో మాత్రమే. మరిప్పుడు... నాలుగంటే నాలుగే సిరీస్‌లు... ఆరు నెలల వ్యవధి... అంతా మారిపోయింది... వన్డేలు, టి20ల్లో అశ్విన్, జడేజా ఊసే లేదు. టెస్టుల్లో నంబర్‌వన్ బౌలర్లైనా, పరిమిత ఓవర్ల మ్యాచ్‌లకు ఎందుకు ఎంపిక చేయడం లేదన్న ప్రశ్నే తలెత్తడం లేదు. ఇదంతా మరో ఇద్దరి మణికట్టు మాయాజాలం. వారే యజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్. సాక్షి క్రీడా విభాగం: బహుశా సగటు క్రికెట్ అభిమాని కూడా ఇంత తక్కువ కాలంలో ఇంతటి మార్పును ఊహించి ఉండకపోవచ్చు. అందుకేనేమో, ఎటుపోయి ఎటు వస్తుందోనని సెలెక్టర్లు కూడా అశ్విన్, జడేజాలను శ్రీలంక పర్యటనకు మొదట ‘విశ్రాంతి’ పేరిట మాత్రమే పక్కన పెట్టారు. వీరి స్థానాల్లో తీసుకున్న చహల్, కుల్దీప్ ప్రతిభావంతులే అయినా అంత తేలిగ్గా సీనియర్లను తప్పిస్తే విమర్శలు వస్తాయని భావించారు. ఒకవేళ కొత్తవారు విఫలమైతే తర్వాత ఆలోచించవచ్చని అనుకున్నారేమో. కానీ, ఆ అవకాశం లేకుండా చేశారీ మణికట్టు మాంత్రికులు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంక, తాజాగా సఫారీ పర్యటనలో రెండు వన్డేల్లోనూ విజయాలనందించి జట్టుకు అదనపు బలంగా మారారు. తక్కువ వేగమే ఆయుధం... 15... చివరి అయిదు వన్డేల్లో చహల్ తీసిన వికెట్లు... 10... కుల్దీప్ గత అయిదు వన్డేల్లో పడగొట్టిన వికెట్లు. అటు పరుగుల కట్టడితో పాటు ప్రత్యర్థిని చుట్టేస్తుండటంతో వీరి సత్తాపై క్రమక్రమంగా నమ్మకం పెరుగుతోంది. ప్రమాదకర బ్యాట్స్‌మెన్‌ను కూడా వీరు తేలిగ్గా పెవిలియన్‌కు పంపుతున్నారు. ‘పరుగులు పోతే పోనీ... వికెట్ మాత్రం పడగొట్టు’ అన్నది కెప్టెన్ కోహ్లి అభిప్రాయం కావడంతో చహల్ తనకు ఇష్టమైన ఫ్లయిటెడ్ డెలివరీలను సంధిస్తున్నాడు. గంటకు 80 కి.మీ. నుంచి 90 కి.మీ. బౌలింగ్ వేగం మించనప్పటికీ వీరిని ఎదుర్కొనలేకపోవడం ప్రొటీస్ కోచ్‌లనే ఆశ్చర్యపరుస్తోంది. పిచ్‌లకు తగ్గట్లు మారిపోయి... దక్షిణాఫ్రికా పిచ్‌లంటేనే పేస్. అలాంటిచోట కూడా చహల్, కుల్దీప్ చెలరేగుతున్నారు. దీనంతటికీ కారణం పిచ్‌లను అర్థం చేసుకోవడం.. తగినట్లు సన్నద్ధం కావడమే. 2013–14 పర్యటనలో అశ్విన్, జడేజా సరిగ్గా ఈ పనే చేయలేకపోయారు. డికాక్ వరుసగా మూడు శతకాలతో చెలరేగిన ఈ టూర్లో వీరు చెరో వికెట్ మాత్రమే పడగొట్ట గలిగారు. కానీ చహల్, కుల్దీప్ మాత్రం వికెట్‌పై ఉండే బౌన్స్‌ను తమ బౌలింగ్‌కు సమన్వయం చేసుకుంటున్నారు. బ్యాట్స్‌మెన్ బ్యాక్‌ఫుట్‌పై ఆడేలా బంతులేస్తూ వికెట్లు తీస్తున్నారు. ఇక్కడి బౌన్సీ వికెట్లపై ఎక్కువ వేగంతో బంతులేస్తే స్పిన్ తిరగవు. బ్యాట్స్‌మెన్ తేలిగ్గా ఆడేస్తారు. ఈ కిటుకును మన స్పిన్నర్లు కనిపెట్టి వేగంలో