వెల్లింగ్టన్: అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే అరుదైన ఘటన వెస్టిండీస్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో చోటుచేసుకుంది. విండీస్ ప్లేయర్ సునీల్ అంబ్రిస్ తన అరంగేట్ర టెస్టులోనే ఓ అరుదైన చెత్త రికార్డును నమోదు చేశాడు. తొలి టెస్టులో ఎదుర్కొన్న తొలి బంతికే ( గోల్డెన్ డక్ ) హిట్ వికెట్ అయిన తొలి బ్యాట్స్‌మెన్‌గా అంబ్రిస్ గుర్తింపు పొందాడు.
ఇప్పటి వరకు ఈ చెత్త రికార్డు విండీస్‌కే చెందిన సీఎస్ బాహ్ పేరిట ఉండగా అంబ్రిస్ అధిగమించాడు. సీఎస్ బాహ్ 2003లో ఆస్ట్రేలియాపై టెస్టు అరంగేట్ర మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో 19 పరుగులకు హిట్ వికెట్ అయి ఈ రికార్డు జాబితాలో ఇప్పటి వరకు అగ్రస్థానంలో కొనసాగాడు.
తొలి ఇన్నింగ్స్‌లో నీల్ వాగ్నర్ 29 ఓవర్ తొలి బంతిని ఫైన్‌లెగ్ షాట్ ఆడాడు. కానీ అతని ఎడమ కాలు స్టంప్స్‌ను తాకడంతో హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు. అరంగేట్ర టెస్టు మ్యాచ్‌లో ఎన్నో కలలతో బ్యాటింగ్‌కు దిగిన అంబ్రిస్ దురదృష్టం వెంటాడటంతో నిరాశగా పెవిలియన్ చేరాడు.
Comments
Please login to add a commentAdd a comment