కొంత రాజీ పడ్డారు. సఫారీ ప్రధాన స్పిన్నర్ తాహిర్, చైనామన్ షమ్సీ మాత్రం సహజ శైలిని నమ్ముకుని తేలిపోతున్నారు. భారత్‌లో కంటే ఇక్కడ బౌలింగ్ చేయడాన్నే తాను ఆస్వాదిస్తున్నానని కుల్దీప్ అంటున్నాడంటనే అతడెంతటి ఆత్మవిశ్వాసంతో ఉన్నాడో తెలుస్తోంది. మరోవైపు భారత్ ‘ఎ’ జట్టు తరఫున దక్షిణాఫ్రికాలో ఆడిన అనుభవం చహల్‌కు బాగా పనికొస్తోంది. ఆ సమయంలోనే పిచ్‌లను బాగా అర్థం చేసుకున్న అతడు మరింతగా రాణిస్తున్నాడు. మంచి బౌన్స్‌తో బంతి వేగంగా వెళ్తుండటంతో అతడికి ఎక్కువగా ఆలోచించే అవసరమే లేకుండా పోతోంది. ప్రతిఘటించే వారేరి..? ప్రస్తుతం దక్షిణాఫ్రికా జట్టులో భారత స్పిన్నర్లను సమర్థంగా ఆడే వారు కనిపించడం లేదు. డుమిని, మిల్లర్ తడబడుతున్నారు. మిగతా వారికి అంతగా అనుభవం లేదు. సొంత గడ్డపై కొంత మెరుగ్గా ఉన్నా నాణ్యమైన స్పిన్‌ను ఆడటంలో దక్షిణాఫ్రికాది తొలి నుంచీ పేలవ రికార్డే. ఈసారి ఇక్కడా రాణించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో సిరీస్‌లో మన మణికట్టు మాంత్రికులను ప్రతిఘటించే బ్యాట్స్‌మెన్ లేనట్లే. వీరి జోరు కొనసాగితే సఫారీ గడ్డపై తొలిసారి వన్డే సిరీస్ భారత్ సొంతం కావడం ఖాయం. పరిస్థితులను బాగా అర్థం చేసుకొని దాని ప్రకారం బౌలింగ్ చేయడమే దక్షిణాఫ్రికాతో వన్డేల్లో భారత లెగ్‌స్పిన్నర్ల విజయ రహస్యం. నా దృష్టిలో చహల్, కుల్దీప్ బౌలింగ్‌లో ఉన్న కొత్తదనం కూడా ఫలితాన్ని ఇస్తోంది. ఇది మణికట్టు స్పిన్ గురించో, ఆఫ్ స్పిన్ గురించో కాదు. పరిస్థితులకు తగినట్లుగా తమను తాము మార్చుకోవడమే ఇక్కడ ముఖ్యం. టి20లు వచ్చిన కొత్తలో స్పిన్నర్లు పనికి రారని తేల్చేశారు. ఆపై పదేళ్ల పాటు ఆఫ్ స్పిన్నర్లు రాజ్యమేలారు. ఇప్పుడు లెగ్ స్పిన్నర్లు బాగా వేస్తున్నారు. వన్డే జట్టులో స్థానం కోల్పోవడం గురించి నేనేమీ నిద్ర మానేసి ఆలోచించడం లేదు. నాలో ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ. ఇప్పుడు కూడా ఏ జట్టులోనైనా స్థానం పొందగలననే నమ్మకం నాకుంది. – దక్షిణాఫ్రికాలో భారత స్పిన్నర్ల ప్రదర్శనపై అశ్విన్ వ్యాఖ్య -
కుల్దీప్ యాదవ్ హ్యాట్రిక్.. స్టీవ్ స్మిత్ రియాక్షన్
సాక్షి, కోల్‌కతా: ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో కలిసికట్టుగా రాణించిన టీమిండియా సిరీస్‌లో మళ్లీ పైచేయి సాధించింది. దీంతో ఐదు వన్డేల సిరీస్‌లో 2-0తో ఉంది. టీమిండియా మరో సారి సత్తా చాటినా.. భారత యువ సంచలనం కుల్దీప్ యాదవ్ పైనే అందరిదృష్టి ఉంది. కుల్దీప్ అద్బుత హ్యాట్రిక్ ఫీట్‌పై ఆస్ట్రేలియా కెప్టెన్ స్మిత్ స్పందించారు. 'కుల్దీప్ చాలా మంచి బంతులు వేశాడు. అతడి సగం ఓవర్ల కోటా ముగిసేవరకూ మేమే అతడిపై ఆధిపత్యం చెలాయించాం. కానీ బంతి గమనాన్ని ఎక్కువగా అంచనా వేయాలన్న తమ బ్యాట్స్మెన్ల తప్పిదం వల్ల కుల్దీప్ చేతికి చిక్కారు. హ్యాట్రిక్ వీరుడు కుల్దీప్ బౌలింగ్‌లో నాకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదు. టర్న్‌ను గమనించి స్వేచ్ఛగా పరుగులు సాధించాను. మా ఆటగాళ్లు బంతి చాలా దగ్గరగా వచ్చేవరకూ ఎదురుచూసి షాట్లు ఆడాలనుకోవడం మా కొంపముంచింది. ఒకవేళ బంతి గమనాన్ని అంచానా వేశాక ఎలా ఆడాలన్న దానిపై దృష్టి పెట్టలేకపోయాం. ముఖ్యంగా టాపార్డర్ నలుగురిలో ఒకరు భారీ ఇన్నింగ్స్ ఆడితే ఏ జట్టయినా విజయాలు సాధిస్తుంది. కానీ, రెండో వన్డేలో కూడా అలా జరగలేదు. స్టోయినిస్ రాణించడంతో ఓటమి అంతరం తగ్గింది. ఇతర బ్యాట్స్మెన్లు స్టోయినిస్లా కూల్‌గా ఆడితే సిరీస్‌లో ఈ మ్యాచ్‌తోనైనా బోణీకొట్టేవాళ్లమంటూ' ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ వివరించారు. గురువారం ఇక్కడి ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరిగిన రెండో వన్డేలో భారత్ 50 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. భారత చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ 33వ ఓవర్లో వరుస బంతుల్లో వేడ్, అగర్, కమిన్స్‌లను కుల్దీప్ అవుట్ చేసి హ్యాట్రిక్ వికెట్ల ఫీట్ నమోదు చేసిన విషయం తెలిసిందే. -
మళ్లీ అదరగొట్టారు
-
మళ్లీ అదరగొట్టారు
►రెండో వన్డేలో భారత్ 50 పరుగులతో విజయం ►రాణించిన కోహ్లి, రహానే ►కుల్దీప్ యాదవ్ ‘హ్యాట్రిక్’ ►భువనేశ్వర్ 3/9 ►మూడో వన్డే ఆదివారం భారత్ తమదైన శైలిలో మరోసారి సత్తా చాటింది. శ్రీలంకను చిత్తుగా ఓడించి వచ్చినా, ఆస్ట్రేలియాతో అంత సులువు కాదని అంతా భావించారు. అయితే అద్భుతమైన ఆట ముందు ఆసీస్ అయినా ఎవరైనా ఒకటే అని మన జట్టు మళ్లీ రుజువు చేసింది. టీమిండియా ఆల్‌రౌండ్ ప్రదర్శన ముందు నిలవలేక కంగారూలు మళ్లీ తలవంచారు. భారీ స్కోరు సాధించకపోయినా... తమ బౌలింగ్ వనరులతో చెలరేగిన కోహ్లి సేన ప్రత్యర్థి పని పట్టింది. వరుసగా రెండో విజయంతో సిరీస్‌పై పట్టు బిగించింది. కోహ్లి కీలక ఇన్నింగ్స్... అండగా నిలిచిన రహానే... ఈ ఇద్దరి శతక భాగస్వామ్యం భారత్‌ను నడిపించాయి. చివర్లో ఎలాంటి మెరుపులు లేకున్నా... జట్టు మెరుగైన స్కోరుతో సవాల్ విసిరింది. ఛేదనలో భువనేశ్వర్ కుమార్ దెబ్బకు 9 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన ఆసీస్ గత మ్యాచ్ వైఫల్యాన్నే కొనసాగించింది. మధ్యలో కుల్దీప్ యాదవ్ ‘హ్యాట్రిక్’ జోరుకు ఆ జట్టు కుదేలైంది. స్మిత్, స్టొయినిస్ అర్ధ సెంచరీలు గెలుపు అంతరాన్ని మాత్రమే తగ్గించగలిగాయి. కోల్‌కతా: ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్‌లో భారత్ మళ్లీ పైచేయి సాధించింది. సమష్టి కృషితో టీమిండియా మరో సారి సత్తా చాటింది. గురువారం ఇక్కడి ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరిగిన రెండో వన్డేలో భారత్ 50 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. ఐదు వన్డేల సిరీస్‌లో 2–0తో ఆధిక్యంలో నిలిచింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది. విరాట్ కోహ్లి (107 బంతుల్లో 92; 8 ఫోర్లు) త్రుటిలో సెంచరీ కోల్పోగా, అజింక్య రహానే (64 బంతుల్లో 55; 7 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించాడు. అనంతరం ఆస్ట్రేలియా 43.1 ఓవర్లలో 202 పరుగులకు ఆలౌటైంది. మార్కస్ స్టొయినిస్ (65 బంతుల్లో 62 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), స్టీవ్ స్మిత్ (76 బంతుల్లో 59; 8 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. భారత చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ ‘హ్యాట్రిక్’ సాధించడం విశేషం. 33వ ఓవర్లో వరుస బంతుల్లో వేడ్, అగర్, కమిన్స్‌లను కుల్దీప్ అవుట్ చేశాడు. విరాట్ కోహ్లికి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. సిరీస్‌లో మూడో వన్డే ఆదివారం ఇండోర్‌లో జరుగుతుంది. సెంచరీ భాగస్వామ్యం... 35 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 185/3. కోహ్లి మరో సెంచరీ దిశగా సాగుతున్నాడు. ఈ దశలో భారత్ 300 పరుగులు చేసేలా కనిపించింది. అయితే తర్వాతి ఐదు ఓవర్ల వ్యవధిలో కోహ్లితో పాటు పాండే, ధోని కూడా అవుట్ కావడంతో భారత్ జోరుకు కళ్లెం పడింది. ఆ తర్వాత ఇన్నింగ్స్ చివర్లో కూడా భారత్ ఆఖరి 20 బంతుల్లో 15 పరుగులు మాత్రమే చేసి నాలుగు వికెట్లు కోల్పోయి సాధారణ స్కోరుకే పరిమితమైంది. పిచ్‌పై ఉన్న తేమను బాగా ఉపయోగించుకున్న ఆసీస్ పేసర్లు కమిన్స్, కూల్టర్ నీల్ ఆరంభంలో భారత బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశారు. ఆరో ఓవర్లో కూల్టర్‌నీల్‌కు రోహిత్ శర్మ (7) రిటర్న్ క్యాచ్ ఇవ్వడంతో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ఈ దశలో రహానే, కోహ్లి కలిసి చక్కటి సమన్వయంతో బ్యాటింగ్ చేశారు. జాగ్రత్తగా ఆడుతూనే వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదారు. అయితే రహానే రనౌట్‌తో వీరిద్దరి 102 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. రెండో పరుగు తీసే ప్రయత్నంలో కోహ్లి వేగానికి తగిన విధంగా స్పందించని రహానే వెనుదిరగాల్సి వచ్చింది. అప్పటి వరకు కోల్‌కతా వేడిలో చెమటలు చిందిస్తూ ఇబ్బంది పడిన ఆసీస్‌కు ఈ వికెట్ కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఇదే జోరులో తక్కువ వ్యవధిలో పాండే (3), ధోని (5), కోహ్లిలను అవుట్ చేసి ఆ జట్టు పట్టు బిగించింది. ఒక దశలో తాను ఆడిన వరుస బంతుల్లో 4, 4, 6 కొట్టి దూకుడు ప్రదర్శించిన కేదార్ జాదవ్ (24 బంతుల్లో 24; 2 ఫోర్లు, 1 సిక్స్) కూడా ఆ వెంటనే పెవిలియన్ చేరాడు. పాండ్యా (20), భువనేశ్వర్ (20) కలిసి ఏడో వికెట్‌కు 35 పరుగులు జత చేయడంతో భారత్ గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది. సొంతగడ్డపై ముందుగా బ్యాటింగ్ చేస్తూ భారత్ ఆలౌట్ కావడం 2013 జనవరి (పాక్‌పై) తర్వాత ఇదే తొలిసారి. స్మిత్ మినహా... సాధారణ విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా మరోసారి తడబాటుకు లోనైంది. భువనేశ్వర్ అద్భుత బౌలింగ్ ముందు ఆసీస్ ఓపెనర్లు పరుగు తీయడమే గగనంగా మారింది. భువీ జోరుకు ముందుగా కార్ట్‌రైట్ (15 బంతుల్లో 1), ఆ తర్వాత వార్నర్ (9 బంతుల్లో 1) తక్కువ వ్యవధిలో వెనుదిరిగారు. అనంతరం స్మిత్, హెడ్ (39 బంతుల్లో 39; 5 ఫోర్లు) కలిసి జట్టును ఆదుకున్నారు. 15 పరుగుల వద్ద హెడ్ ఇచ్చిన క్యాచ్‌ను రోహిత్ వదిలేయగా... వీరిద్దరు క్రీజ్‌లో ఉన్నంత సేపు చకచకా పరుగులు సాధించి భారత్‌పై ఒత్తిడి పెంచారు. ఈ జంట మూడో వికెట్‌కు 73 బంతుల్లోనే 76 పరుగులు జత చేసిన అనంతరం చహల్ ఈ జోడీని విడదీశాడు. ఆ తర్వాత కుల్దీప్ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు బాది జోరు ప్రదర్శించిన మ్యాక్స్‌వెల్ (14) ఎక్కువ సేపు నిలవలేదు. చహల్ చక్కటి బంతికి ధోని మెరుపు స్టంపింగ్ తోడై మ్యాక్సీ పెవిలియన్ చేరాడు. మరో ఎండ్‌లో 65 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న స్మిత్... పాండ్యా ఉచ్చులో చిక్కాడు. బౌన్సర్‌ను పుల్ షాట్ ఆడబోయి జడేజాకు క్యాచ్ ఇవ్వడంతో ఆసీస్ మ్యాచ్‌పై ఆశలు కోల్పోయింది. చివర్లో స్టొయినిస్ పోరాడే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. ►భారత్ తరఫున వన్డేల్లో హ్యాట్రిక్ నమోదు చేసిన మూడో బౌలర్ కుల్దీప్ యాదవ్. గతంలో చేతన్ శర్మ (న్యూజిలాండ్‌పై), కపిల్‌దేవ్ (శ్రీలంకపై) ఈ ఘనత సాధించారు. ఓవరాల్‌గా అంతర్జాతీయ క్రికెట్లో కుల్దీప్‌కిది రెండో హ్యాట్రిక్. 2014లో జరిగిన అండర్–19 వరల్డ్ కప్‌లో స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్‌లోనూ కుల్దీప్ ‘హ్యాట్రిక్’ సాధించాడు. ► 1 ఆస్ట్రేలియాపై రెండో వన్డేలో విజయం సాధించిన భారత్ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో మళ్లీ నంబర్‌వన్ ర్యాంక్‌కు చేరుకుంది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా, భారత్ 119 రేటింగ్ పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాయి. -
మరిన్ని సవాళ్లు ఉంటాయి
శ్రీలంక తేలిపోవడంతో టీమిండియా లాంఛనాన్ని పూర్తి చేసింది. భారత క్రికెట్ చరిత్రలో విదేశీ గడ్డపై తొలిసారి క్లీన్‌స్వీప్ చేసింది. 1968లో న్యూజిలాండ్ పర్యటనలో భారత్ మూడు టెస్టులు గెలిచింది. అయితే అది నాలుగు టెస్టుల సిరీస్ కావడంతో కివీస్ ఓ మ్యాచ్‌లో నెగ్గింది. లంక తొలి ఇన్నింగ్స్‌ను కుల్దీప్ యాదవ్ దెబ్బతీస్తే... రెండో ఇన్నింగ్స్ అశ్విన్ మాయాజాలానికి కుప్పకూలింది. అతనికి సీమర్ మొహమ్మద్ షమీ అండ లభించింది. లంక బ్యాట్స్‌మెన్ భారత బౌలర్లను పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. పేలవమైన ప్రదర్శననే కొనసాగించారు. ఒక్క కరుణరత్నే మినహా మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ టెస్టుకు సరిపోయే ఇన్నింగ్సే ఆడలేదు. కెప్టెన్ దినేశ్ చండిమాల్, మాజీ సారథి మాథ్యూస్ కాసేపు క్రీజులో నిలబడినా... అదేమంత చెప్పుకోదగ్గ స్కోరే కాదు. అయితే ఈ సిరీస్ మొత్తం శిఖర్ ధావన్, చతేశ్వర్ పుజారాల బ్యాటింగ్... షమీ, అశ్విన్, జడేజాల బౌలింగ్ కోసం గుర్తు పెట్టుకోవాలి. కొత్త కుర్రాళ్లు హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్‌లు అవకాశమిస్తే మేం నిరూపించుకోగలమని చేతల్లో చూపె ట్టారు. భవిష్యత్ భారత క్రికెట్‌కు కొండంత భరోసా కూడా ఇచ్చారు. విదేశీ గడ్డపై ఆట మరీ ఇంత సులభం కాకపోయిన భవిష్యత్‌లో మరిన్ని గట్టి సవాళ్లు ఎదురవుతాయి. అయితే వరుస విజయాల ఉత్సాహంతో తదుపరి సిరీస్‌లను సానుకూల దృక్పథంతో ఆరంభించవచ్చు. జట్టు ఇన్నింగ్స్‌లను నిర్మించడంతోనే ఆటగాళ్ల సత్తా బయటపడుతుంది. ఓవరాల్‌గా కెప్టెన్ కోహ్లి, ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శనే కనబరిచారు. ఇలాంటి ఓపెనర్లు, కొత్త బంతిని పంచుకునే బౌలర్లతో సెలక్టర్లకు ఇబ్బందే! చక్కని ఆటతీరు కనబరిస్తే... ఎవరిని ఉంచాలి? ఎవరిని తొలగించాలనే తలనొప్పులు సెలక్టర్లకు తప్పవు. సునీల్ గావస్కర్ -
స్పిన్నర్లు గెలిపించారు
నార్త్ సౌండ్: పిచ్ నుంచి అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న భారత స్పిన్నర్లు అశ్విన్ (3/28), కుల్దీప్ యాదవ్ (3/41) వెస్టిండీస్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చారు. వీరికి హార్దిక్ పాండ్యా (2/32) కూడా జత కలవడంతో శుక్రవారం జరిగిన మూడో వన్డేలో భారత్ 93 పరుగులతో నెగ్గింది. దీంతో ఐదు వన్డేల సిరీస్‌లో 2–0తో ఆధిక్యంలో ఉంది. తొలి వన్డే వర్షంతో రద్దయిన విషయం తెలిసిందే. 2014లో కూడా భారత స్పిన్నర్లు ఒకే వన్డేలో మూడు అంతకన్నా ఎక్కువ వికెట్లు తీశారు. భారత్ విసిరిన 252 పరుగుల లక్ష్యం కోసం బరిలోకి దిగిన విండీస్ 38.1 ఓవర్లలో 158 పరుగులకు ఆలౌట్ అయ్యింది. రెండో ఓవర్లో ప్రారంభమైన వికెట్ల పతనం తుదికంటా కొనసాగింది. జేసన్ మొహమ్మద్ (61 బంతుల్లో 40; 4 ఫోర్లు), రోవ్‌మన్ పావెల్ (43 బంతుల్లో 30; 5 ఫోర్లు) భారత బౌలర్లను కొద్దిసేపు ఎదుర్కొని ఆరో వికెట్‌కు 54 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: 251/4; విండీస్ ఇన్నింగ్స్: లూయిస్ (బి) ఉమేశ్ 2; కైల్ హోప్ (సి) జాదవ్ (బి) పాండ్యా 19; షాయ్ హోప్ (సి అండ్ బి) పాండ్యా 24; చేజ్ (బి) కుల్దీప్ 2; జేసన్ మొహమ్మద్ ఎల్బీడబ్లు్య (బి) కుల్దీప్ 40; హోల్డర్ (స్టంప్డ్) ధోని (బి) అశ్విన్ 6; పావెల్ (సి) పాండ్యా (బి) కుల్దీప్ 30; నర్స్ (సి) ఉమేశ్ (బి) అశ్విన్ 6; బిషూ నాటౌట్ 4; కమిన్స్ ఎల్బీడబ్లు్య (బి) అశ్విన్ 1; విలియమ్స్ (బి) జాదవ్ 1; ఎక్స్‌ట్రాలు 23; మొత్తం (38.1 ఓవర్లలో ఆలౌట్) 158. వికెట్ల పతనం: 1–9, 2–54, 3–58, 4–69, 5–87, 6–141, 7–148, 8–156, 9–157, 10–158. బౌలింగ్: భువనేశ్వర్ 5–0–19–0; ఉమేశ్ 7–0–32–1; పాండ్యా 6–0–32–2; కుల్దీప్ 10–1–41–3; అశ్విన్ 10–1–28–3; జాదవ్ 0.1–0–0–1. 1భారత్ తరఫున వన్డేల్లో అత్యధిక సిక్సర్లు (208) బాదిన ఆటగాడిగా ధోని. 13 భారత్ తరఫున వన్డేల్లో 150 వికెట్లు పూర్తి చేసిన 13వ బౌలర్‌గా అశ్విన్. నేను వైన్లాంటివాడిని వయస్సు పెరిగిన కొద్దీ నా ఆటతీరు మరింత మెరుగవుతోంది కాబట్టి నేను వైన్ లాంటివాడిని. గత ఏడాదిన్నర కాలం నుంచి మా టాప్ ఆర్డర్ అద్భుతంగా ఆడుతోంది దీంతో నాకు అవకాశం దొరికినప్పుడల్లా ఒత్తిడి లేకుండా పరుగులు సాధించగలుగుతున్నాను. ఇక మూడో వన్డేలో పిచ్‌ను బట్టి బ్యాటింగ్ చేశాను. పరుగులు కష్టమైన తరుణంలో మాకు భాగస్వామ్యం ముఖ్యంగా అనిపించింది. నాకైతే 250 పరుగులు చేయగలం అనిపించింది... అలాగే చేశాం కూడా. చివర్లో నాకు కేదార్ చక్కగా సహకరించాడు కాబట్టి ఈ స్కోరు సాధించగలిగాం. ఐపీఎల్లో చాలా మ్యాచ్‌లు ఆడిన కుల్దీప్ అంతర్జాతీయ స్థాయిలోనూ పరిస్థితిని అర్థం చేసుకుని రాణిస్తున్నాడు. –ఎంఎస్ ధోని మార్పులకు అవకాశం ఉంది మా జట్టులో అవకాశం దొరకని ఆటగాళ్లు ఉన్నారు. అందుకే నాలుగో వన్డేలో మార్పుల కోసం చూస్తాం. మరోసారి మ్యాచ్‌లో అద్భుతంగా ఆడగలిగాం. ఉదయం పిచ్‌పై కాస్త తేమ ఉండటంతో టాస్ గెలవాలనుకున్నాం. విండీస్ అద్భుతంగా బౌలింగ్ చేసింది. అయినా 250 పరుగులు సాధించగలిగాం. రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ కీలకంగా మారింది. మా బౌలర్లు వికెట్లు తీస్తూ ఒత్తిడి పెంచగలిగారు. –కెప్టెన్ విరాట్ కోహ్లి